Monday, 14 November 2016

కార్తీక పౌర్ణమి


కార్తీక పౌర్ణమి

అన్ని మాసములలోకెల్ల ప్రధానమైనటువంటి మాసం,
 పుణ్య ప్రదాయకమైన మాసం కార్తీకమాసం.
ఈ మాసంలో ఎన్నో పర్వదినాలు వున్నాయి.
వాటన్నింటి లోకెల్లా  ప్రత్యేకమైనది కార్తీక పౌర్ణమి .

కార్తీక పూర్ణిమనాడు
స్నాన, దాన, దీపదాన, జ్వాలాతోరణోత్సవం, భక్తేశ్వరవ్రతంవల్ల ,
అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి.

కార్తీక పూర్ణిమనాడు  కార్తీక స్నానం ఆచరించి
శివకేశవులనుపూజించడంతో పాటూ ,

సాయంత్రం శివాలయాల్లో జరిగే
“జ్వాలాతోరణోత్సవం” నుదర్శించాలని శాస్త్రవచనం.

కార్తీక పూర్ణిమనాటి సాయంత్రం,
శివాలయాల్లోని ఆలయప్రాంగణంలో ప్రధాన ఆలయానికి
ఎదురుగా రెండు ఎతైన కర్రలను నాటి ,
మరో కర్రను ఆరెండింటిని కలుపుతూ అడ్డంగా
కట్టి ఆ కర్రను ఎండుగడ్డితో చుట్టి, ఆ గడ్డిని నిప్పుతోవెలిగిస్తారు.
ఇది మండుతూ తోరణంలాగా వుంటుంది.
దీనికి – “జ్వాలాతోరణం” అనే పేరు.

శివపార్వతులను పల్లకీలో వుంచి  ఈ జ్వాలాతోరణం క్రింద తిప్పుతారు.
ఈ ఉత్సవానికే’జ్వాలాతోరణోత్సవం’ అని పేరు.

కార్తీక పూర్ణిమనాడు శివాలయాల్లో జరిగే
ఉత్సవాన్నిదర్శించడం వల్ల జన్మ జన్మల పాపాలు
అంతరించి పుణ్యఫలాలు  లభిస్తాయి.

ఈ జ్వాలాతోరణోత్సవాన్ని దర్శించడంతో పాటూ ,
కార్తీక పూర్ణిమ నాడు “దీపదానోత్సవం”చేయవలెను.

కార్తీక పూర్ణిమనాడు ప్రదోష సమయంలో
శివాలయంలో గాని , వైష్ణవాలయంలోగాని దీపాలు వెలిగించాలి.

అలయ గోపురద్వారం వద్ద గాని, దేవుడి సన్నిదిలో గాని, ఆలయప్రాంగణంలో గాని
దీపాలను వెలిగించాలనీ,అలా వెలిగించిన వారి జన్మజన్మల పాపాలుహరింపబడి
ఇహంలో సౌఖ్యం , పరంలో మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రవచనం.

అలాగె, నదులలో  దీపాలను వదిలిపెట్టాలని , అలా చేయుటచే
పుణ్య ప్రాప్తి అని పెద్దలు అంటారు.

ఆవునెయ్యితో దీపాలువెలిగించడం ఉత్తమం.

అలా కుదర నప్పుడు నువ్వెలనూనెతో గాని, కొబ్బరి నూనెతో గాని,విప్పనూనెతో గాని
వెలిగించవచ్చు.
ఇవేవీ వీలుకాకుంటే ఆముదంతోనైనా దీపంవెలిగించవచ్చు.

ఈ రోజు ఉసిరికాయ పైన ఆవు నెయ్యితో తడిపిన వత్తులను వుంచిదీపమును వెలిగించడం అత్యంత శ్రేష్ఠం.
అరటి దొప్పలోగానీ, అకుమీద గానీ
దీపం వుంచి ,

నదులలో వదలడం కూడా పుణ్య ప్రదమే.


పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/