Wednesday 30 December 2020

రామ నామం విశిష్టత

 రామ నామం విశిష్టత



శ్రీరాముడి కంటే శ్రీరామ నామం గొప్పది అనడం వెనక ఆంతర్యము..


"రామ"..! ఈ మంత్రానికి అత్యంత శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. 

ఈ మంత్ర జపం వల్ల.. అన్ని సమస్యలు దూరమవుతాయని పురాణాలు చెబుతాయి. 

అందుకే ఈ నామంలో కలిగిన రాముడి కంటే..కూడా రామ నామమే గొప్పదని చాలా కథలు మనకు 

చెబుతూ ఉంటాయి. 


అసలు రాముడితో పుట్టిన రామ నామం రాముడి కంటే ఎందుకు గొప్పది అయింది..


రామ నామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు. 

తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి

మరణం వరకు.. జీవితం సాఫీగా సాగుతుంది.

చెడు కర్మలను మంచిగా మార్చుకోవడానికి 

ఈ రామనామం సహాయపడుతుంది. 

కాబట్టి అత్యంత శక్తివంతమైన రామనామాన్ని జపిస్తూ ఉండాలి.


భగవన్నామ స్మరణకు మించిన సాధన కలియుగంలో మరొకటి లేదని శాస్త్రాలు చెబుతాయి. 

అలాగే ప్రతి దేవుడి నామస్మరణలో అద్భుతమైన శక్తి, మహిమ ఉంటుంది. 

మన హిందువులకు ఉన్న ఏడుకోట్ల మహామంత్రాలలో రెండు అక్షరాల రామ మంత్రానికి ఉన్న విశిష్టత మరే మంత్రానికి లేదు. 

ఇంతటి మహిమాన్విత శక్తి కలిగిన రామ నామం విశిష్టత, రామ నామం గొప్పదనం, 

రామనామం శక్తి సామర్థ్యాలను తెలుసుకుందాం..


రామ నామం పుట్టుక..

తారక మంత్రంగా పిలిచే రామ మంత్రం.. 

రెండు మహా మంత్రాల నుంచి పుట్టింది. 

ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో 

రా..అనే అక్షరం జీవాక్షరం. 

అలాగే ఓం నమ: శివాయ అనే పంచాక్షరి మంత్రంలో 

మ..అనేది జీవాక్షరం.

అంటే.. ఈ రెండు మంత్రాలలో జీవాక్షరాలు తొలగిస్తే.. అర్థం ఉండదు. 

అందుకే.. ఈ రెండు మంత్రాల నుంచి తీసిన రా, మ అనే అక్షరాల ద్వారా రామ అనే నామం వచ్చింది. 

ఈ రెండు అక్షరాలు లేకపోతే.. 

ఆ రెండు మహామంత్రాలకు విలువ ఉండదు. 

అందుకే ఈ రెండు జీవాక్షరాల సమాహారంగా రామ అనే నామం లేదా మంత్రం పుట్టింది.


శివకేశవ మంత్రం..

ఓం నమో నారాయణాయలో రా, 

ఓం నమ: శివాయలో మ అనేవి జీవాక్షరాలు. 

అందుకే శివకేశవుల అత్యంత శక్తి కలవడం వల్ల రామ అనే మంత్రం అత్యంత శక్తివంతమైంది. 

అందుకే ఈ మంత్రాన్ని హరిహరతత్వం కలిసిన మహామంత్రమని పిలుస్తారు.


లంకపై దండెత్తడానికి రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మిస్తారనే సంగతి అందరికీ తెలుసు. 

అయితే.. రాయిపై రామ అని రాసి నీటిలో వేయడం వల్ల ఆ రాయి పైకి తేలుతూ ఉంది. 

ఇదంతా చూస్తున్న శ్రీరాముడికి.. 

తన పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా.. 

తానే రాయి వేస్తే అనే ఆలోచన వచ్చింది.

తనకు వచ్చిన ఆలోచనతో రాముడు ఒక రాయి తీసి సముద్రంలోకి విసిరాడు. 

కానీ.. ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది.

రాముడు ఆశ్చర్యపోయాడు.

తాను వేసిన రాయి మునిగిపోవడంతో రాముడు వెంటనే తన పక్కన ఉన్న హనుమంతుడిని అడిగాడు. 

అప్పుడు హనుమంతుడు.. 

రామ అనే మంత్రం రాసిన రాళ్లే పైకి తేలుతాయి. 

మీరు వేసిన రాయిపై రామనామం లేదు కదా.. 

