ఆలూ బోండా
కావలిసిన పదార్థాలు
1. బంగాళ దుంపలు 5.
2. క్యారెట్టు 1
3. పచ్చిమిర్చి 3
4. అల్లం చిన్న ముక్క
5. కొత్తిమీర కొద్దిగా
6. కరివేపాకు
7. పసుపు కొద్దిగా
8. ఉప్పు రుచికి సరిపడా
పోపు దినుసులు
సెనగపప్పు అర స్పూన్ , మినపప్పు అర స్పూన్ , ఆవాలు కొద్దిగా ,
జీలకర్ర కొద్దిగా ,ఆయిల్ 3 స్పూన్స్
తోపు పిండికి
సెనగపిండి ఒక కప్పు , కారం కొద్దిగా , ఉప్పు కొద్దిగా ,
వరిపిండి. 2 స్పూన్స్ , బేకింగ్ పొడి కొద్దిగా, నీళ్లు
తోపు పిండి కి సరిపడా , ఆయిల్ పావులీటరు.
తయారీ విధానం
ముందుగా బంగాళ దుంపలను ,క్యారట్ ను శుభ్రం గా కడిగి ,
పైన వున్న. తొక్కను తీసి , ముక్కలు గా తరిగి ,
తగినన్ని నీళ్లు పోసి కుక్కరు లో పెట్టి ఉడికించుకుని , చల్లార్చు కోవాలి .
తోపు పిండికి ఒక బౌల్ లో పైన చెప్పిన సెనగపిండి , వరిపిండి, బేకింగ్ పొడి ,
కారం , కొద్దిగా ఉప్పు , జీలకర్ర వేసి బాగా కలిపి ,
కొద్దీ కొద్దిగా నీళ్లు పోసుకుంటూ , బూరెల తోపు పిండి మాదిరిగా కలుపుకుని ,
పక్కన పెట్టుకోవాలి
అల్లం , పచ్చిమిర్చి , కొత్తిమీరలను శుభ్రం గా కడిగి ,
మెత్తని పేస్టు లాగ గ్రైండ్ చేసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక 3 స్పూన్స్ ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపు దినుసులను వేసి దోరగా వేగిన తరువాత ,
ముందుగా పేస్టులాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర ముద్దను ,
కరివేపాకును వేసి అది కూడా దోరగా వేగాక
ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళ దుంప ,క్యారట్ ముక్కలు ,
పసుపు తగినంత ఉప్పును వేసి బాగా కలిపి ముద్దలాగ చేసి ,
స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక వెడల్పయిన ప్లేట్ లోకి తీసుకుని
కూరను బాగా చల్లారనివ్వాలి . బాగా చల్లారిన తరువాత నిమ్మకాయ అంత సైజు లో
ఉండలు చేసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఉండలను తోపు పిండిలో ముంచి తీసి
ఆయిల్ లో వేసిదోరగా వేపుకుంటే
ఆలూ బోండా రెడీ
వీటిని టొమాటో సాస్ తో గాని కొత్తిమీర పచ్చడితో గాని తింటే బావుంటాయి
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi