కావలిసిన పదార్థాలు
1. మామిడి అల్లం పావుకేజీ
2. నిమ్మకాయలు 2.
3. పసుపు
4. ఉప్పు రుచికి సరిపడా
5. ఎర్ర కారం ఒక కప్పు
6. ఆయిల్ కప్పు
7. ఇంగువ కొద్దిగా
మెంతి ఆవపొడికి
మెంతులు 2 స్పూన్స్ ,ఆవాలు 3 స్పూన్స్ ,ఇంగువ కొద్దిగా
పోపుకి
కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఆయిల్ ,
తయారీ విధానం
ముందుగా మామిడి అల్లమును శుభ్రం గా కడిగి ,
తడి లేకుండా ఆరబెట్టుకోవాలి.
ఆరిన తరువాత పైన వున్న తొక్కను తీసి
ముక్కలుగా తరిగి , పసుపును వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
లేదా తురుము కోవాలి.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,
పైన చెప్పిన ఆవాలు మెంతులను కలిపి దోరగా వేపుకుని ,
చల్లారాక మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి కొద్దిసేపు కాగాక ,
ముందుగా తయారు చేసి పెట్టుకున్న మెంతి ఆవపొడి , కారము ,
తగినంత ఉప్పును వేసి బాగా కలిపి ,
స్టవ్ ఆఫ్ చేసుకోవాలి .
ఈ కారము మిశ్రమంలో గ్రైండ్ చేసి పెట్టుకున్న
మామిడి అల్లం తొక్కును వేసి , కారము , ఉప్పు కలిసేలా బాగాకలిపి,
పోపు కూడా వేసి ,
నిమ్మరసం వేసి బాగా కలిపి ఊరనిస్తే
మామిడి అల్లం తొక్కు పచ్చడి తయారవుతుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.