బాదుషా
కావలిసిన పదార్థాలు
1. మైదా పిండి 3 కప్పులు
2. కరిగించిన నెయ్యి 1 కప్పు
3. పెరుగు అర కప్పు
4. బేకింగ్ పౌడర్ కొద్దిగా
5. పంచదార 3 కప్పులు
6. నీళ్లు 3. కప్పులు
7. ఆయిల్ 200 గ్రాములు
8. డాల్డా 100 గ్రాములు
9. ఏలకుల పొడి కొద్దిగా.
తయారీ విధానం
ముందుగా ఒక బేసిన్ లోకి పైన చెప్పిన
మైదా పిండి ,పెరుగు ,కరిగించిన నెయ్యి,
వేసి ముద్దలా కలుపుకుని ,
ఈ పిండిని ఒక అరగంట సేపు నాననివ్వాలి .
ఒక గిన్నెలో 3 కప్పుల పంచదార, 3 కప్పుల నీళ్లు ,
పోసి గరిటతో బాగా కలిపి ఏలకులపొడిని వేసి ,
స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి .
తీగ పాకం వచ్చేంత వరకు ఉంచి ,
స్టవ్ ఆఫ్ చేసుకోవాలి .
నానిన పిండిని గుండ్రంగా చిన్న ఉండలుగా చేసి ,
ఈ ముద్దను రెండు అరచేతుల మధ్యలో పెట్టి అదిమి ,
దీనిని బొటనవేలు మధ్యవేలుతో గుంట పడేలా చిన్నగా నొక్కాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,
ఆయిల్ మరియు డాల్డా కలిపి ,
బాణలి లోవేసి స్టవ్ మంటను సిమ్ లో పెట్టి ,
తయారుచేసుకున్న బాదుషా లను
బంగారపు రంగులోకి వచ్చేంత వరకు వేపుకుని
ముందుగా తయారుచేసి పెట్టుకున్న , పంచదార పాకం లో వేసి ,
తీసుకుంటే
బాదుషా లు రెడీ అవుతాయి.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi