Friday 4 November 2016

జీలకర్ర బంగాళాదుంపకూర (జీరా ఆలు )


జీలకర్ర బంగాళాదుంపకూర ( జీరా ఆలు)

కావలిసిన పదార్థాలు
1. బంగాళాదుంపలు పావుకేజీ
2.  ధనియాల పొడి అర  స్పూన్
3. పసుపు కొద్దిగా
4. ఉప్పు రుచికి సరిపడా
5. ఆయిల్ 3 స్పూన్స్
6. జీలకర్ర 2 స్పూన్
7. కొత్తిమీర
8.  కారం   అర  స్పూన్
9  పచ్చిమిర్చి   3

తయారీ విధానం
ముందుగా బంగాళాదుంపలను  శుభ్రంగా  కడిగి  ,
పైన వున్న  తొక్కను తీసి ,
మరల కడిగిసమానమైన ముక్కలుగా  తరిగి
 ఉడికించుకుని  చల్లార్చుకోవాలి .
పచ్చిమిర్చిని చిన్న  ముక్కలుగా తరుగుకోవాలి
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ఆయిల్ వేసి  ,
జీలకర్ర ను వేసి దోరగా వేపుకుని ,
పచ్చిమిర్చి ముక్కలను  కూడా  వేసి అవి కూడా  వేగాక
ముందుగా   ఉడికించి పెట్టుకున్న
బంగాళాదుంప ముక్కలను వేసి ,
దోరగా వేగేలా   చూసుకుని
 ,కొద్దిగా పసుపును , సరిపడినంత ఉప్పును ,
ధనియాల పొడిని   , కొద్దిగా కారమును వేసి బాగా కలిపి
కొద్దిసేపు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని పైన
కొత్తిమీర తో  గార్నిష్  చేసుకుంటే

జీలకర్ర  బంగాళాదుంప కూర  ( జీరా ఆలు ) రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi