Tuesday 30 October 2018

థాయిలాండ్ లో రామరాజ్యం



థాయిలాండ్ లో  రాజ్యాంగ ప్రకారం ఒక రామరాజ్యం ఉంది .
శ్రీరాముని పుత్రుడైన కుశుని వంశంవాడైన "భూమిబల్ అతుల్య తేజ్ " అనే రాజు అక్కడ రాజ్యపాలన చేస్తున్నాడు.
ఇతిహాసాలలో శ్రీరాముని చరిత్ర.
వాల్మీకిమహర్షి రచించిన రామాయణం మనకు మతగ్రంథమే కాదు, చారిత్రక గ్రంథం కూడా. వాల్మీకి మహర్షి బాలకాండ లోని 70,71 &73 సర్గలలో రాముని వివాహాన్ని , తమ్ముల వివాహాలను కూడా వర్ణించడం జరిగింది.
మిథిలకు రాజు సీరధ్వజుడు. ఆయనకు విదేహరాజు అన్న పేరు కూడా ఉంది. ఆయన భార్య సునేత్ర లేక సునయన. ఆయన పుత్రిక అయిన జానకికి రామునితో వివాహం జరిగింది. జనకుడికి కుశధ్వజుడు అనే తమ్ముడు కూడా ఉన్నాడు. అతని రాజధాని సాంకశ్యనగరం. అది ఇక్షుమతీనది ఒడ్డున ఉంది. ఈ కుశధ్వజుడు తన పుత్రికలైన ఊర్మిళ , మాండవి , శ్రుతకీర్తులను లక్ష్మణ, భరత, శతృఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు. కేశవదాసు రచించిన రామచంద్రిక అనే గ్రంథం ఆధారంగా (పేజీ 354), సీతారాములకు లవకుశులు ,   ఊర్మిళాలక్ష్మణులకు అంగద చంద్రకేతులు , మాండవీభరతులకు పుష్కరుడు - తక్షుడనే వాళ్ళు , శృతకీర్తిశతృఘ్నులకు సుబాహువు - శతృఘాతకుడనేవాళ్ళు జన్మించారు.
శ్రీరామునిసమయంలోనే రాజ్యవిభజన జరిగింది.
పశ్చిమంలో లవునకు లవపురం ( లాహోర్ ) , తూర్పున కుశునకు కుశావతి , తక్షునకు తక్షశిల , అంగదునకు అంగదనగరం , చంద్రకేతునకు చంద్రావతి లను ఇవ్వడం జరిగింది. కుశుడు తన రాజ్యాన్ని తూర్పుదిక్కుగా విస్తరింపజేసాడు. ఒక నాగవంశపు కన్యను వివాహం చేసుకున్నాడు. థాయిలాండ్ లోని రాజులంతా ఆ కుశుని వంశంలోని వారే. ఈ వంశాన్ని #చక్రీ వంశము అంటారు. చక్రి అంటే విష్ణువనే అర్థం .
రాముడు విష్ణుభగవానుని అవతారం. అదీగాక, రాజు విష్ణుస్వరూపమే  అందువలన వీళ్ళు తమ పేర్లచివర
రామ్ అన్న పేరు తగిలించుకుని ,
వారికి ఒక సంఖ్య ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం 9వ రాముడు రాజ్యం చేస్తున్నాడు. అతని పేరే భూమిబల్_అతుల్య_తేజ్.
థాయిలాండ్ యొక్క  " అయోథ్య
థాయిలాండ్ రాజధానిని ఆంగ్లంలో Bangkok
అయితే ప్రభుత్వరికార్డులలో అధికారిక రాజధాని పేరు  ప్రపంచంలో ని అన్నిదేశాల రాజధాను లలో ఇదే పొడుగైన పేరుగల రాజధాని.
ఆ పేరు సంస్కృతంలో ఉంది.
"  క్రుంగదేవ మహానగర అమరరత్న కోసింద్ర మహింద్రాయుధ్యా మహా తిలక భవ నవరత్న రజధానీపురీ రమ్య ఉత్తమ రాజ నివేశన అమర విమాన అవతార స్థిత శక్రదత్తియ విష్ణుకర్మ ప్రసిద్ధి " .
థాయిభాషలో పైపేరుని రాయడానికి 163 అక్షరాలు వాడారు.  వాళ్ళు రాజధాని పేరుని చెప్పమంటే పలకరు , పాటలా పాడుతారు. కొంతమంది సంక్షిప్తంగా
"మహింద్ర అయోధ్య" అని అంటారు. ఇంద్రుడు నిర్మించిన అయోధ్య అని అర్థం. థాయిలాండ్ రాజులందరూ ఈ అయోథ్యలోనే నివసిస్తారు.
థాయిలాండ్ లో నేటికీ రామరాజ్యం ఉంది.
థాయిలాండ్ లో 1932 లో ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజలు బౌద్ధమతస్తులైనా , రామరాజ్యాన్నే అనుసరిస్తున్నారు. అక్కడి రాజవంశం వారనెవరినీ విమర్శించడం గానీ , వివాదాలలోకి లాగడంగానీ చేయరు. వారంతా పూజనీయులని విశ్వసిస్తారు. రాజవంశంవారి దగ్గర నిటారుగా నిలబడి మాట్లాడరు, వంగి మాట్లాడతారు. ప్రస్తుత రాజుకి ముగ్గురు కూతుళ్ళు. అందులో చివరి కూతురికి హిందూధర్మశాస్త్ర పరిజ్ఞానముంది.
థాయిలాండ్ జాతీయగ్రంథం రామాయణం
థాయిలాండ్ వారు అధికశాతం బౌద్ధులైనా , వారి జాతీయగ్రంథం రామాయణము . థాయిభాషలో దానిని "రామ్ కియేన్ " అని పిలుస్తారు. మన వాల్మీకిరామాయణానికి దగ్గరగా విషయాలన్నీ ఉంటాయి. ఒకసారి 1767లో  రామ్ కియేన్ పాడైపోయినదట. అపుడు రాజైన రామ-1 (1736 -1809) తన స్మరణశక్తితో తిరిగి రామాయణమంతా రచించినాడట. రామాయణం జాతీయగ్రంథంగా వారు ప్రకటించుకున్నారు.
థాయిలాండ్ లో రామ్ కియేన్
( రామాయణం) ని అనుసరించి నాటకాలు , తోలుబొమ్మలాటలు ఉన్నాయి. వారి నాటకాలలోని పాత్రలు  -
1. రామ్ ( రాముడు )
2. లక్ ( లక్ష్మణుడు )
3. పాలీ ( వాలి )
4. సుక్రీప్ (సుగ్రీవుడు )
5. ఓన్కోట్ ( అంగదుడు )
6. ఖోంపూన్ ( జాంబవంతుడు )
7. బిపేక్ ( విభీషణుడు )
8. తోతస్ కన్ ( దశకంఠ ) రావణుడు
9. సదాయు ( జటాయు )
10. సుపన్ మచ్ఛా (శూర్పణఖ )
11. మారిత్ ( మారీచుడు )
12. ఇంద్రచిత్ (ఇంద్రజిత్ ) మేఘనాదుడు.
థాయిలాండ్ లో హిందూదేవీదేవతలు
ఇక్కడ బౌద్ధులు అధికసంఖ్యాకులు. హిందువులు అల్పసంఖ్యలో ఉన్నారు. ఇక్కడ బౌద్ధులు కూడా ఈ హిందూ దేవీ దేవతలను పూజిస్తారు.
1. ఈసుఅన్ ( ఈశ్వర్ ) శివుడు
2. నారాయి (నారాయణ్ ) విష్ణువు
3. ఫ్రామ్ ( బ్రహ్మా )
4. ఇన్ ( ఇంద్రుడు )
5. ఆథిత్ ( ఆదిత్య ) సూర్యుడు
6. పాయ్ ( వాయు )
థాయిలాండ్ జాతీయపక్షి గరుత్మంతుడు
గరుడపక్షి చాలా పెద్ద ఆకారంతో ఉంటుంది. ప్రస్తుతం ఈజాతి లుప్తమైపోయిందని భావిస్తున్నారు. ఇంగ్లీషులో ఆశ్చర్యంగా దీనిని బ్రాహ్మణపక్షి ( The Brahmany Kite )  అని పిలుస్తారు. దీని సైంటిఫిక్ నామధేయం "Haliastur Indus". ఫ్రెంచ్ పక్షిశాస్త్రజ్ఞుడు మాథురిన్ జాక్స్ బ్రిసన్ 1760 లో దీనిని చూసి Falco Indus అన్న పేరు పెట్టాడు. ఈయన దక్షిణభారత్ లోని పాండిచెరీ పట్టణం వద్ద కొండలలో దీనిని చూసానని తెలిపాడు. అందువల్ల ఈ పక్షి కల్పన కాదు అని అవగతమౌతోంది. మన పురాణాలలో ఈపక్షిని విష్ణుభగవానుని వాహనంగా పేర్కొన్నారు. థాయిలాండ్ ప్రజలు ఎంతో గౌరవంతో తమ రాజు రాముని అవతారం కనుక , ఆ రాముడు విష్ణువు అవతారమనీ , ఆ విష్ణువు వాహనం కనుక గరుడపక్షిని తమ జాతీయపక్షిగా చేసుకున్నారు.




థాయిలాండ్ పార్లమెంటు ఎదురుగా గరుడుని బొమ్మ కూడా పెట్టుకున్నారు.
థాయిలాండ్ ఎయిర్ పోర్ట్ పేరు సువర్ణభూమి
థాయిలాండ్ లోని రాజధాని లోని ఎయిర్ పోర్ట్ కు చక్కని సంస్కృతంలోని పేరు "సువర్ణభూమి" అని పెట్టుకున్నారు. వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ ఎయిర్ పోర్టు ఇదే. దీని వైశాల్యం 563,000 sq.mt. ఎయిర్ పోర్టు ముందు "సముద్రమంథనం " ని ప్రతిబింబిస్తూ పెద్ద బొమ్మ దేవతలు , రాక్షసులు చేసే క్షీరసాగరమథనాన్ని చూపిస్తుంది.

Monday 29 October 2018

నిత్యం తప్పనిసరిగా పఠించాల్సిన మంత్రాలు...

నిత్యం తప్పనిసరిగా పఠించాల్సిన
మంత్రాలు...

శ్రీ లలితా సహస్రం ,
ఆదిత్య హృదయం,
గాయత్రీ మంత్రం లాంటి మంత్రాలు,
నిత్యం తప్పని సరిగా పఠించాలి. వాటి ఉచ్ఛారణ వలన శక్తివంతమైన శబ్ద తరంగాలు ఉత్పన్నమై ...శారీరక,మానసిక శక్తులను ఇనుమడింపజేస్తాయి.  మంత్రాలను  రోజూ పఠించడం వలన...మనలో ఎన్నో శారీరక, మానసిక మార్పులు జరిగి,.....సానుకూల వర్తనలు అలవడతాయి.

గాయత్రీ మంత్రము :
 ఓం భూర్భువస్వః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియోయోనః ప్రచోదయాత్

 ప్రభాత శ్లోకం :

కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ !
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ !!

ప్రభాత భూమి శ్లోకం :

సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే !
విష్ణుపత్నీచ నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే !!

స్నాన శ్లోకం :

గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ !
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు !!

భస్మ ధారణ శ్లోకం :
శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ !
లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ !!

భోజనపూర్వ శ్లోకం :

బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ !
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన: !!

అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ - మాశ్రిత: !
ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ !!

భోజనానంతర శ్లోకం :

అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ !
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ !!

సంధ్యా దీప దర్శన శ్లోకం :
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ !
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోఁస్తుతే !!

నిద్రా శ్లోకం :
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ !
శయనే య: స్మరేన్నిత్యమ్ దుస్వప్న - స్తస్యనశ్యతి !!

కార్య ప్రారంభ శ్లోకం :
వక్రుతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ: !
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా !!

హనుమ స్తోత్రం :
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ !
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి !!

బుద్ధిర్భలం యశోధైర్యం నిర్భయత్వ - మరోగతా !
అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ - స్మరణాద్ - భవేత్ !!

శ్రీరామ స్తోత్రం :
శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

గణేశ స్తోత్రం :
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ !
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !!
అగజానన పద్మార్కం గజానన మహర్ణిశమ్ !
అనేకదంతం భక్తానా - మేకదంత - ముపాస్మహే !!

శివ స్తోత్రం :
ఓం త్ర్యం’బకం యజామహే సుగంధిం పు’ష్టివర్ధినమ్ !
ఉర్వారుకమి’ వ బంధ’ నాన్ - మృత్యో’ర్ - ముక్షీయమాఁ మృతా’’త్ !!

గురు శ్లోకం :
గురుబ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: !
గురు: సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ: !!

సరస్వతీ శ్లోకం :
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ !
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా !!

యు కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా !
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా !!
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ - దేవై: సదా పూజితా !
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా !!

లక్ష్మీ శ్లోకం :
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ !
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ !
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరమ్ !
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ !!

వెంకటేశ్వర శ్లోకం :
శ్రియ: కాంతాయ కళ్యాణనిధయే నిధయేఁర్థినామ్ !
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ !!

దేవీ శ్లోకమ్ :
సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే !
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే !!

దక్షిణామూర్తి శ్లోకం :
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ !
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ: !!

అపరాధ క్షమాపణ స్తోత్రం :
అపరాధ సహస్రాణి, క్రియంతేఁహర్నిశం మయా !
దాసోఁయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర !!

కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ !
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో !!

కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్ !
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి !!

శాంతి మంత్రం :
అసతోమా సద్దమయా !
తమసోమా జ్యోతిర్గమయా !
మృత్యోర్మా అమృతంగమయా !
ఓం శాంతి: శాంతి: శాంతి:

సర్వే భవంతు సుఖిన: సర్వే సంతు నిరామయా: !
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దు:ఖ భాగ్భవేత్ !!

ఓం సహ నా’వవతు ! సహనౌ’ భునక్తు ! సహవీర్యం’ కరవావహై !
తేజస్వినా వధీ’ తమస్తు మా వి’ద్విషావహై !!
ఓం శాంతి: శాంతి: శాంతి: !!
 ప్రతి మంత్రపు ఉచ్ఛారణ...శరీరాన్ని,మనస్సునూ...అనుసంధానం చేస్తుంది. ప్రతి పవిత్ర శబ్ద ఉచ్ఛారణ...ఆ ధ్వని తరంగాల రేఖా రూపాలను మారుస్తుంది.

Sunday 28 October 2018

ముఖ్య విషయము లు

 లింగాలు :
(1) పుం,
(2) స్త్రీ,
(3) నపుంసక

 వాచకాలు :
(1) మహద్వా,
(2) మహతీ,
(3) అమహత్తు.

 పురుషలు :-

(1) ప్రథమ,
(2) మధ్యమ,
(3) ఉత్తమ.

 దిక్కులు
(1) తూర్పు,
(2) పడమర,
(3) ఉత్తరం,
(4) దక్షిణం

మూలలు
(1) ఆగ్నేయం,
(2) నైరుతి,
(3) వాయువ్యం,
(4) ఈశాన్యం

 వేదాలు
(1) ఋగ్వేదం,
(2) యజుర్వేదం,
(3) సామవేదం,
(4) అదర్వణ వేదం

 ఉపవేదాలు :
(1) ధనుర్వేద,
(2) ఆయుర్వేద,
(3) గంధర్వ,
(4) శిల్ప.

 పురుషార్ధాలు :-
(1) ధర్మ,
(2) అర్థ,
(3) కామ,
(4) మోక్షాలు.

 చతురాశ్రమాలు :-
(1) బ్రహ్మ చర్యం,
(2) గార్హస్య్ద,
(3) వానప్రస్ధం,
(4) సన్యాసం.

 పంచభూతాలు :-
(1) గాలి,
(2) నీరు,
(3) భూమి,
(4) ఆకాశం,
(5) అగ్ని.

  పంచేంద్రియాలు :-
(1) కన్ను,
(2) ముక్కు,
(3) చెవి,
(4) నాలుక,
(5) చర్మం.

  భాషా భాగాలు :-
(1) నామవాచకం,
(2) సర్వనామం,
(3) విశేషణం,
(4) క్రియ,
(5) అవ్యయం.

 లలిత కళలు :-
(1) కవిత్వం,
(2) చిత్రలేఖనం,
(3) నాట్యం,
(4) సంగీతం,
(5) శిల్పం.

  పంచకావ్యాలు :-
(1) ఆముక్తమాల్యద,
(2) వసుచరిత్ర,
(3) మనుచరిత్ర,
(4) పారిజాతాపహరణం,
(5) శృంగార నైషధం.

  పంచగంగలు :-
(1) గంగ,
(2)  కృష్ణ,
(3) గోదావరి,
(4) కావేరి,
(5) తుంగభద్ర.

  దేవతావృక్షాలు :-
(1) మందారం,
(2) పారిజాతం,
(3) కల్పవృక్షం,
(4) సంతానం,
(5) హరిచందనం.

  పంచోపచారాలు :-
(1) స్నానం,
(2) పూజ,
(3) నైవేద్యం,
(4) ప్రదక్షిణం,
(5) నమస్కారం.

  పంచాగ్నులు :-
(1) బడబాగ్ని,
(2) జఠరాగ్ని,
(3) కష్టాగ్ని,
(4) వజ్రాగ్ని,
(5) సూర్యాగ్ని.

  పంచామృతాలు :-
(1) ఆవుపాలు,
(2) పెరుగు,
(3) నెయ్యి,
(4) చక్కెర,
(5) తేనె.

 పంచలోహాలు :
(1) బంగారం,
(2) వెండి,
(3) రాగి,
(4) సీసం,
(5) తగరం.

 పంచారామాలు :-
(1) అమరావతి,
(2) భీమవరం,
(3) పాలకొల్లు,
(4) సామర్లకోట,
(5) ద్రాక్షారామం

  ధర్మరాజు అడిగిన ఊళ్ళు :-
(1) ఇంద్రప్రస్థం,
(2) కుశస్థం,
(3) వృకస్థలం,
(4) వాసంతి,
(5) వారణావతం.

   వేదాంగాలు (స్మ్రతులు) :-
(1) శిక్ష,
(2) వ్యాకరణం,
(3) ఛందస్సు,
(4) నిరుక్తం,
(5) జ్యోతిష్యం,
(6) కల్పం.

 షడ్రుచులు :-
(1) తీపి,
(2) పులుపు,
(3) చేదు,
(4) వగరు,
(5) కారం,
(6) ఉప్పు.

  అరిషడ్వర్గాలు (షడ్గుణాలు) :-
(1) కామం,
(2) క్రోధం,
(3) లోభం,
(4) మోహం,
(5) మదం,
(6) మత్సరం.

  ఋతువులు :-
(1) వసంత,
(2) గ్రీష్మ,
(3) వర్ష,
(4) శరద్ఋతువు,
(5) హేమంత,
(6) శిశిర.

 షట్చక్రాలు :-
(1) మూలధార,
(2) స్వాధిష్టాన,
(3) మణిపూరక,
(4) అనాహత,
(4) విశుద్ధ,
(5) ఆజ్ఞాచక్రాలు.

   షట్చక్రవర్తులు :-
(1) హరిశ్చంద్రుడు,
(2) నలుడు,
(3) సగరుడు,
(4) పురుకుత్సుడు,
(5) పురూరవుడు,
(6) కార్తవీర్యార్జునుడు.

  సప్త ఋషులు :-
(1) కాశ్యపుడు,
(2) గౌతముడు,
(3) అత్రి,
(4) విశ్వామిత్రుడు,
(5) భరద్వాజ,
(6) జమదగ్ని,
(7) వశిష్ఠుడు.

  తిరుపతి సప్తగిరులు :-
(1) శేషాద్రి,
(2) నీలాద్రి,
(3) గరుడాద్రి,
(4) అంజనాద్రి,
(5) వృషభాద్రి,
(6) నారాయణాద్రి,
(7) వేంకటాద్రి.

  కులపర్వతాలు :-
(1) మహేంద్ర,
(2) మలయ,
(3) సహ్యం,
(4) శుక్తిమంతం,
(5) గంధమాధనం,
(6) వింధ్య,
(7) పారియాత్ర.

  సప్త సముద్రాలు :
(1) ఇక్షు,
(2) జల,
(3) క్షీర,
(4) లవణ,
(5) దది,
(6) సూర,
(7) సర్పి.

  సప్త వ్యసనాలు :-
(1) జూదం,
(2) మద్యం,
(3) దొంగతనం,
(4) వేట,
(5) వ్యబిచారం,
(6) దుబారఖర్చు,
(7) కఠినంగా మాట్లాడటం.

    సప్త నదులు :-
(1) గంగ,
(2) యమునా,
(3) సరస్వతి,
(4) గోదావరి,
(5) సింధు,
(6) నర్మద,
(7) కావేరి.
               
   ఊర్ధ్వలోకాలు :-
(1) భూ,
(2) భువర్ణో,
(3) సువర్ణో,
(4) తపో,
(5) జనో,
(6) మహా,
(7) సత్య.

  అదో లోకాలు :-
(1) అతల,
(2) వితల,
(3) సుతల,
(4) తలాతల,
(5) రసాతల,
(6) మహాతల,
(7) పాతాళ.

   జన్మలు :-
(1) దేవ,
(2) మనుష్య,
(3) రాక్షస,
(4) పిశాచి,
(5) పశు,
(6) పక్షి,
(7) జలజీవ,
(8) కీటక.

    కర్మలు :-
(1) స్నానం,
(2) సంధ్య,
(3) జపం,
(4) హోమం,
(6) స్వాధ్యాయం,
(7) దేవపూజ,
(8) ఆతిథ్యం,
(9) వైశ్యదేవం.

  అష్టదిగ్గజాలు :-
(1) ఐరావతం,
(2) పుండరీకం,
(3) కుముదం,
(4) సార్వభౌమం,
(5) అంజనం,
(6) సుప్రతీకం,
(7) వామనం,
(8) పుష్పదంతం.

   అష్టదిగ్గజకవులు :-
(1) నందితిమ్మన,
(2) పెద్దన,
(3) ధూర్జటి,
(4) పింగళి సూరన,     
(5) తెనాలిరామకృష్ణ,
(6) రామరాజభూషణుడు,
(7) అయ్యలరాజురామభద్రుడు,
(8) మాదయగారిమల్లన

   శ్రీ కృష్ణుని అష్ట భార్యలు :-
(1) రుక్మిణి,
(2) సత్యభామ,
(3) జాంబవతి,
(4) మిత్రవింద,
(5) భద్ర,
(6) సుదంత,
(7) కాళింది,
(8) లక్షణ.

   అష్ట భాషలు :-
(1) సంస్కృతం,
(2) ప్రాకృత,
(3) శౌరసేని,
(4) పైశాచి,
(5) సూళికోక్తి,
(6) అపభ్రంశం,
(7) ఆంధ్రము.

   నవధాన్యాలు :-
(1) గోధుమ,
(2) వడ్లు,
(3) పెసలు,
(4) శనగలు,
(5) కందులు,
(6) నువ్వులు,
(7) మినుములు,
(8) ఉలవలు,
(9) అలసందలు.

  నవరత్నాలు :-
(1) ముత్యం,
(2) పగడం,
(3) గోమేధికం,
(4) వజ్రం,
(5) కెంపు,
(6) నీలం,
(7) కనకపుష్యరాగం,
(8) పచ్చ (మరకతం),
(9) ఎరుపు (వైడూర్యం).

   నవధాతువులు
(1) బంగారం,
(2) వెండి,
(3) ఇత్తడి,
(4) రాగి,
(5) ఇనుము,
(6) కంచు,
(7) సీసం,
(8) తగరం,
(9) కాంతలోహం.

  నవరసాలు :-
(1) హాస్యం,
(2) శృంగార,
(3) కరుణ,
(4) శాంత,
(5) రౌద్ర,
(6) భయానక,
(7) బీభత్స,
(8) అద్భుత,
(9) వీర.

   నవబ్రహ్మలు :-
(1) మరీచ,
(2) భరద్వాజ,
(3) అంగీరసుడు,
(4) పులస్య్తుడు,
(5) పులహుడు,
(6) క్రతువు,
(7) దక్షుడు,
(8) వశిష్ఠుడు,
(9) వామదేవుడు.

   నవ చక్రాలు :-
(1) మూలాధార,
(2) స్వాధిష్టాన,
(3) నాభి,
(4) హృదయ,
(5) కంఠ,
(6) ఘంటికా,
(7) భ్రూవు,
(8) గగన,
(9) బ్రహ్మ రంధ్రం.

  నవదుర్గలు :-
(1) శైలపుత్రి,
(2) బ్రహ్మ చారిణి,
(3) చంద్రఘంట,
(4) కూష్మాండ,
(5) స్కందమాత,
(6) కాత్యాయని,
(7) కాళరాత్రి,
(8) మహాగౌరి,
(9) సిద్ధిధాత్రి.

   దశ బలములు :
(1 )  విద్య,
(2 )  స్నేహ,
(3 )  బుద్ధి,
(4 )  ధన,
(5 )  పరివార,
(6 )  సత్య,
(7 )  సామర్ధ్య,
(8 )  జ్ఞాన,
(9 )  దైవ,
(10) కులినిత.

  దశ సంస్కారాలు :
( 1 ) వివాహం,
( 2 ) గర్భాదానం,
( 3 ) పుంసవనం ,
( 4 ) సీమంతం,
( 5 ) జాతకకర్మ,
( 6 ) నామకరణం,
( 7 ) అన్నప్రాశనం,
( 8 ) చూడకర్మ,
( 9 ) ఉపనయనం,
(10) సమవర్తనం.

  దశ  మహాదానాలు :-
( 1 ) గో,
( 2 ) సువర్ణ,
( 3 ) రజతం,
( 4 ) ధాన్యం,
( 5 ) వస్త్ర,
( 6 ) నెయ్యి,
( 7 ) తిల,
( 8 ) సాలగ్రామం,
( 9 ) లవణం,
(10) బెల్లం.

   అర్జునుడికి గల పేర్లు :-
(*) అర్జునుడు,
(*) పార్ధుడు,
(*) కిరీటి,
(*) శ్వేతవాహనుడు,
(*) బీభత్సుడు,
(*) జిష్ణుడు,
(*) విజయుడు,
(*) సవ్యసాచి,
(*) ధనుంజయుడు
(*) పాల్గుణుడు.

   దశావతారాలు :-
( 1 ) మత్స్య,
( 2 ) కూర్మ,
( 3 ) వరాహ,
( 4 ) నరసింహ,
( 5 ) వామన,
( 6 ) పరశురామ,
( 7 ) శ్రీరామ,
( 8 ) శ్రీకృష్ణ,
( 9 ) బుద్ధ,
(10) కల్కి.

  జ్యోతిర్లింగాలు :-
హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .

కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .

మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)

గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)

మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం,    ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)

ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)

తమిళనాడు ~ రామలింగేశ్వరం

  షోడశ మహాదానాలు :-
( 1 ) గో,
( 2 ) భూ,
( 3 ) తిల,
( 4 ) రత్న,
( 5 ) హిరణ్య,
( 6 ) విద్య,
( 7 ) దాసి,
( 8 ) కన్య,
( 9 ) శయ్య,
(10) గృహ,
(11) అగ్రహార,
(12) రధ,
(13) గజ,
(14) అశ్వ,
(15) ఛాగ (మేక),
(16) మహిషి (దున్నపోతు).

    అష్టాదశవర్ణన
( 1 ) నగరం,
( 2 ) సముద్రం,
( 3 ) ఋతువు,
( 4 ) చంద్రోదయం,
( 5 ) అర్కోదయం,
( 6 ) ఉద్యానము,
( 7 ) సలిలక్రీడ,
( 8 ) మధుపానం,
( 9 ) రతోత్సవం,
(10) విప్రలంభం,
(11) వివాహం,
(12) పుత్రోత్పత్తి,
(13) మంత్రము,
(14) ద్యూతం,
(15) ప్రయాణం,
(16) నాయకాభ్యుదయం,
(17) శైలము,
(18) యుద్ధం.

    అష్టాదశ పురాణాలు :-
( 1 ) మార్కండేయ,
( 2 ) మత్స్య,
( 3 ) భవిష్య,
( 4 ) భాగవత,
( 5 ) బ్రహ్మ,
( 6 ) బ్రహ్మవైవర్త,
( 7 ) బ్రహ్మాండ,
( 8 ) విష్ణు,
( 9 ) వాయు,
(10) వరాహ,
(11) వామన,
(12) అగ్ని,
(13) నారద,
(14) పద్మ,
(15) లింగ,
(16) గరుడ,
(17) కూర్మ,
(18) స్కాంద.

   భారతంలోపర్వాలు :
( 1 ) ఆది,
( 2 ) సభా,
( 3 ) అరణ్య,
( 4 ) విరాట,
( 5 ) ఉద్యోగ,
( 6 ) భీష్మ,
( 7 ) ద్రోణ,
( 8 ) కర్ణ,
( 9 ) శల్య,
(10) సౌప్తిక,
(11) స్ర్తి,
(12) శాంతి,
(13) అనుశాసన,
(14) అశ్వమేధ,
(15) ఆశ్రమవాస,
(16) మౌసల,
(17) మహాప్రస్థాన,
(18) స్వర్గారోహణ.

 సంస్కృతరామాయణంలోకాండలు :-
( 1 ) బాల ,
( 2 ) అయోధ్య,
( 3 ) అరణ్య,
( 4 ) కిష్కింద,
( 5 ) సుందర ,
( 6 ) యుద్ధ.

{ తెలుగులో 7వకాండ ఉత్తర (లవకుశ కథ) }

  భాగవతంలో స్కంధాలు :-
(*) రాముని వనవాసం 14సం.

(*) పాండవుల అరణ్యవాసం 12సం.
      అజ్ఞాతవాసం 1సం.

 శంఖాలు :-
భీముడు      -  పౌండ్రము
విష్ణువు        -  పాంచజన్యం
అర్జునుడు    -  దేవదత్తం.

  విష్ణుమూర్తి  -  ఆయుధాలు  :- 
ధనస్సు   - శారంగం,
శంఖం     - పాంచజన్యం,
ఖడ్గం      - నందకం,
చక్రం       - సుదర్శనం.

  విల్లులు :-
అర్జునుడు   -  గాంఢీవం
శివుడు        -  పినాకం
విష్ణువు        -  శారంగం

  వీణలు - పేర్లు
  కచ్చపి - సరస్వతి,
మహతి   - నారధుడు,
కళావతి   - తుంబురుడు.

అష్టదిక్కులు         పాలకులు         ఆయుధాలు

తూర్పు                ఇంద్రుడు             వజ్రాయుధం
పడమర               వరుణుడు          పాశం
ఉత్తర                  కుబేరుడు            ఖడ్గం
దక్షిణం                 యముడు           దండం
ఆగ్నేయం             అగ్ని                    శక్తి
నైరుతి                 నిరృతి                 కుంతం
వాయువ్యం          వాయువు           ధ్వజం
ఈశాన్యం             ఈశానుడు          త్రిశూలం

 మనువులు                   మన్వంతరాలు
-------------------           -------------------------

స్వయంభువు       -     స్వారోచిష
ఉత్తమ                 -    తామసి
రైతవ                   -    చాక్షువ
వైవస్వత              -    సవర్ణ
దక్ష సువర్ణ            -    బ్రహ్మ సువర్ణ
ధర్మసవర్ణ             -    రుద్రసవర్ణ
రౌచ్య                   -    బౌచ్య

  సప్త స్వరాలు :-
""""""""""""""""""""""
 స   ~  షడ్జమం      -{ నెమలిక్రేంకారం    }
 రి   ~   రిషభం       -{ ఎద్దురంకె             }
 గ   ~   గాంధర్వం   -{ మేక అరుపు        }
 మ ~   మధ్యమ     -{ క్రౌంచపక్షికూత      }
 ప   ~   పంచమం   -{ కోయిలకూత        }
 ద   ~   దైవతం      -{ గుర్రం సకిలింత     }
 ని   ~   నిషాదం     -{ ఏనుగు ఘీంకారం }

  సప్త ద్వీపాలు :-
""""""""""""""""""""""
జంబూద్వీపం   - -   అగ్నీంద్రుడు
ప్లక్షద్వీపం         - -    మేధాతిధి
శాల్మలీద్వీపం    - -   వప్రష్మంతుడు
కుశద్వీపం        - -    జ్యోతిష్యంతుడు
క్రౌంచద్వీపం      - -    ద్యుతిమంతుడు
శాకద్వీపం         - -    హవ్యుడు
పుష్కరద్వీపం    - -   సేవకుడు

 తెలుగు వారాలు :-
"""""""""""""""""""""""""
(1) ఆది,
(2) సోమ,
(3) మంగళ,
(4) బుధ,
(5) గురు,
(6) శుక్ర,
(7) శని.

  తెలుగు నెలలు :-
"""""""""""""""""""""""""
( 1 ) చైత్రం,
( 2 ) వైశాఖం,
( 3 ) జ్యేష్ఠం,
( 4 ) ఆషాఢం,
( 5 ) శ్రావణం,
( 6 ) భాద్రపదం,
( 7 ) ఆశ్వీయుజం,
( 8 ) కార్తీకం,
( 9 ) మార్గశిరం,
(10) పుష్యం,
(11) మాఘం,
(12) ఫాల్గుణం.

  రాశులు :-
""""""""""""""
( 1 ) మేషం,
( 2 ) వృషభం,
( 3 ) మిథునం,
( 4 ) కర్కాటకం,
( 5 ) సింహం,
( 6 ) కన్య,
( 7 ) తుల,
( 8 ) వృశ్చికం,
( 9 ) ధనస్సు,
(10) మకరం,
(11) కుంభం,
(12) మీనం.

  తిథులు :-
""""""""""""""""
( 1 ) పాఢ్యమి,
( 2 ) విధియ,
( 3 ) తదియ,
( 4 ) చవితి,
( 5 ) పంచమి,
( 6 ) షష్ఠి,
( 7 ) సప్తమి,
( 8 ) అష్టమి,
( 9 ) నవమి,
(10) దశమి,
(11) ఏకాదశి,
(12) ద్వాదశి,
(13) త్రయోదశి,
(14) చతుర్దశి,
(15) అమావాస్య /పౌర్ణమి.

  నక్షత్రాలు :-
"""""""""""""""""
( 1 ) అశ్విని,
( 2 ) భరణి,
( 3 ) కృత్తిక,
( 4 ) రోహిణి,
( 5 ) మృగశిర,
( 6 ) ఆరుద్ర,
( 7 ) పునర్వసు,
( 8 ) పుష్యమి,
( 9 ) ఆశ్లేష,
(10) మఖ,
(11) పుబ్బ,
(12) ఉత్తర,
(13) హస్త,
(14) చిత్త,
(15) స్వాతి,
(16) విశాఖ,
(17) అనురాధ,
(18) జ్యేష్ఠ,
(19) మూల,
(20) పూర్వాషాఢ,
(21) ఉత్తరాషాఢ,
(22) శ్రావణం,
(23) ధనిష్ఠ,
(24) శతభిషం,
(25) పూర్వాబాద్ర,
(26) ఉత్తరాబాద్ర,
(27) రేవతి.

  తెలుగు సంవత్సరాల పేర్లు :-
( 1 ) ప్రభవ :-
1927, 1987, 2047, 2107

( 2 ) విభవ :-
1928, 1988, 2048, 2108

( 3 ) శుక్ల :-
1929, 1989, 2049, 2109

( 4 ) ప్రమోదూత :-
1930, 1990, 2050, 2110

( 5 ) ప్రజోత్పత్తి :-
1931, 1991, 2051, 2111

( 6 ) అంగీరస :-
1932, 1992, 2052, 2112

( 7 ) శ్రీముఖ :-
1933, 1993, 2053, 2113

( 8 )భావ. -
1934, 1994, 2054, 2114

9యువ.  -
1935, 1995, 2055, 2115

10.ధాత.  -
1936, 1996, 2056, 2116

11.ఈశ్వర. -
1937, 1997, 2057, 2117

12.బహుధాన్య.-
1938, 1998, 2058, 2118

13.ప్రమాది. -
1939, 1999, 2059, 2119

14.విక్రమ. -
1940, 2000, 2060, 2120

15.వృష.-
1941, 2001, 2061, 2121

16.చిత్రభాను. -
1942, 2002, 2062, 2122

17.స్వభాను. -
1943, 2003, 2063, 2123

18.తారణ. -
1944, 2004, 2064, 2124

19.పార్థివ. -
1945, 2005, 2065, 2125

20.వ్యయ.-
1946, 2006, 2066, 2126

21.సర్వజిత్తు. -
1947, 2007, 2067, 2127

22.సర్వదారి. -
1948, 2008, 2068, 2128

23.విరోధి. -
1949, 2009, 2069, 2129

24.వికృతి. -
1950, 2010, 2070, 2130

25.ఖర.
1951, 2011, 2071, 2131

26.నందన.
1952, 2012, 2072, 2132

27 విజయ.
1953, 2013, 2073, 2133,

28.జయ.
1954, 2014, 2074, 2134

29.మన్మద.
1955, 2015, 2075 , 2135

30.దుర్మిఖి.
1956, 2016, 2076, 2136

31.హేవళంబి.
1957, 2017, 2077, 2137

32.విళంబి.
1958, 2018, 2078, 2138

33.వికారి.
1959, 2019, 2079, 2139

34.శార్వారి.
1960, 2020, 2080, 2140

35.ప్లవ
1961, 2021, 2081, 2141

36.శుభకృత్.
1962, 2022, 2082, 2142

37.శోభకృత్.
1963, 2023, 2083, 2143

38. క్రోది.
1964, 2024, 2084, 2144,

39.విశ్వావసు.
1965, 2025, 2085, 2145

40.పరాభవ.
1966, 2026, 2086, 2146

41.ప్లవంగ.
1967, 2027, 2087, 2147

42.కీలక.
1968, 2028, 2088, 2148

43.సౌమ్య.
1969, 2029, 2089, 2149

44.సాధారణ .
1970, 2030, 2090, 2150

45.విరోధికృత్.
1971, 2031, 2091, 2151

46.పరీదావి.
1972, 2032, 2092, 2152

47.ప్రమాది.
1973, 2033, 2093, 2153

48.ఆనంద.
1974, 2034, 2094, 2154

49.రాక్షస.
1975, 2035, 2095, 2155

50.నల :-
1976, 2036, 2096, 2156,

51.పింగళ               
1977, 2037, 2097, 2157

52.కాళయుక్తి       
1978, 2038, 2098, 2158

53.సిద్ధార్ధి             
1979, 2039, 2099, 2159

54.రౌద్రి               
1980, 2040, 2100, 2160

55.దుర్మతి             
1981, 2041, 2101, 2161

56.దుందుభి           
1982, 2042, 2102, 2162

57.రుదిరోద్గారి       
1983, 2043, 2103, 2163

58.రక్తాక్షి               
1984, 2044, 2104, 2164

59.క్రోదన                 
1985, 2045, 2105, 2165

60.అక్షయ             
1986, 2046, 2106, 2166.

కులవృత్తులు.
బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్య, రజక, మంగలి, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, కంసాలి, సాలెలు, జాలరి, మేదరి, కర్షకుడు, చెప్పులుకట్టేవారు.

జానపద కళలు.
హరికథ, బుర్రకథ, ఒగ్గుకథ, తోలుబొమ్మలాట, బుడబుక్కలాట, కోలాటం, పులివేషం, యక్షగానం, వీధినాటకాలు, డప్పులనృత్యం, గంగిరెద్దులమేళం, కర్రసాము.

Saturday 27 October 2018

అట్లతద్ది


అట్లతద్ది
గౌరీదేవి శివుని భర్తగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు సూచించాడు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది. ఇది స్త్రీలు సౌభాగ్యం
కోసం చేసుకునే వ్రతం. కన్నెపిల్లలు  గుణవంతుడైన రూపసి  పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతమిది.
అట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి.

ఇది ఆశ్వయుజ బహుళ తదియనాడు జరుపుకొంటారు. "అట్లతద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు" అంటూ ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలివ్వటం పరిపాటి. సాయం సమయమందు వాయినాలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి, అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు.
త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలముతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి తొలుతగ చేసిన విశిస్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్రీలు సౌభాగ్యము కోసం చేసుకొనే వ్రతమిది. చంద్రారాధన ప్రధానమైన పూజ, చంద్రకళల్లో కొలువైవున్నశక్తి అనుగ్రహం చేత స్రీసౌభాగ్యము పెరుగుతుంది. కుటుంబములో సుఖశాంతులు వర్దిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండగలో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతర్ధానముంది. నవగ్రహాలలోని కుజుడుకీఅట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యముగాపెడితే కుజదోషపరిహారమై సంసారసుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకము. రజోదయమునకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగావుంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భదారణలోఎటువంటిసమస్యలుండవు. మినుములు పిండి, బియ్యము పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంభందంచిన దాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనముగా ఇవ్వాలి. గర్భస్రావమురాకుండా, సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుందికూడా. అందుకే ముత్తయిదువులకు అట్లను వాయనముగా ఇస్తారు. అట్లతద్దిలోని 'అట్ల'కు ఇంతటి వైద్యవిజ్ఞానము నిక్షిప్తం చేయబడివుంది.అట్లతద్ది పండుగను ఉత్తభారత దేశంలో 'కర్వా ఛౌత్' అనే పేరుతో జరుపుకుంటారు.
వ్రతవిధానము
ఈ రోజు తెల్లవారుఝామునే మేల్కొని శుచి, శుభ్రతతో స్నానమాచరించి, ఉపవాసముండి, ఇంటిలో తూర్పుదిక్కున మంటపము యేర్పాటుచేసి గౌరీదేవి పూజ చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి, వినాయక పూజ తర్వాత, గౌరీ స్తోత్రము, స్లోకాలు, పాటలు చదవడము, పాడడం చేస్తారు. సాయంత్రం చంద్ర దర్శనము అనంతరము శుచియై తిరిగి గౌరీపూజచేసి, 11 అట్లు నైవేద్యముగాపెట్టి, ముత్తైదువులకు అలంకారము చేసి, 11 అట్లు, 11 ఫలాలు వాయనముగా సమర్పించి, అట్లతద్దినోము కథ చెప్పుకొని, అక్షతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవిక గుడ్డలు, దక్షిణతాంబూలాలు ఇచ్చి భోజనాలుపెట్టి, తామూ భోజనము చేయాలి. 11 రకాల ఫలాలను తినడం, 11 మార్లు తాంబూలం వేసుకోవడం, 11 మార్లు ఊయలఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ఈపండుగలో విశేషము. దీనినే 'ఉయ్యాలపండగ' అనీ, 'గోరింటాకుపండగ' అనీ అంటారు. ఈపండగ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహంతో పెళ్లి కాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్తగా లభిస్తాడని, పెళ్ళైనవారికి పిల్లలు కలుగుతారని, ఐదవతనముతోపాటు, పుణ్యము లభిస్తుందని తరతరాలనుంచి వస్తున్న నమ్మకము.
అట్ట్ల తద్దోయ్ ఆరట్లోయ్
ముద్దపప్పోయ్, మూడట్లోయ్
చిప్ప చిప్ప గోళ్ళు, సింగరయ్య గోళ్ళు
మా తాత గోళ్ళు, మందాపరాళ్ళు


Monday 22 October 2018

మారేడు చెట్టు.

లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు.
అందుకే
ఆ చెట్టుకు పండిన కాయను
‘శ్రీఫలము’  అని పిలుస్తారు.
సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది.
మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి , దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు.
మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగ పడుతుంది.
ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది.
 అందుకే
" త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం "
అని తలుస్తాము.
దళములు దళములుగా ఉన్నవాటినే కోసి
పూజ చేస్తారు. ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది.
అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. అది మూడు, తొమ్మిది కూడా ఉంటాయి.
మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు.
మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు.
అందులో మారేడు దళము ఒకటి.
మారేడు దళంతో పూజ చేసినప్పుడు
బిల్వం ఈనె శివలింగమునకు తగిలితే
ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది.
అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా,
పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్నా
మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు.
శివుడిని మారేడు దళంతో పూజ చేయగనే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట.

 ‘బాల్యం,
యౌవనం,
కౌమారం
ఈ మూడింటిని నీవు చూస్తావు’
అని ఆశీర్వదిస్తాడుట.
కాబట్టి
ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది.

శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తీ మూడు గుణములకు అతీతుడు అవుతాడు.

 మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే జ్ఞానం సిద్ధిస్తుంది. ఇంత శక్తి కలిగినది కాబట్టే  దానికి "శ్రీసూక్తం"లో
 ‘అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే’
(అమ్మా అలక్ష్మిని= దరిద్రమును పోగొట్టెదవుగాక)  అని  చెప్తాము.
మనిషికి మూడు గుణములు,
మూడు అవస్థలు ఉంటాయి.
 నాల్గవదానిలోకి వెళ్ళడు.
నాల్గవది తురీయము.
తురీయమే జ్ఞానావస్థ.
అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది.
మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే
మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే.
ఇంట్లో మారేడు చెట్టు ఉంటె ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా అపారమయిన సిద్ధి కలుగుతుంది.
యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు
ఆ మారేడు చెట్టుక్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే
అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది.
 శాస్త్రము మనకు లఘువులు నేర్పింది.
మారేడు చెట్టు అంత గొప్పది.
మారేడు చెట్టు మీదనుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది.
అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది.
 ‘మా-రేడు’
తెలుగులో
రాజు ప్రకృతి,
రేడు వికృతి.
మారేడు అంటే మా రాజు. ఆ చెట్టు పరిపాలకురాలు. అన్నిటినీ ఇవ్వగలదు.
ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు.
అది పువ్వు పూయవలసిన అవసరం లేదు.
 ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది.
అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు.
అందుకే మీకు ఏది చేతనయినా కాకపోయినా మీ జీవితమును పండించుకోవడానికి వాసనా బలములను మీరు ఆపుకోలేకపోతే ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీ అంత మీరు నిగ్రహించుకోలేకపొతే మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి.
అందులో
1మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం,

2 రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట,

3 మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట.

ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు.

Thursday 11 October 2018

శ్రీవారి ఆలయం చేరుకోవటానికి నడకదారులు

శ్రీవారి ఆలయం చేరుకోవటానికి  నడకదారులు

లక్షల సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శిస్తుంటారు భక్తులు. కొండ మీద ఉన్న శ్రీవారికి దర్శించుకొనేందుకు భక్తులు సాధారణంగా నడక మార్గాన, టాక్సీలలో, జీపులలో మరియు బస్సులలో వెళుతుంటారు.
చాలా మందికి తెలిసిన దారి అలిపిరి.  అలిపిరి కాకుండా ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి

అలిపిరి - తిరుమల మెట్ల మార్గం

తిరుమలలో ఏడు కొండలు నడకదారి గుండా ప్రయాణిస్తే తిరుమల ఆలయానికి చేరుకోవచ్చు.

తాళ్ళపాక అన్నమాచార్యులు
 గొప్ప వైష్ణవ భక్తుడు మరియు వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి, మర్యాద, గౌరవం, ప్రేమ, వాత్సల్యం. ఆయన వ్రాసిన 32 వేల కీర్తనలలో  వేంకటేశ్వరస్వామి కీర్తనలే ఎక్కువ. అలిపిరి నుండి తిరుమల కొండ ఎక్కిన మొట్టమొదటి భక్తుడు అన్నమాచార్యుల వారే.

*అన్నమాచార్య*

అలిపిరి నుండి అన్నమాచార్యులు వెళ్లిన దారే మొదటి నుండి గుర్తింపు పొందినది. శ్రీవారి కొండకు చేరుకోవటానికి తక్కువ టైం పట్టే మార్గాలలో ఇది ఒకటి. ఈ దారే కాకుండా తిరుమల చేరుకోవటానికి అనేక దారులు ఉన్నాయి. అయితే సౌకర్యాలు అంతంత్రమాత్రమే.

*మొదటి మెట్టు*

శ్రీవారికి ఆలయానికి చేరుకోవటానికి మొత్తం 8 దారులు ఉన్నాయి. వాటిలో మొదటిది మరియు ప్రధానమైనది అలిపిరి. అలిపిరి అంటే *'ఆదిపడి*' అనగా మొదటిమెట్టు అని అర్థం.

*అలిపిరి*

అలిపిరి మార్గంలో తిరుమల చేరుకోవటానికి గంటన్న సమయం పడుతుంది. *దూరం 11-12 KM* లు ఉంటుంది.

*రెండవ దారి*

*తిరుపతి కి 10 KM ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది.* అక్కడికి 5 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. ఈ దారి గుండా మూడు కిలోమీటర్లు నడిస్తే శ్రీవారి ఆలయం చేరుకోవచ్చు. పట్టే సమయం గంట. చంద్రగిరి కోట నిర్మించిన తర్వాత ఈ దారి వెలుగులోకి వచ్చింది.
*చంద్రగిరి కి 8 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది.* చంద్రగిరి రాజులు ఈ దారి గుండా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొనేవారు.
కృష్ణదేవరాయలు చంద్రగిరి దుర్గం లో విడిది చేసి, ఈ మార్గం గుండా శ్రీనివాసుడిని ఏడు సార్లు దర్శించుకున్నాడని స్థానికులు చెబుతారు. ఇప్పటికీ కొండ పైకి కూరగాయలు, పాలు, పెరుగు, పూలు వంటివి ఇదే దారిలో చేరుస్తారు. స్థానికులకు తప్ప ఈ దారి గురించి బాహ్య ప్రపంచానికి తెలీదు.

*మూడవ దారి*

మూడవ దారి మామండూరు. ఇది తిరుమల కొండకు ఈశాన్యాన కలదు. దీనికి మించిన దారి మరొకటిలేదు అంటారు పూర్వీకులు. కడప, రాజంపేట, కోడూరు, కర్నూలు, ప్రకాశం నుండి వచ్చే భక్తులు ఈ దారి గుండా శ్రీవారి ఆలయం చేరుకుంటారు. విజయనగర రాజులు ఈ దారిలో నడిచే యాత్రికుల కోసం రాతి మెట్లను ఏర్పాటుచేశారు.

*నాల్గవ దారి*

తిరుమల కొండకు పశ్చిమం వైపున కల్యాణి డ్యాం ... దానికి ఆనుకొని శ్యామలకోన అనే దారి ఉంది. రంగంపేట, భీమవరం వచ్చే భక్తులు ఈ దారిగుండా వెళుతారు.

*నాల్గవ దారి*

డ్యాం వద్ద నుండి దారి గుండా 3 కిలోమీటర్లు ముందుకు వెళితే ఒక మలుపు వస్తుంది. అక్కడి నుండి తూర్పువైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది. డ్యాం నుండి తిరుమల మధ్య *దూరం : 15 KM.*

*ఐదవ దారి*

కడప బోర్డర్ లో చిత్తూర్ ఎంట్రెన్స్ వద్ద కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుండి
తుంబురుతీర్థం --> పాపవినాశనం --> తిరుమల చేరుకోవచ్చు.

 తుంబురుతీర్థం, పాపవినాశనం మధ్య *దూరం 12 KM.*

*ఆరవ దారి*

అవ్వాచారి కొండ/ అవ్వాచారికోన దారి గుండా వెళితే కూడా తిరుమల కొండ చేరుకోవచ్చు. రేణిగుంట సమీపంలో కడప - తిరుపతి రహదారి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉన్నది. ఇక్కడి నుండి లోయలో ఉన్న అవ్వాచారికోన దారి గుండా పడమరవైపుకి వెళితే మోకాళ్ళపర్వతం వస్తుంది. అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు.

*ఏనుగుల దారి*

ఏనుగుల దారి అంటే ఏనుగులు ప్రయాణించిన దారి. పూర్వం చంద్రగిరి శ్రీవారి మెట్టు నుండి అవ్వాచారికోన వరకు దారి ఉండేది. తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు కావలసిన రాతి స్తంభాలను ఏనుగుల గుండా ఈ మార్గానే చేరవేసేవారు.

*తలకోన*

తలకోన నుండి కూడా తిరుమలకు దారి కలదు. జలపాతం వద్ద నుండి నడుచుకుంటూ జెండాపేటు దారిలోకి వస్తే ... మీరు తిరుమలకు చేరుకున్నట్లే. నడక మార్గం 20 కిలోమీటర్లు.

*తిరుమల గురించి మరికొన్ని విషయాలు*

తిరుమలలో క్రీ.శ.1387 లో మోకాళ్ళపర్వతం వద్ద మెట్లు నిర్మించారు. విజయనగర రాజులు అలిపిరి - గాలి గోపురం మార్గం 15 వ శతాబ్దంలో వేశారు.

గాలిగోపురం నుండి కిందకు చూస్తే ..

అలిపిరి మెట్లు ఎక్కగానే గోపురం, కుమ్మరి దాసుని సారె, గజేంద్రమొక్షం, గాలిగోపురం వస్తాయి. అలానే ఇంకాస్త ముందుకు వెళితే గాలిగోపురం కనిపిస్తుంది. గాలిగోపురం నుండి కిందకు చూస్తే గోవిందరాజస్వామి, అలివేలుమంగమ్మ దేవాలయాలు , తిరుపతి పరిసరాలు అందంగా కనిపిస్తాయి.

*ఆంజనేయస్వామి*

గాలిగోపురం లోపలి వెళితే సీతారాముల ఆలయం, హనుమంతుని పెద్ద విగ్రహం, విష్ణుమూర్తి అవతారాలు తారసపడతాయి. దక్షిణంవైపు అడవిలోకి వెళితే ఘంటామండపం, నామాలగవి, అవ్వా చారి కోన కు వెళ్తుంటే అక్కగార్ల గుడి కనిపిస్తాయి. ఆతర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది. ఇక్కడే రామానుజాచార్యుల వారి మందిరం కలదు.

*మోకాళ్ళ మిట్ట*

మోకాళ్ళ మిట్ట చేరుకున్నాక సారె పెట్టెలను గమనించవచ్చు. అది దాటితే లక్ష్మీనరసింహ ఆలయం వస్తుంది. అలానే ఇంకాస్త ముందుకు మండపాలను దాటుకుంటూ వెళితే శ్రీవారి ఆలయం కనిపిస్తుంది.

*శ్రీవారి మెట్టు*

శ్రీవారి మెట్టు శ్రీనివాస మంగాపురం వద్ద కలదు. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కలదు. శ్రీవారు, ఆయన భార్య పద్మావతి ఇక్కడే వివాహం చేసుకొని శ్రీవారి మెట్టు దారిలో కొండ పైకి వెళ్ళి వెలిశారు.

*శ్రీవారి మెట్టు*

తిరుపతికి శ్రీవారి మెట్టు కు మధ్య దూరం 15 కి.మీ. శ్రీవారి మెట్టు నుండి ఆలయానికి మధ్య 2500 - 2800 మెట్లు ఉన్నాయి. ఇవి ఎక్కటానికి పట్టే సమయం 1-2 గంటలు. ప్రతి 50/100 మెట్లకు నీటి సదుపాయాలు కలవు.

*కౌంటర్*

శ్రీవారి మెట్టు గుండా వెళితే 1000 వ మెట్టు వద్ద దివ్య దర్శనం టికెట్లు ఇస్తుంటారు. వెళ్ళి తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్నవి 2000 మెట్ల దగ్గర స్టాంప్ వేసుకుంటే చెల్లుతాయి. 1100 మెట్ల వద్ద శ్రీవారి పాదాలు ఉన్నాయి.

*మెట్ల దారిన వెళ్తున్నప్పుడు గుర్తించుకోవాల్సినవి*

1. తిరుపతి బస్ స్టాండ్ నుండి ఉచితబస్సు సౌకర్యం ఉంది. మీరు బస్సును అందుకోలేకపోతే జీప్/ కార్ మాట్లాడుకొని వెళ్ళవచ్చు

2. శ్రీవారి మెట్టు కు వెళ్ళే మార్గంలోనే అలిపిరి వస్తుంది. అలిపిరి వద్ద లాకర్ సౌకర్యం ఉంది. శ్రీవారి మెట్టు వద్ద ఆ సౌకర్యం లేదు.

3.మెట్లమార్గం లో తాగునీటి సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. కనుక బాటిల్ తీసుకుపోవాల్సిన అవసరం లేదు. వీలైతే తినుబండారాలను తీసుకొని పోవచ్చు. కొండపైన, ఆలయ పరిసరాలలో ప్లాస్టిక్ వస్తువులు నిషేధం.

*వసతి*

వసతి ససౌకర్యాలకు తిరుమల లో కొదువలేదు. ఉత్సవాలు, పండుగలు తప్పనిచ్చి మిగితా అన్ని దినాలలో బస దొరుకుతుంది. టిటిడి విశ్రాంతి గదులు, గెస్ట్ హౌస్ లు, సత్రాలు, హోటళ్ళు, లాడ్జీలు లాంటి ఎన్నో వసతులు ఇక్కడ ఉన్నాయి.

గైడ్ తప్పనిసరి

ఈసారి తిరుమలకు వెళ్ళే యాత్రికులు పైన పేర్కొన్న దారుల గుండా వెళ్ళటానికి ప్రయత్నించండి. అయితే వెళ్ళేటప్పుడు గైడ్ లేదా స్థానికుల సహకారం తప్పనిసరి. కొత్త రూట్లు కదా

చేరుకోవడం ఎలా ?

అన్ని మార్గాలకు కేంద్ర బిందువు తిరుపతి. కనుక యాత్రికులు తిరుపతి చేరుకొని అక్కడి నుండి ఈ మార్గాలకు చేరుకొని శ్రీవారి ఆలయాన్ని దర్శించండి.

తిరుమల తిరుపతి దేవస్థానం 

Tuesday 9 October 2018

మిరియాల అన్నం


మిరియాల  అన్నం

మిరియాలు లో
పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, విటమిన్ K మరియు విటమిన్ సి సమృద్దిగా ఉంటాయి.

మిరియాల అన్నం

కావల్సిన పదార్థాలు

1. పొడిపొడిగా ఉడికించిన అన్నం – కప్పు,
2. సెనగపప్పు – అరకప్పు
3. మిరియాలపొడి –
రెండు చెంచాలు,
4. పల్లీలు -అరకప్పు,
5. పచ్చిమిర్చి – ఆరు,
6. తాలింపు దినుసులు -ఒకటిన్నర చెంచా,
 7. కరవేపాకు రెబ్బలు – రెండు,
8. కొబ్బరి తురుము – పావుకప్పు
9. నూనె – అయిదు చెంచాలు,
10. పసుపు – చిటికెడు,
11.ఉప్పు – తగినంత.

తయారీ విధానం

అన్నాన్ని వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని చల్లార్చుకోవాలి.
సెనగపప్పులో కొద్దిగా ఉప్పూ,
పసుపూ వేసి మరీ మెత్తగా కాకుండా ఉడికించి పెట్టుకోవాలి.
బాణలిలో నూనె వేడిచేసి తాలింపుగింజలు వేయించుకోవాలి.
తరవాత పచ్చిమిర్చీ, కరివేపాకూ, పల్లీలూ వేయించాలి.

ఇందులో ఉడికించిన సెనగపప్పూ, మరికొంచెం ఉప్పూ, కొబ్బరి తురుమూ,
మిరియాల పొడీ వేసుకునిబాగా వేయించి దింపేయాలి.
ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలిపితే సరిపోతుంది.

మిరియాల అన్నంతో ప్రయోజనాలు

1. మిరియాలు జీర్ణశక్తిని పెంచుతాయి.
2. కొవ్వు పదార్థాలు జీర్ణమవటాన్ని పెంచుతాయి.
  శరీరంలో ఉన్న కొవ్వు కరగడమే
  కాకుండా మలినాలు అన్నీ బయటికి  పోతాయి.

3. మిరియాల లో ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి రక్తంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.

4. మిరియాల్లో విటమిన్ ‘C’ పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ వైరస్ మరియు బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని శరీర రోగ నిరోధక వ్యవస్థకు చేకూరుస్తుంది.

5. జీవక్రియ సజావుగా, సాధారణ
స్థాయిలో జరిగే విధంగా ప్రోత్సహిస్తుంది.

6. ఆరోగ్యకర రోగ నిరోధక వ్యవస్థ

మరియు జీవక్రియలు శరీరంలో కొవ్వు పదార్థాల నిల్వను నివారించి, బరువు తగ్గుటను ప్రోత్సహిస్తాయి.

7. రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను చేరిస్తే చర్మం మరియు జుట్టు మెరుగుదలకు సహాయపడుతుంది.

8. జలుబు దగ్గు గొంతు గరగర ముక్కుదిబ్బడ ,గొంతును శుభ్రపరచటం, కీళ్లనొప్పులు  లో మిరియాలు ఔషధం లా ఉపయోగ పడతాయి.

9. మిరియాలు ఫ్రీ రాడికల్ ని శుద్ధి చేయడం ద్వారా క్యాన్సర్ చికిత్సలో సహాయపడుతుంది.
క్యాన్సర్ యొక్క కొన్ని రకాల కార్యకలాపాల ఉదృతిని తగ్గిస్తుంది. చర్మ క్యాన్సర్ నివారణలో కూడా సహాయపడుతుంది.

10.   మిరియాలలో ఉండే పెపైన్
        యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది.
11. మిరియాలలో
     యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా
     ఉండుట వలన లైన్స్,ముడతలు,
     నల్లని మచ్చలు,కు
     వ్యతిరేకంగా పోరాటం చేసి
     చర్మాన్ని రక్షిస్తుంది.

మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.




Monday 8 October 2018

శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ మాలా శ్లోకము


      శ్రీ  దుర్గా ద్వాత్రింశన్నామ  మాలా శ్లోకము

దుర్గా  దుర్గార్తి  శమనీ  దుర్గాపద్వినివారిణీ
దుర్గమచ్ఛేదినీ  దుర్గసాధినీ  దుర్గనాశినీ
ఓం దుర్గతోద్ధారిణీ   దుర్గనిహంత్రీ   దుర్గమాపహా
ఓం దుర్గమజ్ఞానదా దుర్గ దైత్య లోక   దవానలా
ఓం దుర్గ  మాదుర్గమాలోకా   దుర్గమాత్మ  స్వరూపిణీ
ఓం దుర్గమార్గప్రదా   దుర్గమవిద్యా  దుర్గమాశ్రితా
ఓం దుర్గమ  జ్ఞాన  సంస్థానా  దుర్గమ  ధ్యాన  భాసినీ
ఓం దుర్గ  మోహాదుర్గ  మాదుర్గమార్ధ  స్వరూపిణీ
ఓం దుర్గ  మాసుర  సంహంర్త్రీ    దుర్గమాయుధధారిణీ
ఓం దుర్గమాంగీ  దుర్గమాతా  దుర్గమాదుర్గమేశ్వరీ
ఓం దుర్గభీమా దుర్గభామా దుర్లభా  దుర్గ  దారిణీ
నామావళి   మిమాం  యస్తు దుర్గాయా  మమ మానవః
 పఠేత్సర్వ  భయాన్ముక్తో  భవిష్యతి  నసంశయః

ఈ  శ్లోకం  చాలా  శక్తిమంతమయిన  శ్లోకం. దుర్గాదేవికి  సంభందించిన 32 నామాలు  ఇందులో  ఉన్నాయి .  ఈ  శ్లోకం  దుర్గాసప్తసతి  లో  కనిపిస్తుంది . ఈ  శ్లోకాన్ని ఎవరు   రోజూ  చదువుతారో
 వారు  అన్ని భయాలనుంచీ    కష్ఠాలనుంచీ  విముక్తులవుతారు.