Saturday 21 January 2017

మెంతి కూర పచ్చడి


మెంతి  కూర  పచ్చడి

కావలిసిన  పదార్థాలు
1.  మెంతికూర  3 కట్టలు
2. చింతపండు  కొద్దిగా
3. పసుపు
4. ఉప్పు  రుచికి  సరిపడా
5. వెల్లుల్లి  రెబ్బలు  8.
6. ఆయిల్  10 స్పూన్స్

పోపు  దినుసులు
మినపప్పు  1 స్పూన్,  ఆవాలు  అర స్పూన్,  మెంతులు  కొద్దిగా,  ఇంగువ  కొద్దిగా  ,
ఎండుమిరప  కాయలు  10.

తయారీ  విధానం
ముందుగా  మెంతికూరను  శుభ్రం గా  కడిగి  ,సన్నగా  తరిగి  ,
ఆర బెట్టుకోవాలి  . స్టవ్  వెలిగించి బాణలి  పెట్టి  వేడెక్కాక  ఆయిల్  వేసి  ,
పైన  చెప్పిన  పోపు  దినుసులను  వేసి , దోరగా వేపుకుని ,
 చల్లార నివ్వాలి  . అదే  బాణలిలో  ఆయిల్  వేసి ,
మెంతికూరను  ,చింత పండును ,  పసుపును ,
వేసి  పచ్చివాసన  పోయేంత  వరకు  మగ్గనిచ్చి ,
 చల్లారనివ్వాలి  . ముందుగా  చల్లారిన  పోపును  ,
తగినంత  ఉప్పు వేసి  మెత్తని    పొడి  లాగ  చేసుకుని  ,
దీనిలో మెంతి కూరను  వేసి  మెత్తని  ముద్దలాగా  గ్రైండ్  చేసుకోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి పెట్టి  వేడెక్కాక  ఆయిల్  వేసి  ,
వెల్లుల్లి రెబ్బలను  వేసి  దోరగా  వేపుకుని,  ఒక  ప్లెట్ లోకి  తీసుకోవాలి  .
అదే  బాణలి  లో  ఆయిల్  ,ఇంగువ  వేసి  ,వేడెక్కాక
ఈ  ముద్దను  ,వెల్లుల్లి రెబ్బలను వేసి  ,ఆయిల్  అంతా పచ్చడిలోకి  ఇంకేంత  వరకు  ఉంచి
స్టవ్ ఆఫ్  చేసుకుంటే
మెంతి కూర   పచ్చడి  రెడీ  అవుతుంది
ఈ పచ్చడి  వేడి అన్నం  లో  నెయ్యి  వేసుకుని   తింటే  రుచిగా  ఉంటుంది
చపాతీ  లలోకి  కూడా  బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer
Achanta Subbalakshmi
Achanta Subhadevi

Friday 20 January 2017

రాజ్మా గింజల మసాలా కూర


రాజ్మా  గింజల  మసాలా  కూర

కావలిసిన  పదార్థాలు
1. రాజ్మా  గింజలు  2 కప్పులు
2.  ఉల్లిపాయలు  5.
3. టమాటాలు  3
4.  అల్లం  వెల్లుల్లి  పేస్ట్  1 స్పూన్
5.  పచ్చిమిర్చి  4.
6.  కారం  1 స్పూన్
7. ధనియాలపొడి  1 స్పూన్
8. గరం  మసాలా  పొడి  1 స్పూన్
9. రాజ్మా  మసాలా  పొడి  1 స్పూన్
10.  పసుపు  కొద్దిగా
11. ఉప్పు  రుచికి  సరిపడా
12.   నీళ్లు  తగినన్ని
13. కొత్తిమీర  
14. ఆయిల్ 8 స్పూన్స్
15. పల్లీలు  2 స్పూన్స్
16. జీడిపప్పు  పలుకులు  6.
17. పెరుగు  3 స్పూన్స్

తయారీ  విధానం
రాజ్మా  గింజలను  ముందురోజు  తగినన్ని  నీళ్లు  పోసుకుని  ,
నానబెట్టుకోవాలి  . ఇలా  నానిన  రాజ్మా  గింజలను  నీళ్లు  పోసుకుని
కుక్కరులో  పెట్టి   ఉడికించుకోవాలి  .

3 ఉల్లిపాయలను  ,టమాటాలు  ,
చిన్న ముక్కలుగా  తరిగి  ,స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  ,
వేడెక్కాక    2 స్పూన్స్  ఆయిల్  వేసి  ,
తరిగిన టమాటా  ఉల్లిపాయ  ముక్కలను  వేసి , పచ్చి  పోయేంత  వరకు  వేగనిచ్చి  ,
స్టవ్  ఆఫ్  చేసుకోవాలి.

చల్లారాక  ముద్దలాగా  గ్రైండ్  చేసుకోవాలి .
పల్లీలను  ,జీడిపప్పు  పలుకులను  ,దోరగా  వేపుకుని  ,
చల్లారాక  మెత్తని  పొడిలాగా  చేసుకోవాలి  .

పచ్చిమిర్చిని  చీలికలుగాను , 2 ఉల్లిపాయలను  సన్నగాను  తరుగుకోవాలి  .
స్టవ్  వెలిగించి  వెడల్పయిన  బాణలి  పెట్టి  వేడెక్కాక ,
ఆయిల్  వేసి   ,అల్లం  వెల్లుల్లి  పేస్ట్ ను  వేసి  ,దోరగా  వేగాక  ,
సన్నగా తరిగి పెట్టుకున్న  ఉల్లిపాయ  ముక్కలు  ,పచ్చిమిర్చి  చీలికలు  వేసి ,
అవి కూడా  వేగాక  టమాటా  ఉల్లిపాయ  ముద్దను  వేసి  ,
కొద్దిగా  నీళ్లుపోసి  ఉడకనివ్వాలి  .
 దీనిలో  ముందుగా  మనం  ఉడికించి  ఉంచుకున్న
రాజ్మా  గింజలను  వేసి,  పసుపు  ,కారము , ధనియాలపొడి , గరం మసాలాపొడి  ,
రాజ్మా  మసాలా పొడి  , తగినంత  ఉప్పును  ,వేసి
బాగా  కలిపి , తగినన్ని  నీళ్లు  పోసి   బాగా ఉడకనివ్వాలి .
దీనిలో  పెరుగు  వేసి , కలిపి  పల్లీ  జీడిపప్పు  పొడిని  వేసి  ,బాగా  కలిపి ,
 కొద్దిసేపు  ఉడకనివ్వాలి  .
కూర  అంతా  దగ్గర  పడ్డాక  స్టవ్  ఆఫ్  చేసుకుని  ,
కూరను  ఒక  బౌల్ లోకి  తీసుకుని , కొత్తిమీరతో గార్నిష్  చేసుకుంటే
రాజ్మా  గింజల  మసాలా  కూర  రెడీ  అవుతుంది
ఈకూర  చపాతీ  లలోను  పరోటా  లోకి  బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer
Achanta Subbalakshmi
Achanta Subhadevi

Thursday 19 January 2017

చుక్క కూర పచ్చడి


చుక్క  కూర  పచ్చడి

కావలిసిన  పదార్థాలు
1. చుక్క  కూర  3 కట్టలు
2. పసుపు
3. ఉప్పు  రుచికి సరిపడా  
పోపు  దినుసులు
మినపప్పు  1 స్పూన్  ,ఆవాలు  కొద్దిగా  ,మెంతులు  కొద్దిగా,
  ఇంగువ  కొద్దిగా  ,ఎండుమిరపకాయలు  10, ఆయిల్  చిన్న  కప్పు  
తయారీ  విధానం
ముందుగా  స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ,ఆయిల్  వేసి  ,
పైన  చెప్పిన  పోపుదినుసులను  వేసి  ,
దోరగా  వేపుకుని  చల్లారనివ్వాలి .
చల్లారాక  తగినంత  ఉప్పు  వేసి  మెత్తగా  పొడి  లాగ  చేసుకోవాలి .
 చుక్క  కూరను  శుభ్రం గా  కడిగి  సన్నగా  తరుగుకోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక,  ఆయిల్  వేసి  ,
తరిగి పెట్టుకున్న  చుక్క కూరను ,పసుపును , కొద్దిగా ఉప్పును  వేసి ,
దగ్గర  పడేంత  వరకు  మగ్గనిచ్చి ,
 ముందుగా  తయారు చేసి  పెట్టుకున్న  కారం పొడిని  వేసి ,
 బాగా   కలిపి ఒక  పక్కన  పెట్టుకోవాలి  .
స్టవ్  పైన  వేరే  బాణలి  పెట్టి  వేడెక్కాక  ఆయిల్  కొద్దిగా  వేసి  ,
వేడెక్క  నిచ్చి  ముందుగా  మనం  తయారు  చేసి  పెట్టుకున్న  పచ్చడిని  వేసి
ఆయిల్  అంతా  పచ్చడిలో  ఇంకేంత వరకు   ఉంచి
స్టవ్  ఆఫ్  చేసుకుంటే
చుక్కకూర  పచ్చడి  రెడీ  అవుతుంది 
ఈ  పచ్చడి  ఒక  10. రోజులపాటు  నిలువ  ఉంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi

షోడశోపచారాలు



షోడశోపచారాలు
మనం భగవంతుని షోడశోపచారాలతో పూజిస్తాము. ఉపచారము అనగా సేవ అనే అర్ధం.
అనగా మనం దేవునికి నిత్యం జరిపే పూజలు

పదహారు రకాల ఉపచారాలు/సేవలు షోడశోపచారాలు

1. ఆవాహనం,2. ధ్యానం, 3. ఆసనం, 4. పాద్యం, 5. అర్ఘ్యం,6. స్నానం – అభిషేకం
7. వస్త్రం, 8. యజ్ఞోపవీతం, 9. గంధం,10. అధాంగ పూజ,11. ధూపం,12. దీపం
13. నైవేద్యం, 14. తాంబూలం, 15. నీరాజనం, 16. మంత్ర పుష్పం
1. ఆవాహనం:
భగవంతుడిని పూజామండపానికి ఆహ్వానించడము
2. ధ్యానం:
భగవంతుడిపై పూర్తిగా మనసు లగ్నం చేసి పూజామండపం లోకి ఆహ్వానించి పూజించడానికి శ్లోకంతో చేసే సేవను ధ్యానం అంటారు. భగవంతుడిని రాముడు, కృష్ణుడు, లక్ష్మి లేదా గౌరీ అంటూ ఏ రూపంలోనైనా పూజించవచ్చు. అది పూజ చేసే సందర్భాన్ని బట్టి, మనకున్న నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంలో కొలిచినా భగవంతుడు ఎప్పుడూ భక్తుల పక్షమే. శ్రద్ధాసక్తులు ముఖ్యమైనవి.
3. ఆసనం:
రత్నాలంకృతమైన బంగారు సింహాసనాన్ని అధిష్టించి పూజలందుకొమ్మని ఆసనం సమర్పించడం.
4. పాద్యం:
పాదాలు(కాళ్ళు) శుభ్రపరుచుకోవడానికి నీరందించడాన్ని పాద్యం అంటారు.
5. అర్ఘ్యం:
చేతులు శుభ్రపరుచుకోవడానికి నీరు అందించడాన్ని అర్ఘ్యం అంటారు.
6. అభిషేకం:
స్నానికి జలం సమర్పించడాన్ని అభిషేకం అంటారు. దేవునికి పంచామృతం (తేనె, ఆవు పాలు, ఆవు నెయ్య, పెరుగు, పంచదార) స్నానం అత్యంత ప్రీతికరమైనది. ఈ ఏడు పదార్ధాలతో స్నానం చేయించి తర్వాత మళ్ళీ శుద్ధమైన జలంతో స్నానం చేయించడాన్ని అభిషేకం అంటారు.
7. వస్త్రం:
అభిషేకం పూర్తి అయ్యాక దేవునికి సమర్పించే వస్త్రాలను వస్త్రం సమర్పయామి అని అందిస్తారు.
8. యజ్ఞోపవీతం:
భుజం  పై నుంచి వేసుకోవడానికి యజ్ఞోపవీతం సమర్పించడం.
9. గంధం:
దేవునికి గంధం, అక్షతలు మరియు పుష్పాలు సమర్పించడం.
10. అధాంగ పూజ”
దేవునికి వారి అన్ని శరీర అవయవాలను కీర్తిస్తూ పూజ సమర్పించడాన్ని అధాంగ పూజ అంటారు.
11. ధూపం:
దేవునికి అగరవత్తులు మరియు ధూపం సమర్పించడం
12. దీపం:
దీపాన్ని వెలిగించి దేవుని ముందుంచి ధ్యాన నిమగ్నులమై పూజించడం.
13. నైవేద్యం:
భక్తి ప్రపత్తులతో, శ్రద్ధాసక్తులతో భగవంతునికి ఆరగించడానికి సమర్పించే భక్ష్య భోజ్యాలను నైవేద్యం అంటారు. ఆ భగవానుడే మనకి ఇచ్చిన జీవితానికి, ఆనందాలకు, సుఖశాంతులకు, మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఇదొక అవకాశం.
14. తాంబూలం:
మనం భక్తి తో సమర్పించిన భక్ష్య భోజ్యాలతో సంతుష్టుడైన దేవునికి, తాంబూలం సమర్పించడం. తాంబూలం జీర్ణశక్తిని పెంచుతుంది.
15. నీరాజనం:
దేవునికి కర్పూరంతో హారతి వెలిగించి, దిష్టి తీసి, మంగళం పాడి, మనం కళ్ళకి అద్దుకోవడం.
16. మంత్రపుష్పం:
మన మనస్సునే ఒక పుష్పంగా చేసి భగవంతునికి సమర్పించడానికి మంత్ర సహితంగా చేసే సేవనే మంత్రపుష్పం అంటారు.
ఇన్ని సేవలూ పూర్తి అయ్యాక, చేసిన పూజలో గాని, చదివిన మంత్రాలలో గాని తప్పులున్న మన్నించమని, ఉచ్చారణ దోషాలున్నా, భక్తి లో ఎటువంటి లోపము ఉండదని అపరాధ క్షమాపణ చెప్పుకుని దేవుని సాగనంపుతారు.
వెళ్లేముందు “పునరాగమనాయచ” అంటూ మళ్ళీ రమ్మని చెప్పి మరీ పంపుతారు.
ఇవి మనం నిత్యం దేవునికి సమర్పించే షోడశోపచారాలు(సేవలు). 

Wednesday 18 January 2017

వంకాయ పెరుగు పచ్చడి


వంకాయ  పెరుగు  పచ్చడి

కావలిసిన  పదార్థాలు
1.  తెల్ల  వంకాయలు  పెద్దవి  2
2.  పెరుగు  2 కప్పులు
3. ఉప్పు  తగినంత
4. పచ్చిమిర్చి  4
5. కొత్తిమీర  కొద్దిగా
పోపు  దినుసులు
 మినపప్పు  1 స్పూన్  ,ఆవాలు  అర  స్పూన్ , ఎండుమిరపకాయలు  2 ,
 ఇంగువ  కొద్దిగా  ,ఆయిల్  2 స్పూన్స్
తయారీ  విధానం
ముందుగా  తెల్లవంకాయలను  శుభ్రంగా  కడిగి  ,
స్టవ్  పైన  కాల్చుకుని చల్లారాక  ,పైన వున్న తొక్కను  తీసి  గుజ్జులాగా   చేసుకోవాలి  .
పచ్చిమిర్చిని  చిన్న  ముక్కలుగా  ,కొత్తిమీరను  సన్నగా  ,
తరుగుకోవాలి. స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ,
ఆయిల్ వేసి   పైన  చెప్పిన  పోపు  దినుసులను వేసి  ,
దోరగా  వేగనివ్వాలి  .ఒక  బౌల్  లోకి  పెరుగును  తీసుకుని  ,
దానిలో   వంకాయ  గుజ్జును  , పోపు ను  ,పచ్చిమిర్చిని  ,
తగినంత  ఉప్పును  వేసి  ,
బాగా  కలిపి  కొత్తిమీర తో  గార్నిష్   చేసుకుంటే  ,
వంకాయ  పెరుగు  పచ్చడి  రెడీ  అవుతుంది
దీని ని  వేడి  అన్నం  లో  కలుపుకుని  తింటే  రుచిగా  వుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi

Tuesday 17 January 2017

ఇడ్లీ పిండి పుణుకులు


ఇడ్లీ  పిండి  పుణుకులు

కావలిసిన  పదార్థాలు
1. ఇడ్లీ  పిండితగినంత
 2. వరిపిండి  3 స్పూన్స్
3. ఉల్లిపాయలు  3
4. పచ్చిమిర్చి 4
5. కొత్తిమీర  కొద్దిగా
6. జీలకర్ర
7. ఆయిల్  తగినంత

ఇడ్లీ  పిండి తయారీకి
మినపప్పు  ఒక  గ్లాసు , ఉప్పుడు  నూక  2 గ్లాసులు  ,ఉప్పు  తగినంత
తయారీ  విధానం
ముందుగా  మినపప్పును ,  ఉప్పుడు  నూకను  ,వేరు  వేరు  గిన్నె  లలో  నీళ్ళుపోసి
నానబెట్టుకోవాలి . నాని న  పప్పును  శుభ్రం  గా  కడిగి
తగినంత  ఉప్పు  వేసి  మెత్తగా  రుబ్బుకోవాలి.
నూకను  కూడా  బాగా  కడిగి  ఒక  గిన్నెలోకి  తీసుకుని ,
రుబ్బిన  మినపపిండిని వేసి  ,బాగా    కలిపి ,
3 గంటలసేపు  నాన నివ్వాలి  .
ఉల్లిపాయలను,  పచ్చిమిర్చి  ని  ,కొత్తిమీరను  ,సన్నగా  తరుగుకుని
మినప  పిండిలో  వేసి  , జీలకర్రను  కూడా  వేసి  ,
బాగా  కలుపుకోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ,ఆయిల్  వేసి   ,
దీనిలో  పిండిని  పుణుకుల  మాదిరి  గా  వేసి  ,
దోరగా  వేపుకుంటే ఇడ్లీ పిండి  పుణుకులు  రెడీ  అవుతాయి

వీటిని  కొత్తిమీర  పచ్చడితోగాని  కొబ్బరి  పచ్చడి తో  గాని  తింటే  బాగుంటాయి.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi


Tuesday 10 January 2017

తియ్య గుమ్మడికాయ కూర


తియ్య గుమ్మడికాయ  కూర

కావలిసిన  పదార్థాలు
1.  తియ్యగుమ్మడికాయ  అర చెక్క
2. పచ్చిమిర్చి  5
3.  కరివేపాకు
4.   పసుపు
5. ఉప్పు  రుచికి  సరిపడా
6. బెల్లం  తగినంత
7. వరిపిండి  కొద్దిగా  
8. నీళ్లు  తగినన్ని

పోపు దినుసులు
సెనగ  పప్పు  1 స్పూన్  ,మినపప్పు  1 స్పూన్  ,ఆవాలు  అర స్పూన్  ,జీలకర్ర  అర  స్పూన్ ఎండుమిరపకాయలు  2, ఆయిల్  2. స్పూన్స్

తయారీ  విధానం
ముందుగా గుమ్మడి  కాయ  చెక్కను  శుభ్రంగా  కడిగి,
  లోపల  వున్న గుజ్జును  పైన  వున్న పెచ్చును  ,
తీసి వేసి  చిన్నముక్కలుగా తగినన్ని  నీళ్లు  పోసి ఉడికించుకుని
చల్లార్చుకోవాలి  .స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక
ఆయిల్  వేసి  పైన. చెప్పిన  పోపు  దినుసులను  వేసి ,
 అవి దోరగా  వేగాక  ,పచ్చిమిర్చి  చీలికలు , కరివేపాకు  వేసి ,
 అవి కూడా  దోరగా  వేగాక ,
ముందుగా  ఉడికించి  పెట్టుకున్న , గుమ్మడికాయ  ముక్కలు , పసుపు  ,
తగినంత  బెల్లం  ,తగినంత  ఉప్పు  ,వరి పిండిని  వేసి ,
 బాగా కలిపి  కూర  అంతా  దగ్గర  పడేంత  వరకు  ఉంచి
స్టవ్  ఆఫ్  చేసుకుంటే
తియ్య  గుమ్మడికాయ  కూర  రెడీ  అవుతుంది
ఈ కూరను  వేడి  అన్నం లో  నెయ్యి  వేసుకుని  తింటే  బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi

ములక్కాడ పిండి కూర



ములక్కాడ  పిండి  కూర

కావలిసిన  పదార్థాలు
1. ములక్కాడలు  3.
2. బియ్యం  ఒక  కప్పు
3. ఆవాలు   కొద్దిగా
4.   పచ్చిమిర్చి  4.
5. ఉప్పు  రుచికి  సరిపడా
6.   పసుపు  కొద్దిగా
7.   కరివేపాకు  
పోపు  దినుసులు
 మినపప్పు  1  స్పూన్  ,ఆవాలు  అర స్పూన్,  జీలకర్ర  అర  స్పూన్,
 ఎండుమిరపకాయలు 2, ఆయిల్  2. స్పూన్స్

తయారీ  విధానం
 ముందుగా   బియ్యాన్ని , ఆవాలను శుభ్రంగా కడిగి ,
 ఒక  గిన్నెలో   తగినన్ని  నీళ్లు  పోసి  ఓకే గంట  సేపు  నానబెట్టుకోవాలి .
 నానిన  వీటిని  పచ్చిమిర్చి , తగినంత  ఉప్పు  వేసి  ,
మెత్తగా  గ్రైండ్  చేసుకోవాలి.
 ములక్కాడలను   శుభ్రంగా  కడిగి,  ముక్కలుగా  తరిగి  ,
తగినన్ని  నీళ్లు  పోసి  ,ఉడికించికోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి పెట్టి  వేడెక్కాక  ,ఆయిల్  వేసి  ,
పైన  చెప్పిన  పోపు  దినుసులను  వేసి ,
దోరగా  వేగిన తరువాత  కరివేపాకు  వేసి,  వేగాకా  ,
ముందుగా  ఉడికించి  పెట్టుకున్న  ములక్కాడ  ముక్కలు  ,
గ్రైండ్ చేసి  పెట్టుకున్న పిండి  మిశ్రమము  వేసి  ,
బాగా  కలిపి   ఒక  గ్లాసు  నీళ్లు  పోసి  బాగా  ఉడకనివ్వాలి .
 మధ్య మధ్య లో  కలుపుతూ  ఉండాలి.
 స్టవ్  మంట  సిమ్  లో  ఉండేలా  చూసుకోవాలి  .
కూర  అంతా  బాగా  దగ్గర  పడేంత  వరకు  ఉంచి
స్టవ్  ఆఫ్  చేసుకోవాలి 
వేడి  అన్నం  లో నెయ్యి  వేసుకు  తింటే  రుచిగా  ఉంటుంది

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi

Thursday 5 January 2017

యజ్ఞోపవీత విశిష్టత


యజ్ఞోపవీత విశిష్టత

యజ్ఞోపవీతం అనేది వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ పరిచయమే. దీనినే జందెం అని, బ్రహ్మసూత్రం అని కూడా పిలుస్తారు.

ఈ యజ్ఞోపవీతాన్ని

“ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్|
ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ||”

అనే మంత్రాన్ని చదువుతూ ధరించాలి.

ఈ మంత్రం ప్రకారం పరమపవిత్రమైన యజ్ఞోపవీతం ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టినట్లు తెలుస్తోంది. యజ్ఞోపవీతం నవ తంతువుల (తొమ్మిది దారపుపోగుల) తో నిర్మించబడుతుంది. వీటిలో ఒక్కో తంతువుకీ ఒక్కో అధిష్ఠాన దేవత ఉంటారు.
వారు
1. ఓంకారం 2. అగ్నిదేవుడు 3. నాగదేవత 4. సోమదేవత 5. పితృదేవతలు 6. బ్రహ్మదేవుడు 7. వాయుదేవుడు 8. సూర్యుడు 9. మిగిలిన దేవతలందరూ ఉంటారు.

ఈ యజ్ఞోపవీతం అనేది కేవలం తంతువుల సముదాయం మాత్రమే కాదు. అది 15 తిథులకు, 7వారాలకు, 27 నక్షత్రాలకు, 25 తత్వాలకు, చతుర్వేదాలకు, త్రిగుణాలకు, త్రికాలాలకు, 12 మాసాలకు అనగా మొత్తం 96 విషయాలకు ప్రతీక. దీనివలన యజ్ఞోపవీతం ధరించిన వ్యక్తికి సకల తిథులలోను, వారాలలోను, నక్షత్రాలలోను, తత్వాలలోను, వేదాలలోను, గుణాలలోను, కాలాలలోను, మాసాలలోను పవిత్రత ఏర్పడి, ఇవన్నీ ఆ వ్యక్తికి శుభఫలాలను కలిగిస్తాయి. అందువలననే యజ్ఞోపవీతం 96 కొలతలతో ఉండాలని “వసిష్ఠ స్మృతి” తెలియజేస్తోంది.


అలాగే “చతుర్వేదేషు గాయత్రీ చతుర్వింశతికాక్షరీ  తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్” అనే ప్రమాణం ప్రకారం
 గాయత్రీ మంత్రంలో ఉండే అక్షరాల సంఖ్య 24 ను, వేదాల సంఖ్య 4 తో గుణిస్తే వచ్చే సంఖ్యతో అనగా 24 x 4 = 96 తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించి ధరించాలి.

యజ్ఞోపవీత పరిమాణం:

సాముద్రిక శాస్త్రప్రకారం యజ్ఞోపవీతం అది ధరించిన వ్యక్తి యొక్క నడుము వరకు వ్రేలాడుతుండాలి. అంతకంటే చిన్నగా ఉంటే ఆయుష్షు తగ్గిపోతుంది, పొడవు ఉంటే చేసిన జపం/తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది, మరీ సన్నగా
ఉంటే ధననష్టం.

పరమ పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడరాదు. దానికి ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం వలన సమస్త పాపాలు చుట్టుకుంటాయి.
మన శరీరంలోని ప్రాణనాడులను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో,
యజ్ఞోపవీతంలోని తంతువులను కూడా అంత జాగ్రత్తగానూ రక్షించుకోవాలి.

యజ్ఞోపవీతం జీర్ణమయిపోయినపుడు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి, జీర్ణమయిపోయిన యజ్ఞోపవీతాన్ని తొలగించాలి. అలాగే ఆప్తుల జనన, మరణాల వలన అశౌచం కలిగినప్పుడు, ఇతర అమంగళాలు కలిగినప్పుడు, గ్రహణముల తరువాత విధిగా యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి.

పాత యజ్ఞోపవీతాన్ని తొలగించేటప్పుడు:

“ఉపవీతం చిన్న తంతుం జీర్ణం కశ్మలదూషితం
విసృజామి యశో బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తుమే|
యజ్ఞోపవీతం హత జీర్ణవంతం వేదాంత వేద్యం
పరబ్రహ్మ రూపం జీర్ణోపవేతం విశృజస్తు తేజః||”

అనే మంత్రాన్ని చదవాలి. మంత్రం చదువుకండా యజ్ఞోపవీతం ధరించుట కాని, విసర్జించుట కాని పనికిరావు.

యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సు కోసం ,
ధరించిన వ్యక్తి దానికి తగిన ధర్మాలను ఆచరించాలి.

Tuesday 3 January 2017

వెజిటబుల్ ఫ్రైడ్ రైస్


వెజిటబుల్  ఫ్రైడ్  రైస్

కావలిసిన  పదార్థాలు
1. బియ్యం  3 గ్లాసులు లేక  ( బాసుమతి రైస్ )
2. బీన్స్
3. గ్రీన్ పీస్  అర కప్పు
4. కేరట్లు  4
5. అల్లం వెల్లుల్లి పేస్ట్  1 స్పూన్
6. పచ్చిమిర్చి  6.
7. కొత్తిమీర  కొద్దిగా
8. జీడిపప్పు  పలుకులు  10
9. ఉప్పు  రుచికి  సరిపడా
10. ఆయిల్  6 స్పూన్స్
11.  లవంగాలు  6.
12. మిరియాలు  6
13. దాల్చిన చెక్క  పొడి  కొద్దిగా

తయారీ  విధానం
ముందుగా  బియ్యమును  శుభ్రంగా  కడిగి ,  ఒక  గ్లాసుకి  రెండు  గ్లాసుల  చొప్పున,
 నీళ్లు  పోసి  కుక్కరులో  పెట్టి  ఉడికించుకుని ,
ఒక  వెడల్పయిన  బేసిన్ లో  వేసి  చల్లార్చుకోవాలి .
 బీన్స్  , కేరట్ , కొత్తిమీరలను  ,శుభ్రంగా  కడిగి  సన్నగా  తరుగుకోవాలి.
పచ్చిమిర్చిని  చీలికలుగా  తరుగుకోవాలి .
స్టవ్  వెలిగించి  , వెడల్పయిన బాణలి  పెట్టి , వేడెక్కాక  ఒక  స్పూన్  ఆయిల్ వేసి  ,
జీడిపప్పు  పలుకులను  వేసి , దోరగా  వేపుకుని , ఒక  ప్లేట్ లోకి  తీసుకోవాలి  .
అదే  బాణలిలో  ,ఆయిల్  వేసి, లవంగాలు , మిరియాలు , దాల్చిన  చెక్క  పొడి  వేసి ,
అవి దోరగా  వేగాక , అల్లం  వెల్లుల్లి పేస్ట్  వేసి  ,
అదికూడా  దోరగా  వేగాక
పచ్చిమిర్చి  చీలికలు,  కూర ముక్కలు   ,గ్రీన్ పీస్ , ఆయిల్  వేసి, బాగా  మగ్గనివ్వాలి .
ఇవ్వన్నీ  బాగా మగ్గిన  తరువాత , ముందుగా  ఉడికించి  చల్లారబెట్టుకున్న,
అన్నమును  కూడా  వేసి , బాగా  కలిపి, కొద్దీ  సేపు  వేగనిచ్చి,
ఉప్పు  వేసి  బాగా  కలిపి,   స్టవ్  ఆఫ్  చేసుకుని  ,
జీడిపప్పు పలుకులు  ,కొత్తిమీరతో  గార్నిష్  చేసుకుంటే
వెజిటబుల్ ఫ్రైడ్  రైస్  రెడీ  అవుతుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi