Monday 16 May 2016

వంటింటి చిట్కాలు 51-60

                                                     


                                                      వంటింటి చిట్కాలు  51-60


1. ఆకు కూరలని ప్లాస్టిక్ కవర్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెడితే నిలవ ఉంటుంది . 

2. పచ్చి మిర్చి తొడిమలు తీసేసి గాలి తగలిని సీస లో వేసి కొంచెం పసుపు చల్లి చల్లని చోట నిలువ 
    చెయ్యాలి  

3. నిమ్మ కాయలను చల్లని నీటి లో ఉంచితే నిలువ ఉంటాయి కానీ రోజు నీళ్ళు మారుస్తూ ఉండాలి 

4. దోస కాయలను నేల మీద ఉంచి ఎ  బెసినైన మూత పెడితే ఎండి పోకుండా నిలువ ఉంటాయి 

5. కాకర కాయ త్వరగా పండి ఎండి పోతుంది దాన్ని , రెండు ముక్కలుగా తరిగి పెడితే నిలవ ఉంటుంది 

6. కారెట్ కి  మొదళ్ళు కోసి ఫ్రిడ్జ్ లో పెడితే నిల్వ ఉంటాయి

7. బియ్యం డబ్బాలో అడుగున వేపాకులు వేసి ఆ పైన బియ్యం పోస్తే పురుగులు పట్ట కుండా ఉంటాయి 

8. పంచదార డబ్బా లో కొన్ని లవంగాలు వేసి ఉంచితే చీమలు  పట్టకుండా ఉంటుంది 

9.ఎండి పోయిన నిమ్మ కాయల డిప్పలను బీరువా లో ఉంచితే పురుగులు రావు 

10.పూర్ణము పల్చ బడి ఉండ కి రాకుండా ఉంటె ఉంటే అందులో కాస్త పాల పిండి కలిపితే గట్టి
      బడుతుంది మరియు రుచి గా కూడా ఉంటుంది .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi