పండుమిరప కాయ పచ్చడి
కావలిసిన పదార్థాలు
1. పండు మిరప కాయలు దేశవాళీవి పావుకేజీ
2. చింతపండు 50 గ్రాములు
3. పసుపు
4. ఉప్పు రుచికి సరిపడా
5. మెంతులు 3 స్పూన్స్
6. ఆవాలు 3 స్పూన్స్
7. ఇంగువ కొద్దిగా
8. నువ్వులనూనె ఒక కప్పు
తయారీ విధానం
ముందుగా పండు మిరప కాయలను
శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి .
మెంతులను ,ఆవాలను ,కలిపి దోరగా వేపుకుని ,
చల్లారాక మెత్తని పొడి లాగ గ్రైండ్ చేసుకోవాలి .
చింతపండును కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,
ఆయిల్ వేసుకుని ఆరబెట్టుకున్న
పండు మిరప కాయలను వేసి దోరగా వేపుకోవాలి.
చింతపండును తుక్కులూ లేకుండా బాగా పిసికి ,
ఈగుజ్జును ఉడికించుకోవాలి ,
వేపుకుని చల్లార్చుకున్న పండుమిరపకాయలను ,
పసుపు ,ఉప్పు ,ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జును ,
వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నువ్వుల నూనె ను పోసి .
వేడెక్కాక మిరపకాయ ముద్ద, మెంతి , ఆవపొడి, మిశ్రమం ,
ఇంగువ వేసి బాగా కలిపి
నూనె అంతా పచ్చడిలో కలిసేలా బాగా కలిపి
స్టవ్ ఆఫ్ చేసుకుంటే ,
ఘుమఘుమ లాడే
పండు మిరప కాయ పచ్చడి రెడీ
ఈ పచ్చడి 3 నెలలు నిల్వ ఉంటుంది
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi