కావలిసిన పదార్థాలు
1. సెనగపిండి ఒక గ్లాసు
2. వరిపిండి అర గ్లాసు
3. బేకింగ్ పొడి ( వంట సోడా ) కొద్దిగా
4. నీళ్లు తగినంత
5. ఆయిల్ అరలీటరు
6. ఉప్పు తగినంత
7. కారము తగినంత
8. కరివేపాకు కొద్దిగా
9. పల్లీలు ఒక కప్పు
తయారీ విధానం
ముందుగా ఒక బేసిన్ లోకి సెనగపిండి, వరిపిండి ,
వంట సోడా ( బేకింగ్ పొడి ) , (చిటికెడు )
బాగా కలిపి,
కొద్దీ కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గరిట జారుగా ఉండేలా కలుపుకోవాలి .
ఒక ప్లేటులోకి ఉప్పు ,కారము ,బూందికి సరిపడా వేసి కలుపుకునివుంచుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ పోసుకోవాలి . కాగాక
బూందీ చట్రం తీసుకుని దాంట్లో గుంట గరిటతో పిండిని పోసి,
గరిటతో పామితే బూందీ పలుకులు ఆయిల్ లో పడతాయి .
వీటిని దోరగా వేపుకుని , వేరే ప్లేట్ లో వేసి ,
పైన తయారు చేసి పెట్టుకున్న ఉప్పుకారము ,
కొంచెం చల్లుకోవాలి .
ప్రతి వాయి కి ఉప్పు కారం కలుపుతువుండాలి .
చివర్లో కరివేపాకును , పల్లీలను ఆయిల్ లో
వేసి వాటిని కూడా దోరగా వేపుకుని
బూందీ పలుకుల మీద వేసుకుని ,
ఉప్పు , కారం అంతా కలిసేలా కలుపుకుంటే
కారపు బూందీ రెడీ అవుతుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi