Monday 27 April 2020

సూర్య మండల స్తోత్రం,

 సూర్య మండల స్తోత్రం,

సమస్త పాపాల్ని హరించి..పుణ్యఫలం పెంచే స్తోత్రం

నమోస్తు సూర్యాయ సహస్రరశ్మయే
సహస్రశాఖాన్విత సంభవాత్మనే |
సహస్రయోగోద్భవ భావభాగినే
సహస్రసంఖ్యాయుధధారిణే నమః || 1 ||

యన్మండలం దీప్తికరం విశాలం |
రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |
దారిద్ర్య దుఃఖక్షయకారణం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 2 ||

యన్మండలం దేవగణైః సుపూజితం |
విప్రైస్తుతం భావనముక్తికోవిదమ్ |
తం దేవదేవం ప్రణమామి సూర్యం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 3 ||

యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం |
త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |
సమస్త తేజోమయ దివ్యరూపం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 4 ||

యన్మండలం గూఢమతి ప్రబోధం |
ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ |
యత్సర్వ పాపక్షయకారణం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 5 ||

యన్మండలం వ్యాధివినాశదక్షం |
యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |
ప్రకాశితం యేన చ భూర్భువః స్వః |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 6 ||

యన్మండలం వేదవిదో వదంతి |
గాయంతి యచ్చారణసిద్ధసంఘాః |
యద్యోగినో యోగజుషాం చ సంఘాః |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 7 ||

యన్మండలం సర్వజనైశ్చ పూజితం |
జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే |
యత్కాల కాలాద్యమరాది రూపం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 8 ||

యన్మండలం విష్ణుచతుర్ముఖాఖ్యం |
యదక్షరం పాపహరం జనానామ్ |
యత్కాలకల్పక్షయకారణం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 9 ||

యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం |
ఉత్పత్తి రక్ష ప్రలయ ప్రగల్భమ్ |
యస్మిన్ జగత్సంహరతే ఖిలం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 10 ||

యన్మండలం సర్వగతస్య విష్ణోః |
ఆత్మా పరం ధామ విశుద్ధతత్త్వమ్ |
సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 11 ||

యన్మండలం వేదవిదోపగీతం |
యద్యోగినాం యోగ పథానుగమ్యమ్ |
తత్సర్వ వేద్యం ప్రణమామి సూర్యం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || 12 ||

సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః |
సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే ||

ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ కృష్ణార్జున సంవాదే సూర్యమండల స్తోత్రం..సంపూర్ణం.. ||

Thursday 23 April 2020

భజగోవిందం - తాత్పర్య సహితం


భజగోవిందం - తాత్పర్య సహితం

ఓం స్థాపకయ చ ధర్మస్య సర్వ ధర్మ స్వరూపిణే |
అవతర వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ: ||

1) భజగోవిందం భజగోవిందం
గోవిందం భజమూఢమతే |
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృఞ్కరణే ||
తాత్పర్యం: గోవిందుని భజించు, గోవిందుని భజించు, గోవిందుని భజించు.
ఓ మూర్ఖా! మరణమాసన్నమైనప్పుడు నిను ఏ డుకృణ్ వ్యాకరణమూ రక్షించదు.

2) మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం |
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం ||
తాత్పర్యం: ఓ మూర్ఖుడా! ధనమును ఆర్జింపవలెనను పేరాశను విడువుము. తృష్ణారాహిత్యమను సద్బుద్ధిని అలవరుచుకొనుము. నీవు చేసిన కృషి వలన నీకు న్యాయముగా ఏది లభించునో దానితో నీ మనస్సును తృప్తి పరుచుకొనుము.

3) నారీస్తనభర నాభీదేశం
దృష్ట్వా మాగామోహావేశం |
ఏతన్మాంసవసాది వికారం
మనసి విచింతయ వారం వారం ||
తాత్పర్యం: స్త్రీల యొక్క వక్షోజములు, నడుము భాగాన్ని చూచి మోహావేశమును పొందకుము. అది అంతయు మాంసము, క్రొవ్వు మొదలగు పదార్థముల వికారమేనని మనస్సునందు మాటిమాటికి బాగుగా తలపోయుము.

4) నలినీదళగత జలమతి తరళం
తద్వజ్జీవితమతిశయచపలం |
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం
లోకం శోకహతం చ సమస్తం ||
తాత్పర్యం: తామరాకుపైనున్న నీటి బిందువు మాదిరి, జీవితమెంతో చంచలమైనది. జనులందరును రోగములతో బాధపడుతు, దేహాభిమానమును విడువక దుఃఖములో చిక్కుకొని యుందురు. మనుష్యునకు సుఖమే లేదని తెలుసుకొనుము.

5) యావద్విత్తోపార్జన సక్తః
తావన్నిజ పరివారో రక్తః |
పశ్చాజ్జీవతి జర్జర దేహే
వార్తాం కోపి న పృచ్ఛతి గేహే ||
తాత్పర్యం: ధనమును సంపాదించుచున్నంత వరకే నీ బంధు మిత్ర పరివార జనము నీ యందు అనురాగము, ఆసక్తి చూపుదురు. ముసలితనమున నీ దేహము శిథిలమై శక్తిహీనమైనప్పుడు నీ ఇంట నిన్ను పలుకరించు వారు ఎవ్వరూ ఉండరు.

6) యావత్పవనో నివసతి దేహే
తావత్పృచ్ఛతి కుశలం గేహే |
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్కాయే ||
తాత్పర్యం: శరీరములో ఊపిరి ఉన్నంతవరకు ఇంటిలోనివారు కుశలమును విచారింతురు. ఆ ఊపిరి ఆగిపోయి, మరణము సంభవించినపుడు నీ మృతదేహము చూసి సమీపించుటకు నీ భార్య కూడా భయపడును.

7) బాలస్తావత్క్రీడాసక్తః
తరుణస్తావత్తరుణీసక్తః|
వృద్ధస్తావచ్చింతాసక్తః
పరే బ్రహ్మణి కోపిన సక్తః||
తాత్పర్యం: బాల్యమంతయు ఆటపాటలయందు ఆసక్తి చేతను, యవ్వనమంతయు స్త్రీ వ్యామోహము చేతను, వార్థక్యమును సంసార చింతల చేతను జీవితమంతా గడుపుదురే కాని, పరబ్రహ్మమునందు ఆసక్తి కలవారెవ్వరును లేరు.

8) కా తే కాంతా కస్తే పుత్రః
సంసారో యమతీవ విచిత్రః |
కస్య త్వం కః కుత ఆయాతః
తత్త్వం చింతయ తదిహ భ్రాతః ||
తాత్పర్యం: ఓ సోదరా! నీ భార్య ఎవరు? ఎవడు నీ పుత్రుడు? వారికిని, నీకును గల సంబంధమేమి? నీవు ఎవరవు? ఎక్కడనుండి వచ్చితివి? ఈ సంసారమే అతి విచిత్రమైనది. ఈ తత్వమును బాగా ఆలోచించి తెలుసుకొనుము.

9) సత్సంగత్వే నిః సఙ్గత్వం
నిఃసఙ్గత్వే నిర్మోహత్వం |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః ||
తాత్పర్యం: జ్ఞానులైన సజ్జనులు సాంగత్యము వలన సంసార బంధములు విడిపోవును. బంధములు విడిపోయిన అజ్ఞానమూలకమైన మోహము పోవును. మోహము నశించినచో నిశ్చలమగు పరిశుద్ధ తత్వము గోచరమగును. అది తెలిసినపుడు జీవన్ముక్తి కలుగును.

10) వయసి గతే కః కామవికారః
శుష్కే నీరే కః కాసారః |
క్షీణే విత్తే కః పరివారో
జ్ఞాతే తత్త్వే కః సంసారః ||
తాత్పర్యం: వయసు మళ్ళిన వానికి కామ వికార మెక్కడిది? నీరు ఎండిపోయిన యెడల అది చెరువు ఎలా అవుతుంది? అట్లే, ధనము లేనప్పుడు పరివార మెట్లుండును? తత్వము అనుభూతమైన తర్వాత సంసార బంధము ఏముండును?

11) మా కురు ధన జన యౌవన గర్వం
హరతి నిమేషాత్కాలః సర్వం |
మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ||
తాత్పర్యం: ధనము, పరివారము, యోవ్వనము కలవని గర్వముతో ఉండకుము. క్షణములో వీటినన్నిటిని కాలము హరించును. ఇదంతయు మాయామయమని, మిథ్యయని, అశాశ్వతమని గ్రహించి జ్ఞానివై పరబ్రహ్మమును పొందుము.

12) దినయామిన్యౌ సాయం ప్రాతః
శిశిరవసంతౌ పునరాయాతః |
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః
తదపి న ముంచత్యాశావాయుః ||
తాత్పర్యం: రాత్రింబవళ్ళు, ఉదయ సాయంకాలములు, శిశిర వసంతాది ఋతువులు ఒకదాని వెంబడి ఒకటి వచ్చుచు పోవుచుండును. ఈ విధముగా కాలము క్రీడించుచున్నది, ఆయువు క్షీణించుచున్నది. అయిననూ ఆశాపిశాచము మాత్రము నిన్ను వదలకయే ఉన్నది.

13) కాతే కాంతా ధనగతచిన్తా
వాతుల కిం తవ నాస్తి నియంతా |
త్రిజగతి సజ్జనసంగతిరేకా
భవతి భవార్ణవతరణే నౌకా ||
తాత్పర్యం: ఓయీ! నీ భార్య ఎవరు? నీకు ఎల్లప్పుడును ధనమును గూర్చిన చింతయేనా? వేరొక చింతలేదా? నిన్ను సన్మార్గమున నడిపింప చేయగలవారెవ్వరు లేకపోయారా? నీవు ముల్లోకములు వెదకినను సంసార సాగరమును దాటించుటకు సజ్జన సాంగత్యము తప్ప వేరొక నౌక లేదని తెలుసుకొనుము.

14) జటిలో ముండీ లుంఛితకేశః
కాషాయాంబరబహుకృతవేషః |
పశ్యన్నపి చన పశ్యతి మూఢో
ఉదరనిమిత్తం బహుకృతవేషః ||
తాత్పర్యం: జుట్టును జడలుగా కట్టించుకొనుట, తలను నున్నగా గొరిగించుకొనుట, కాషాయవస్త్రములు ధరించుట, ఇట్లు ఉ

దరపోషణ నిమిత్తము పెక్కు వేషములను వేయుచున్నారే కాని లోక పరిస్థితులన్నియు చూచుచున్ననూ జ్ఞానోదయమునకై ఎంత మాత్రము ప్రయత్నించరు.

15) అంగం గలితం పలితం ముండం
దశనవిహీనం జాతం తుండం |
వృద్ధో యాతి గృహిత్వా దండం
తదపి న ముంచత్యాశాపిండం ||
తాత్పర్యం: శరీరము కృంగి, కృశించి, చిక్కి, మడతలు పడినను, తల పూర్తిగా నెరసిపోయినను, పండ్లు ఊడిపోయి నోరు బోసి ఆయినను, ముసలితనము వచ్చి కర్రను పట్టుకుని కాని నడవలేక పోయినను ఆశ మాత్రము అతనిని వదలదు.

16) అగ్రే వహ్నిః పృష్ఠే భానూ
రాత్రౌ చుబుకసమర్పితజానుః |
కరతలభిక్షస్తరుతలవాసః
తదపి న ముంచత్యాశాపాశః ||
తాత్పర్యం: తనవారితో గల సంబంధముల నన్నిటిని విడిచి, చెట్ల నీడలలో నివసించుచు, రాత్రులందు చలికి ముడుచుకుని, మోకాళ్ళపై గడ్డమును ఉంచుకుని పండుకొనుచు, పగలు సూర్యుని ఎండను ఆశ్రయించుచు, చేతిలో పడవేసిన భిక్షాన్నమును తినుచూ గడుపుచున్నను ఆశ మాత్రము వదిలి పెట్టదు.

17) కురుతే గంగాసాగరగమనం
వ్రతపరిపాలనమథవా దానం |
జ్ఞానవిహీనః సర్వమతేన
ముక్తిం న భజతి జన్మశతేన ||
తాత్పర్యం: గంగాసాగర సంగమము మున్నగు చోట్ల స్నానములు చేసినను, నోములు, వ్రతములు చేసినను, దాన ధర్మముల నెన్ని చేసినను సరే అతడు జ్ఞానము పొందలేకపోయినచో, నూరు జన్మములు ఎత్తినను ముక్తిని పొందడు.

18) సుర మందిర తరు మూల నివాసః
శయ్యా భూతల మజినం వాసః |
సర్వ పరిగ్రహ భోగ త్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః ||
తాత్పర్యం: దేవాలయముల వద్దనుండు చెట్ల కింద నివసించుచు, నేలపై పవళించుచు, జింకతోలు మున్నగు చర్మములే వస్త్రములుగా కలిగి యుండి, భోగముల నన్నిటిని త్యజించిన వానికి అట్టి వైరాగ్యము వలన సుఖము ఎందుకు కలగదు?

19) యోగరతో వా భోగరతోవా
సఙ్గరతో వా సఙ్గవిహీనః |
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ ||
తాత్పర్యం: యోగమునందు ఆసక్తి కలవాడైనను, భోగమునందు ఆసక్తి కలవాడైనను, ఏకాంతముగా నుండువాడైనను, బంధుమిత్రులతో కలిసి ఉన్నవాడైనాను, తన మనస్సును పరబ్రహ్మమునందు ఏకాగ్రతతో లగ్నము చేసి వినోదించువాడు ఎల్లప్పుడునూ ఆనందమును అనుభవించుచున్నాడు.

20) భగవద్గీతా కించిదధీతా
గంగా జలలవ కణికాపీతా |
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన న చర్చా ||
తాత్పర్యం: భగవద్గీతను కొంచెము అధ్యయనము చేసినను, గంగానదీ జలములోని ఒక బిందువునైనా పానము చేసినను, ఒక్కసారి అయినను మనసా కర్మణా భగవంతుని పూజించినను చాలు! అట్టివానికి యమునివలన ఎంతమాత్రము భయము లేదు.

21) పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం |
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయాపారే పాహి మురారే ||
తాత్పర్యం: మరల మరల జన్మించుచు, మరల మరల మరణించుచు, తిరిగి తల్లి గర్భమున శయనించుచు, ఈ సంసారమును దాటజాలక నానాబాధలకు గురౌతున్న నన్ను ఓ మురారీ! కృపతో సంసారము నుండి తరింపజేయుము.

22) రథ్యా చర్పట విరచిత కంథః
పుణ్యాపుణ్య వివర్జిత పంథః |
యోగీ యోగనియోజిత చిత్తో
రమతే బాలోన్మత్తవదేవ ||
తాత్పర్యం: వీధులలో దొరికిన గుడ్డముక్కల బొంతను ధరించి పుణ్యపాపముల భేదములను వర్జించినవాడై యోగి తన చిత్తమును బ్రహ్మమునందు లగ్నము చేసి పసి బాలుని వలెను, ఉన్మత్తుని వలెను ఆనందముతో సంచరించును.

23) కస్త్వం కోఅహం కుత ఆయాతః
కా మే జననీ కో మే తాతః |
ఇతి పరిభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా స్వప్న విచారం ||
తాత్పర్యం: సర్వవ్యాపకుడైన భగవంతుడు నీయందును, నాయందును కూడా ఉన్నాడు, అతడొక్కడే. సహనము కోల్పోయి, నిష్కారణముగా నాపై కోపముతో ఉన్నావు. నీవు శ్రీఘ్రముగా విష్ణువులో ఐక్యమును సాధింపగోరుదువేని, భేదబుద్ధిని వీడి, అంతటను సమచిత్తుడవై ఉండి గోవిందునే సేవింపుము.

24) త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః
వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః |
భవ సమచిత్తః సర్వత్ర త్వం
వాంఛస్య చిరాద్యది విష్ణుత్వమ్ ||
తాత్పర్యం: నాలోను, నీలోను, మనందరిలోను, ఈ చరాచర జీవకోటిలో ఉన్నవాడు ఆ విష్ణువే. అజ్ఞానముతో అన్నియు మరిచి అందరినీ దూషింతువు ఏల? సమ భావమును, సహనము పెంచుము, స్వార్ధము త్రెంచుము, సమతను పెంచుము, మానవ సేవే మాధవ సేవగా దైవత్వముతో దయతో మెలుగుము.

25) శత్రౌ మిత్రే పుత్రే బంధౌ
మా కురు యత్నం విగ్రహసంధౌ |
సర్వస్మిన్నపి పశ్యా త్మానం
సర్వత్రో త్సృజ భేద జ్ఞానమ్ ||
తాత్పర్యం: శత్రువునైనా, మిత్రుడనైనా, పుత్రుడనైనా, బంధువునైనా కలహము చేయక, కూర్మిని చూపి శత్రు భావమును సంహరించుము. ఇతరుల పైన కోపము చేసిన నిన్ను నీవె కోపించిన తీరు నీలో, అందరిలొ శ్రీహరి నుండ ఇతరుల నేల దూషణ చేతువు?

26) కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వా ఆత్మానం భావయ కో అహం |
ఆత్మజ్ఞాన విహీనా మూఢాః
తే పచ్యంతే నరకనిగూఢాః ||
తాత్పర్యం: కామ క్రోధ లోభ మొహములను వదలి, నేను ఎవరిని అనే ఆత్మ విచారము చేయుము. ఆత్మజ్ఞాన విహీనులైన మూఢులు ఈ అరిషడ్వర్గమును వదలక వాటినంటి పెట్టుకొని సంసార నరకములో పడి మ్రగ్గుచుందురు.

27) గేయం గీతా నామ సహస్రం
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం |
నేయం సజ్జన సంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తం ||
తాత్పర్యం: భగవత్ గీతను, విష్ణు సహస్రనామములను సంకీర్తన చేయుచుండ వలయును, ఎల్లప్పుడూ శ్రీపతి రూపముపై మనసు ని

లిపి ద్యానింప వలెను. ఎల్లప్పుడునూ సజ్జనులతో సహవాసము చేయవలెను. బీదలకు ధనము పంచి పెట్టవలెను.

28) సుఖతః క్రియతే రామాభోగః
పశ్చాద్దంత శరీరే రోగః |
యద్యపి లోకే మరణం శరణం
తదపి న ముంచతి పాపాచరణం ||
తాత్పర్యం: ఇంద్రియ సుఖములు ఎన్నడూ తీరవు, కామ వాంఛలే కాల సర్పములై దేహమునకు రోగము మిగుల్చును. మనిషికి చివరకు మరణము తథ్యము, కాని అతని పాపములు అతనిని వదలవు.

29) అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తితతః సుఖలేశః సత్యం |
పుత్రాదపి ధన భాజాం భీతిః
సర్వత్రైషా విహితా రీతిః ||
తాత్పర్యం: ధనమెల్లప్పుడును అనర్ధమునే కలిగించునని గ్రహించుము, ధనము వలన సుఖము కొంచెమైనను కలుగదు, ఇది సత్యము. ధనవంతులు పుత్రునివలన కూడా భయపడుదురు. ప్రపంచమంతా ఇదే రీతిగా ఉన్నది.

30) ప్రాణాయామం ప్రత్యాహారం
నిత్యానిత్య వివేకవిచారం |
జాప్యసమేత సమాధివిధాన
కుర్వవధానం మహదవధానం ||
తాత్పర్యం: సద్గురువులను ఆశ్రయించుము, వారి కరుణతో విబుధుడవగుము. ఇంద్రియములపై నిగ్రహమును ఉంచి మనసును గురు చరణములపై ఉంచి, భవ బంధములు త్యాగము చేసి ఆ హరిని గాంచు.

31) గురుచరణాంబుజ నిర్భర భక్తః
సంసారాదచిరాద్భవ ముక్తః |
సేంద్రియమానస నియమాదేవం
ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం ||
తాత్పర్యం: అష్టసాధనలు అవలంబించు, అంతర్ముఖముగ మనసును నిలుపు, ఏకాగ్రతను సంపాదించు. అటువంటి శాంతమునొందిన సమాధి స్థితిలో ఆనందము నీ సొంతము అగును.

ఇతి శ్రీమద్ఛంకరభగవత: కృతౌ
భజ గోవిందం సంపూర్ణం ||

భజగోవిందం భజగోవిందం | గోవిందం భజమూఢమతే ||

దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి -


దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి -
శ్రీ దత్త నామ కవచం - ఫలితాలు

దత్తపరమైన జ్ఞానం చెప్పుకోవడం, వినడం అనే క్రియవల్ల అన్ని అమంగళములు నశించి పోతాయి అంటూ దత్తుడి మహిమ చెప్పుకోవడం వల్ల వచ్చే ఫలితం చెప్తూ వేదధర్ముడు దీపకునికి ఒక 108 అద్భుత దత్తనామములు చెప్తాడు. ఆ దత్తనామాలు నిత్యానుష్టానం చేసేవాడిని కవచంలా స్వామి కాపాడతాడు.

దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి
ఓం శ్రీ దత్తాయ నమః
ఓం దేవదత్తాయ నమః
ఓం బ్రహ్మదత్తాయ నమః
ఓం శివదత్తాయ నమః
ఓం విష్ణుదత్తాయ నమః
ఓం అత్రిదత్తాయ నమః
ఓం ఆత్రేయాయ నమః
ఓం అత్రివరదాయ నమః
ఓం అనసూయాయ నమః
ఓం అనసూయాసూనవే నమః 10
ఓం అవధూతాయ నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధర్మపరాయణాయ నమః
ఓం ధర్మపతయే నమః
ఓం సిద్ధాయ నమః
ఓం సిద్ధిదాయ నమః
ఓం సిద్ధిపతయే నమః
ఓం సిధ్ధసేవితాయ నమః
ఓం గురవే నమః
ఓం గురుగమ్యాయ నమః 20
ఓం గురోర్గురుతరాయ నమః
ఓం గరిష్ఠాయ నమః
ఓం వరిష్ఠాయ నమః
ఓం మహిష్ఠాయ నమః
ఓం మహాత్మనే నమః
ఓం యోగాయ నమః
ఓం యోగగమ్యాయ నమః
ఓం యోగాదేశకరాయ నమః
ఓం యోగపతయే నమః
ఓం యోగీశాయ నమః 30
ఓం యోగాధీశాయ నమః
ఓం యోగపరాయణాయ నమః
ఓం యోగిధ్యేయాంఘ్రి పంకజాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం దివ్యాంబరాయ నమః
ఓం పీతాంబరాయ నమః
ఓం శ్వేతాంబరాయ నమః
ఓం చిత్రాంబరాయ నమః
ఓం బాలాయ నమః
ఓం బాలవీర్యాయ నమః 40
ఓం కుమారాయ నమః
ఓం కిశోరాయ నమః
ఓం కందర్ప మోహనాయ నమః
ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః
ఓం సురాగాయ నమః
ఓం వీరాగాయ నమః
ఓం వీతరాగాయ నమః
ఓం అమృతవర్షిణే నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం అనుగ్రహరూపాయ నమః 50
ఓం స్ధవిరాయ నమః
ఓం స్ధవీయసే నమః
ఓం శాంతాయ నమః
ఓం అఘోరాయ నమః
ఓం మూఢాయ నమః
ఓం ఊర్ధ్వరేతసే నమః
ఓం ఏకవక్త్రాయ నమః
ఓం అనేకవక్త్రాయ నమః
ఓం ద్వినేత్రాయ నమః
ఓం త్రినేత్రాయ నమః 60
ఓం ద్విభుజాయ నమః
ఓం షడ్భుజాయ నమః
ఓం అక్షమాలినే నమః
ఓం కమండలధారిణే నమః
ఓం శూలినే నమః
ఓం శంఖినే నమః
ఓం గదినే నమః
ఓం ఢమరుధారిణే నమః
ఓం మునయే నమః
ఓం మౌనినే నమః 70
ఓం శ్రీ విరూపాయ నమః
ఓం సర్వరూపాయ నమః
ఓం సహస్రశిరసే నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రబాహవే నమః
ఓం సహస్రాయుధాయ నమః
ఓం సహస్రపాదాయ నమః
ఓం సహస్రపద్మార్చితాయ నమః
ఓం పద్మహస్తాయ నమః
ఓం పద్మపాదాయ నమః 80
ఓం పద్మనాభాయ నమః
ఓం పద్మమాలినే నమః
ఓం పద్మగర్భారుణాక్షాయ నమః
ఓం పద్మకింజల్కవర్చసే నమః
ఓం జ్ఞానినే నమః
ఓం జ్ఞానగమ్యాయ నమః
ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః
ఓం ధ్యానినే నమః
ఓం ధ్యాననిష్ఠాయ నమః
ఓం ధ్యానస్ధిమితమూర్తయే నమః 90
ఓం ధూళిదూసరితాంగాయ నమః
ఓం చందనలిప్తమూర్తయే నమః
ఓం భస్మోద్ధూళితదేహాయ నమః
ఓం దివ్యగంధానులేపినే నమః
ఓం ప్రసన్నాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ప్రకృష్టార్ధ ప్రదాయ నమః
ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వరీయసే నమః 100
ఓం బ్రహ్మణే నమః
ఓం బ్రహ్మరూపాయ నమః
ఓం విశ్వరూపిణే నమః
ఓం శంకరాయ నమః
ఓం ఆత్మనే నమః
ఓం అంతరాత్మనే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం శ్రీ దత్తాత్రేయాయ పరబ్రహ్మణే
నమో నమః 108

ఓం శ్రీ దత్తాయనమః ఓం దేవదత్తాయనమః తో ప్రారంభమయ్యే ఈ దివ్య నామములు దివ్యదృష్టితో దత్తాత్రేయ స్వామి ని దర్శించి వేద ధర్ముడు దీపాకునికి చెప్పాడు. తరువాత ఈ నామములను కవచముగా ఎలా చేసుకొనవలెనో వివరించాడు. ఈ కవచమును ఉదయము, సాయంత్రం శ్రద్ధగా చదివిన పాపములనుంచి విముక్తి కలుగును అని శిష్యునకు కూడా చెప్పెను.

శ్రీ దత్త నామ కవచం

1. ఓం కారాది నమోంతానం! నామ్నామష్టోత్తరం శతమ్!
శ్రద్ధయా యః పఠేన్నిత్యం! త్రిసంధ్యం నియతః సుధీః॥

భావము:: వేదధర్ముడు ఇలా చెప్పారు - ఓం కారంతో మొదలు పెట్టి నమః శబ్దమును చివర చేర్చి నూట ఎనిమిది నామములను విద్వాంసుడు ఏకాగ్రతతో మూడు సంధ్యా కాలములలో శ్రద్ధగా చదవాలి.

2. సర్వపాప విముక్తాత్మా! జాయతే విమలాంతరః !
భుక్త్యా యథేప్సితాన్భోగాన్! ప్రేత్య
బ్రహ్మణి లీయతే ॥

భావము:: ఈ నామములు పఠించిన చో పాపచింతనలనుండి విడివడి స్వచ్ఛమైన మనస్సు కలవాడై. కోరిన కోర్కెలు తీరి సమస్త సుఖములను అనుభవించును . పరలోకమున శ్రీ దత్తునియందు ఐక్యము చెందును.

3. భక్తరక్షాక్షణో దేవః!స్మృతః సేవా స్వవేశ్మని!
స్వభోజ్యస్యార్పణం దానం! ఫలమింద్రాది దుర్లభమ్ ॥

భావము:: భక్తరక్షణ కొరకు ఎల్లప్పుడూ దత్తుడు సిద్ధంగా వుండును. భక్తులను రక్షించుటయే ఆయనకు ఆనందం. మన ఇంట్లోనే వుండి ఆయనను తలచినా, భోజనమునకు ముందు ఆ స్వామికి భోజనం అర్పించి తినినా, మనకు దానఫలము లభింస్తుంది. ఇంద్రాది దేవతలకు కూడా దుర్లభమైన ఐశ్వర్యమును ఇచ్చును.

4. య ఏతైర్నామభిర్దివ్యైః! కవచం ధారయేత్కృతీ!
రాజవేశ్మని కాంతారే! దుర్గాదిషు మహాభయే ॥

భావము:: ఈ అష్టోత్తర శతనామములు ఎవరు కవచముగా ధరించెదరో వారు కృతార్థులు అగుదురు. రాజభవనమునందు,అరణ్య ములందు,మహాభయములందు ఈ నామములతో కవచముగా ధరించిన విజయము పొందుతారు.

5. శత్రుచోరభయాకీర్ణే! శ్మశానే ప్రేతదూషితే!
న భయం విద్యతే తస్య! దృష్ట్వా తం విద్రువేద్భయమ్॥

భావము:: శత్రువులు, దొంగలు, శ్మశానములయందు,భయములువుండు చోట ఈ నామములు కవచముగా కలిగిన వానిని చూసి భయపడి అన్ని పారిపోవును.

6. శిరో లలాటం నేత్రేచ! భ్రూమధ్యం చ భ్రువౌ తథా!
నాసే కర్ణౌ తథోష్ఠౌ చ! హనుః కంఠం కకుత్తథా ॥

భావము:: శిరస్సు, నుదురు, నేత్రములు, కనుబొమల మధ్యభాగం,కనుబొమలు, ముక్కు, చెవులు, పెదవులు, దవడలు, కంఠము, ఈ నామములు చెప్పుచూ తాకవలెను. అక్కడ వున్న రోగములు పోతాయి.

7 . దౌతాంఘ్రిహస్త ఆచమ్య! స్మృత్యా దత్తం న్యసేత్సుధీః!
కరాంగన్యాసౌ విన్యస్య!షడ్భిః ష్షడ్భిః తతః క్రమాత్ ॥

భావము:: చేతులు, కాళ్ళు కడుగుకొని కేశవాది నామాలతో ఆచమనం చేసి దత్తాత్రేయుని స్మరించి ఈ అష్టోత్తర శతనామ కవచమును చదువుకొనవలెను. అంగన్యాస, కరన్యాసములు ఆరేసి నామములతో చేయవలెను.

8. జత్రుస్తనౌ చ చక్షుశ్చ! హృదయం నాభిరేవచ!
మూలాధార స్ఫిచావూరూ! జానుజంగాశ్చ గుల్ఫయౌః ॥

భావము:: మూపు సంధులు, వక్షస్థలము, నేత్రములు, నాభి, మూలాధార ము, పిరుదులు, కటిప్రదేశము,తొడలు, మోకాళ్ళు, పిక్కలు, గిలకలు.

9. ప్రపదౌ పాదమూలాభ్యం ! తథా పాదతలే ఉభే!
పాదాగ్రాంగుష్ఠయో శ్చైవ ! హస్తాగ్రాభ్యాం తథైవ చ ॥

భావము: మోకాళ్ళు, పాదమూలములు , పాదప్రదేశములు,బొటనవేళ్ళు,చేతుల యొక్క అగ్రభాగములకు,నామములతో కవచము చేసుకొనవలెను.నామ ప్రభావముతో ఆయా అవయము ల రోగములు పోవును మరియు కవచము వలె రక్షణ ఇచ్చును.

10. స్కంధయోర్బుజమూలాభ్యాం ! సంధిభ్యాం కరయోః పృథక్!
అంగుల్యం గుష్ఠయోశ్చైవ! హస్తాగ్రాభ్యాం తథైవ చ ॥

భావము: భుజస్కంధముల యందు,భుజముల మూలలయందు,హస్తముల సందులయందు,వ్రేళ్ళయందు, హస్తాగ్రములయందు .

11.హృదయాద్దస్త పాదాగ్ర! పర్యంతవ్యాపకం న్యసేత్!
దశేంద్రియాంతః కరణ! చతుష్టయధృతంన్యసేత్ ॥

భావము:: హృదయము నుంచి హస్తాది పాదాగ్రముల వరకు ఈ నామకవచమును కప్పవలెను. పది ఇంద్రియాలందు, మనో,బుద్ధి, చిత్త, అహంకారముల యందు ఈ కవచమును ఉంచవలెను.

12. రోమస్వేకం చ హృదయం! స్పృష్ట్వా నామాని పంచ చ !
జేద్భక్త్యా స్మరన్దేవం! కృతకృత్యో భవేన్నరః ॥

భావము: రోమమలయందు,హృదయము నందు స్పృశించి అయిదు నామములను చెప్పవలెను. ఇట్లు భక్తి తో తన అవయముల అన్నిటి అందును ఆ దేవదేవుని స్మరించుచూ ఆ స్వామి నామములను జపించవలెను.

జపమునకు ముందు చేయవలసిన ధ్యాన శ్లోకం:::
పీతాంబరాలంకృత పృష్టభాగం! భస్మావగుంఠామలరుక్మ దేహమ్!
విద్యుత్సదాపింగ జటాభిరామం! శ్రీ దత్తయోగీశమహంనతోస్మి ॥

భావము:: పట్టు వస్త్రాలు కట్టుకొన్న, విభుతితో పూయబడిన బంగారపు శరీరము కలవాడు, మెరుపు తీగ వలె పచ్చనైన జడలతో మనోహరమైన శ్రీ దత్తయోగీశ్వరునికి అన్నివేళలా వంగి వంగి నమస్కరిస్తాను.

చిదంబరంలోని నటరాజ స్వామి అర్చన నామాలు


చిదంబరంలోని నటరాజ స్వామి అర్చన నామాలు

9 శ్లోకాలు లో 108 శివనామాలు కలిగిన పతంజలి మహర్షి రచించిన అత్యద్భుత స్తోత్రం.
ఇప్పటికీ చిదంబరంలోని నటరాజ స్వామికి ఈ నామాలతోటి అర్చన జరుగుతుంది.
ప్రతి రోజూ ప్రదోష సమయంలో చదువుకోవాల్సిన స్తోత్రం.


సదంచిత-ముదంచిత నికుంచిత పదం ఝలఝలం-చలిత మంజు కటకం |

పతంజలి దృగంజన-మనంజన-మచంచలపదం జనన భంజన కరమ్ |

కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబ కవిడంబక గళమ్

చిదంబుధి మణిం బుధ హృదంబుజ రవిం పర చిదంబర నటం హృది భజ || ౧ ||
హరం త్రిపుర భంజన-మనంతకృతకంకణ-మఖండదయ-మంతరహితం

విరించిసురసంహతిపురంధర విచింతితపదం తరుణచంద్రమకుటమ్ |

పరం పద విఖండితయమం భసిత మండితతనుం మదనవంచన పరం

చిరంతనమముం ప్రణవసంచితనిధిం పర చిదంబర నటం హృది భజ || ౨ ||
అవంతమఖిలం జగదభంగ గుణతుంగమమతం ధృతవిధుం సురసరిత్-

తరంగ నికురుంబ ధృతి లంపట జటం శమనదంభసుహరం భవహరమ్ |

శివం దశదిగంతర విజృంభితకరం కరళసన్మృగశిశుం పశుపతిం

హరం శశిధనంజయపతంగనయనం పర చిదంబర నటం హృది భజ || ౩ ||
అనంతనవరత్నవిలసత్కటకకింకిణిఝలం ఝలఝలం ఝలరవం

ముకుందవిధి హస్తగతమద్దల లయధ్వనిధిమిద్ధిమిత నర్తన పదమ్ |

శకుంతరథ బర్హిరథ నందిముఖ భృంగిరిటిసంఘనికటం భయహరమ్

సనంద సనక ప్రముఖ వందిత పదం పర చిదంబర నటం హృది భజ || ౪ ||
అనంతమహసం త్రిదశవంద్య చరణం ముని హృదంతర వసంతమమలమ్

కబంధ వియదింద్వవని గంధవహ వహ్నిమఖ బంధురవిమంజు వపుషమ్ |

అనంతవిభవం త్రిజగదంతర మణిం త్రినయనం త్రిపుర ఖండన పరమ్

సనంద ముని వందిత పదం సకరుణం పర చిదంబర నటం హృది భజ || ౫ ||
అచింత్యమళివృంద రుచి బంధురగళం కురిత కుంద నికురుంబ ధవళమ్

ముకుంద సుర వృంద బల హంతృ కృత వందన లసంతమహికుండల ధరమ్ |

అకంపమనుకంపిత రతిం సుజన మంగళనిధిం గజహరం పశుపతిమ్

ధనంజయ నుతం ప్రణత రంజనపరం పర చిదంబర నటం హృది భజ || ౬ ||
పరం సురవరం పురహరం పశుపతిం జనిత దంతిముఖ షణ్ముఖమముం

మృడం కనక పింగళ జటం సనక పంకజ రవిం సుమనసం హిమరుచిమ్ |

అసంఘమనసం జలధి జన్మకరలం కవలయంత మతులం గుణనిధిమ్

సనంద వరదం శమితమిందు వదనం పర చిదంబర నటం హృది భజ || ౭ ||
అజం క్షితిరథం భుజంగపుంగవగుణం కనక శృంగి ధనుషం కరలసత్

కురంగ పృథు టంక పరశుం రుచిర కుంకుమ రుచిం డమరుకం చ దధతం |

ముకుంద విశిఖం నమదవంధ్య ఫలదం నిగమ వృంద తురగం నిరుపమం

స చండికమముం ఝటితి సంహృతపురం పర చిదంబర నటం హృది భజ || ౮ ||
అనంగపరిపంథినమజం క్షితి ధురంధరమలం కరుణయంతమఖిలం

జ్వలంతమనలం దధతమంతకరిపుం సతతమింద్ర సురవందితపదమ్ |

ఉదంచదరవిందకుల బంధుశత బింబరుచి సంహతి సుగంధి వపుషం

పతంజలి నుతం ప్రణవ పంజర శుకం పర చిదంబర నటం హృది భజ || ౯ ||
ఇతి స్తవమముం భుజగపుంగవ కృతం ప్రతిదినం పఠతి యః కృతముఖః

సదః ప్రభుపద ద్వితయదర్శనపదం సులలితం చరణ శృంగ రహితమ్ |

సరః ప్రభవ సంభవ హరిత్పతి హరిప్రముఖ దివ్యనుత శంకరపదం

స గచ్ఛతి పరం న తు జనుర్జలనిధిం పరమదుఃఖజనకం దురితదమ్ || ౧౦ ||

శ్రీ దత్తాత్రేయ ప్రార్థనా స్తోత్రం/ ఘోరకష్టోద్ధారణ స్తోత్రం


శ్రీ దత్తాత్రేయ ప్రార్థనా స్తోత్రం/
ఘోరకష్టోద్ధారణ స్తోత్రం


శ్రీపాద శ్రీవల్లభ త్వం సదైవ ।
శ్రీదత్తాస్మాన్పాహి దేవాధిదేవ ॥
భావగ్రాహ్య క్లేశహారిన్సుకీర్తే ।
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ॥ ౧॥

త్వం నో మాతా త్వం పితాప్తోఽధిపస్త్వమ్ ।
త్రాతా యోగక్షేమకృత్సద్గురుస్త్వమ్ ॥
త్వం సర్వస్వం నోఽప్రభో విశ్వమూర్తే ।
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ॥ ౨॥

పాపం తాపం వ్యాధిమాధిం చ దైన్యమ్ ।
భీతిం క్లేశం త్వం హరాశు త్వదన్యమ్ ॥
త్రాతారం నో వీక్ష్య ఈశాస్తజూర్తే ।
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ॥ ౩॥

నాన్యస్త్రాతా నాపి దాతా న భర్తా ।
త్వత్తో దేవ త్వం శరణ్యోఽకహర్తా ॥
కుర్వాత్రేయానుగ్రహం పూర్ణరాతే ।
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ॥ ౪॥

ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిమ్ ।
సత్సంగాప్తిం దేహి భుక్తిం చ ముక్తిమ్ ।
భావాసక్తిం చాఖిలానందమూర్తే ।
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ॥ ౫॥

శ్లోకపంచకమేతతద్యో లోకమఙ్గలవర్ధనమ్ ।
ప్రపఠేన్నియతో భక్త్యా స శ్రీదత్తప్రియో భవేత్ ॥

ఇతి శ్రీ వాసుదేవానన్దసరస్వతీవిరచితం
శ్రీ దత్తాత్రేయ ప్రార్థనా స్తోత్రం సంపూర్ణం ॥

శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం


 శ్రీ గణేశ పంచరత్న స్తోత్రం

శ్రీ ఆది శంకరాచార్య విరచిత

ముదాకరాత్తమోదకం సదావిముక్తి సాధకం
కళాధరావతం సకం విలాసిలోక రక్షకం
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం || 1 ||

నతేరాతి భీకరం నవోదితార్క భాస్వరం
నమత్సురారి నిర్జరం నతాధికాప దుద్ధరం
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం || 2 ||

సమస్తలోక శంకరం నిరస్త దైత్యకుంజరం
దరేతరోదరం వరం వరేభవక్త్ర మక్షరం
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం || 3 ||

అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం
పురారి పూర్వ నందనం సురారి గర్వచర్వణం
ప్రపంచ నాశభీషణం ధనంజయాది భూషణం
కపోలదానవారణం భజే పురాణ వారణం || 4 ||

నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం
అచింత్యరూప మంతహీనమంతరాయ కృంతనం
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం
తమేకదంతమేవ తం విచింతయామి సంతతం || 5 ||

ఫలశ్రుతి:

మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం

ప్రజల్పతి ప్రభాతకే హృదిస్మరన్ గణేశ్వరమ్

అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం

సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్

ఇతి శ్రీ శంకరాచార్య విరచితం గణేశ పంచరత్నం సంపూర్ణం.

వైద్యనాథాష్టకము


వైద్యనాథాష్టకము

పరమశివుడు వైద్యులకు అధిపతిగా కూడా పేరొందాడు. శ్రీ రుద్రాభిషేచనంలో చాలా భాగం దీన్ని వక్కాణిస్తుంది. నమకం, చమకంలో పూర్తి ప్రార్థన, ఫలితం కూడా రోగ నివారణ, ఆరోగ్యము, దీర్ఘాయుష్షు గురించి చెపుతాయి. అందుకనే శివుని వైద్యనాథుడిగా కొలుస్తారు. దీనికి జ్యోతిర్లింగ స్వరూపమే మహారాష్ట్ర అంబజోగై సమీపం లోని వైద్యనాథ దేవాలయం. అలాగే, తమిళనాట చిదంబరం దగ్గర వైదీశ్వరన్ కోవిల్ ఈ స్వామి మహాత్మ్యాన్ని తెలిపేదే. జటాయు అంత్యక్రియలు, కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న అంగారకునికి (కుజ గ్రహం) రోగ నివారణ ఇక్కడే జరిగాయని గాథ. సుబ్రహ్మణ్యునికి శూలము కూడా ఇక్కడ శివుని ప్రార్థించిన తర్వాతే లభించిందని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఇక్కడి సిద్ధామృత తీర్థం (పుష్కరిణిలో నీరు), అంగసనాతన తీర్థంలో స్నానం చేసి, వేప చెట్టు క్రింద మట్టి తీసుకుని పవిత్ర భస్మముతో కలిపి దేవునికి సమర్పించి ఆ సిద్ధామృత తీర్థంతో తీసుకుంటే సర్వ రోగ నివారణ అవుతుందని గట్టి విశ్వాసం. అలాగే ఆ వైద్యనాథుని ఈ క్రింది స్తోత్రము రోజుకు మూడు సార్లు చదివితే ఆరోగ్యం కలుగుతుందట. అంతటి మహిమాన్వితమైన వైద్యనాథ అష్టకం ....

వైద్యనాథాష్టకము

1::శ్రీ రామ సౌమిత్రి జటాయు వేద షడాననాదిత్య కుజార్చితయ శ్రీ నీలకంఠాయ దయామయాయ శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

2::గంగా ప్రవాహేందు జటాధరాయ త్రిలోచనాయ స్మర కాల హంత్రే సమస్త దేవైరపి పూజితాయ శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

3::భక్త ప్రియాయ త్రిపురాంతకాయ పినాకినీ దుష్ట హరాయ నిత్యమ్ ప్రత్యక్ష లీలాయ మనుష్య లోకే శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

4::ప్రభూత వాతాది సమస్త రోగ ప్రణాశ కర్త్రే ముని వందితాయ ప్రభాకరేంద్ర్వగ్ని విలోచనాయ శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

5::వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి విహీన జంతోః వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి సుఖ ప్రదాయ కుష్ఠాది సర్వోన్నత రోగ హంత్రే శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

6:వేదాంత వేద్యాయ జగన్మయాయ యోగీశ్వర ధ్యేయ పదాంబుజాయ త్రిమూర్తి రూపాయ సహస్ర నామ్నే శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

7::స్వతీర్థ మృడ్భస్మ భృతాంగ భాజాం పిశాచ దుఃఖార్తి భయాపహాయ ఆత్మ స్వరూపయ శరీర భాజాం శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

8::శ్రీ నీలకంఠాయ వృష ధ్వజాయ స్రక్గంధ భస్మాద్యభి శోభితాయ సుపుత్రదారాది సుభాగ్యదాయ శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

ఫల శ్రుతిః బాలాంబికేశ వైద్యేశ భవ రోగ హరేతి చ జపేన్నామ త్రయం నిత్యం మహారోగ నివారణం 

Wednesday 22 April 2020

పరమ శివుని శత నామాలు - నిత్యమూ స్మరించవలసినవి


పరమ శివుని శత నామాలు - నిత్యమూ స్మరించవలసినవి

1 స్థిరః = సర్వకాలములందు నిలకడగా నుండువాడు,
2 స్థాణుః = ప్రళయకాలమునందును ఉండువాడు,
3 ప్రభుః = సమస్తమునకు అధిపతి,
4 భీమః = ప్రళయకాల భయమును కలుగజేయువాడు,
5 ప్రవరః = సర్వశ్రేష్టుడు,
6 వరదః = వరములనిచ్చువాడు,
7 సర్వాత్మా = సమస్తమైన ఆత్మలుతానే అయినవాడు,
8 సర్వవిఖ్యాతః = సర్వత్రా ప్రసిద్ధుడైనవాడు,
9 సర్వః = సమస్తము తానేఅయినవాడు,
10 సర్వకరః = సమస్తజగత్తులను చేయువాడు,
11 భవః = శివుని రూపంలో పుట్టినవాడు,
12 జటీ = జడలు ధరించినవాడు,
13 చర్మీ = వ్యాఘ్ర చర్మనును ధరించినవాడు,
14 శిఖండీ = శిఖలు ధరించినవాడు, నెమలి పింఛములను ధరించినవాడు,
15 సర్వాంగః = సమస్తమైన అవయవములతో పూర్ణమైనవాడు,
16 సర్వభావనః = సమస్త భావనల రూపమును తానే అయినవాడు.
17 హరః = సమస్త పాపములను హరించువాడు,
18 హరిణాక్షః = లేడికన్నులు వంటి కన్నులు కలవాడు,
19 సర్వభూతహరః = సమస్తప్రాణికోటిని హరించువాడు,
20 ప్రభుః = అధిపతి,
21 ప్రవృత్తిః = జీవనవిధానము తానే అయినవాడు,
22 నివృత్తిః = జీవనవిధాన నివారణము తానే అయినవాడు,
23 నియతః = నియమము యొక్క రూపము తానే అయినవాడు,
24 శాశ్వతః = నిత్యమైనవాడు
25 ధ్రువః = నిశ్వయ రూపము తానే అయినవాడు.
26 శ్మశానవాసీ = శ్మశానమునందు నివసించువాడు,
27 భగవాన్ = షడ్గుణ ఐశ్వర్యములు కలవాడు,
28 ఖచరః = ఆకాశమునందు సంచరించువాడు,
29 అగోచరః = కంటికి కనిపించనివాడు,
30 అర్దనః = తనలోనికి తీసుకొనువాడు,
31 అభివాద్యః = నమస్కరింప తగినవాడు,
32 మహాకర్మా = గొప్పదైన కర్మానుభవం తానేఅయినవాడు,
33 తపస్వీ = తపస్సుచేయువాడు,
34 భూతభావనః = ప్రాణికోటి భావన తానే అయినవాడు.
35 ఉన్మత్తవేష ప్రచ్ఛన్నః= పిచ్చివాని వేషంలో దాగియున్నవాడు,
36 సర్వలోక ప్రజాపతిః= సమస్తలోకములందలి ప్రజలను పాలించువాడు,
37 మహారూపః = గొప్పదైన ఆకారము కలవాడు,
38 మహాకాయః = గొప్పదైన శరీరము కలవాడు,
39 వృష రూపః = పుణ్య స్వరూపుడు,
40 మహాయశాః = గొప్ప కీర్తి కలవాడు.
41 మహాత్మా = గొప్పదైన ఆత్మయే తానైయున్నవాడు,
42 సర్వభూతాత్మా = సమస్త ప్రాణికోటి యొక్క ఆత్మల రూపం ధరించినవాడు,
43 శ్వరూపః = సమస్త విశ్వము యొక్క రూపము తానే అయినవాడు,
44 మహాహనుః = గొప్ప దవడలు గలవాడు,
45 లోకపాలః = లోకములను పరిపాలించువాడు,
46 అంతర్హితాత్మా = అదృశ్యమైన ఆత్మలు తానే అయినవాడు,
47 ప్రసాదః = అనుగ్రహించువాడు,
48 నీల లోహితః = నీలమైన కంఠము, ఎరుపు వర్ణము జటలు కలవాడు.
49 పవిత్రం = పరిశుద్ధమైన,
50 మహాన్ = గొప్పవాడు,
51 నియమః = నియమం తన స్వరూపమైనవాడు,
52 నియమాశ్రితః = నియమములను ఆశ్రయించియుండువాడు,
53 సర్వకర్మా = సమస్తమైన కర్మములు తానే అయినవాడు,
54 స్వయం భూతః = తనంతట తానుగా పుట్టినవాడు,
55 ఆదిః = సృష్టికి అంతటికీ మొదటివాడు,
56 నిధిః = అన్నిటికి మూలస్థానమైనవాడు.
57 సహస్రాక్షః = అనేకమైన కన్నులు కలవాడు,
58 విశాలాక్షః = విశాలమైన కన్నులు కలవాడు,
59 సోమః = చంద్రుని వంటివాడు,
60 నక్షత్రసాధకః = నక్షత్రాలకు వెలుగును కలుగజేయువాడు,
61 చంద్రః = చంద్రుని వంటివాడు,
62 సూర్యః = సుర్యుని వంటివాడు,
63 శనిః = సూర్యుని కుమారుడైన శని వంటివాడు,
64 కేతుః = కేతుగ్రహరూపం తానేఅయినవాడు,
65 గ్రహపతిః = గ్రహములను పాలించువాడు,
66 వరః = శ్రేష్టుడు.
67 ఆది = మొదలు,
68 అంతః = చివర,
69 లయకర్తః = ప్రళయములను సృష్టించువాడు,
70 మృగబాణార్పణః = మృగమువంటి ఇంద్రియములపై బాణము ప్రయోగించినవాడు,
71 అనఘః = పాపరహితుడు,
72 మహాపాతః = గొప్ప తపస్సు చేసినవాడు,
73 ఘోరతపాః = భయంకరమైన తపస్సు చేసినవాడు,
74 అదీనః = ప్రాధేయపడు స్వభావము లేనివాడు,
75 దీన సాధకః = బాధలలో ఉన్నవారిని రక్షించువాడు.
76 సంవత్సర కరః = సంవత్సర కాలమును సృష్టించినవాడు,
77 మంత్రః = మంత్ర స్వరూపము తానే అయినవాడు,
78 ప్రమాణం = ప్రమాణ స్వరూపుడు,
79 పరమంతపః = మహా ఉత్కృష్టమైన తపస్సు తానే అయినవాడు,
80 యోగీ = యోగనిష్ఠ యందున్నవాడు,
81 యోజ్యః = సంయోజనము చేయుటకు తగినవాడు,
82 మహాబీజః = గొప్ప ఉత్పత్తి కారకమైనవాడు,
83 మహారేతః = గొప్ప వీర్యము కలవాడు,
84 మహాబలః = గొప్పశక్తి కలవాడు.
85 సువర్ణరేతాః = అగ్నిరూపమై యున్నవాడు,
86 సర్వజ్ఞః = సమస్తము తెలిసినవాడు,
87 సుబీజః = ఉత్తమమైన ఉత్పత్తి కారకుడు,
88 బీజవాహనః = సమస్త సృష్టి ఉత్పత్తి కారకములను తెచ్చి ఇచ్చువాడు,
89 దశబాహుః = పది భుజాలు కలవాడు,
90 అనిమిషః = రెప్పపాటు లేనివాడు,
91 నీలకంఠః = నల్లని కంఠము కలిగియున్నవాదు,
92 ఉమాపతిః = పార్వతి భర్త
93 విశ్వరూప = ప్రపంచ స్వరూపము తానే అయినవాడు
94 స్వయంశ్రేష్ఠః = తనంతట తానుగా ఉత్తముడైనవాడు
95 బలవీరః = బలము చేత పరాక్రమం కలవాడు
96 బలః = బలము కలవాడు
97 గణః = సమూహ స్వరూపమైనవాడు
98 గణకర్తా = ప్రమధాది గణములను సృష్టించువాడు
99 గణపతిః = ప్రమధాతి గణములకు అధిపతియైనవాడు
100 దిగ్వాసాః = దిక్కులు వస్త్రములుగా కలవాడు

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం


శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం

ప్రథమో జ్ఞానశక్త్యాత్మ ,
ద్వితీయో స్కంద ఏవచ
అగ్నిగర్భశ్చతృతీయస్యాత్, బాహులేయస్చతుర్ధకః
గాంగేయః పంచమోవిద్యాత్,
షష్ఠః శరవణోభవః
సప్తమః కార్తికేస్యాత్,
కుమారస్యదతష్టకాత్
నవమః షణ్ముఖశ్చైవ,
దశమః కుక్కుట ధ్వజః
ఏకాదశః శక్తిధరో,
గుహో ద్వాదశ ఏవచ
త్రయోదశో బ్రహ్మచారీ,
షణ్మాతురచతుర్దశః
క్రౌంచధారి పంచాదశః,
షోడశః శిఖివాహనః
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం సంపూర్ణః.

Tuesday 21 April 2020

వృక్ష_దేవతలు


వృక్ష_దేవతలు

హిందువులు అన్ని జీవుల్లోను దేవుణ్ని చూశారు. అందువల్లనే ఆవులు వంటివి పూజనీయ జంతవులయ్యాయి.
అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి.
కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి.
వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే
కథలు కూడా ఉన్నాయి.
అలాగే చెట్లలో కూడా దేవుణ్ని చూశారు.
కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు.

నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి.
అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో బాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి.
కాగా చెట్లకు మనుషుల మాదిరి ఆనందం, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు.
అది ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమయింది.
భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు.
ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు.

హిందువులు పవిత్ర మైన వృక్ష జాతులుగా పేర్కొనే వాటిలో ..
తులసి,
రావి (అశ్వత్థం),
వేప,
మారేడు,
మర్రి,
అశోక,
ఉసిరి
వంటి మరి కొన్ని ఉన్నాయి.
దేవతా వృక్షాలుగా పేర్కొనే వాటిలో కొన్నిటికి అద్భుతమైన ఔషధ శక్తులు ఉండడం విశేషం.
కొన్ని దేవతా వృక్షాల విశేషాలు తెలుసుకుందాం.

తులసి.
తులసి పవిత్రమైనదని అందరికీ తెలుసు.
ప్రతి ఇంటిలో తులసి ఉండాల్సిన అవసరముంది.
తులసి కథ అందరికీ తెలిసిందే.
విష్ణుమూర్తికి తులసి ప్రీతికరమని,
దానితోఆయనకు పూజ పుణ్యప్రదమనేది
అందరికీ తెలిసిందే.
తులసిని పవిత్రంగా ఉన్నప్పుడే ముట్టుకోవచ్చని, అనవసరంగా తుంచరాదనే నియమాలు కూడా ఉన్నాయి. తులసి పవిత్రతని చెప్పే ఒక శ్లోకం ఉంది. అది

యన్మూలే సర్వ తీర్థాని, యన్మధ్యే సర్వ దేవతా:
యదగ్రే సర్వ వేదాశ్చ, తులసీం త్వాం నమామ్యహం

మూలంలో సర్వ తీర్థాలు,
మధ్య భాగంలో సర్వ దేవతలు,
అగ్రభాగంలో సర్వవేదాలు గల తులసి కి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం.
తులసికి ఎన్నో ఔషధ గుణాలున్నాయన్న విషయం తెలిసిందే.
తులసికి మనస్సును ఉద్వేగాలను,
శరీరాన్ని పరిశుద్ధం చేసే శక్తి ఉందని చెబుతారు. అందువల్లనే యోగులు, సాధువులు వంటి వారు
తులసి మాలను మెడలో ధరిస్తుంటారు.
ఇతరుల చెడు భావాలను ఎదుర్కొని దూరం చేసే
శక్తి తులసికి ఉంది.
అంత ఎందుకు తులసిని స్పృశించడమే మనలను
శుద్ధి చేస్తుందని చెబుతారు.

రావి.
దేవతా వృక్షాల్లో రావి(అశ్వత్థం)ఒకటి.
అశ్వత్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం.
రావి చెట్టులో త్రిమూర్తులు ఉన్నారని చెప్పే
శ్లోకం కూడా ఉంది. అది

మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి
అగ్రత: శివ రూపాయ, వృక్ష రాజాయతే నమ:

ఈ వృక్షం మూలం వద్ద్ద బ్రహ్మ,
మధ్యలో విష్ణువు,
అగ్రంలో శివుడు
ఉన్నారని దీని అర్థం.
ఇక రావి చెట్టు విష్ణువు రూపమని చెబుతారు. అందువల్లనే అశ్వత్థ నారాయణుడు అనే పేరు
కూడా ఆయనకు ఉంది.
మొహంజొదారో లో దొరికిన ఒక ముద్రలో సింధులోయ నాగరికతకు చెందిన ప్రజలు అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తున్న దృశ్యం బయటపడింది.
దేవదానవ యుద్ధంలో దేవతలు ఓడిపోయిన
ఒక సందర్భంలో విష్ణువు అశ్వత్థ వృక్షంగా మారాడని పురాణాలు చెబుతున్నాయి.
ఆయన ఆ చెట్టు రూపం దాల్చినందున దానికి పవిత్రత వచ్చిందని చెబుతారు.
కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని
కొందరు చెబుతారు.
స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలుకు గాని
దాని కొమ్మలకు గాని ఎర్ర వస్త్రం గాని, ఎర్ర దారం గాని
కట్టే ఆచారం ఉంది.
ఏ చెట్టును నరకడమైనా పాపమే కాగా అశ్వత్థ వృక్షాన్ని నరకడం మహాపాపమని ఒక పురాణ వచనం.
బుద్ధునికి ఈ చెట్టు కిందే జ్ఞానోదయం అయిందని చెబుతారు.
అందువల్ల వారు దానిని బోధి వృక్షమని,
జ్ఞాన వృక్షమని వ్యవహరిస్తారు.

వేప.
వేపచెట్టు లక్ష్మీ దేవి స్వరూపమని చెబుతారు. అందువల్లనే విష్ణు రూపమైన రావి చెట్టుకు,
లక్ష్మీ రూపమైన వేప చెట్టును ఒకే చోట పాతి
వాటికి వివాహం చేసే ఆచారం కూడా ఉంది.
ఉత్తర హిందూస్థానంలో వేప చెట్టును నీమారి దేవిగా వ్యవహరిస్తారు.
కొన్ని శుద్ధి కార్యక్రమాల్లో వేప రెమ్మలను ఉపయోగిస్తారు. వేపలో ఉన్న ఔషధ గుణాలు తెలిసినవే.
వేప‌ చెట్టు గాలే శరీరానికి మంచిదని అంటారు.
దాని ఆకులు క్రిమి సంహారిణిగా ఉపయోగిస్తాయి.
దాని బెరడు కొన్ని రకాల చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది.

మారేడు.
మారేడు పత్రాలనే సంస్కృతంలో బిల్వ పత్రాలంటారు. మారేడు శివునికి ప్రీతికరం.
అందుకే ఆయనకు లక్ష పత్రి పూజలో కూడా బిల్వాలనే వాడతారు.
అది దేవతా వృక్షమై నందునే దానిని కొన్ని రోజులలో, తిథులలో కోయరాదనే నిబంధన కూడా ఉంది. కోసేటప్పుడు కూడా ఒక శ్లోకం చదివి నమస్కరించి కోయాలంటారు.
ఆ శ్లోకం..

అమృతోద్భవ శీవృక్ష మహాదేవ ప్రియ: సదా
గృహ్ణామి తవ పత్రాణి శివపూజార్థమాదరాత్‌

మారేడుకు అమృతం నుంచి ఉద్భవించిందని,
శ్రీ వృక్షమని పేర్లు.
అలాగే ఎప్పుడూ శివునికి ఇష్టమైనది.
అటువంటి నీ పత్రాలను శివ పూజ నిమిత్తం కోస్తున్నాను అని దీని అర్థం.
మారేడు లక్ష్మీ దేవికి ప్రీతికరం.
మూడుగా కలసి ఉన్న బిల్వ దళాలను శివుని పూజకు వాడుతారు.
ఈ మూడు పత్రాల దళం శివునిమూడు కనులకు
ప్రతీక అని భావిస్తారు.
జైనులకు కూడా ఇది పవిత్ర వృక్షం.
వారి గురువుల్లో ఒకరైన 23వ తీర్ధంకరుడు
భగవాన్‌ పరస్‌నాథ్‌జీ మారేడు వృక్షం కిందే నిర్వాణం (జ్ఞానోదయం పొందారని) భావిస్తారు.
మారేడులో ఔషధ గుణాలు అధికం.
కడుపులో మంటకు కారణమయ్యే ఎసిడిటీ వంటి సమస్యలకు, కొన్ని ఉదర సంబంధ వ్యాధులకు
మారేడు చూర్ణం, మారేడు ఆకుల కషాయం పనికొస్తుంది.

జమ్మి.
జమ్మి చెట్టు దేవతా వృక్షాల్లో ఒకటి.
సంస్కృతంలో దీనిని శమీ వృక్షంగా పేర్కొంటారు.
జమ్మి చెట్టును తాకడం కూడా పుణ్యప్రదమని చెబుతారు. జమ్మి చెట్టు గొప్పతనాన్ని వివరించే ఒక శ్లోకం కూడా ఉంది. అది

శమి శమయతే పాపం, శమి శత్రు వినాశిని
అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియ దర్శిని

శమి శత్రువులను నశింపజేస్తుందని,
పాండవుల ఆయుధాలను మోసినదని,
రామునికి ప్రియమైనదని దీని అర్థం.
ఈ వృక్షం పైనే అజ్ఞాతవాసంలో పాండవులు
తమ ఆయుధాలు దాచారు.
అలాగే రాముడు లంకపై యుద్ధానికి వెళుతున్నపుడు
ఈ వృక్ష అధిష్ఠాన దేవతే ఆయనకు విజయం సిద్ధిస్తుందని చెప్పినట్లు ఒక కథ
అలాగే అగ్ని దేవుడు ఒక పర్యాయం భృగు మహర్షి
కోపం నుంచి తప్పించుకోవడానికి ఈ చెట్టులో దాగి ఉన్నాడని కథ.
ఈ చెట్టు బెరడనును కుష్ఠు రోగం, గాయాలు, శరీరంపై వచ్చే వ్రణాలు వంటి వాటి చికిత్సలో ఉపయోగిస్తారు.
ఈ చెట్టు బెరడు పొడి గొంతు నొప్పి, ఆస్త్మా మరెన్నో రోగాల చికిత్సలో ఉపయోగపడుతుంది.
గింజలు, రెమ్మలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించేందుకు, శ్వాసకోశ సంబంధ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తుంది.

ఉసిరి.
ఉసిరిని శ్రీమహా విష్ణువు రూపంగా భావిస్తారు.
అందరికీ తెలిసిన వన భోజనాలు ఉసిరి చెట్టు వనంలో లేదా ఉసిరి చెట్టు ఉన్న వనంలో చేయాలంటారు.
కార్తీక మాసంలో ఈ చెట్టును శ్రీమహా విష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తుంటారు.
ఉసిరి కాయల మీద వత్తులు పెట్టి వెలిగించే సంప్రదాయం కూడా ఉంది.
ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం.

మేడి.
మేడి చెట్టుకింద దత్తాత్రేయుల వారు కూర్చుని ఉంటారు. త్రిమూర్త్యాత్మకుడు ఎప్పుడూ ఏ చెట్టు నీడనుంటాడో
అది పవిత్రమైనది కాక మరేమవుతుంది.
అది దేవతా వృక్షమే.
ఎండిన మేడి పళ్లను ఆరోగ్యం కోసం కూడా వాడతారు.

మర్రి.
మర్రి చెట్టును కూడా త్రిమూర్త్యాత్మక స్వరూపంగా భావిస్తారు.
ఈ చెట్టును చాలా సంస్కృతుల్లో జీవానికి,
సంతాన సాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు.
అందువల్లనే సంతానం లేనివారు మర్రి చెట్టును
పూజించే ఆచారం ఉంది.
అలాగే దీనిని ఏ సమయంలోనూ నరికి వేయరాదన్నది పురాణాలలో పేర్కొన్నారు.
సర్వ లోకాలకూ గురువుగా భావించే జ్ఞాన స్వరూపుడైన మేధా దక్షిణామూర్తి మర్రి వృక్ష ఛాయలోనే ఉంటాడు. పశ్చిమ బెంగాల్‌ హౌరాలోని ఇండియన్‌ బొటాని కల్‌ గార్డెన్‌లో ఉన్న మర్రి చెట్టు ప్రపంచంలోనే అతి పెద్దది.

అశోక.
ఈ చెట్టును కామ దేవునికి ప్రతీకగా భావిస్తారు.
ఈ పువ్వులను ఆలయ అలంకరణలో ఉపయోగిస్తారు. బుద్ధుడు అశోక వృక్షం కిందే జన్మించాడని చెబుతారు. అందువల్ల వీటిని బౌద్ధారామాల్లో ఎక్కువగా నాటుతుంటారు.
అశోక వృక్షం కూడా పవిత్ర వృక్షములలో ఒకటి.
పుష్పాల నుంచి తీసే ఎసెన్స లో ఈ పుష్పాలకు
ప్రత్యేక స్థానం ఉంది.
ఇది దట్టమైనాకులతో నిటారుగానిలబడే చిన్నది.
ఇది పువాసన కల ఎరుపు రంగు పుష్పాలతో ఉంటుంది. ఏప్రిల్‌, మే నెల్లో ఈ చెట్టు పుష్పిస్తుంది.
హిమాలయాల తూర్పు, మధ్య ప్రదేశ్‌ లోను,
ముంబై పశ్చిమ తీరప్రాంతంలోనూ ఇది కనిపిస్తుంది.
అశోక అంటే సంస్కృతంలో శోకంలేనిది లేదా
శోకాన్ని దూరం చేసేది అనే అర్థాలు చెప్పుకోవచ్చు.
దీనికి ప్రాంతీయ భాషల్లో పలు పేర్లు ఉన్నాయి.

మామిడి.
మామిడి చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే.
రామాయణం, మహాభారతం, ఇతర పురాణాల్లో
దీని ప్రస్తావన ఉంది.
ఈ మామిడిపండు పండుగా ప్రేమకు, సంతానసాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు.
ఏ శుభ కార్యమైనా మామిడి ఆకు తోరణాలు కట్టకుండా ప్రారంభం కాదు.
ఈ ఆకులకు ఎక్కువ మంది చేరిన చోట ఏర్పడే కాలుష్యాన్ని తొలగించే గుణం ఉందని కూడా చెబుతారు.

