Sunday 6 November 2016

దిబ్బ రొట్టె


దిబ్బ రొట్టె

కావలిసిన పదార్థాలు
1. మినపపప్పు 1 గ్లాసు
2. వుప్పుడునూక 2 గ్లాసులు
3. ఉప్పు రుచికి సరిపడా
4. జీలకర్ర
5. ఆయిల్ అర కప్పు

తయారీ విధానం
ముందుగా మినపప్పును , వుప్పుడునూకను శుభ్రముగా కడిగి ,,
విడివిడిగా  రెండు గిన్నెలలో 6 గంటలసేపు నానబెట్టుకోవాలి .
నానిన మినపప్పును శుభ్రం గా పొట్టు తీసేసి,
సరిపడినంత ఉప్పు వేసి ,
మెత్తగా రుబ్బుకోవాలి . నూకను కూడా శుభ్రం గా కడిగి
రుబ్బుకున్న మినప పిండిలో వేసి
బాగా కలిసేలా కలుపుకుని 1 గంట సేపు నాననివ్వాలి .
ఈ దిబ్బరొట్టె ఇత్తడి మూకుడు లో చాలా బాగా వస్తుంది .
ఈ మూకుడు లేని వారు వెడల్పయిన మూకుడు తీసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ,
మూకుడు అంతా అంటుకునేలా అట్లకాడతో రాసి
4 గరిటల పిండిని వేసి , పైన జీలకర్ర అద్ది ,
2 స్పూన్స్ ఆయిల్ వేసి , మూతపెట్టి స్టవ్ మంట సిమ్ లో పెట్టి ,
దోరగా మగ్గనిచ్చి ,
అట్లకాడతోతిరగేసి మరల 2 స్పూన్స్ ఆయిల్ వేసి దోరగా మగ్గనివ్వాలి .
మద్య మధ్య లో అట్లకాడతో తిరగేస్తూ  ఉండాలి .
ఇలా రెండు పక్కలా దోరగా కాల్చుకుని ,
ప్లేటులోకి సర్వ్ చేసుకుంటే
దిబ్బ రొట్టి రెడీ .

దీనిని  కొబ్బరిపచ్చడి తో గాని , అల్లం పచ్చడి తో గాని , ఆవకాయ తో గాని తింటే బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi