పాకం గారెలు
కావలిసిన పదార్థాలు
1. మినపప్పు 2. గ్లాసులు
2. బియ్యం 3. స్పూన్స్
3. ఉప్పు రుచికి సరిపడా
4. బెల్లం 2 గ్లాసులు
5. ఏలకుల పొడి కొద్దిగా
6. నీళ్లు 2. గ్లాసులు
7. ఆయిల్ పావు లీటరు
తయారీ విధానం
ముందుగా మినపప్పును బియ్యమును నీళ్లలో పోసి 4. గంటల సేపు
నాన బెట్టుకోవాలి నానిన ,మినపప్పును పైన వున్న పొట్టును తీసి శుభ్రం గా కడిగి ,
ఉప్పును వేసి మెత్తగాను మరియు గట్టిగాను రుబ్బుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి రుబ్బుకున్న మినపపిండిని,
ప్లాస్టిక్ కాగితం మీద గాని అరిటాకుమీద గాని గారెలు లాగ తట్టుకుని ,
మధ్యలో చిల్లు పెట్టి ఆయిల్ లో వేసి దోరగా వేపుకుని ఒక బేసిన్లోకి తీసుకోవాలి.
బెల్లం పాకం తయారీ విధానం
ఒక గిన్నెలో బెల్లం తగినన్ని నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి .
పాకము గులాబ్ జామ్ ల పాకం లాగ. ఉండేలా చూసుకోవాలి .
దింపే ముందు ఏలకుల పొడిని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి .
ఈ పాకం లో ముందుగా మనం చేసి పెట్టుకున్న
గారెలు వేసి ఒక గంట సేపు నాన నిస్తే
పాకం గారెలు రెడీ
ఒక వెడల్పయిన బౌల్ లో పాకం ఉంచి దాంట్లో గారెలు వేస్తే
పాకం అన్నిటిలోను సమానంగా దూరుతుంది
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi