దొండకాయ కాయల పడంగా కూర
కావలిసిన పదార్థాలు
1. దొండకాయలు పావుకేజీ
2. పసుపు కొద్దిగా
3. ఆయిల్ 4 స్పూన్స్
4. నీళ్లు తగినన్న
5. ఉప్పు తగినంత
కారం తయారీకి
సెనగపప్పు 1 స్పూన్ , మినపప్పు 1. స్పూన్ , ఆవాలు అర స్పూన్ ,
జీలకర్ర అర స్పూన్ , ఎండుమిరపకాయలు 6 , ఆయిల్ 1 స్పూన్ ,
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,
ఒక స్పూన్ ఆయిల్ వేసి పైన చెప్పిన పోపు దినుసులను వేసి ,
దోరగా వేపుకుని చల్లారనివ్వాలి .
చల్లారాక ఉప్పు వేసి మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి.
దొండకాయలను శుభ్రంగా కడిగి తొడిమలు కత్తిరించి ,
గుత్తులమాదిరి తరుగుకుని తగినన్ని నీళ్లు పోసి ,
కుక్కరులో పెట్టి ఉడికించుకుని చల్లార్చుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి ,
ఉడికించుకున్న దొండకాయలను వేసి దోరగా వేగనివ్వాలి ,
మధ్య మధ్య లో అట్లకాడతో కలుపుతూ ఉండాలి ,
దోరగా వేగాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న
కూరకారమును వేసి , ఒక స్పూన్ ఆయిల్ వేసి ,
బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే
దొండకాయ కాయల పడంగా కూర రెడీ అవుతుంది.
వేడి అన్నములో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi