గోగు ( గోంగూర ) పువ్వు పచ్చడి
కావలిసిన పదార్థాలు
1. గోగుపువ్వులు 2 కప్పులు
2. ఉప్పు రుచికి సరిపడ
3. పసుపు కొద్దిగా
పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్ , ఆవాలు 1 స్పూన్ , మెంతులు అర స్పూన్ ,
ఇంగువ కొద్దిగా , జీలకర్ర అర స్పూన్ , ఎండుమిరపకాయలు 8. ,ఆయిల్ 8 స్పూన్స్
తయారీ విధానం
ముందుగా గోగుపువ్వులను శుభ్రం గా కడిగి ,
తొడిమలు తీసి ఆర బెట్టుకోవాలి.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక 2 స్పూన్స్ ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపు దినుసులను వేసిదోరగా వేపుకుని
ఒక ప్లేటులోకి తీసుకోవాలి .
అదే బాణలిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆర. బెట్టుకున్న
గోగుపువ్వులను వేసి దోరగా వేపుకుని చల్లార నివ్వాలి .
ముందుగా వేపుకుని పెట్టుకున్న పోపు ను మెత్తగా పొడిలాగ గ్రైండ్ చేసుకుని
ఒక ప్లేటులోకి తీసుకోవాలి .
తరువాత గోగుపువ్వులను , పసుపు , తగినంత ఉప్పును వేసి ,
మెత్తగా గ్రైండ్ చేసుకుని ,
తరువాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం పొడిని కూడా వేసి ,
ఒకేసారి కలిసేలా గ్రైండ్ చేసుకుని ,
ఒక బౌల్ లోకి తీసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక 4. స్పూన్స్ ఆయిల్ ,
కొద్దిగా ఇంగువ వేసి మరగనిచ్చి ,
దీంట్లో ముందుగా తయారు చేసిపెట్టుకున్న పచ్చడిని వేసి ,
ఆయిల్ అంతా పచ్చడిలో ఇంకే వరకు ఉంచి
స్టవ్ ఆఫ్ చేసుకుంటే
ఘుమ ఘుమ లాడే గోగుపువ్వుల పచ్చడి రెడీ అవుతుంది
ఈ పచ్చడిలో ఇష్టమైన వారు బెల్లం కూడా వేసుకుని రుబ్బుకోవచ్చు
ఈ పచ్చడి ఒక 15. రోజులపాటు నిలువ ఉంటుంది .
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు