Tuesday 8 November 2016

ఆనపకాయ ( సొరకాయ ) పచ్చడి


ఆనపకాయ , ( సొరకాయ  )పచ్చడి

కావలిసిన పదార్థాలు
1. ఆనపకాయ ముక్కలు 3
2. కప్పులు పచ్చిమిర్చి 3
3. కరివేపాకు కొద్దిగా
4. కొత్తిమీర కొద్దిగా
5. పసుపు కొద్దిగా
6. ఉప్పు రుచికి సరిపడా
7. చింత పండు కొద్దిగా

పోపు దినుసులు
సెనగపప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్ , ధనియాలు 1 స్పూన్ ,
ఆవాలు అర స్పూన్,  ఇంగువ కొద్దిగా ,ఎండుమిరపకాయలు 6 ,
నూపప్పు 1 స్పూన్ ,ఆయిల్ 3 స్పూన్స్

తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి పైన చెప్పిన పోపు దినుసులను వేసి దోరగా వేపుకుని ,
ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి అదే బాణలి లో మరల ఆయిల్ వేసుకుని
తరిగిపెట్టుకున్నఆనపకాయ ముక్కలు ,పసుపు ,చింతపండు ,
పచ్చిమిర్చి,  కొత్తిమీర లను వేసి బాగా మగ్గనిచ్చి ,
స్టవ్ ఆఫ్ చేసుకోవాలి .
ముందుగా చల్లారిన పోపు దినుసులను మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి .
తవాత మగ్గ బెట్టుకున్న ఆనప కాయముక్కలను వేసి ,
మెత్తగా గ్రైండ్ చేసుకుని ,
ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారము పొడిని  వేసి
మెత్తగా గ్రైండ్ చేసుకుని , బౌల్ లోకి తీసుకుని ,
పచ్చడి పైన మినపప్పు,  ఆవాలు , జీలకర్ర , కరివేపాకుల పోపును వేసుకోవాలి.
అంతే,

ఆనపకాయ ( సొరకాయ ) పచ్చడి రెడీ .
ఈపచ్చడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది
ఈ పచ్చడి వారం రోజుల పాటు నిలువ ఉంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi