దొండకాయ కొబ్బరి కోరు కూర
కావలిసిన పదార్థాలు
1. దొండకాయలు పావుకేజీ
2. కొబ్బరికోరు ఒక కప్పు
3. పచ్చిమిర్చి 3.
4. కరివేపాకు
5. పసుపు
6. ఉప్పు రుచికి సరిపడా
7. నీళ్లు ఒక గ్లాసు
8. కొత్తిమీర
పోపు దినుసులు
సెనగ పప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్ , ఆవాలు అర స్పూన్ ,
జీలకర్ర అర స్పూన్ , ఎండుమిరపకాయలు 2 ,ఆయిల్ 3 స్పూన్స్
తయారీ విధానం
ముందుగా దొండ కాయలను శుభ్రంగా కడిగి,
సన్నని చీలికలుగా తరుగుకుని నీళ్ళుపోసి కుక్కరులో పెట్టి ఉడికించుకుని ,
చిల్లుపల్లెం లో పోసి చల్లార్చు కోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపుదినుసులను వేసి దోరగా వేపుకుని
తరువాత కరివేపాకు ,పచ్చిమిర్చి చీలికలు ,కొబ్బరికోరులను వేసి దోరగా వేగాక,
ఉడికించి చల్లారబెట్టుకున్న దొండకాయ ముక్కలు ,పసుపు ,
తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ,
కాసేపు మగ్గనిచ్చి
స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకుని
పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
దొండ కాయ కొబ్బరికోరు కూర రెడీ అవుతుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi