Friday, 11 November 2016

తెల్లగోధుమనూక ప్రసాదం


తెల్ల గోధుమ నూక  ప్రసాదం

కావలిసిన  పదార్థాలు
1. తెల్ల గోధుమ  నూక  1 గ్లాసు
2.  పంచదార  1 గ్లాసు
3.  నెయ్యి అర  గ్లాసు
4. పాలు  1 గ్లాసు
5. నీళ్లు  1 గ్లాసు
6. జీడిపప్పు  పలుకులు 8.
7. ఏలకులపొడి  కొద్దిగా
8. కిస్మిస్ 8

తయారీ విధానం
ముందుగా  స్టవ్  వెలిగించి బాణలి పెట్టి  వేడెక్కాక
తెల్లగోధుమ నూక ను ,వేసి  దోరగా  వేపుకుని, ఒక  ప్లేట్  లోకి  తీసుకోవాలి
జీడిపప్పు పలుకులను ,కిస్మిస్ లను  దోరగా  వేపుకుని ,
ఒక  ప్లేట్  లోకి  తీసుకోవాలి .
నూక  పైన  పంచదారను వేసుకుని బాగా కలపాలి .
దీని వలన  ప్రసాదం  వుండ లు  కట్టకుండా  ఉంటుంది
బాణలిలో   , పాలను  , నీళ్లను  పోసి,
 కొద్దిసేపు  మరగనిచ్చి  దీనిలో
 పంచదార కలిపిన  గోధుమ నూకను  వేసి  ,
ఉండలు  లేకుండా   బాగా కలిపి కొద్దిసేపు ,
ఉడకనిచ్చి
ఏలకుల పొడిని , నెయ్యిని  వేసి , కలిపి  కొద్దిసేపు మగ్గనివ్వాలి .
మధ్య  మధ్య లో  అట్లా కాడ తో  కలుపుతూ  ఉండాలి  .
అవసరమైతే నెయ్యిని వేసుకోవాలి .
మిశ్రమం  అంతా  దగ్గరపడి నెయ్యి పైకి తేలేవరకు  ఉంచి
పైన జీడిపప్పు , కిస్మిస్ లను , వేసుకుంటే ,
తెల్లగోధుమనూక   ప్రసాదం  రెడీ అవుతుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi