Friday 11 November 2016

క్షీరాబ్ధి ద్వాదశి


క్షీరాబ్ధి ద్వాదశి

నమస్తులసి కళ్యాణి, నమో విష్ణుప్రియే శుభే 
నమో మోక్షప్రదే దేవి, నమ సంపత్ప్రదాయికే
యన్మూలే సర్వ తీర్ధాని- యన్మధ్యే సర్వ దేవతాః 
యదగ్రే సర్వ వేదాశ్చ – తులసీం త్వాం నమామ్యహం

కార్తీకమాసంలో వచ్చే ఎన్నో పర్వదినాలలో క్షీరాబ్ధి ద్వాదశి ఒకటి.
కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి అని అంటారు.
ఈ ద్వాదశినే మధన ద్వాదశి, చిలక ద్వాదశి అని కూడా అంటారు.
సాగర మధనం మొదలైన రోజు, మహాలక్ష్మి సాగర మథనంలో పుట్టినరోజు కూడా ఈరోజే.

మహా విష్ణువు తులసి వుండే బృందావనములోకి ఈరోజే ప్రవేశించారుట. అందువలన, ఈ రోజు తులసి మొక్క దగ్గర మహావిష్ణు ప్రతి లేదా ఉసిరి మొక్కను ఉంచి తులసి కళ్యాణం జరిపిస్తారు.

అన్నమాచార్యుల వారు కూడా అమ్మవారికి మంగళ నీరాజనములు ఇచ్చే వేళ ….

“క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిి
నీరజాలయమునకు నీరాజనం” అంటూ ఆలపించారు.

ఈరోజే బృందా దేవి శాపము వల్ల లోకానికి మహోపకారం జరిగింది.
మహా విష్ణువు ” సాలగ్రామం” గా మారి లోక కళ్యాణం జరిగింది.

కార్తీకమాసం ద్వాదశి రోజున తులసి సన్నిధిలో దీపప్రజ్వలనం చేసి,

“నమస్తులసి సర్వజ్ఞే పురుషోత్తమ వల్లభే పాహిమాం సర్వపాపేభ్యస్సద్వ సంపత్ప్రదాయినీ”అంటూ ధ్యానం చేస్తూ, శ్రద్ధతో తులసిదేవిని పూజించాలి.

“ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరీ విద్యాం, పుత్ర పౌత్రాం, ఆయురారోగ్యం,సర్వసంపదాం మమదేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే -ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యంవిష్ణు భక్తించ శాశ్వతీమ్‌ నీరోగం కురుమాం నిత్యం నిష్పాపంకురుసర్వదా”

అనే స్త్రోత్రం చేస్తూ ఉసిరి (ధాత్రీ) చెట్టు క్రింద శ్రీమహావిష్ణువును పూజించి దీపారాధన చేసి, ఉసిరికాయలు నివేదన చేసి, పదకొండు ప్రదక్షిణులు చేస్తే,
అఖండమైన అష్టైశ్వర్యప్రాప్తి.

ఈ పర్వదినాన, తులసి మొక్క వద్ద ఒక్క దీపం వెలిగించినా చాలు
అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి అని అంటారు.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/