నిమ్మకాయ కారం
కావలిసిన పదార్థాలు
1. నిమ్మకాయలు 6.
2. పసుపు కొద్దిగా
3. ఆయిల్ 4 స్పూన్స్
పోపు దినుసులు
సెనగపప్పు 2 స్పూన్స్ , మినపప్పు 2 స్పూన్స్ , ఆవాలు 1 స్పూన్ ,
జీలకర్ర 1 స్పూన్ ,ఇంగువ కొద్దిగా , ఎండుమిరపకాయలు 8 ,ఉప్పు తగినంత
తయారీ విధానం
ముందుగా నిమ్మకాయలు శుభ్రం గా కడిగి ఆరబెట్టుకోవాలి .
ఆరిన నిమ్మకాయల నుండి రసమును ఒక కప్పులోకి పిండుకోవాలి .
రసము పిండేసిన. నిమ్మ చెక్కలను ముక్కలుగా తరుగుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక 1 స్పూన్ ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపు దినుసులను వేసి దోరగా వేగాక
స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి .
చల్లారిన పోపును తగినంత ఉప్పు వేసి ,
మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకుని ,
ఒక బౌల్ లోకి తీసుకుని
దీనిలో ముందుగా మనం తీసి ఉంచుకున్న
నిమ్మరసమును , నిమ్మకాయ ముక్కలను ,పసుపు ను ,3 స్పూన్స్ ఆయిల్ వేసి ,
బాగా కలిపి కొద్దిసేపు ఊరనిస్తే
నిమ్మకాయ కారం రెడీ
వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది .
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi