Saturday, 5 November 2016

రవ్వ లడ్డు


రవ్వ లడ్డు

కావలిసిన పదార్థాలు
1. తెల్ల గోధుమ నూక ఒక గ్లాసు ( బొంబాయి రవ్వ )
2. పంచదార ఒక గ్లాసు
3. కొబ్బరి కోరు అరగ్లాసు
4. ఏలకుల పొడి కొద్దిగా
5. నెయ్యి 3 స్పూన్స్
6. జీడిపప్పు 10 పలుకులు
7. పాలు చిన్న కప్పు
8. కిస్మిస్

తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
 ఒక స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు పలుకులను దోరగా వేపుకుని
ఒక ప్లేటులోకి తీసుకోవాలి .
అదే బాణలిలో ఒక స్పూన్ నెయ్యి వేసి
తెల్ల  గోధుమ నూకను దోరగా వేపుకుని ,
ఒక బేసిన్ లోకి తీసుకోవాలి .
అదే బాణలి లో ఒక స్పూన్ నెయ్యి వేసి కొబ్బరి కోరును కూడా దోరగా వేపుకుని
 ముందుగా వేపుకుని పెట్టుకున్న నూక మీద వేసుకోవాలి .
పాలను కొద్ధిగా మరగనివ్వాలిముందుగా మనం వేపుకుని పెట్టుకున్న నూక ,
కొబ్బరి కోరుకి ,
పంచదార ను , ఏలకుల పొడిని , జీడిపప్పుని వేసి ,
బాగా కలిపి కొద్దికొద్దిగా పాలు పోసుకుంటూ వుండ అయ్యేలా చూసుకుని
గుండ్రంగా ఉండలు చేసుకుని పైన కిస్మిస్ అద్దితే ,

రవ్వలడ్డు రెడీ
ఇవి ఒక 10 రోజులపాటు నిలువ ఉంటాయి.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi