Sunday 6 November 2016

పుణ్యఫలాలు అందించే " కార్తీకమాసం "


పుణ్యఫలాలు అందించే " కార్తీకమాసం "

నాగేంద్రహారాయ త్రిలోచనాయ! భస్మాంగరాగాయ మహేశ్వరాయ!

నిత్యాయ శుద్థాయ దిగంబరాయ! తస్మైన కారాయ నమశ్శివాయ!

మందాకినీ సలిలచందన చర్చితాయ! నందీశ్వరప్రమధనాథమహేశ్వరాయ!

మందారపుష్ప బహుపుష్పసుపూజితాయ! తస్మై మ కారాయ నమశ్శివాయ!

శివాయ గౌరీ వదనాబ్జబృం గ! సూర్యాయ దక్షాధ్వర నాశకాయ!

శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ! తస్మై శి కారాయ నమశ్శివాయ!

వశిష్టకుంభోద్భవ గౌతమార్య ! మునీంద్ర దేవార్చిత శేఖరాయ!

తస్మై వ కారాయ నమశ్శివాయ!
యక్ష స్వరూపాయ జటాధరాయ!
పినాక హస్తాయ సనాతననాయ!
దివ్యాయ దేవాయ దిగంబరాయ!
తస్మై య కారాయ నమశ్శివాయ!
పంచాక్షర మిదంపుణ్యంయ :పఠేతేశివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే

చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవది.
శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రసమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి “కార్తీకమాసం”అని పేరు వచ్చింది.
స్నానాలు, దానాలు, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలువంటివి, మహిమాన్వితమైన మాసం అయిన “కార్తీకమాసం” లో
చేయడం వల్ల జన్మజన్మల పాపాలు ప్రక్షాళన అయ్యి అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి.

కార్తీకమాసం శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీకమాసంలో ప్రతీరోజూ తెల్లవారు ఝూముననే స్నానమాచరించవలెను. అప్పుడే అది కార్తీక స్నానమవుతుంది. నిత్యం దీపాన్ని వెలిగించినా, ఆరాధించినా, దీపమును కార్తీకమాసంలో వెలిగించడం, నదిలో దీపాలను వదలడం , ఆకాశదీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వంటి ఆచారాలను పాటించవలేను.

కార్తీకమాసమంతా ఇంటి ముందు ద్వారానికి ఇరువైపులా సాయంకాలం దీపాలను వెలిగించవలెను. అట్లే సాయంత్ర సమయంలో శివాలయాల్లో గానీ వైష్ణవాలయాల్లోగానీ గోపురద్వారం వద్దగానీ, దేవుని సన్నిదానంలో గానీ ఆలయప్రాంగణంలోగానీ దీపాలు వెలిగించిన వారికి సర్వపాపములు హరించి వైకుంఠ ప్రాప్తికలుగుతుందని శాస్త్ర వచనం.

కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమినాడుగాని లేక ఇతర దినాల్లో అయినా సాయంసమయాలలో శివాలయంలో ఉసిరికాయపైన వత్తులను వుంచి దీపం వెలిగించడం శ్రేష్టం.

ఆవునెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం.
లేదంటే నువ్వులనూనెతోగానీ,కొబ్బరినూనెతోగానీ, నెయ్యితోగాని, అవిశనూనెతోగానీ, ఇప్పనూనెతోగానీ, కనీసం ఆముదంతోనైనా దీపమును వెలిగించవలెను.
కార్తీకమాసంలో దీపదానం చేయాలని శాస్త్ర వచనం.

కార్తీకమాసంలో ముప్పై రోజులలో దీపం పెట్టలేనివారు శుద్ధద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్ర వచనం.

ఈ విధంగా కార్తీకమాసంలో దీపాలను వెలిగించడం , దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళూ,రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం.

కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు
నెలంతా కార్తీక స్నానం చేయడం మంచిది.
సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి,చతుర్దశి, పౌర్ణిమరోజుల్లోనైనా తప్పక ఆచరించవలెను.

శుద్ధ ద్వాదశినాడు తులసి పూజ చేయవలెను.
ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించవలెను.
పరమేశ్వరుని మారేడుదళములతోనూ , జిల్లేడుపువ్వులతోనూ పూజించవలెను.

ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/