నిమ్మరసం లో మామిడి అల్లం ముక్కలు
కావలసిన పదార్థాలు
1. మామిడి అల్లం 50గ్రాములు
2. పచ్చిమిర్చి 5
3. నిమ్మకాయలు 2.
4. పసుపు
5. ఉప్పు తగినంత
తయారీ విధానం
ముందుగా మామిడి అల్లాన్ని , పచ్చిమిర్చిని , నిమ్మకాయలను ,
శుభ్రంగా కడుగుకోవాలి. మామిడిఅల్లాన్ని పైన వున్న తొక్కను తీసి ,
సన్నని చీలికలుగాను , పచ్చిమిర్చిని కూడా సన్నని చీలికలు గాను,లేక
చిన్న ముక్కలు గాను ,తరిగి ఒక బౌల్ లోకి తీసుకుని ,
వీటి పైన పసుపు ,తగినంత ఉప్పు వేసి ,
నిమ్మరసం పిండి బాగా కలిపి ఒక గంట సేపు ఊరనివ్వాలి.
అప్పుడు
నిమ్మరసం లో మామిడి అల్లం ముక్కలు రెడీ.
ఈ ముక్కలను ఏదయినా పప్పు కూరతోగాని , ముద్దపప్పుతో గాని తింటే బాగుంటాయి .
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi