Saturday 5 November 2016

కేబేజీ ఆవపెట్టి కూర


కేబేజీ ఆవపెట్టి కూర

కావలిసిన పదార్థాలు
1. కేబేజీ పావుకేజీ
2. అల్లం చిన్న ముక్క
3. పచ్చిమిర్చి 4
4. కరివేపాకు
5. ఆవముద్ద 1 స్పూన్
6. పసుపు కొద్దిగా
7. ఉప్పు రుచికి సరిపడా 
పోపు దినుసులు
సెనగ పప్పు 1 స్పూన్ ,మినపప్పు 1 స్పూన్ ,ఆవాలు అర స్పూన్ ,జీలకర్ర అర స్పూన్ ,
ఎండుమిరపకాయలు 3 , నూ ని 3 స్పూన్స్.

తయారీ విధానం
ముందుగా కేబేజీని శుభ్రం గా కడిగి ,
బాగా సన్నగా తరుగుకోవాలి .
పచ్చిమిరప కాయల ను చీలికలుగాను ,
అల్లం  సన్నగా చిన్న ముక్కలుగాతరుగుకోవాలి ,
తరిగిన కేబేజీ ని ఉడికించుకుని ,
చిల్లుల పళ్లెం లో పోసి చల్లార్చుకోవాలి.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపు దినుసులనువేసి అవి దోరగా వేగాక
తరిగిపెట్టుకున్న అల్లం ముక్కలు , పచ్చిమిర్చి చీలికలు ,కరివేపాకులను వేసి
ఇవి కూడా దోరగా వేగాక
ముందుగా ఉడికించి చల్లార బెట్టుకున్న కేబేజీని  వేసి
కొద్దిగా పసుపు ను వేసి , బాగా కలిపి , కొద్దిసేపు మగ్గనిచ్చి ,
తరువాత ఉప్పు ను వేసి ,బాగా కలిపి
స్టవ్ ఆఫ్ చేసుకుని కూరను ఒక బౌల్ లోకి తీసుకుని
చల్లారాక ఆవముద్ద ఒక స్పూన్ , ఆయిల్ వేసి
బాగా కలిపితే ,

కేబేజీ ఆవ పెట్టి కూర రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi