కంద ఊరగాయ
కావలిసిన పదార్థాలు
1. కంద పావుకేజీ
2. నిమ్మకాయలు 2.
3. పసుపు
4. కారము 1 కప్పు
5. ఆవ పిండి 1 కప్పు
6. ఉప్పు తగినంత
7. ఆయిల్ పావులీటరు
తయారీ విధానం
ముందుగా కందను పైన వున్న తొక్కనుతీసి శుభ్రం గా కడిగి ,
ముక్కలుగా తరుగుకోవాలి .
కారము ,ఆవ ,ఉప్పు కలిపి న మిక్స్ బయట షాప్ లలో దొరుకుతుంది .
అది దొరకని పక్షం లో మన ఇంట్లోనే ఈ మిక్స్ తయారుచేసుకోవచ్చు .
ఆవాలను బాగా ఎండబెట్టి , మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ,
ఆవపొడి తయారవుతుంది .
ఈ ఆవపొడికి కారం ,ఉప్పు కలిపితే మిక్స్ తయారవుతుంది .
స్టవ్ వెలిగించి వెడల్పయిన బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి అందులో తరిగిపెట్టుకున్న కంద ముక్కలను వేసి
దోరగా వేపుకుని ఒక బేసిన్ లోకి తీసుకోవాలి .
ఈముక్కలపైన పసుపు ,కారం మిక్స్, నిమ్మరసం వేసి ,
బాగా కలుపు కుంటే కంద ఊరగాయ రెడీ.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi