ఆనపకాయ ( పాలు పోసి ) కూర
కావలిసిన పదార్థాలు
1. ఆనపకాయ ముక్కలు 3 కప్పులు
2. కరివేపాకు
3. పసుపు కొద్దిగా
4. ఉప్పు రుచికి సరిపడా
5. వరిపిండి 1 స్పూన్
6. పాలు పావు కప్పు
7. పచ్చి మిర్చి 2
8. పంచదార రెండు స్పూన్స్
పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్ , ఆవాలు అర స్పూన్, జీలకర్ర అర స్పూన్,
ఎండుమిరపకాయలు 2 , ఆయిల్ 2 స్పూన్స్.
తయారీ విధానం
ముందుగా ఆనపకాయ ముక్కలను కొద్దిగా నీళ్లు పోసి ,
కుక్కరు లో పెట్టి ఉడికించుకుని ,
చిల్లుల పళ్లెం లోపోసి చల్లార్చుకోవాలి ..
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపు దినుసులను వేసి దోరగా వేగాక ,
పచ్చి మిర్చి చీలికలు ,కరివేపాకు ను వేసి వేగాక ,
ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న ఆనపకాయ ముక్కలు ,
పాలు , పసుపు , పంచదార , తగినంత ఉప్పు , వరిపిండి వేసి ,
బాగా కలిపి కొద్దీ సేపు మగ్గనిచ్చి ,
కూర అంతా బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే,
ఆనపకాయ ( పాలు పోసి ) కూర రెడీ అవుతుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer :
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.