దోసకాయ పప్పు
కావలిసిన పదార్థాలు
1.దోసకాయ 1.
2. కందిపప్పు 1 కప్పు
3. పచ్చిమిర్చి 3.
4. పసుపు కొద్దిగా
5. ఉప్పు రుచికి సరిపడా
6. చింతపండు కొద్దిగా
7. కరివేపాకు కొద్దిగా
8. నీళ్లు తగినన్ని
పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్, ఆవాలు అర స్పూన్ ,జీలకర్ర అర స్పూన్ ,
ఇంగువ కొద్దిగా , ఎండుమిరపకాయలు 2 ,ఆయిల్ 2. స్పూన్స్
తయారీ విధానం
ముందుగా దోసకాయను శుభ్రంగా కడిగి ,
పైన వున్నా తొక్కను లోపల వున్న గింజలను తీసి ,
చిన్న ముక్కలుగా తరుగుకోవాలి .
పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకోవాలి ,
కందిపప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి ,
కుక్కరు లో పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,
ఆయిల్ వేసి పైన చెప్పిన పోపు దినుసులను వేసి ,
దోరగా వేగాక , పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు ,
పసుపు వేసి , వేగాక,
దోసకాయముక్కలు , చింతపండు , తగినంత ఉప్పు,
వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి ఉడకనివ్వాలి.
ఇవి ఉడికాక ,
ముందుగాఉడికించి పెట్టుకున్న ,
కందిపప్పును వేసి అంతా కలిసేలా బాగాకలిపి
దగ్గర పడేంత వరకు ఉంచి,
స్టవ్ ఆఫ్ చేసుకుంటే
దోసకాయ పప్పు రెడీ అవుతుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.