కంద పచ్చడి
కావలిసిన పదార్థాలు
1. కంద ముక్కలు 3 కప్పులు
2. చింతపండు కొద్దిగా
3. పసుపు
4. ఉప్పు రుచికి సరిపడా
5. పచ్చి మిర్చి 4
పోపు దినుసులు
సెనగపప్పు 1. స్పూన్ , మినపప్పు 1 స్పూన్ , ఆవాలు అర స్పూన్ ,
జీలకర్ర అర స్పూన్ , ఇంగువ కొద్దిగా , ధనియాలు 1 స్పూన్ ,
ఎండుమిరపకాయలు 5 , ఆయిల్ 4. స్పూన్స్.
తయారీ విధానం
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపు దినుసులను వేసి దోరగా వేపుకుని ,
ఒక ప్లేటులోకి తీసుకుని చల్లారనివ్వాలి .
అదే బాణలిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ,
కంద ముక్కలు , పచ్చిమిర్చి చీలికలు ,
పసుపు , చింతపండు వేసి,
పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చి ,
చల్లారనివ్వాలి . ముందుగా చల్లారిన పోపును
మెత్తని పొడి లాగ గ్రైండ్ చేసుకుని ,
అందులో ముందుగా మగ్గబెట్టి పెట్టుకున్న,
కంద , పచ్చి మిర్చి , చింతపండు మిశ్రమం ,
తగినంత ఉప్పును వేసి ,
మెత్తగా గ్రైండ్ చేసుకుని , ఒకబౌల్ లోకి తీసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,
ఆయిల్ వేసి కొద్దిగా మినపప్పు, ఆవాలు , జీలకర్ర , ఇంగువ ,
కరివేపాకు , వేసి దోరగా వేగాక ,
ఈ పోపును పచ్చడి మీద వేసుకుంటే
కంద పచ్చడి రెడీ.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/