Saturday 24 August 2019

పడుకొనే అప్పుడు పాటించ వలసిన నియమాలు


1. నిర్మానుష్యంగా, నిర్జన  గృహంలో
    ఒంటరిగా  పడుకోకూడదు.

** దేవాలయం లో పడుకోకూడదు.( మనుస్మృతి )

2 పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు.  ( విష్ణుస్మృతి )

3. విద్యార్థి,నౌకరు,మరియు ద్వారపాలకుడు
    వీరు అధిక సమయం నిద్రపోతున్నచో,
    వీరిని మేల్కొలపవచ్చును.( చాణక్య నీతి )

4. ఆరోగ్యవంతులు  ఆయురక్ష కోసం
   బ్రహ్మా ముహూర్తం  లో నిద్ర లేవాలి.
  ( దేవీ భాగవతము ).
**పూర్తిగా చీకటి గదిలో నిద్రించకూడదు.
  ( పద్మ పురాణము )

5. తడి పాదము లతో నిద్రించకూడదు.
   పొడి పాదాల తో నిద్రించడం వలన
    లక్ష్మి (ధనం)ప్రాప్తిస్తుంది.(  అత్రి స్మృతి )

** విరిగిన పడకపై,మరియూ ,
     ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం.   ( మహాభారతం )

6.  వివస్త్రలులై పడుకోకూడదు.( గౌతమ ధర్మ సూత్రం )

7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన  " విద్య "
  
  **  పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన 
    ప్రబల చింత ,
 
   **ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన   హాని,
      మృత్యువు

  ** దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించిన
  ధనము,ఆయువు ప్రాప్తిస్తుంది.( ఆచార మయూఖ )

8. పగటిపూట ఎపుడు కూడా నిద్రించవద్దు.
  కానీ జ్యేష్ఠ మాసం లో  1 ముహూర్తం(48నిమిషాలు)   నిద్రిస్తారు.
**(పగటిపూట నిద్ర రోగహేతువు,మరియు ఆయుక్షీణత  కలుగచేస్తుంది)

9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు
రోగి మరియు దరిద్రులు అవుతారు.
(బ్రహ్మా వైవర్తపురాణం)

10.సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు3 గంటల) తరువాత నే పడుకోవాలి

11.ఎడమవైపు  కి తిరిగి పడుకోవడం  వలన  స్వస్థత లభిస్తుంది.

12.దక్షిణ దిశ వైపు  కాళ్లు  పెట్టి
     ఎపుడు నిద్రించకూడదు.
**యముడు మరియు దుష్ట గ్రహము లు
నివాసము వుంటారు.
**దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా  మందగిస్తుంది. మతిమరుపు, మృత్యువు లేదా
అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి.

13.గుండెపై చేయి వేసుకుని, చెత్తు యొక్క బీము  కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.

14.పడక మీద త్రాగడం- తినడం  చేయకూడదు.

15. పడుకొని పుస్తక పఠనం  చేయడానికి వీల్లేదు. ( పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసకబారుతుంది.)

ఈ నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి,మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు

  

Thursday 15 August 2019

హయగ్రీవుడు




అశ్వ రూపం విశ్వ తేజం
చదువున్నచోట జ్ఞానముంటుంది.
జ్ఞానం ధనాన్ని సంపాదిస్తుంది.
ధనం ఆనందానికి మూలమవుతుంది.
అందుకే చదువు రావాలన్నా, జ్ఞానం వృద్ధి చెందాలన్నా, సంపదలు చేకూరాలన్నా జ్ఞానానందమయుడైన హయగ్రీవుణ్ణి ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది.

‘జ్ఞానానందమయం దేవం
నిర్మల స్ఫటికా కృతిం
ఆధారం సర్వవిద్యానాం
హయగ్రీవముపాస్మహే’


ఇది హయగ్రీవ స్తోత్రంలోని మొదటి శ్లోకం. ఇందులోనే స్వామితత్త్వం అంతా ఇమిడి ఉంది.

హయగ్రీవుడు చదువులకు అధిదేవుడు. సృజనాత్మకత, సందర్భానుసారంగా నేర్చుకున్న విద్యలన్నీ గుర్తుకురావడం, తెలివితేటలు, జ్ఞాపకశక్తి వృద్ధిచెందడంలాంటి వాటికోసం ఆయనను ఆరాధించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. తెలుగు సాహితీ ప్రక్రియల్లో విశేషమైన అవధానం, ఆశు కవిత, సభారంజకంగా ఉపన్యసించడంలో పేరుపొందిన పండితులంతా హయగ్రీవ ఉపాసన చేస్తుంటారు.

ధర్మరక్షణ కోసం మహావిష్ణువు ఎత్తినవి దశావతారాలని అందరికీ తెలుసు.

కొందరు అవి 21 అని చెబుతారు.
వాటిలో ఒకటి హయగ్రీవ రూపం.. శ్రవణానక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు ఈ స్వామి అవతరించినట్లు చెబుతారు.

మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రం. లక్ష్మీదేవి పుట్టిన తిధి శ్రావణ పౌర్ణమి.
వారిద్దరి జన్మ నక్షత్ర తిధులతో కలిసి ఉంటుంది కాబట్టి ఆనాడు
లక్ష్మీసహిత హయగ్రీవ ఆరాధన మంచిదని చెబుతారు.

హయగ్రీవ అవతరణ వివరాలు మహాభారతం, దేవీ భాగవతంలో ఉన్నాయి.
సకల చరాచర సృష్టికి కర్తయిన బ్రహ్మకు శక్తినిచ్చేవి వేదాలు.
ధర్మమూలాలైన వేదాల సంరక్షణ బాధ్యత శ్రీ మహావిష్ణువుది.
మధుకైటభులనే రాక్షసులు సృష్టి ప్రారంభ పనిలో నిమగ్నమై ఉన్న బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న నాలుగు వేదాలను అపహరించి, రసాతలానికి చేరుకున్నారు.
దాంతో బ్రహ్మకు సృష్టి ఎలా చేయాలో తెలియకుండా పోయింది.
అప్పుడు మహావిష్ణువు వేద సంరక్షణ కోసం హయగ్రీవుని అవతారం ధరించాడు.
గుర్రం ముఖం, మానవ శరీరంతో ఈ అవతారం ఉంది.
అది విశ్వమంతా నిండి మహోన్నతంగా కనిపించింది.
నక్షత్రాలతో నిండిన ఆకాశం తల భాగంగా, సూర్యకిరణాలు కేశాలుగా, సముద్రాలు కనుబొమలుగా, సూర్యచంద్రులు కళ్లుగా, ఓంకారం అలంకారంగా, మెరుపులు నాలుకగా, పితృదేవతలు దంతాలుగా, గోలోకం, బ్రహ్మలోకం రెండు పెదవులుగా, తమోమయమైన కాళరాత్రి మెడ భాగంగా కనిపించాయి.
ఈ దివ్యరూపంలోని హయగ్రీవుడు క్షణకాలంలో బ్రహ్మముందు అంతర్థానమై రసాతలాన్ని చేరాడు.
అక్కడ ప్రణవనాదం చేశాడు.
ఉదాత్త, అనుదాత్త స్వరయుక్తంగా సామ వేదాన్ని గానం చేశాడు.
ఆ మధుర గానవాహిని రసాతలమంతా మార్మోగింది.
అది విన్న మధుకైటభులిద్దరూ వేదాలను వదిలి ఆ నాదం వినిపిస్తున్న వైపు పరుగులు పెట్టారు.
అప్పుడు హయగ్రీవుడు రాక్షసులు, వేదాలను దాచి ఉంచిన చోటికి వెళ్లి వాటిని తీసుకుని వచ్చి బ్రహ్మకు ఇచ్చాడు.
అక్కడ రాక్షసులకు వేదనాదం చేసిన వాళ్లెవరూ కనిపించలేదు.
వెనక్కి తిరిగి వచ్చి చూస్తే వేదాలు లేవు. వాటిని తీసుకెళ్లింది శ్రీమహావిష్ణువేనని గ్రహించిన వాళ్లిద్దరూ ఆయనతో యుద్ధానికి దిగారు.
ఆ స్వామి రాక్షసులిద్దరినీ సంహరించి మధుకైటభారిగా అందరి స్తుతులందుకున్నాడు.
వేదాలు జ్ఞానానికి చిహ్నాలు, అలాంటి జ్ఞానాన్ని రక్షించి తిరిగి బ్రహ్మకు ప్రసాదించిన అవతారం కాబట్టి హయగ్రీవుణ్ణి జ్ఞానానందావతారంగా చెబుతారు.

హయం అంటే గుర్రం.
గర్రుపు తలతో కనిపించే హయగ్రీవుడి రూపాన్ని
ఓ జ్ఞానదీపంగా భావిస్తారు సాధకులు.
గుర్రపు సకిలింతలో ఉన్న
క్లీం, హ్రీం, శ్రీం అనే బీజాక్షరధ్వని
అశ్వ వేగంలోని యోగ రహస్యంగా గుర్తించారు.
ఇందులో క్లీం అనే అక్షరాన్ని కామరాజ బీజమని కూడా పిలుస్తారు.
యోగమార్గంలో త్వరగా కోర్కెల సాధనకు ఇది గొప్ప సాధకం.
క్లీంలో వినిపించే ‘ఈ’ కారానికి కూడా విశేషముంది.
దీన్ని ‘కేవలా’ అంటారు. కేవలా అంటే మాత్రమే అని అర్థం.
లలితా సహస్రనామంలోని ‘కేవలా’ ఇదేనని చెబుతారు.
సృష్టి మొత్తానికి మూలం ఆమె శక్తి మాత్రమే అని భావం.

అగస్త్య మహర్షి హయగ్రీవుడిని గురించి తపస్సు చేశాడు.
అప్పుడా స్వామి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నప్పుడు అగస్త్యుడు
లలితా పరమేశ్వరి గురించి వివరించమని అడిగాడు.
అప్పుడు హయగ్రీవుడు అమ్మ సహస్రనామాలను అంగన్యాస కరన్యాస పూర్వకంగా మహర్షికి ఉపదేశించాడు. లోకక్షేమం కోసం లలితా పరమేశ్వరి సంకల్పంతో వీటిని చెప్పినట్లు వివరిస్తాడు.

హయగ్రీవునికి తెలుపురంగు పూలు, యాలుకలతో చేసిన మాల,
గుగ్గిళ్ల నైవేద్యం చాలా ఇష్టమని చెబుతారు.

హయగ్రీవ హయగ్రీవ అనే శబ్దాన్ని పలికితే చాలు అట్టి మానవుని పాపాలన్నీ తొలగి అతని దరిద్రం తొలగుతుంది.
హయగ్రీవ హయగ్రీవ అని పలికితే చాలు నిస్సందేహంగా గంగాదేవి ప్రవాహంలా చుదువు వస్తుంది. అంటే సర్వవిద్యలూ వస్తాయన్నమాట.
హయగ్రీవ హయగ్రీవ అనే ధ్వనిని
వింటే చాలు వైకుంఠంయొక్క
తలుపులు తెరుచుకుంటాయి.

హయగ్రీవుని పూజించడంవల్ల
విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి.
విద్యార్థులు హయగ్రీవుని పూజించడంవల్ల చదువు బాగా వస్తుంది.
పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి, ఉన్నత విద్యను అందిస్తుంది.

జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే

జ్ఞానం, ఆనందం, మూర్త్భీవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము.

హయగ్రీవుని పదములతో మిళితమైన ఈ మూడు శ్లోకములు దివ్యమైనవి.
ఎవరైతే వాటిని స్మరిస్తారో వారికి సంపదలు కలుగుతాయి.

హయగ్రీవస్తోత్రం

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ |
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః |
వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః||

ఫలశ్రుతి
శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |
వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం||


Friday 9 August 2019

కనకధారా స్తోత్రం మహాత్మ్యం


శ్రీ వెరంబదూరు...

కేరళలోని కాలడి సమీపంలో, పూర్ణానదీ తీరంలో శ్రోత్రియులు ఎక్కువగా నివసించే చిన్న గ్రామం...

కార్తీకమాసం, శుక్లపక్ష ద్వాదశి, మధ్యాహ్న సమయం...

ఓ ఇంటి ముందు నిల్చుని
‘భవతీ భిక్షాందేహి...’
అడిగాడు ఎనిమిదేళ్ల బాలుడు...

ఈ మాట వినిపిస్తూనే బయటకు వచ్చి తొంగిచూసిందా ఇల్లాలు...

బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతున్న ఆ పిల్లాడి ముఖం చూసి ఇంట్లోకి వెళ్లిందామె.

మధ్యాహ్నం... భోజన సమయం...

అందులోనూ ద్వాదశినాడు అతిథి వచ్చాడు.

తన చీర చిరుగులు కనబడకుండా దాచుకునే ప్రయత్నం చేస్తూ..

ఏమీ ఇవ్వలేని తన దురదృష్టానికి, పేదరికానికి దుఃఖిస్తూ..
ఇంట్లో ఉన్న ఒక ఎండిపోయిన ఉసిరికాయను తెచ్చి ఆ పిల్లవాడికి భిక్షగా
సమర్పించిందా ఇల్లాలు..

తనకు భిక్ష వేసిన ఆ ఇల్లాలి ముఖం చూస్తూనే ఆమె దుఃఖం, పేదరికం
ఆ పిల్లవాడికి అర్థమయ్యాయి.

అంతే... ఆ ఇంటి ముందే నిల్చుని

‘అంగం హరేః పులక భూషణ మాశ్రయంతే
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః’


‘మొగ్గలతో నిండి ఉన్న చీకటి చెట్టుకు ఆడ తుమ్మెదలు ఆభరణాలైనట్లుగా,

పులకాంకురాలతో శ్రీహరి శరీరాన్ని ఆశ్రయించి ఉన్న సకల శుభాలకు స్థానమైన లక్ష్మీదేవి చల్లని చూపు శుభాలను ప్రసాదించుగాక..’

అంటూ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ
ఆశువుగాశ్లోకాలు గానం చేశాడు.

అంతే... ఆ ఇంటి ముందు

బంగారు ఉసిరికల వర్షం కురిసింది.

ఆ ఇల్లాలి పేదరికం తొలగిపోయి సకల శుభాలు కలిగాయి.

ఇలా జాతికి లక్ష్మీ దయను వర్షింపజేసిన ఆ బాలుడే
అద్వైత సిద్ధాంతకర్తగా,
జగద్గురువుగా అవతరించిన
ఆది శంకరాచార్యులు.

ఆయన చేసిన స్తోత్రమే కనకధారా స్తోత్రం.

ఆది శంకరులు అనేక స్తోత్రాలు రచించి
జాతికి అందించారు.
వాటి ద్వారా జీవన మార్గాన్నీ నిర్దేశించారు.

వాటిలో కనకధారా స్తోత్రం ఒకటి.
జగద్గురు ప్రవచించిన వాటిలో ఇది మొదటి స్తోత్రంగా చెబుతారు.

ఇందులో మొత్తం 21 శ్లోకాలు ఉన్నాయి.

కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
ధారాధరే స్ఫురతి యా తట్పిదంగనేవ
మాతాస్సమస్త జగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః’

ఆకాశంలో మబ్బులు కమ్మిన సమయంలో వచ్చే మెరుపు ఎలా కాంతిమంతంగా కనిపిస్తుందో...
అలా విష్ణు వక్ష స్థలంలో లక్ష్మీదేవి ప్రకాశిస్తుంది.

‘గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి
శాకంబరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టిస్థితి ప్రళయ కేళిఘ సంస్థితాయై
తస్మై నమస్త్రిభువనైన గురోస్తరుణ్యై’

ముల్లోకాలకూ గురువైన విష్ణువు పట్టమహిషి...
వాగ్దేవి, గరుడ ధ్వజసుందరి, శాకంబరి, శశిశేఖర వల్లభ అనే పేర్లతో పూజలందుకుంటున్న లక్ష్మీదేవికి నమస్కారం.

మరో శ్లోకంలో వక్షస్థలాన్ని అలంకరించిన మాలలోని ఇంద్రనీలపతకం మెరుస్తున్నట్లుగా లక్ష్మీదేవి ఉందని చెబుతారు.
ఇలా ఏ శ్లోకానికా శ్లోకం ప్రత్యేకంగా ఉండడంతో పాటు అమ్మరూపాన్ని, దయను ఒక దృశ్యంగా కళ్లముందు ఉంచుతుంది.

ఆది శంకరులు ఆ పేదరాలి ఇంటి ముందు నిలబడి ఆశువుగా స్తోత్రం చేశాడు కానీ అందులో ఎక్కడా కనకధార అనే మాట వినిపించదు. అయితే అందులోని

‘దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా
మస్మిన్నకించన విహంగశిశే విషణ్ణే!
దుష్కర్మఘర్మ మపనీయ చిరాయదూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః!’

శ్రీమన్నారాయణుని దేవేరి అయిన లక్ష్మీదేవి దృష్టి అనే మేఘం దయావాయు ప్రేరితమై, నాలో చాలాకాలం నుంచి ఉన్న దుష్కర్మ తాపాలను తొలగించి, పేదవాడిని అనే విచారంలో ఉన్న చాతక పక్షి వంటి నాపై ధనవర్ష ధారను కురిసేలా చేయును గాక’

అనే శ్లోకాన్ని బట్టి కనకధార అనే పేరు ఈ స్తోత్రానికి వచ్చినట్లు చెబుతారు.

ఇందులోని ‘ద్రవిణాంబుధార’ అనే పద భాగమే కనకధార అనే పేరుకు కారణంగా భావించాలి.

తనను నమ్మి నిరంతరం స్తోత్రం చేసేవారిపై లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో తన దయను వర్షింపజేస్తుంది. 

ఈ విషయాన్ని నిరూపించేదే కనకధారా స్తోత్రం.



శ్రీమహాలక్ష్మి సంపదల తల్లి.

ధనధాన్యాలకు అధినేత.

శ్రీహరి హృదయ రాణి.

కనకధారా స్తోత్రంలో విష్ణువును ప్రార్థించడం,
విష్ణువుతో లక్ష్మీదేవిని అనుసంధానం చేస్తూ స్తోత్రం చేయడం కనిపిస్తుంది.

‘నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్దోదధి జన్మభూమ్మై్య
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై’

పద్మాలను పోలిన ముఖంతో వర్ధిల్లే దేవికి నమస్కారం.
క్షీర సముద్రం నుంచి జన్మించిన తల్లికి నమస్కారం,
అమృతం, చంద్రుడుల సోదరికి నమస్కారం. నారాయణుని వల్లభ అయిన లక్ష్మీదేవికి నమస్కారం...


శ్రీ కనకధారా స్తోత్రం


వందే వందారు మందార మందిరానంద కందలం
అమందానంద సందోహ బంధురం సింధురాననం
అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ
భృంగాగనేవ ముకుళాభరణం తమాలం
అంగీకృతాఖిల విభూతి రసాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః
ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని
మాలా దృశోర్మధుకరీవ మహోత్సలేయా
సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః
విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్ష
మానందహేతు రధికం మురవిద్విషోపి
ఈషన్నిషీదతు మయిక్షణ మీక్షణార్థ
మిందీవరోదర సహోదర మిందిరాయాః
ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకుంద
మానందకంద మనిమేష మనంగ తంత్రం
ఆకేరక స్థిత కనీనిక పద్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః
కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
ధారా ధరే స్ఫురతి యా తటిదంగ నేవ
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః
బాహ్వాంతరే మురజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరనీలమయీ విభాతి
కామప్రదా భగవతోపి కటాక్షమాలా
కల్యాణమావహతు మే కమలాలయాయాః
ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన
మయ్యాపతే త్తదిహ మంథర మీక్షణార్థం
మందాలసం చ మకరాలయ కన్యకాయాః
దద్యాయానుపవనో ద్రవిణాంబుధారా
మస్మిన్నకించన విహంగశిసౌ విషణ్ణే
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః
ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
దృష్టా స్త్రివిష్టప పదం సులభం లభంతే
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః
గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యైః
శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్యైనమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై
నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై
నమోస్తు హేమాంబుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికాయై
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్గ్ఙయుధ వల్లభాయై
నమోస్తు దేవ్యై భృగునందనాయై
నమోస్తు విష్ణోరురసి స్థితాయై
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై
నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై
సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితా హరణోద్యతాని
మామేవ మాత రనిశం కలయంతు మాన్యే
యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్థ సంపదః
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారి హృదయేశ్వరీం భజే
సరసిజనయనే సరోజ హస్తే
ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతి కరి ప్రసీద మహ్యం
దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాంగీం
ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష
లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం
కమలే కమలాక్ష వల్లబే త్వం
కరుణాపూర తరంగితై రపాంగైః
అవలోకయ మా మకించనానాం
ప్రథమం పాత్రమ కృత్రిమం దయాయాః
బిల్వాటవీమధ్యలసత్ సరోజే
సహస్రపత్రే సుఖసన్నివిష్టాం
అష్తాంపదాంభోరుహ పాణిపద్మాం
సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం
కమలాసనపాణినా లలాటే
లిఖితామక్షర పంక్తిమస్య జంతోః
పరిమార్జయ మాతరంఘ్రిణాతే
ధనికద్వార నివాస దుఃఖదోగ్ర్ధీం
అంభోరుహం జన్మగృహం భవత్యాః
వక్షస్స్థలం భర్తృగృహం మురారేః
కారుణ్యతః కల్పయ పద్మవాసే
లీలాగృహం మే హృదాయారవిందం
స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
గుణాధికా గురుతర భాగ్యభాజినో
భవంతి తే భువి బుధ భావితాశయాః


సువర్ణ ధారా స్తోత్రం
యచ్ఛంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యఃపథేన్నిత్యం స కుబేరసమోభవేత్


ఇతి శ్రీ మచ్ఛంకర భగవత్పాదాచార్యకృతం కనకధారాస్తోత్రం