Monday 13 November 2017

దీపావళి రోజు పఠించాల్సిన లక్ష్మీ స్తోత్రం

దీపావళి రోజు పఠించాల్సిన లక్ష్మీ స్తోత్రం

నమశ్రియై లోకధాత్ర్వై బ్రహ్మామాత్రే నమోనమః
నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమోనమః !!

ప్రసన్న ముఖ పద్మాయై పద్మ కాంత్యై నమోనమః
నమో బిల్వ వన స్థాయై విష్ణు పత్న్యై నమోనమః

విచిత్ర క్షామ ధారిణ్యై పృథు శ్రోణ్యై నమోనమః
పక్వ బిల్వ ఫలాపీన తుంగస్తన్యై నమోనమః !!

సురక్త పద్మ పత్రాభ కరపాదతలే శుభే
సరత్నాంగదకేయూర కాంచీనూ పురశోభితే !!

యక్షకర్ధమ సంలిప్త సర్వాంగే కటకోజ్జ్వలే
మాంగళ్యా భరణైశ్చిత్రైః ముక్తాహారై ర్విభూషితే !!

తాటంకై రవతం సైశ్చ శోభమాన ముఖాంబుజే
పద్మ హస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే !!

ఋగ్యజుస్సామరూపాయై విద్యాయైతే నమోనమః
ప్రసీదాస్మాన్ కృపాదృష్టి పాతై రాలోక యాబ్దిజే
యేదృష్టాతే త్వయా బ్రహ్మరుద్రేంద్రత్వం సమాప్నుయుః

ఫలశ్రుతి
ఇతిస్తుతాతథాదేవైః విష్ణు వక్షస్స్థలాలయా
విష్ణునా సహసందృశ్య రమాప్రేతావదత్సురాన్
సురారీన్ సహసాహత్వా స్వపధాని గమిష్యథ
యే స్థానహీనాః స్వస్థానా ద్ర్భ్రం శితాయేనరాభువి
తేమామనే నస్తోత్రేణ స్తుత్వా స్థానమవాప్నుయుః !

Tuesday 7 November 2017

చతుర్దశ (14) భువనములు


చతుర్దశ (14) భువనములు

ఊర్థ్వ లోకములు:1.సత్యలోకము
                            2.తపోలోకము
                            3.జనలోకము
                            4.మహాలోకము
                            5.స్వర్గలోకము
                            6.భువర్ లోకము
                            7.భూలోకము

అథోలోకములు:    1.అతలము
                             2.వితలము
                            3.సుతలము
                            4.తలాతలము
                            5.రసాతలము
                            6.మహాతలము
                            7.పాతాళము

అష్టాదశ (18) ఉప పురాణములు


అష్టాదశ (18) ఉప పురాణములు

1.ఉశన పురాణము
2.కపిల పురాణము
3.కాళి పురాణము
4.సనత్కుమార పురాణము
5.శంభు పురాణము
6.సౌర పురాణము
7.దౌర్వాస పురాణము
8.నందీయ పురాణము
9.నారసింహ పురాణము
10.నారదీయ పురాణము
11.పారాశర పురాణము
12.అంగీరస సంహిత పురాణము
13.భృగు సంహిత పురాణము
14.మారీచ పురాణము
15.మానవ పురాణము
16.వాసిష్ఠ పురాణము
17.లింగ పురాణము
18.వారుణ పురాణము

అష్టాదశ(18) పురాణములు


అష్టాదశ(18) పురాణములు


శ్లో:మద్వయం,భద్వయం చైవ,
     బ్రత్రయం,వచతుష్టయం/
      అ,నా,ప,లిం,గ,కూ,స్కాని-
      పురాణాని పృథక్ పృథక్//

'మ'ద్వయం:1.మత్స్య పురాణం
                    2.మార్కండేయ పురాణం

'భ'ద్వయం: 1.భవిష్య పురాణం
                   2.భాగవతము

'బ్ర‌'త్రయం:  1.బ్రహ్మ పురాణం
                   2.బ్రహ్మాండ పురాణం
                   3.బ్రహ్మవైవర్త పురాణం

'వ'చతుష్టయం:1.వామన పురాణం
                        2.వాయు పురాణం/
                           శివ పురాణం
                        3. విష్ణు పురాణం
                        4.వరాహ పురాణం

'అ'                 :అగ్ని పురాణం
'నా'                :నారద పురాణం
'ప'                  :పద్మ పురాణం
'లిం'                :లింగపురాణం
'గ'                   :గరుడ పురాణం
'కూ'                 :కూర్మ పురాణం
'స్కా'                :స్కాంద పురాణం

మహాభారతం అష్టాదశ(18) అనుబంధం


మహాభారతం అష్టాదశ(18)
అనుబంధం

1.మహాభారతంలోని
   పర్వములు-18

2.కురుక్షేత్ర యుధ్ధం లో పాల్గొన్న
   అక్షౌహిణులు-18

   (పాండవులు 7 అక్షౌహిణులు,
     కౌరవులు   11 అక్షౌహిణులు)

3.కురుక్షేత్రం సంగ్రామం జరిగిన
    రోజులు -18

4. శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన
    భగవద్గీత అధ్యాయములు -18

5.కురుక్షేత్ర యుధ్ధంలో ప్రయోగించిన
   అస్త్రములు -18

1.గాండీవము 2.పాశుపతాస్త్రము
3.బ్రహ్మాస్త్రము 4.వైష్ణవాస్త్రము
5.ఇంద్రాస్త్రము 6.చక్రము 7.ఖడ్గము
8.నారాయణాస్త్రము 9.ఇంద్రాస్త్రము
10.వరుణాస్త్రము 11.ఆగ్నేయాస్త్రము
12.నాగాస్త్రము 13.గరుడాస్త్రము
14.వాయువ్యాస్త్రము 15.భార్గవాస్త్రము
16.మేఘాస్త్రము.  17కీర్తనీయాస్త్రము
18.బ్రహ్మశిరోనామకాస్త్రము

