ఉప్పుడు పిండి
కావలిసిన పదార్థాలు
1. వరి నూక 3 గ్లాసులు
2. పెసరపప్పు 4 స్పూన్స్
3. కొబ్బరి కోరు ఒక కప్పు
4. కరివేపాకు
5. పచ్చిమిర్చి 4
6. అల్లం చిన్న ముక్క
7. ఉప్పు
పోపు దినుసులు
పల్లీలు 2 స్పూన్స్ , సెనగపప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్ ,
ఆవాలు అర స్పూన్ ,జీలకర్ర అర స్పూన్ ,ఎండుమిరపకాయలు 3 ,
ఆయిల్ 5 స్పూన్స్ ,
తయారీ విధానము
పచ్చిమిర్చిని చీలికలుగా ను , అల్లముం సన్నని చిన్న ముక్కలుగాను ,
తరుగుకోవాలి .ఉప్పుడు పిండి ని ఇత్తడి గిన్నెలో చేస్తే చాలా బాగా వస్తుంది .
ఇత్తడిగిన్నె లేనివారు వెడల్పయిన బాణలి లో చేసుకోవచ్చు .
వరి నూక కిరాణా షాపులలో దొరుకుతుంది ,
లేకపోతే మనం ఇంట్లో బియ్యాన్ని సన్నగా గ్రైండ్ చేసుకుని ,
జల్లించుకుంటే వరినూక వస్తుంది .
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి గాని ఇత్తడిగిన్నె గాని పెట్టి ,
వేడెక్కాక ఆయిల్ వేసి , పైన చెప్పిన పోపు దినుసులను వేసి ,
అవి దోరగా వేగాక , పెసరపప్పు , తరిగిపెట్టుకున్న పచ్చిమిర్చి ,
అల్లం ముక్కలు ,కరివేపాకు , కొబ్బరికోరులని వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి.
మగ్గిన తరువాత నీళ్లు పోసుకోవాలి .
నీళ్ల కొలత ఒకగ్లాసు నూకకి 2 గ్లాసులు నీళ్లు పడతాయి
సరిపడినంత ఉప్పును వేసి , నీళ్లు మరిగిన తరువాత
వరినూకను వేసి ఉడకనివ్వాలి ,మద్య మధ్యలో అట్లకాడతో కలుపుతూ ఉండాలి
అవసరమైతే నీళ్లు చిలకరిస్తూ ఉండాలి .అట్లకాడతో బాగా కలుపుతూ ఉండాలి .
బాగా మగ్గిన తరువాత ,
స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు ఉమ్మగిల్లనిస్తే
ఉప్పుడు పిండి రెడీ.
దీనిని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi