కంద అట్టు
కావలిసిన పదార్థాలు
1. కంద పావుకేజీ
2. వరిపిండి 2 కప్పులు
3. ఉప్పు తగినంత
4. ఎండుమిరప కాయలు 6.
5. ఇంగువ కొద్దిగా
6. జీలకర్ర 1 స్పూన్
7. పసుపు కొద్దిగా
8. ఆయిల్ అర కప్పు
9. పెసర పప్పు అర కప్పు
తయారీ విధానం
ముందుగా పెసర పప్పు ను నాన పెట్టుకోవాలి.
కందను పైన వున్న. తొక్కను తీసి శుభ్రం గా కడిగి
చిన్న ముక్కలు గా తరుగుకోవాలి . తరిగిన కంద ముక్కలను
,నాన పెట్టిన పెసరపప్పును ,పసుపు ,తగినంత ఉప్పు
ఎండుమిరపకాయలు ,జీలకర్ర , ఇంగువ వేసి ,
మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకుని ,
తగినంత వరిపిండి వేసి బాగా కలుపుకోవాలి.
పైన కొద్దిగా జీలకర్రను చల్లుకోవాలి .
స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి పెనం అంతా పామాలి .
ఇప్పుడు ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకుని , దానికి ఆయిల్ రాసి
కంద పిండిని దాని మీద వేసి అట్టులా తట్టుకుని ,
వేడెక్కిన పెనం మీద వేసుకుని ,
ఆయిల్ వేసి రెండు పక్కలా దోరగా కాల్చు కుంటే ,
కంద అట్టు రెడీ అవుతుంది
వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే రుచిగా ఉంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.