అందుకే మునిగిపోయిందని హనుమంతుడు వివరించాడు.

ఇలా రాముడి కంటే.. రామ నామం ఎంతో బలమైనది, శక్తివంతమైనది, విశిష్టమైనదని భావించడం మొదలుపెట్టారు.


రామ నామం అర్థం..

రామ అనే మంత్రంలో ర, అ, మ అనే అక్షరాలున్నాయి. 

ర అంటే అగ్ని, 

అ అంటే సూర్యుడు, 

మ అంటే చంద్రుడు అని అర్థం. 

అంటే రామ అనే మంత్రంలో ఈ లోకానికి మూలమైన మూడు శక్తులున్నాయని వివరిస్తుంది.


రామ నామ జపం విశిష్టత..

రామ అనే పలికేటప్పుడు రా అనే అక్షరాన్ని 

నోరు తెరుచుకుని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నికి ఆహుతి అవుతాయి. 

అలాగే మ అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకుని బయటి పాపాలని మనలోకి ప్రవేశించవని వివరిస్తుంది.


విష్ణుసహస్రనామం..

రామ రామ రామ అని మూడు సార్లు జపం చేస్తే.. 

విష్ణు సహస్ర నామం చేసినంత ఫలితం లభిస్తుందట.


రామ నామ మంత్రం..

శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే 

13 అక్షరాల నామమంత్రం. 

ఈ మంత్రాన్ని జపించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందట. 

సమర్థరామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్ల సార్లు జపించి.. రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. 

కాబట్టి ఈ నామజపం మంచి ఫలితాన్నిస్తుంది.


శనీశ్వరుడినే జయించిన రామనామం..

పూర్వం ఒకసారి హనుమంతుడిని కష్టాలపాలు చేయాలని శనీశ్వరుడు అతని దగ్గరకు వచ్చాడు. 

అప్పుడు హనుమంతుడు రామనామం జపిస్తున్నాడు. శనీశ్వరుడు హనుమంతుడికి విషయం చెప్పగా.. 

తాను రామనామ జపంలో ఉన్నానని... 

అది పూర్తయిన తర్వాత రమ్మని చెప్పాడు. 

శనీశ్వరుడు ఎంతసేపు నిరీక్షించినా.. 

రామనామ జపం పూర్తవలేదు. 

దీంతో.. శనీశ్వరుడు.. రామనామం జపించేవాళ్ల దరిచేరడం కష్టమని వెనక్కి వెళ్లిపోయాడు. 

కాబట్టి రామ నామాన్ని జపించేవాళ్లకు శనిబాధలు ఉండవు.


 శ్రీరాముని యొక్క శ్రీ రామ నామం జపించడం కానీ 

శ్రీ రామకోటి ని రాయడం కానీ ఆచరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి.


మన పురాణాల్లో " ఆది కావ్యం గా "చెప్పబడుతున్న 

వాల్మీకి మహర్షి యొక్క  "శ్రీరామాయణం" లో చెప్పబడింది.

రామ నామం యొక్క గొప్పదనం శ్రీ రామాయణం లో అడుగు అడుగున చెప్పబడుతుంది.

ఈ నామాన్ని చిన్నపిల్లల నుంచి వృద్ధులు వరకు   జపించవచ్చు స్మరించవచ్చు రాయవచ్చు.

 

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సకల చరాచర సృష్టికి 

ఆది దేవుడు అయినా "శివపరమాత్ముడు"  నిత్యం రామనామం జపిస్తారు అంత గొప్పది. " రామ నామం"

 

అందుచేత యావన్మంది భక్తకోటి రామ నామం యొక్క గొప్పతనం తెలుసుకొని రామకోటి  రాయండి. జపించండి మీకు శ్రీరాముని యొక్క కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి.

(సేకరణ)

Thursday 24 December 2020

శ్రీగురు_దక్షిణామూర్తి

 శ్రీగురు_దక్షిణామూర్తి





దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు
ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది.
మరో కాలు పైకి మడిచి ఉంటుంది.
చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు.
ఈ భంగిమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాం.

బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన
సనక, సనందన, సనాతన, సనత్కుమారులు
బ్రహ్మ జ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సు నాచరించారు.
అయినా వారికి అంతుపట్టలేదు.
వారు చివరికి పరమ శివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు.

అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా
ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు.
ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది.

ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది.
ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే..
జ్ఞానమనేది మాటల్లో వర్ణించలేనిది,
కేవలం అనుభవించదగినది అని.
గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు.
అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో
విస్తృతంగా వర్ణించారు.

శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం.
దక్షిణ అంటే సమర్థత అని అర్ధం.
దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం.
అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోతాయి.
దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే
ఆ రూపమే దక్షిణామూర్తి.

మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి.
ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి.
దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు.

విష్ణు,
బ్రహ్మ,
సూర్య,
స్కంద,
ఇంద్ర
తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.

మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది.

ఆ రూపాలు వరుసగా.....
శుద్ధ దక్షిణామూర్తి,
మేధా దక్షిణామూర్తి,
విద్యా దక్షిణామూర్తి,
లక్ష్మీ దక్షిణామూర్తి,
వాగీశ్వర దక్షిణామూర్తి,
వటమూల నివాస దక్షిణామూర్తి,
సాంబ దక్షిణామూర్తి¸
హంస దక్షిణామూర్తి,
లకుట దక్షిణామూర్తి,
చిదంబర దక్షిణామూర్తి,
వీర దక్షిణామూర్తి,
వీరభద్ర దక్షిణామూర్తి¸
కీర్తి దక్షిణామూర్తి,
బ్రహ్మ దక్షిణామూర్తి¸
శక్తి దక్షిణామూర్తి,
సిద్ధ దక్షిణామూర్తి.

ప్రధానమైన ఈ 16 మూర్తులలో వట మూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది.

భస్మాన్ని అలముకున్న తెల్లనివాడు,
చంద్రకళాధరుడు,
జ్ఞానముద్ర,
అక్షమాల,
వీణ,
పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనవాడు, సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి.
తెలివిని, విద్యను మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు.

పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు.
సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి.
మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను
సొంతం చేసుకుంటారు.

చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,
సంపద(ధనము) దగ్గర నుండి,
పెద్దలకు మోక్షము వరకు,
దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షముకి అదిష్టానం
అయి ఉంటాడు.

ఓం శ్రీ గురు దక్షిణామూర్తియే నమః..!

(సేకరణ)




Wednesday 23 December 2020

నీలకృత ఆంజనేయ స్తోత్రం



ఈ స్తోత్రము నిత్యము పఠించు వారికి హనుంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వలె కోరికలన్నిటిని తీర్చగలడు.

 


 

నీలకృత ఆంజనేయ స్తోత్రం 


ఓం జయ జయ! శ్రీ ఆంజనేయ! కేసరీ ప్రియనందన! వాయుకుమారా! ఈశ్వరపుత్ర! పార్వతీ గర్భ సంభూత! వానరనాయక! సకల వేదశాస్త్ర పారగ! సంజీవి పర్వతోత్పాటన! లక్ష్మణ ప్రాణరక్షక! గుహప్రాణదాయక! సీతాదుఃఖ నివారణ! ధాన్యమాలీ శాపవిమోచన దుర్దండీ బంధవిమోచన! నీలమేఘ రాజ్యదాయక! సుగ్రీవ రాజ్యదాయక! భీమసేనాగ్రజ! ధనంజయ ధ్వజవాహన! కాలనేమి సంహార! మైరావణ మర్దన! వృతాసుర భంజన! సప్త మంత్రిసుత ధ్వంసన! ఇంద్రజిద్వధకారణ! అక్షకుమార సంహార! లంకిణీ భంజన! రావణమర్దన! కుంభకర్ణ వధపరాయణ! జంబూ మాలి నిషూదన! వాలినిర్హరణ! రాక్షసకుల దాహన! అశోకవన విదారణ! లంకాదాహక! శతముఖవధకారణ! సప్తసాగర వాలసేతు బంధన! నిరాకార నిర్గుణ సగుణ స్వరూప! హేమవర్ణ పీతాంబరధర! సువర్చలా ప్రాణనాయక! త్రయస్తింశత్కోట్యర్బుద రుద్రగణపోషక! భక్తపాలనచతుర! కనకకుండలాభరణ! రత్న కిరీట హార నూపుర శోభిత! రామభక్తి తత్పర! హేమరంభావన విహార! వక్షతాంకిత మేఘవాహక! నీలమేఘశ్యామ! సూక్ష్మకాయ! మహాకాయ! బాలసూర్యగ్రసన! ఋష్యమూక గిరి నివాసక! మేరు పీఠకార్చన! ద్వాత్రింశతాయుధధరా! చిత్రవర్ణ! విచిత్ర సృష్టినిర్మాణకర్తా! అనంతనామ! దశావతార! అఘటన ఘటనా సమర్థ! అనంతబ్రహ్మన్! నాయక! దుర్జనసంహార! సుజనరక్షక! దేవేంద్రవందిత! సకలలోకారాధ్య! సత్యసంకల్ప! భక్తసంకల్పపూరక! అతిసుకుమారదేహ! అకర్దమ వినోదలేపన! కోటి మన్మథాకార! రణకేళిమర్దన! విజృంభమాణ! సకలలోక కుక్షింభర! సప్తకోటి మహామంత్ర తంత్ర స్వరూప! భూతప్రేత పిశాచ శాకినీ ఢాకినీ విధ్వంసన! శివలింగ ప్రతిష్ఠాపనకారణ! దుష్కర్మ విమోచన! దౌర్భాగ్య నాశన! జ్వరాది సకలరోగహర! భుక్తి ముక్తిదాయక! కపటనాటక సూత్రధారీ! తలావినోదాంకిత! కళ్యాణ పరిపూర్ణ! మంగళప్రద! గానప్రియ! అష్టాంగయోగ నిపుణ! సకల విద్యా పారీణ! ఆదిమధ్యాంతరహిత! యజ్ఞకర్త! యజ్ఞభోక్త! షణ్మత వైభవసానుభూతి చతుర! సకల లోకాతీత! విశ్వంభర! విశ్వమూర్తే! విశ్వాకార! దయాస్వరూప! దాసజన హృదయకమల విహార! మనోవేగగమన! భావజ్ఞ నిపుణ! ఋషిగణగేయ! భక్తమనోరథదాయక! భక్తవత్సల! దీనపోషక దీనమందార! సర్వస్వతంత్ర! శరణాగత రక్షక! ఆర్తత్రాణ పరాయణ! ఏక అసహాయవీర! హనుమాన్! విజయీభవ! దిగ్విజయీభవ! దిగ్విజయీభవ!

Tuesday 8 December 2020

మహామృత్యుంజయస్తోత్రం

 మహామృత్యుంజయస్తోత్రం



రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠముమాపతిమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧ ||


నీలకంఠం కాలమూర్తిం కాలజ్ఞం కాలనాశనమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౨ ||


నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రదమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౩ ||


వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౪ ||


దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౫ ||


గంగాధరం మహాదేవం సర్వాభరణభూషితమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౬ ||


త్ర్యక్షం చతుర్భుజం శాంతం జటామకుటధారిణమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౭ ||


భస్మోద్ధూళితసర్వాంగం నాగాభరణభూషితమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౮ ||


అనంతమవ్యయం శాంతం అక్షమాలాధరం హరమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౯ ||


ఆనందం పరమం నిత్యం కైవల్యపదదాయినమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౦ ||


అర్ధనారీశ్వరం దేవం పార్వతీప్రాణనాయకమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౧ ||


ప్రళయస్థితికర్తారమాదికర్తారమీశ్వరమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౨ ||


వ్యోమకేశం విరూపాక్షం చంద్రార్ధకృతశేఖరమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౩ ||


గంగాధరం శశిధరం శంకరం శూలపాణినమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౪ ||


అనాథః పరమానందం కైవల్యఃపదగామినమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౫ ||


స్వర్గాపవర్గదాతారం సృష్టిస్థిత్యంతకారణమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౬ ||


కల్పాయుర్దేహి మే పుణ్యం యావదాయురరోగతామ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౭ ||


శివేశానాం మహాదేవం వామదేవం సదాశివమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౮ ||


ఉత్పత్తిస్థితిసంహారకర్తారమీశ్వరం గురుమ్ |

నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౯ ||


మార్కండేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ |

తస్య మృత్యుభయం నాస్తి నాగ్నిచౌరభయం క్వచిత్ || ౨౦ ||


శతావర్తం ప్రకర్తవ్యం సంకటే కష్టనాశనమ్ |

శుచిర్భూత్వా పఠేత్ స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకమ్ || ౨౧ ||


మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతమ్ |

జన్మమృత్యుజరారోగైః పీడితం కర్మబంధనైః || ౨౨ ||


తావకస్త్వద్గతః ప్రాణస్త్వచ్చిత్తోఽహం సదా మృడ |

ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యంబకాఖ్యమనం జపేత్ || ౨౩ ||


నమః శివాయ సాంబాయ హరయే పరమాత్మనే |

ప్రణతక్లేశనాశాయ యోగినాం పతయే నమః || ౨౪ ||