Wednesday 9 November 2016

రుద్రాక్షలు


రుద్రాక్షలు

శివుని అక్షుల నుండి జాలువారిన నీటి బిందువులు ,
భూమి మీదకు జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారి
వాటికి కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు.

వీటిలో చాల రకముల రుద్రాక్షలు వున్నాయి ఒకొక్కటి ఒకొక్క విశిష్టతను కలిగి వుంటాయి.
ఇవి ఒకటి నుంచి పదిహేను పద్దెనిమిది రకముల వరకూ వుండు అవకాశమున్నది.

1. ఏక ముఖి
ఇది అత్యంత విలువ కలిగినది దీనిని ప్రత్యక్ష శివుని రూపముగా భావించుతారు.

2. ద్విముఖి
ఇది అర్ధనారిస్వరులు [శివ పార్వతులు] గా భావిస్తారు.

3. త్రి ముఖి
దీనిని శివ,విష్ణు , బ్రహ్మ , రూపముగా భావిస్తారు.

4. చతుర్ ముఖి
దీనిని బ్రహ్మ స్వరూపమని కొందరు చతుర్ వేదాల స్వరూపమని కొందరు భావిస్తారు.

5. పంచ ముఖి
దీనిని పంచ ముఖ రూపముగా లక్ష్మి స్వరూపముగా భావిస్తారు.

6. షణ్ముఖి
ఇది ప్రత్యక్ష కుమారస్వామి [కార్తికేయ] రూపముగా భావిస్తారు.

7. సప్త ముఖి
కామధేను స్వరూపము గా భావిస్తారు.

8. అష్ట ముఖి
గణనాధుని[విఘ్నేశ్వర] స్వరూపముగా భావిస్తారు.

9. నవముఖి
నవగ్రహస్వరూపముగానె కాక ఉపాసకులకు మంచిదని భావిస్తారు

10.దశ ముఖి
దీనిని దశావతార రూపముగా విశేసించి స్త్రీలు వీటిని ధరిచుట మంచిదని భావించుట జరుగుతున్నది.





పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/