అక్షౌహిణి-వివరణ


అక్షౌహిణి-వివరణ

'అక్షౌహిణి'యను పదము చతురంగ బలముతో కూడిన సైన్యము లోని రథ‌,గజ,తురగ, పదాదుల సంఖ్యాపరిమితిని తెలుపుటకు
ఏర్పబడిన ఒక సంజ్ఞ
అక్షౌహిణి యనగా....
1.ఒకరథము,ఒకఏనుగు,మూడు గుఱ్ఱములు,ఐదు కాల్బలములు
ఒక 'పత్తి' (10)
2.మూడు 'పత్తులు' చేరినది ఒక 'సేనాముఖము' (30)
3.మూడు 'సేనాముఖములు' చేరినది ఒక‌
'గుల్మము' (90)
4.మూడు'గుల్మము'లు కలిసిన ఒక
'గణము' (270)
5.మూడు 'గణము'లు కలిపిన ఒక
'వాహిని' (810)
6.మూడు' వాహిను'ల సైన్యము ఒక
'పృథ' (2430)
7.మూడు'పృథ'నములు కలిసిన ఒక
'చమూ' (7290)
8.మూడు'చమూ'లు కలిసిన ఒక
'అనీకినీ'(21870)
9.పది'అనీకిను'లు చేరి ఒక 'అక్షౌహిణీ'
    (2,18,700)

ఒక 'అక్షౌహిణి'  సైన్యములో....

1.కాల్బలములు       1,09,350   (18)
2.గుఱ్ఱములు              65,610    (18)
3.ఏనుగులు               21,870     (18)
4రథములు                21,870      (18)
మొత్తము సంఖ్య.     2,18,700     (18)

Thursday 2 November 2017

బూడిద గుమ్మడి కాయ వడియాలు


బూడిద  గుమ్మడి  కాయ  వడియాలు

కావలిసిన  పదార్థాలు
1. బూడిద  గుమ్మడి  కాయ  చిన్నది 1
2. మినపప్పు   అరకేజీ
3. పచ్చిమిర్చి  100 గ్రాములు
4. అల్లం  50 గ్రాములు
5.   ఉప్పు  తగినంత
6. ఇంగువ తగినంత
7. పసుపు

తయారీ  విధానం
ముందుగా  బూడిద గుమ్మడి  కాయను  శుభ్రం  గా  కడిగి  ,
తుడిచి  తడి లేకుండా  ఆర బెట్టుకోవాలి  బాగా   ఆరి న  తరువాత  , పగలకొట్టి
బూడిద  గుమ్మడికాయ లోపల వున్న గుజ్జును  తీసివేసి ,
 సన్నని చిన్న  ముక్కలుగా  తరుగుకోవాలి .
ఇలా  తరుగుకున్న  ముక్కలను ,తగినంత  ఉప్పు , పసుపు వేసి,
 బాగా  కలిపి  కాటన్ బట్టలో  వేసి  మూట కట్టి  ,
పైన బరువు  పెట్టి ఒక  రాత్రి  అంతా  ఉంచాలి .
దీనివలన నీరుఅంతా  ఇవతలికి  వచ్చేస్తుంది  .
మినపప్పు  ను ఒక గిన్నెలోకి  తీసుకుని  ,
తగినన్ని  నీళ్లు  పోసి నానబెట్టుకోవాలి .
మరునా డు  పప్పును  శుభ్రంగా  కడిగి  ,గారెల పిండిలా  గట్టిగా  రుబ్బుకుని  ,
వెడల్పయిన బేసిన్ లోకి  తీసుకోవాలి .
అల్లం ,పచ్చిమిర్చిలను  శుభ్రంగా  కడిగి  ,
తుడిచి  మెత్తని ముద్దలాగా  గ్రైండ్  చేసుకోవాలి  .
రుబ్బుకున్న మినపపిండిలో  గుమ్మడి ముక్కలు , అల్లం పచ్చిమిర్చి ముద్ద,
 ఇంగువ   ,పసుపు  ముక్క లపైన ఉప్పు వేసి ,
మూట కడతాము  కాబట్టి  రుచి చూసుకుని  అవసరమైతేనే  ఉప్పు  వేసుకోవాలి  .
ఇవన్నీ  బాగా  కలిసేలా  కలుపుకోవాలి  .
ఇలా  కలుపుకున్న  పిండిని
ప్లాస్టిక్ పేపర్  మీద  వడియాల  మాదిరి పెట్టుకుని  ,
ఎండబెట్టుకోవాలి .
సాయంత్రం  అట్లకాడతో   తిరగేసుకుని  ,
వెడల్పయిన  ప్లేటులో  పెట్టి  బాగా  ఎండబెట్టుకుని
బాగా  ఎండిన తరువాత
గాలి  చొర బడని  డబ్బాలో  పెట్టుకుంటే  ఏడాది  పాటు నిలువ  ఉంటాయి.
ఆ తరువాత నూనె లో వేయించుకుంటే  గుమ్మడి వడియాలు రెడీ .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

విజ్ఞప్తి :
మొబైల్ లో చదివే వారు " విషయ సూచిక " కోసము అడుగున ఉన్న
  " వెబ్ వ్యూ " పైన క్లిక్ చేస్తే  మిగతా పోస్టింగ్స్ వివరాలు లభిస్తాయి.