Wednesday 2 November 2016

అరటిదూట ఆవ కూర


అరటిదూట ఆవ కూర

కావలిసిన పదార్థాలు
1. అరటిదూట పావుకేజీ
2. పచ్చిమిర్చి 5
3. కరివేపాకు కొద్దిగా
4. అల్లం చిన్న ముక్క
5. చింతపండురసం కొద్దిగా
6. మజ్జిగ ఒక చిన్న కప్పు
7. పసుపు కొద్దిగా
8. ఉప్పు రుచికి సరిపడా
9. ఆవముద్ద ఒక స్పూన్

పోపు దినుసులు
సెనగ పప్పు 1 స్పూన్ ,మినపప్పు 1 స్పూన్ ,ఆవాలు అర స్పూన్ ,
జీలకర్ర అరస్పూన్ ,ఎండుమిరపకాయలు 3 ,ఇంగువ కొద్దిగా ,ఆయిల్ 4 స్పూన్స్

తయారీ విధానం
ముందుగా అరటి దూటను శుభ్రంగా కడిగి
గుండ్రంగా తరుగుకోవాలి . ఇలా తిరిగినప్పుడు నార లాగవస్తుంది .
దానిని తీసివేసి సన్నని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి .
ఒక గిన్నెలో మజ్జిగ తీసుకుని
దాంట్లో తరిగి పెట్టుకున్న దూట ముక్కలను వేసి
ఒక 10 నిమిషాలు ఉంచాలి .
దీనివలన జిగురు వగరు పోతాయి .
తరువాత ముక్కలను కడిగి ,ఉడికించుకుని ,
చిల్లుపల్లెం లో వేసి చల్లార్చుకోవాలి .
పచ్చిమిర్చిని సన్నగా తరుగుకోవాలి .
అల్లాన్ని సన్నని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి .
చింతపండు ను కొద్దిగా నీళ్లు పోసి ,
నాననిచ్చి గుజ్జులాగా తీసుకోవాలి.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపు దినుసులను వేసి ,అవి దోరగా వేగాక
కరివేపాకు ,పచ్చిమిర్చి చీలికలు , అల్లం ముక్కలు ,
వేసి కొద్దిసేపు మగ్గనిచ్చి , తరువాత ముందుగా ఉడికించి చల్లార బెట్టుకున్న
అరటిదూట ముక్కలు ,పసుపు , సరిపడినంత ఉప్పు,
 చింత పండు గుజ్జు వేసి ,
బాగా కలిపి కొద్దిసేపు మగ్గనిచ్చి
స్టవ్ ఆఫ్ చేసుకుని కూర చల్లారాక
తగినంత ఆవముద్దను , ఒక స్పూన్ ఆయిల్ వేసి
కూర అంతాకలిసేలా కలుపుకుంటే
ఘుమ ఘుమ లాడే అరటి  దూట ఆవ కూర రెడీ.

ఈ కూరను వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi