Sunday 22 October 2023

తెలుగు–సంస్కృతం పేర్లు

 తెలుగు–సంస్కృతం పేర్లు

అరటిపండు – కదళీఫలం

ఆపిల్ – కాశ్మీరఫలం

ఉసిరికాయ – అమలక

కిస్మిస్ – శుష్కద్రాక్ష

కొబ్బరికాయ పూర్తిగా – నారికేళం

కొబ్బరికాయ చిప్పలు – నారికేళ ఖండద్వయం

ఖర్జూరం – ఖర్జూర

జామపండు – బీజాపూరం

దబ్బపండు – మాదీఫలం

దానిమ్మపండు – దాడిమీఫలం

ద్రాక్షపళ్ళు – ద్రాక్షఫలం

నారింజ – నారంగ

నిమ్మపండు – జంభీరఫలం

నేరేడుపండు – జంబూఫలం

మామిడి పండు – చూతఫలం

మారేడుపండు – శ్రీఫలం

రేగు పండు – బదరీ ఫలం

వెలగపండు – కపిత్తఫలం

సీతాఫలం – సీతాఫలం


విశేష నివేదనలు 


అటుకులు – పృథక్

అటుకుల పాయసం – పృథక్పాయస

అన్నము (నెయ్యితో) – స్నిగ్ధౌదనం

అన్నం (నెయ్యి, కూర, పప్పు, పులుసు, పెరుగు) – మహానైవేద్యం

ఉగాది పచ్చడి – నింబవ్యంజనం

కట్టుపొంగలి (మిరియాల పొంగలి) – మరీచ్యన్నం

కిచిడీ – శాకమిశ్రితాన్నం

గోధుమ నూక ప్రసాదం – సపాదభక్ష్యం

చక్కెర పొంగలి – శర్కరాన్నం

చలిమిడి – గుడమిశ్రిత తండులపిష్టం

నిమ్మకాయ పులిహోర – జంభీరఫలాన్నం

నువ్వుల పొడి అన్నం – తిలాన్నం

పరమాన్నం (పాలాన్నం) - క్షీరాన్నం

పానకం – గుడోదకం, మధుర పానీయం

పాయసం – పాయసం

పిండివంటలు – భక్ష్యం

పులగం – కుశలాన్నం

పులిహోర – చిత్రాన్నం

పెరుగన్నం – దధ్యోదనం

పేలాలు – లాజ

బెల్లపు పరమాన్నం –గుడాన్నం

వడపప్పు – గుడమిశ్రిత ముద్గసూపమ్

వడలు – మాసపూపం

శెనగలు (శుండలు) – చణకం

హల్వా – కేసరి

వివిధ పదార్థాలు

అప్పాలు – గుడపూపం

చెరుకు ముక్క – ఇక్షుఖండం

చక్కెర – శర్కర

తేనె – మధు

పాలు – క్షీరం

పెరుగు – దధి

బెల్లం – గుడం

వెన్న – నవనీతం 

Thursday 24 August 2023

హనుమ నవ అవతారములు నామాలు

 

ప్రసన్న హనుమాన్ ,
వీర అంజనేయుడు,
వింశతి భుజహా,
పంచవక్తృత,
అష్టాదశ భుజహా,
సువర్చలాపతి ,
చతుర్భుజహ,
కజిత శ్రీమాన్ ద్వాత్రిమ్స  భుజమండలహా ,
వానరాకారహ
నవావతార నామములు ఎవరైతే పఠిస్తారో వారికి హనుమ రక్ష ఉంటుంది అని శాస్త్ర విదితం..

సేకరణ : శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనం నుండి...🙏🌷🙏


Saturday 19 August 2023

ఆంజనేయ స్వామి వారి స్తుతి

ఆంజనేయ స్వామి వారి స్తుతి

నమస్తే దేవ దేవేశ, 

నమస్తే రాక్షసాంతక,

నమస్తే వానరాధీసా ,

నమస్తే వాయు నందన,

నమస్తే త్రిమూర్తి వపుషే 

నమస్తే వేదవేధ్యాయా 

నమస్తే లోక నాధాయ 

నమస్తే  సీతా శోకాహారిణి


సీతమ్మ వారు ఆంజనేయ స్వామిని ఇలా స్తుతించారు..

సేకరణ : శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనం నుండి..

Sunday 2 July 2023

ఆంజనేయ స్వామివారు స్వయం గా ఉండే ప్రదేశాలు

 

ఆంజనేయ స్వామివారు
స్వయం గా ఉండే ప్రదేశాలు



1. కుండినం
2.శ్రీ భద్రం
3.కుశతర్పణం
4.పంపాతీరం
5.చంద్రకోణం
6.కాంభోజనం
7.గంధమాధనం
8.బ్రహ్మావర్తపురం
9.నైమిశారణ్యం
10.సుందరం  (సుందరనగరం)
11. శ్రీ హనుమత్ పురం

ఈ ప్రదేశాల్లో శ్రీ హనుమాన్ వారు స్వయంగా అదృశ్య రూపం లో ఎల్లవేళలా ఉంటారని..ప్రవచనకారులు చెబుతున్నారు...
ఆ ప్రదేశాలు కొన్ని మాత్రమే ఇపుడు గుర్తుపట్టగలం ..కొన్ని కాలక్రమేణా వచ్చిన మార్పుల వలన ప్రస్తుత ఆ ప్రదేశం పేరు ..తెలియలేదు ట...ఆ ప్రదేశాలు దర్శించడంమహా భాగ్యం...
కనీసం ప్రతి రోజు ఆ పేర్లు చదివినా ఆయనఅనుగ్రహము లభిస్తుందని పెద్దలు చెబుతారు..


1. కుండినం ( మహర్ష్ట్రా అమరావతి దగ్గర)
2.శ్రీ భద్రం(భద్రాచలం)
3.కుశతర్పణం( గోదావరి ఉద్గామ స్థానం నాసిక్)
4.పంపాతీరం( తుంగభద్ర నదీ తీరం)
5.చంద్రకోణం ( బాకురా జిల్లా బెంగాల్)
6.కాంభోజనం( ఆఫ్ఘనిస్తాన్ + కాశ్మీర్)
7.గంధమాధనం( బదరీనాథ్ + రామేశ్వరం)
8.బ్రహ్మావర్తపురం( బీతురు కాన్పూర్ ) 
9.నైమిశారణ్యం( ఉత్తర ప్రదేశ్ అయోధ్య దగ్గర)
10.సుందరనగరం( శ్రీ లంక)
11. శ్రీ హనుమత్ పురం ( హోసూరు కి 40 కి.మీ )

12. బార్స్పత్యపురం (అలహాబాద్).                    13. మహిష్మతి పురం ( ఇండోర్ దగ్గర మధ్య ప్రదేశ్ ) 

*
సమాచార సహాయం చేసిన హరి గారికి ధ్యవాదములు 


జై వీర హనుమాన్

సేకరణ..
దయచేసి స్టిక్కర్ తో ప్రోత్సహించండి..


Thursday 22 June 2023

పూజ ఎలా విజయానికి దారి చూపిస్తుంది

 



పూజ ఎలా విజయానికి దారి చూపిస్తుంది


పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ. 

మనసుతో చేసే వ్యాయామం.

మఠం వేసుకుని కూర్చుంటాం అది ఒక ఆసనం..

యోగా ప్రక్రియ 

మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి

మన మెదడుని మనమే ట్యూన్‌ చేసుకునే ప్రక్రియ

ఈ పూజ..

దీప ప్రజ్వలనం అనేది..... త్రాటకం అనే యోగ ప్రక్రియ


రోజూ ఓ మూడు నిమిషాలు 

ఆవు నేతితో వెలిగించిన

దీపాన్ని తదేకంగా చూస్తే.... కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెపుతారు.


ఏదైనా  మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే.. 

అది నాలికకు ఎక్సర్‌సైజ్‌ 

అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది.

ధారణ శక్తి పెరుగుతుంది 


పూజ అంటే 

మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయము.



1. గుడికి ఎందుకు వెళ్ళాలి...


మూలవిరాట్ భూమిలో ఎక్కడైయితే 

electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. 

ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను  ఉంచుతారు.

 అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి.


2. ప్రదక్షిణ 


మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి.


3. ఆభరణాలతో దర్శనం ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. 

బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని.


4. కొబ్బరి కాయ

ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం.


5.మంత్రాలు మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజ పరువస్తాయి.


6. గర్భగుడి 


గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.


7. అభిషేకం 

విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. 


8. హారతి 


 పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._


10. మడి  


తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..అంటారు 


11. పుణ్యక్షేత్రం


పుణ్య క్షేత్రాలు దర్శించడం వలన ఆ ప్రదేశాల్లో ఉండే శక్తి మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ ని తొలగించి మంచి చేస్తుంది...ఆ ఆలయాలు దర్శించడం వలన..ఆ విగ్రహం లో ఆ క్షేత్రం లో ఉండే శక్తిని తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.. అందుకే దర్శనం దేముడు విగ్రహం ఎదురు గా కాక ఒక పక్కనించి దర్శనం చేసుకోవాలని పెద్దలు చెపుతారు..


ఏకాగ్రత ,దృఢ విశ్వాసం , ఉత్సాహం , ఉత్తేజం.. మొదలగు లక్షణాలు పూజ వలన లభిస్తాయి...


లేదా మనలో  జాగృతం అవుతాయి  లేదా

ప్రేరేపితమవుతాయి...


ఆ లక్షణాలు  సాధించి , 

మన ప్రయత్నం మనం చేస్తే విజయం తధ్యం...


సేకరణ 

Sunday 14 May 2023

మహిమాన్విత 108 లింగాలు

 



మహిమాన్విత 108 లింగాలు

1. ఓం లింగాయ నమః
2. ఓం శివ లింగాయనమః
3. ఓం శంబు లింగాయనమః
4. ఓం ఆధిగణార్చిత లింగాయనమః
5. ఓం అక్షయ లింగాయనమః
6. ఓం అనంత లింగాయనమః
7. ఓం ఆత్మ లింగాయనమః
8. ఓం అమరనాదేశ్వర లింగాయనమః
9. ఓం అమర లింగాయనమః
10. ఓం అగస్థేశ్వర లింగాయనమః

11. ఓం అచలేశ్వర లింగాయనమః
12. ఓం అరుణాచలేశ్వర లింగాయనమః
13. ఓం అర్ధ నారీశ్వర లింగాయనమః
14. ఓం అపూర్వ లింగాయనమః
15. ఓం అగ్ని లింగాయనమః
16. ఓం వాయు లింగాయనమః
17. ఓం జల లింగాయనమః
18. ఓం గగన లింగాయనమః
19. ఓం పృథ్వి లింగాయనమః
20. ఓం పంచభూతేశ్వర లింగాయనమః

21. ఓం పంచముఖేశ్వర లింగాయనమః
22. ఓం ప్రణవ లింగాయనమః
23. ఓం పగడ లింగాయనమః
24. ఓం పశుపతి లింగాయనమః
25. ఓం పీత మణి మయ లింగాయనమః
26. ఓం పద్మ రాగ లింగాయనమః
27. ఓం పరమాత్మక లింగాయనమః
28. ఓం సంగమేశ్వర లింగాయనమః
29. ఓం స్పటిక లింగాయనమః
30. ఓం సప్త ముఖేశ్వర లింగాయనమః

31. ఓం సువర్ణ లింగాయనమః
32. ఓం సుందరేశ్వర లింగాయనమః
33. ఓం శృంగేశ్వర లింగాయనమః
34. ఓం సోమనాథేశ్వర లింగాయనమః
35. ఓం సిధేశ్వర లింగాయనమః
36. ఓం కపిలేశ్వర లింగాయనమః
37. ఓం కాపర్డేశ్వర లింగాయనమః
38. ఓం కేదారేశ్వర లింగాయనమః
39. ఓం కళాత్మక లింగాయనమః
40. ఓం కుంభేశ్వర లింగాయనమః

41. ఓం కైలాస నాదేశ్వర లింగాయనమః
42. ఓం కోటేశ్వర లింగాయనమః
43. ఓం వజ్ర లింగాయనమః
44. ఓం వైడుర్య లింగాయనమః
45. ఓం వైద్య నాదేశ్వర లింగాయనమః
46. ఓం వేద లింగాయనమః
47. ఓం యోగ లింగాయనమః
48. ఓం వృద్ధ లింగాయనమః
49. ఓం హిరణ్య లింగాయనమః
50. ఓం హనుమతీశ్వర లింగాయనమః

51. ఓం విరూపాక్షేశ్వర లింగాయనమః
52. ఓం వీరభద్రేశ్వర లింగాయనమః
53. ఓం భాను లింగాయనమః
54. ఓం భవ్య లింగాయనమః
55. ఓం భార్గవ లింగాయనమః
56. ఓం భస్మ లింగాయనమః
57. ఓం భిందు లింగాయనమః
58. ఓం బిమేశ్వర లింగాయనమః
59. ఓం భీమ శంకర లింగాయనమః
60. ఓం బృహీశ్వర లింగాయనమః

61. ఓం క్షిరారామ లింగాయనమః
62. ఓం కుమార రామ బిమేశ్వర లింగాయనమః
63. ఓం మహానంది ఈశ్వర లింగాయనమః
64. ఓం మహా రుద్ర లింగాయనమః
65. ఓం మల్లికార్జున లింగాయనమః
66. ఓం మహా కాళేశ్వర లింగాయనమః
67. ఓం మల్లీశ్వర లింగాయనమః
68. ఓం మంజునాథ లింగాయనమః
69. ఓం మరకత లింగాయనమః
70. ఓం మహేశ్వర లింగాయనమః

71. ఓం మహా దేవ లింగాయనమః
72. ఓం మణికంధరేశ్వర లింగాయనమః
73. ఓం మార్కండేయ లింగాయనమః
74. ఓం మాడిణ్యేశ్వర లింగాయనమః
75. ఓం ముక్తేశ్వర లింగాయనమః
76. ఓం మృతింజేయ లింగాయనమః
77. ఓం రామేశ్వర లింగాయనమః
78. ఓం రామనాథేశ్వర లింగాయనమః
79. ఓం రస లింగాయనమః
80. ఓం రత్నలింగాయనమః

81. ఓం రజిత లింగాయనమః
82. ఓం రాతి లింగాయనమః
83. ఓం గోకర్ణాఈశ్వర లింగాయనమః
84. ఓం గోమేధిక లింగాయనమః
85. ఓం నాగేశ్వర లింగాయనమః
86. ఓం ఓంకారేశ్వర లింగాయనమః
87. ఓం ఇంద్ర నిల మణి లింగాయనమః
88. ఓం శరవణ లింగాయనమః
89. భృగువేశ్వర లింగాయనమః
90. ఓం నీలకంటేశ్వర లింగాయనమః

91. ఓం చౌడేశ్వర లింగాయనమః
92. ఓం ధర్మ లింగాయనమః
93. ఓం జోతిర్ లింగాయనమః
94. ఓం సైకత లింగాయనమః
95. ఓం చంద్రమౌలీశ్వర లింగాయనమః
96. ఓం జ్వాలా లింగాయనమః
97. ఓం ధ్యాన లింగాయనమః
98. ఓం పుష్యా రాగ లింగాయనమః
99. ఓం నంది కేశ్వర లింగాయనమః
100. ఓం అభయ లింగాయనమః

101. ఓం సహస్ర లింగాయనమః
102. ఓం ఏకాంబరేశ్వర లింగాయనమః
103. ఓం సాలగ్రామ లింగాయనమః
104. ఓం శరభ లింగాయనమః
105. ఓం విశ్వేశ్వర లింగాయనమః
106. ఓం పథక నాశన లింగాయనమః
107. ఓం మోక్ష లింగాయనమః
108. ఓం విశ్వరాధ్య లింగాయనమః.

(సేకరణ)

Saturday 13 May 2023

నామ త్రేయాస్త్ర మంత్రము

నామ త్రయం అంటే మూడు నామాలు. 

అవి   

"శ్రీ అచ్యుతాయ నమః,   

శ్రీ అనంతాయ నమః,   

శ్రీ గోవిందాయ నమః"   


ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి

 కలి ప్రేరితమైన రోగాలు రావు.

 జబ్బులు ఏమైనా ఉంటే అనతి కాలంలోనే తగ్గిపోతాయి అని వచనం.


ఈ నామాలు ఒక దివ్యౌషధం లా పనిచేస్తుంది. భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ ఉంది. 

అందునా కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి. 

అట్టి విశిష్ట నామాల్లో 

మరీ విశిష్ట నామాలు 

అచ్యుత, 

అనంత, 

గోవింద 


పద్మ పురాణంలో ఈ నామ మహిమ 

  "అచ్యుతానంత గోవింద నామెాచ్ఛారణ భేషజాత్ నశ్యంతి సకలారోగాః సత్యం సత్యం వదామ్యహ" 

  అని వర్ణించబడింది. 

అంటే

 "ఈ నామాలను పలకటం అనే మందు చేత సర్వరోగాలు నశించి తీరుతాయి. 

ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను" 

అని దీనర్ధం. 

ఇలా రెండు మార్లు సత్యం అని చెప్పటం ద్వారా

 శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్న మాట. క్షీరార్ణవ మథన సమయంలో అవతరించిన మహా మహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. 

ఆయుర్వేద వైద్య విద్యలో ఆయనదే ప్రధమ స్థానం. 


పార్వతీదేవి అడుగగా శంకరుల వారు శ్రీమన్నారయణుని లీలల గురించి, 

కుార్మావతార సందర్భంలో క్షీరసాగర మథన గాథ వినిపిస్తుా ఇలా అన్నారు. 

పార్వతీ , 

పాల కడలిలో లక్ష్మీ దేవి అవతరించింది. 

దేవతలు, మునులు లక్ష్మీనారాయణుని స్తుతిస్తున్నారు. 

ఆ సందర్భంలోనే భయంకరమైన హాలాహలం పాలకడలి నుంచి ఉద్భవించింది. 

ఆ హాలాహలం చుాసి దేవతలుా, దానవులుా భయపడి తలో దిక్కుకి పారిపోయారు. 

పారిపోతున్న దేవతలను, దానవులను ఆపి, భయపడవద్దని చెప్పి, ఆ కాలకుాటాన్ని నేను మ్రింగుతానని ధైర్యం చెప్పాను. 

అందరుా నా పాదాలపై బడి 

నన్ను పుాజించి స్తుతించ సాగారు. 


అపుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వ దుఃఖ హరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకుని ఆయన నామాల్లో ప్రధానమైన ముాడు నామాల్ని  

"అచ్యుత,  అనంత,  గోవింద"  

అన్న ముాడు మహా మంత్రాల్ని స్మరించుకుంటూ

 ఆ మహా భయంకరమైన కాలకుాట విషాన్ని త్రాగివేశాను. 

సర్వ వ్యాపి అయిన విష్ణు భగవానుని యెుక్క

 ఆ నామ త్రయం యెుక్క మహిమ వల్ల సర్వ లోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా త్రాగేశాను. ఆ విషం నన్నేమి చెయ్యలేక పోయింది అని సాక్షాత్తూ సదా శివుడు తెలిపాడు.

శ్రీ అచ్యుతాయ నమః, 

శ్రీ అనంతాయ నమః,  

శ్రీ గోవిందాయ నమః

అన్న

 "నామ త్రేయాస్త్ర మంత్రాన్ని" 

పలికేటప్పుడు ఈ మహిమనంతా జ్ఞాపకముంచుకుని, 

విశ్వాసం పెంచుకుని, 

మంత్ర మననం చేయడం ద్వారా 

అనారోగ్య బాధలు తొలగించుకుని, ఆయురారోగ్యాలను పొందవచ్చు.  

నీటి గ్లాసును చేత పట్టుకుని " నామ త్రేయాస్త్ర మంత్రాన్ని"  కొద్దిసేపు పలికి, ఆ నీటిని మంత్ర బలంతో శక్తివంతం చేసి, తరువాత ఆ నీటిని స్వీకరించండి 

సేకరణ

వివాహంలోని కార్యక్రమాలు

వివాహంలోని కార్యక్రమాలు 


1. కన్యావరణం:

2. పెళ్ళి చూపులు

3. నిశ్చితార్థం:

4. అంకురార్పణం:

5. స్నాతకం:

6. సమావర్తనం:

7. కాశీయాత్ర:

8. మంగళస్నానాలు:

9. ఎదురుకోలు:

10. వరపూజ:

11. గౌరీపూజ:

12. పుణ్యాహవాచనం:

13. విఘ్నేశ్వరపూజ:

14. రక్షా బంధనం:

15. కొత్త జంధ్యం వేయడం:

16. గౌరీ కంకణ దేవతాపూజ:

17. కౌతుక ధారణ:

18. కంకణ ధారణ:

19. మధుపర్కము:

20. వధువును గంపలో తెచ్చుట:

21. తెరచాపు

22. మహా సంకల్పం:

23. కన్యాదానం:

24. వధూవరుల ప్రమాణములు:

25.సుముహూర్తం-జీలకర్ర-బెల్లం:

26. స్వర్ణ జలాభిషేకం:

27. చూర్ణిక:

28. వధూవర సంకల్పం:

29. యోక్త్రధారణం:

30. మాంగల్య పూజ:

31. మాంగల్య ధారణ:

32. అక్షతలు-తలంబ్రాలు:

33. బ్రహ్మముడి:

34. సన్నికల్లు తొక్కడం:

35. కాళ్లు తొక్కించడం:

36. పాణి గ్రహణం:

37. సప్తపది:

38. లాజహోమం:

39. యోక్త్రవిమోచనం:

40. స్థాలీపాకం:

41. ఉంగరాలు తీయడం:

42. బొమ్మని అప్పగింత:

43. నాగవల్లి:

44. ధ్రువనక్షత్రం:

45. అరుంధతి నక్షత్ర దర్శనం:

46. అప్పగింతలు:

47. అత్తమామలకు వధువు పూజ:

48. ఫలప్రదానం:

49. పానుపు:

50. మహదాశీర్వచనం:

51. వధువు గృహప్రవేశం:

52. కంకణ విమోచన:

53. గర్భాదానం:

54. పదహారు రోజుల పండుగ

55. అల్లెం.


Wednesday 19 April 2023

శ్రీ రామచంద్రుని వంశ వృక్షం

లోకభిరాముని వంశం


రాముడు ఒక ఉత్తమ కొడుకుగా,
ఉత్తమ ప్రజసేవకుడు 'రాజు'గా,
ఉత్తమ మిత్రునిగా,
ఉత్తమ భర్తగా,
ఉత్తమ సోదరునిగా,
ఉత్తమ శిష్యునిగా ఈ విధంగా అనేకమైన సుగుణాలు కలిగిన రాముడుకి అన్ని ఉత్తమ లక్షణాలు రావడానికి వారి వంశజులను ' పూర్వీకులను' గమనిస్తే అర్ధం అవుతుంది,
శ్రీరామ చంద్రుని వంశ పరంపర విన్నా చదివినా , పుణ్యఫలం దక్కుతుంది.

బ్రహ్మ కొడుకు మరీచి

మరీచి కొడుకు కశ్యపుడు.

కశ్యపుడు కొడుకు సూర్యుడు.

సూర్యుడు కొడుకు మనువు.

మనువు కొడుకు ఇక్ష్వాకువు.

ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.

కుక్షి కొడుకు వికుక్షి.

వికుక్షి కొడుకు బాణుడు.

బాణుడు కొడుకు అనరణ్యుడు.

అనరణ్యుడు కొడుకు పృధువు.

పృధువు కొడుకు త్రిశంఖుడు.

త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు ( లేదా యువనాశ్యుడు )

దుంధుమారుడు కొడుకు మాంధాత.

మాంధాత కొడుకు సుసంధి.

సుసంధి కొడుకు ధృవసంధి.

ధృవసంధి కొడుకు భరతుడు.

భరతుడు కొడుకు అశితుడు.

అశితుడు కొడుకు సగరుడు.

సగరుడు కొడుకు అసమంజసుడు.

అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.

అంశుమంతుడు కొడుకు దిలీపుడు.

దిలీపుడు కొడుకు భగీరధుడు.

భగీరధుడు కొడుకు కకుత్సుడు.

కకుత్సుడు కొడుకు రఘువు.

రఘువు కొడుకు ప్రవుర్ధుడు.

ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.

శంఖనుడు కొడుకు సుదర్శనుడు.

సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.

అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.

శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.

మరువు కొడుకు ప్రశిష్యకుడు.

ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.

అంబరీశుడు కొడుకు నహుషుడు.

నహుషుడు కొడుకు యయాతి.

యయాతి కొడుకు నాభాగుడు.

నాభాగుడు కొడుకు అజుడు.

అజుడు కొడుకు ధశరథుడు.

ధశరథుడు కొడుకు రాముడు.

రాముడి కొడుకులు లవ కుశలు ఇది శ్రీ రాముని వంశ వృక్షం  ...

సేకరణ 

Tuesday 28 March 2023

మంచి మనసులు.. కధ

 


                   " మంచి మనసులు "

" ఏమండీ అబ్బాయి ఏమైనా ఫోన్ చేశాడా "
అంది శాంత.
" లేదే వాడేదో బిజీ గా ఉన్నట్లు ఉన్నాడు... "
" లేకపోతే  వాడే చేసే వాడుగా "
అన్నారు రావు గారు.
" పోనీ మీరైనా ఒకసారి చేయొచ్చు గా ,
వాడికి ఖాళీ లేక మర్చిపోతే " అంది..శాంత
" అలాగే లే ,
ముందు నాకో కాఫీ ఒకటి ఇవ్వు " అన్నారు రావు
సరే అంటూ లోపలికి వెళ్ళింది శాంత
" దీనికి ఏం తెలుసు, 
నేను వాడికి ఎన్ని సార్లు ఫోన్ చేశానో..
ఒక్కసారి కూడా పలకడు...
పైగా ఫోన్ చేస్తే బిజీ గా ఉన్నా ,
మీటింగ్ లో ఉన్నా అంటూ ,
తరువాత చేస్తా అంటూ విసుక్కుంటున్నాడు..
ఖాళీ అయితే నేనే చేయనా
ఇలా అస్తమాను డిస్టర్బ్ చేయకండి అన్నాడు
అని దీనికి ఎలా చెప్పను...
బాధ పడుతుంది ."..అనుకున్నారు మనసులో...
కాఫీ పట్టుకుని వచ్చింది
" ఈ సారి ఫోన్ చేస్తే ,
ఒక్కసారి వచ్చి వెళ్ళమని చెప్పండి
చూసి రెండు సంవత్సరాలు అవుతోంది.. "
అంది ఆర్తిగా...
" నీ బాధ నేను అర్థం చేసుకోగలను ..
కానీ వాడు అర్ధం  చేసుకోవాలి గా...
ఎంత సేపు బిజి అంటాడు.."
అనుకుని
" సరేలే నేను చెబుతా...
నువ్వేమి ఇవేమీ ఆలోచించకు
నీ ఆరోగ్యం కూడా అంత బాగోలేదు..
మళ్ళీ బెంగ పెట్టుకుంటే అదో సమస్య.. "
అన్నారు రావు
" వృద్దాప్యం వచ్చేసింది...గా
పోయే ఆరోగ్యం గాని వచ్చేది కాదుగా ..
ఏవో ఉంటూనే ఉంటాయి..."  అంది..
అబ్బో దీనికేం తక్కువ లేదు...
అనుకుని
కాఫీ తాగేసి కప్ ఇచ్చారు...
" నిజానికి వాళ్ళ తప్పు ఏమి ఉండదు... "
" బాగా చదువుకోవాలి
మంచి ఉద్యోగం చేయాలి
బాగా స్థిరపడాలి అనేగా
కష్టపడి చదివిస్తాం..."
" బాగా చదువు కున్నాక..
మరి పట్నాలలో నేగా ఉద్యోగాలు...
మరి అంతంత జీతాలు ఇస్తూ
వాళ్ళు ఉరుకుంటారా ...
దానికి తగ్గ పని చేయించుకుంటారు...
మరి.."
" అన్ని మనమే అనుకుంటే ఎలా
పరిస్థితులు అర్ధం చేసుకుని అలవాటు చేసుకోవాలి... దీని తాపత్రయం దీనిదే గాని...
మరి దీనికి ఎప్పుడు అర్ధం అవుతుందో... మరి "  అనుకున్నారు స్వగతం గా...అలా పడకుర్చీ లో వెనక్కి వాలి కళ్ళు ముసుకుని..రావుగారు

" ఏది ఏమైనా కనీసం 3 నెలలకి ఒకసారి ..
అయినా కాస్త ముఖం చూపిస్తే ..
కాస్త సంతృప్తి గా ఉంటుంది..
మనవలు  పెద్దవాళ్ళు అయి పోతున్నారు... వాళ్ళతో కాస్త సరదాగా గడిపే సమయము
వస్తుందో రాదో... "
అంటూ ఆలోచిస్తూ అలాగే
నిద్రలోకి జారి పోయారు రావు...
****
రమేష్ పెద్ద కార్పొరేట్ కంపెనీ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు..
కష్ట పడి పనిచేసే తత్వం  కావడం తో తొందరగా నే ప్రమోషన్ లు వచ్చేసాయి...
ఇపుడు కీలకమైన పొజిషన్...
పని వత్తిడి ఎక్కువ కావడంతో అలాగే రోజులు గడిచిపోతున్నాయ్...
ఇలా ఉండగా ఒకరోజు తన కూతురు వచ్చింది.. " "నాన్న మీతో కొంచెం మాట్లాడాలి అంది ."
లాబ్ టాప్ లోంచి తల ఎత్తి
" ఏం మాట్లాడాలి " అన్నాడు రమేష్..
" మా కాలేజ్ వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ కోసం వేరే ఊరు వెళ్ళాలి అంటున్నారు.."
" అలా వెడితే ఆ మార్కులు కూడా కలుస్తాయి ట" అంది శైలు..
"ఇపుడు అవసరమా ,
ఏదో చెప్పి మేనేజ్ చేయలేవా  "
అన్నాడు రమేష్..
" తప్పదు లేకపోతే నేనే మానేసే దాన్ని... "
అంది శైలు
" ఎన్నాళ్ళు .." అన్నాడు రమేష్
" ఒక వారం " అంది శైలు
" అమ్మో అన్నాళ్లే..
మరి ఏర్పాట్లు " అన్నాడు రమేష్
" అన్ని వాళ్లే చూసుకుంటారు..
పైగా ఈ పక్క ఉరే..
కానీ ప్రాజెక్ట్ కోసం అక్కడే స్టే చేయమంటున్నారు.." అంతే అంది..
" మరి మీ అమ్మని ఆడిగావా"  అన్నాడు రమేష్..
" ఆ , నిన్నే అడగమంది..
" నువ్వు ఒప్పు కుంటే సరే అంది... " అన్నది శైలు..
" సరే , డబ్బు కావాలంటే అమ్మని అడుగు .."
"కానీ జాగ్రత్త.. రోజు ఫోన్ చేయాలి ..సరేనా "
అన్నాడు రమేష్..
సరే నాన్న అని అమ్మకి చెప్పడానికి లోపలికి వెళ్ళింది..
" అమ్మా నాన్న సరే అన్నారు.. "అంది..
" సరే ఆ ఏర్పాట్లు చేసుకో.
జాగ్రత్తగా  ఉండాలి ..అర్ధం అయిందా.. "
అంది తల్లి ..
సరేలే అమ్మా అంటూ లోపలికి వెళ్లి ఏర్పాటు చేస్కోసాగింది...
" ఏమండీ మీరు ఊరు వెళ్లమన్నారు ట కదా "
  అంది ఇందు...
" అవును తప్పదు ట...
జాగ్రత్తగా వెళ్లి వస్తుంది లే...
అయిన ఒకసారి వెళితే గాని స్వతంత్రం గా ఆలోచించడం రాదు..
ఎంత సేపు మనమే కూడా ఉంటే ఎలా నేర్చుకుంటారు
అన్నీ నేర్చుకోవాలి..
మనం
" వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం "  నేర్పించాలి...
" ఏమి పరవాలేదు పంపించు..."
" కాకపోతే రోజూ కాస్త వేళకు తింటోందో లేదో కనుక్కో చాలు "
అన్నాడు రమేష్..
ఆ మరునాడు శైలు కాంప్ కి వెళ్ళింది...

రెండు రోజులు బాగానే గడిచాయి రమేష్ కి తరువాత మొదలయింది
కుతురి మీద బెంగ
ఇంతకాలం ఒంటరిగా ఎక్కడికి పంపలేదు ..
ఇంటికి వస్తే ఏదో వెలితి ...
ఒక్కోరోజు భారంగా గడుస్తోంది...
పాపం రమేష్ కి ..
" కానీ తప్పదు ..అలవాటు చేసుకోవాలి " అనుకున్నాడు...
మరునాడు తన స్నేహితుడు విశ్వం  తో
ఇదే విషయాన్ని పంచుకున్నాడు...
" అదేమిటి రమేష్ ,
రేపు దానికి పెళ్లి అయితే ఎలా ..
ఆడపిల్ల అన్నాక తప్పదు గా అత్తవారింటికి  పంపించాలి.. "
"పైగా ఇపుడు,  ఆడ ఏమిటి మగ ఏమిటి అందరూ ఉద్యోగ కారణం తో ,
తల్లిదండ్రులు కు దూరంగానే ఉంటున్నారు...
ఎవరి దాకా ఎందుకు
మనం లేమా....
ఎన్నాళ్ళు అయింది రా
మీ తల్లిదండ్రులు దగ్గరకు వెళ్లి..
గట్టిగా కార్ లో కొడితే 3 నుంచి నాలుగు గంటల ప్రయాణం...
ఆ కాస్త ఖాళీ కూడా చేసుకోలేకపోతున్నాం...
మన పిల్లల దాకా వచ్చే సరికి
మనం తల్లిదండ్రులు గా ఫీల్  అయిపోతున్నాం... మన తల్లిదండ్రులు కి మనం కూడా పిల్లలమే గా ...వాళ్ళకి  కూడా మనలాగే ,
మనలని చూడాలని ఉంటుంది గా ..
పాపం బెంగతో ,
మనం ఎక్కడ ఇబ్బంది పడతామో అని
వాళ్ళ ఫీలింగ్స్ అన్ని
లోపలే అణగ తొక్కు కుని
ఏరోజుకైనా రాక పోతామా అని ఎదురుచూస్తు ఉంటారు.."

" ఈ మాటలు మనసుకి కఠినం  కలిగించే విషయం అయినా ఆలోచించ వలసిన విషయం.."
" ఈ స్పీడ్ ప్రపంచంలో పడి మనం
ఎంత తప్పు చేస్తున్నామో గ్రహించలేక పోతున్నాం.. చదువులు చెప్పించారు
ఇంత జీవితాన్ని ఇచ్చారు
ఆఫ్టర్ఆల్ వాళ్ళు మన నుంచి ఎక్సపెక్ట్ చేసేది
" ఒక ప్రేమ పూర్వక పలకరింపు... "
" మనతో కలిసి కొంత సమయం గడిపే అవకాశం..." " ఎందుకంటే చిన్నప్పటి నుండి
మన మీదే అన్ని పెట్టుకుని పెంచారు గా ,
అంటే
ఇపుడు మనం మన పిల్లలని పెంచుతున్నట్లు గా...
" అదే ప్రేమ కదా ఎక్కడైనా , ఏ తరానికైనా..."
అన్నాడు విశ్వం..
" రేపు మన పిల్లలు
ఇదే చూసి నేర్చు కుంటారు
అపుడు మనం తట్టు కోగలమా.. " అన్నాడు విశ్వం
" అవును నిజమే , ఆలోచిస్తూ ఉంటే గుర్తుకు వస్తోంది..
నేను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నానో...
పాపం నాన్న చాలా సార్లు ఫోన్ చేశారు..
కానీ ఏదో టెన్షన్ వలన సరిగ్గా ఆన్సర్ చేయలేక పోయాను..
పైగా నేనే ఫోన్  చేస్తానని విసుక్కున్నా...
నిజానికి ఆయన ఎంత ఆపేక్ష తో చేశారో...
పాపం అమ్మ కూడా
ఎదురు చూస్తూ ఉంటుంది కదా
నా పలకరింపు కోసం...
" జీతం ఇచ్చే వాడికి జీవితం ఇచ్చేస్తున్నాం
కానీ జీవితం ఇచ్చిన వాళ్లకోసం కొంత సమయం కేటాయించ లేక పోతున్నాం... "
పిల్లలు "  బాగున్నావా ,  తిన్నావా అని
పలకరిస్తే చాలు ,బోలెడు సంబరపడిపోతారు."
అలాంటి పలకరింపు కోసం ఎదురు చూపులు
చూసే ఖర్మ వాళ్ళకి రాకూడదు..
వాళ్ళకి ఇక ఇలాంటి పరిస్థితి రాకుండా
నేను ఇవాళ్టి నుండి చూసుకుంటా..
ఈ పండగకి మా ఊరు ,భార్య ,
పిల్లలతో వెడతా ..
ఈ రెండు రోజులు మా అమ్మ నాన్న లతో హాయిగా గడువుతా...
ఉద్యోగం ఎంత అవసరమో  ,
వాళ్ళకి కొంత సమయాన్ని కేటాయించడం
మన బాధ్యత అని తెలుసుకున్నా రా ,
మరి నే వస్తా...రా విశ్వం "
అన్నాడు రమేష్...
" ఆ మార్పు ఏదో , ఈ క్షణం నుండి
మొదలు పెట్టరా "  ..అన్నాడు విశ్వం..
అదెలా రా అన్నాడు రమేష్..
అది కూడా నేనే చెప్పాలా..
" ఫోన్ కొట్టు మీ నాన్నగారికి...."
అన్నాడు విశ్వం..నవ్వుతూ
" ఓహ్ ..నిజమేగా ... ఇపుడే చేస్తా "
అంటూ ఫోన్ చేసాడు..
ఉత్సాహంగా చిన్నపాటి ఉద్వేగం
నాన్న ఏమంటారో అని ...
రావు గారు ఫోన్ తీశారు..
హలో ఎవరు అన్నారు...
నాన్న గొంతు వినగానే ,
రమేష్ కి గొంతులో ఏదో తీయని  బాధ
మాట రావట్లేదు రమేష్ కి ..
కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి...
గొంతు గద్గద మైంది...
ఎవరూ  ఫోన్ చేసి మాట్లాడరేమిటి
అని మళ్ళీ అడిగి ,
కళ్ళజోడు పెట్టుకుని పేరు చూసారు ..
అబ్బాయ్ రమేష్ అని ఉంది...
ఆనందం తో ఆయన కళ్ళు మెరిసాయి
ఒసేయ్  శాంతా అబ్బాయి ఫోన్ ,అని అరచి
ఫోన్ చేసి మాట్లాడవేరా
అంతా బాగానే ఉంది గా..
కోడలు పిల్లలు బాగున్నారా
అని ప్రశ్నల వర్షం కురిపించారు..."
ఇంతలో
"  ఒసేయ్ ఎక్కడ ఉన్నావ్ 
అబ్బాయి ఫోన్ అంటూ ఆనందం గా మళ్ళీ  అరిచారు... "
ఆ ఆ  వినబడింది లెండి ,
వస్తున్నా అంది శాంత...
నాన్న మాటల్లో ఆనందం వినిపిస్తోంది రమేష్ కి
" ఈ మధ్య దానికి వినికిడి కొంచెం మందగించింది రా వృద్ధాప్యం కదా ...డాక్టర్ కి చూపిస్తా అంటే నాకేమి చెముడు లేదు ,కొంచెం వినబడదు అంతే అంటుంది పిచ్చిది.. "
అంటూ తన ధోరణి లో ఆనందం గా మట్లాడేస్తున్నారు రావు గారు
" నాన్నా.."
అన్నాడు రమేష్  మొత్తానికి గొంతు పెగుల్చు కుని
" చెప్పరా నాన్నా "
అన్నారు..రావు గారు
" నన్ను క్షమిచగలరా " అన్నాడు ...రమేష్
" అదేమిట్రా 
ఏదేదో మాట్లాడు తున్నావ్
నిన్ను క్షమించడము ఏమిట్రా..
నువ్వు అసలు ఏమి తప్పు చేశావని "
అన్నారు ఆప్యాయంగా..
" పనులు వత్తిడి వలన రాలేక పోయా
కనీసం ఫోన్ కూడా చేయలేదు
మీకు నా మీద కోపం లేదా"
అని అడిగాడు... రమేష్
ఆఫీసు అన్నాక  సవా లక్ష పనులు ఉంటాయి .."
అవి అన్ని చూసుకునే అప్పటికి
నీకు బహుశ ఖాళీ లేదేమో ..
దానికే అంత ఫీల్ అవ్వాలా " అన్నారు...రావు గారు
అందుకే మీరు " తల్లిదండ్రులు " అయ్యారు..
"  క్షమా హృదయం మీది... "
" రేపే నేను బయలుదేరి వస్తున్న "
" ఈ పండగ మీదగ్గరే జరుపుకుంటా.. "
ఈ పండగే కాదు ఇక ఎపుడు అవకాశం దొరికినా మీతోనే గడపడానికి సమయం కేటాయిస్తా...
అమ్మకి ఒకసారి ఇవ్వండి "
అన్నాడు... రమేష్
" ఇదిగో అబ్బాయి నీతో మాట్లాడుతాడుట.."
ఇదిగో ఈ చెవిలో పెట్టుకొని మాట్లాడు ,ఆ చెవి నీకు సరిగ్గా వినబడదు అన్నారు రావు గారు..
నాకు తెలుసు లెండి ...అంటూ
" ఏరా అబ్బాయ్ ఎలా ఉన్నావ్ ,
వేళకి తింటున్నావా లేదా..."
అని అడిగింది ఆప్యాయంగా
అమ్మవి కదా కొడుకు ఆకలి పట్టించుకున్నావ్...
నేనే మొద్దు గాడిని ,
స్పీడ్ ప్రపంచపు మాయలో పడి మిమ్మలిని పట్టించుకోలేదు...క్షమించవే అన్నాడు రమేష్..
అంత మాట అనకు రా అబ్బాయ్ ,
నాకు ఏడుపు వచ్చేస్తుంది... అంది...శాంత
వద్దు  తల్లీ ఇప్పుడు నువ్వు టాప్ తిప్పకు...
నీకు దండం పెడతాను...అన్నాడు రమేష్
చిన్నప్పడు ఎప్పుడు అలా అనగానే నవ్వేసేది ఆవిడ...
పోరా నువ్వు ఏమి మారలేదు.. అంటూ నవ్వేసింది..
అన్నట్టు నేను ,
మీ కొడలు , మనవలు తో
రేపు వస్తున్నానే ,
ఆ విషయం చెపుదామని ఫోన్ చేశా ..."
అన్నాడు రమేష్..
" చాలా సంతోషం రా..
జాగ్రత్తగా వచ్చేయి నీకోసం ఎదురుచూస్తూ ఉంటాం"
అని పెట్టేసింది ఫోన్.
రమేష్ ఆనందం గా ఇంటికి బయలుదేరాడు..
ఆ పండగ అందరితో సంతోషంగా గడిపాడు..
పిల్లలు తాత  , బామ్మ గారి తో సంతోషం గా గడిపారు..
శాంత ,
వాళ్ళకి బోలెడు కథలు చెప్పింది...
వాళ్ళు ఆమెతోనే పడుకున్నారు ...
ఆ రెండు రోజులు...రెండు క్షణాల్లా గడిచిపోయాయి...
బయలుదేరే సమయం వచ్చింది ...
" నాన్నా ఇక్కడ చాలా బాగుంది,
నానమ్మ , తాత గారు లు బోలెడు కబుర్లు,  కథలు చెప్పారు... "
" ఇలాంటి అనుభూతి ఇంతకు ముందు ఎన్నడూ లేదు..."
"మళ్ళీ ఇక్కడికి ఎపుడు వస్తాము "
అంది శైలు..
మళ్ళీ నెలలో సెలవులు వస్తాయి  గా
అపుడు మళ్ళీ వద్దాం అంటూ

తల్లిదండ్రులు దగ్గర
ఆశీర్వాదం తీసుకొన్నారు..
ఆనందంగా...
మీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాం అంటూ బాయ్ చెప్పారు రావు గారు శాంత..

" అందరివి మంచి మనసులే ,
కానీ పరిస్థితులు లని అధిగమించి
మన ప్రేమ వాళ్ళని చేరగలిగితే ...
అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి ఉండదు..."

" ఉన్నంత కాలం వాళ్ళు ఉండరు...
ఆ తరువాత కావాలన్నా దొరకరు "
తల్లిదండ్రులు విలువ కట్టలేని
అమూల్యమైన సంపద "

" వాళ్ళు ఉన్నంత కాలం
వాళ్లకోసం వాళ్ళకి కావలిసిన
సమయాన్ని ,ఆనందాన్ని
వాళ్లకి ఇచ్చేద్దాం "
వాళ్ల ఎదురు చూపులు ,
" ఎండమావులు "
కాకుండా చూసుకునే బాధ్యత మనదే..."
           అలా చూసుకొనే అందరికి ,
                నమః సుమాంజలి  తో

మీ రచయిత
ఆచంట గోపాలకృష్ణ

ఇది కేవలం  కల్పిత కధ
పాత్రలు , కధ , కథనం అంతా కల్పితం
ఎవరిని ఉద్దేశించినది కాదు..
కధ కోసం పాత్రల చేత అలా ప్రవర్తిచేలా రాయడం జరిగింది.