Monday 6 March 2017

అష్టాక్షరీ మహామంత్ర విశిష్టత



అష్టాక్షరీ మహామంత్ర విశిష్టత

“ఒమ్ నమో నారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రంలో
 “ఒమ్” – ఆత్మ స్వరూపాన్ని, “నమః” – అనే అక్షరాలు – బుద్ధిని, మనస్సుని, “నారాయణాయ” – అనే అక్షరాలు పంచేంద్రియాలను “జీవుని” తెలియజేస్తున్నాయి.

అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’. ఆకాశతత్త్వంపై ఆధారపడి ఉంది.
ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేతప్పుడు, ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది.

జలాలకు నారములని పేరు. పరమాత్మ ఆ ‘అనంతజలరాశి’లో శయనిస్తాడు కనుక ఆయనకు ‘నారాయణ’ అనే నామం వచ్చింది. ఇంకా,

“న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే
“ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే
“య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే
“ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే

“న” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి.
“ర” అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలోనున్న భోగాలు లభిస్తాయి.
“య” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు.
 “ణ” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కల్గి,
         దైవచింతన పట్ల ఆసక్తి కల్గి, మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది.

ఇంతటి శక్తివంతమైన “నారాయణ” అను శబ్దానికి
‘ఒమ్ నమో నారాయణాయ’ (అష్టాక్షరీ మహా మంత్రం)ను
జపించే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు.

ఈ మహా మంత్రంలో, మహోన్నతమైన శక్తి ఉంది.

ధ్యాయేన్నారాయణందేవం
స్నానాదిఘ చ కర్మసు,
ప్రాయశ్చిత్తం హి సర్వస్వ
దుష్కృత…

Wednesday 1 March 2017

కీరా దోసకాయ పెరుగు పచ్చడి


కీరా  దోసకాయ  పెరుగు పచ్చడి
( Kachambar  of cucumber )

కావలిసిన  పదార్థాలు
1.   కీరా  దోసకాయ  1.
2. పెరుగు  2కప్పులు
3.   పచ్చిమిర్చి  2
4. కొత్తిమీర  
5. ఉప్పు రుచికి  సరిపడా
6. పుదీనా

తయారీ  విధానం
ముందుగా  కీరా  దోసకాయను  శుభ్రంగా   కడిగి  ,
సన్నగా చిన్న  ముక్కలుగా ను  ,
పచ్చిమిర్చిని  చీలికలుగాను , కొత్తిమీర ను  సన్నగా  తరుగుకోవాలి.
ఒక  బౌల్  లో  పెరుగును  తీసుకుని , దానిలో  ఉప్పు  ,కీరా దోసకాయ  ముక్కలు ,
పచ్చిమిర్చి చీలికలు  , కొత్తిమీర,   వేసి  బాగా  కలిపి ,
కొద్దిసేపు  నాననివ్వాలి  ,పుదినా  తో గార్నిష్ చేసుకోవాలి .
కీరా  దోసకాయ  పెరుగు పచ్చడి రెడీ.

దీనిని  చపాతీలోకి  ,పులావ్  లోకి  బాగుంటుంది.

" As cool as cucumber " అంటారు ,  చలవ చేసే ఈ
కీరా  దోసకాయ  పెరుగు పచ్చడి  ...వేసవి లో ఉపయోగకరం గా ఉంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer
Achanta Subbalakshmi
Achanta Subhadevi

క్యాబేజీ పకోడీ


క్యాబేజీ  పకోడీ

కావలిసిన  పదార్థాలు
1. క్యాబేజీ  పావుకేజీ
2. సెనగ పిండి  పావుకేజీ
3.  అల్లం  చిన్న ముక్క
4.  పచ్చిమిర్చి  4.
5. కొత్తిమీర
6. పసుపు
7.  కారం  కొద్దిగా
8.   జీలకర్ర  ఆర  స్పూన్
9. ఉప్పు  రుచికి  సరిపడా
10. ఆయిల్  పావులీటరు
11. నీళ్లు  తగినన్ని

తయారీ  విధానం
ముందుగా  క్యాబేజీ ని  శుభ్రంగా  కడిగి  ,సన్నగా  తరుగుకోవాలి  .
అల్లమును  ,పచ్చిమిర్చి ని ,చిన్న  ముక్కలుగాను ,
 కొత్తిమీరను  సన్నగాను  ,తరుగుకోవాలి  .
పైన  చెప్పిన  క్యాబేజీ  ,అల్లం  ,కొత్తిమీర , పచ్చిమిర్చిలను ,
 ఒక  బౌల్  లోకి  తీసుకుని,   తగినంత  ఉప్పు   వేసి,
 బాగా  కలిపి
ఒక 5 నిమిషాలు మూత పెట్టి   ఉంచాలి.
తరువాత  దీనిలో  కారం  ,జీలకర్ర  ,సెనగపిండి  ,వేసి
బాగా  కలిపి  అవసరమైతే  ,కొద్దిగా  నీళ్లు పోసుకుని  ,కలుపుకోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  
వేడెక్కాక  ఆయిల్  వేసి  దీంట్లో ముందుగా  తయారు చేసి  పెట్టుకున్న
క్యాబేజీ  మిశ్రమాన్ని  ,పకోడీ  మాదిరిగా  వేసి  ,దోరగా  వేపుకుంటే  ,
క్యాబేజీ  పకోడీ  రెడీ  అవుతాయి 
వీటిని  టమాటా  సాస్  తో గాని మిర్చి  సాస్  తో  గాని  తింటే  రుచిగా  ఉంటాయి.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer
Achanta Subbalakshmi
Achanta Subhadevi