కొబ్బరి.
కొబ్బరి చెట్టును కల్ప వృక్షంగా వ్యవహరిస్తారు.
అన్ని దైవసంబందమైన కార్యాలనూ కొబ్బరికాయను
కొట్టి ప్రారంభిస్తారు.
పూర్ణ కుంభంలో పై నుంచేది కొబ్బరికాయనే.
ఇక కొబ్బరికాయను శివ స్వరూపంగా దానిపై ఉన్న
మూడు నల్ల మచ్చలను ఆయన త్రినేత్రాలుగా పేర్కొంటుంటారు.
కొబ్బరికాయ నీరు మనుషులు తాకని స్వచ్చమైన జలమని నమ్ముతారు.
అటువంటిది మరే పండు విషయంలోనూ లేదు, దేవతలకు కొబ్బరి నీటితో అభిషేకం చేయడం కూడా చేస్తుంటారు.

అరటి.
అరటి చెట్టులోని ప్రతి భాగం ఏదో విధంగా మానవునికి ఉపయోగపడేదే.
అరటి చెట్టును శుభ కార్యాసమయంలో ద్వారాలకు కడతారు.
ఇక ప్రసాద వితరణకు ఈ ఆకులను ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల భోజనాలకు వీటిని ఉపయోగిస్తారు.
కొన్ని ప్రాంతాల్లోకదలీ వ్రతం పేరుతో అరటి చెట్టుకు పూజచేస్తారు.


చందనం.
చందనం చెక్క ఆరగదీయడం వల్ల వచ్చే చందనం
నిత్య పూజలో ఒక భాగం కనుక
దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది
అందులో దానినిఇచ్చే చందన వృక్షాన్ని
దేవతా వృక్షంగా భావిస్తారు.


వెదురు.
దేవునికి చెందినదేదైనా పవిత్రమైనదనే భావంతో
కృష్ణుని వేణువు తయారైన వెదురును కూడా
దేవతా వృక్షంగా భావిస్తుంటారు.
హిందీలో బన్సూరి అంటే వేణువు.
కృష్ణుడు చేతిలో వేణువు కలిగి ఉంటాడు కనుక ఆయనను బన్సీలాల్‌ అని కూడా పిలుస్తుంటారు.

Monday 20 April 2020

శ్రీమహాలక్ష్మి దండకము


శ్రీమహాలక్ష్మి దండకము

శ్రీమన్మహాలక్ష్మి శ్రీదేవి శ్రీరంగ
ధామేశ్వరీ! శ్రీకరీ మాధవీ హేమ
రూపంధరీ లోక రక్షాకరీ పూజ్య
నారాయణీ పద్మసింహాసినీ దేవి
క్షీరాబ్ది కన్యామణీ శ్రీరమా దేవి
శ్రీవత్సుఁ బెండ్లాడి శ్రీలక్ష్మి వైతీవు
శ్రీవిష్ణు వక్షస్స్థలమ్మే నివాసంబుగా
శేషతల్పంబుపై నున్న మాతల్లి
దారిద్ర్య దుఃఖమ్ము దీర్చంగ రావమ్మ
నీరాక తో జన్మ ధన్యంబు మాకమ్మ
ఏరీతిఁబూజింతు నేరీతి సేవింతు
నీదివ్య రూపంబు నిత్యంబు పూజింతు
శుభ్రమ్ము గానున్న నన్మెత్తు వీవంట
శీఘ్రమ్ము సంపత్తి నీవీవె మాకంట
కష్టాలు దీరంగ నైశ్వర్య మీరావె
పద్మాలు నేఁదెచ్చి పూజింతు నోతల్లి
పచ్చంగ చేనంత పండించు మాలక్ష్మి
మందార పుష్పాల పూజింతు నోతల్లి
ముత్తైదు సౌభాగ్య మీవమ్మ మాలక్ష్మి
పద్మమ్ము లీ ముగ్గులన్ జూడఁగా లక్ష్మి
పారాణి పాదాలు మోపంగ మాయింట
నీదివ్య హస్తంబు చూపించు చాలంట
నీపాద మానించ మోదంబు మాతల్లి
నట్టింట నాట్యంబు నాడంగ మాలక్ష్మి
నీరాజనాలిచ్చి పూజింతు నో తల్లి
ముత్యాలహాసాలు మాకివ్వు మాతల్లి
సౌభాగ్య మీవమ్మ సౌభాగ్య మీనాక్షి
సంతాన శంపాంగి నీవౌదు మాలక్ష్మి
తల్లీ నమస్తే నమస్తే నమస్తే నమః

Sunday 19 April 2020

సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం


సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం



క్షమంవ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే!
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే!!

ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే!
త్వయా వినా జగత్పర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్!!

సర్వ సంపత్స్వ రూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ!
రాసేశ్వర్యది దేవీత్వం త్వత్కలా సర్వయోపిత!!

కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా!
స్వర్గేచ స్వర్గ లక్ష్మీస్త్వం మర్త్య లక్షీశ్చ భూతలే!!

వైకుంఠేచ మహాలక్ష్మీ: దేవదేవీ సరస్వతీ !
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః!!

కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే!
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ!!

పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే!
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే!!

కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననేపిచ!
రాజాలక్ష్మీ: రాజ గేహే గృహలక్ష్మీర్గ్రుహే గృహే !!

ఇత్యుక్వ్తా దేవతాస్సర్వా మునయో మనవాస్తథా!!
రూరూదుర్న మ్రవదనా శుష్క కంఠోష్ఠ తాలుకా!!

ఇతి లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవై కృతం శుభమ్!
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ద్రువమ్!!

అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్!
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్!!

పుత్రా పౌత్ర పతీం శుద్ధాం కులజాం కోమలాం వారామ్!
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్!!

పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్!
భ్రష్టరాజయో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్!!

హత బందుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్!
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ద్రువమ్!!

సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్!
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్!!



ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణమ్


విష్ణుసహస్ర నామ స్తోత్రం విశిష్టత


విష్ణుసహస్ర నామ స్తోత్రం విశిష్టత

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః..

రోజుకు కనీసం ఒక్క సారైనా
విష్ణుసహస్ర నామ పారాయణం చేయండి.
ఉత్తమ ఫలితాలు పొందండి..

మంత్రాల ఘనికి మూల మంత్రం శ్రీ విష్ణుసహస్రనామం

ఓం నమో నారాయణాయ .
ఓం నమో భగవతే వాసుదేవాయ .

ఫలితం మీకే స్పష్టంగా తెలుస్తుంది...

విష్ణు సహస్ర నామ స్తోత్రము
పారాయణ చేసిన

అశ్వ మేధ యాగం చేసినంత పుణ్యం కలుగును ఆయురారోగ్యము కలుగును,
పాపములు తొలగును.

స్తోత్రము లో ప్రతి నామము అద్భుతం.
మన నిత్య జీవితంలోని అన్నీ సమస్యలకు పరిష్కరాలు ఇందులో వున్నాయి

విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. కష్టనష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్ర నామపారాయణం అన్నింటికీ విరుగుడులా పనిచేస్తుందని వారు సూచిస్తున్నారు.

అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కష్టాలు, వ్యాధులు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు శుభాలు చేకూరుతాయి.
విష్ణు సహస్రనామ పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుందనీ.. ఉత్తమగతులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఇంకా ఇంటి దేవతా పూజతో, ఇష్టదేవతా పూజతో కూడా ఇబ్బందులను తొలగించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు.

అయితే విష్ణు సహస్రనామాన్ని అనునిత్యం ఏడాది పాటు పఠించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయంటే

1. అదృష్టం

2. ఆర్థిక ఇబ్బందులు వుండవు

3. గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం

4. కోరిన కోరికలు నెరవేరుతాయి

5. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది

విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానమాచరించడం చేయాలి. ఆపై పూజగదిలో కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. లేకుంటే వినడమైనా చేయాలి. ఈ విష్ణు సహస్ర నామం నుంచి వెలువడే శబ్ధం దుష్ట ప్రభావాన్ని దూరం చేస్తుంది. అలాగే ఇంటి ముందు తులసిని పెంచడం ద్వారా మంచి ఫలితాలు వుంటాయి. అలాగే తులసీ మొక్క ముందు నేతి దీపం వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందిన వారవుతారు.

అభీష్టసిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకములను
108 మార్లు జపించవలెను.
పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:

1. విద్యాభివృద్ధికి :-
14వ శ్లోకం.
సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః |
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||

2. ఉదర రోగ నివృత్తికి:-
16వ శ్లోకం.
భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః |
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ||

3. ఉత్సాహమునకు:-
18వ శ్లోకం.
వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః |
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||

4. మేధాసంపత్తికి:-
19వ శ్లోకం.
మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః |
అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్ ||

5. కంటి చూపునకు:-
24వ శ్లోకం.
అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః |
సహస్రమూర్థా విశ్వాత్మ సహస్రాక్ష స్సహస్రపాత్ ||

6. కోరికలిడేరుటకు:-
27వ శ్లోకం.
అసంఖ్యేయో2ప్రమేయాత్మ విశిష్ట శ్శిష్ట క్రుచ్ఛిచిః |
సిద్ధార్థ స్సిధ్ధసంకల్పః సిద్ధిద స్సిధ్ధిసాధనః ||

7. వివాహ ప్రాప్తికి:-
32వ శ్లోకం.
భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః |
కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ||

8. అభివృద్ధికి:-
42వ శ్లోకం.
వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్స్థానదో ధ్రువః |
పరర్థిః పరమ స్పష్ట: స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః ||

9. మరణ భీతి తొలగుటకు:-
44వ శ్లోకం.
వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః |
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ||

10. కుటుంబ ధనాభివ్రుద్ధికి:-
46వ శ్లోకం.
విస్తారః స్థావర స్స్తాణుః ప్రమాణం బీజ మవ్యయం |
అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ||

11. జ్ఞానాభివ్రుద్ధికి:-
48వ శ్లోకం.
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాం గతిః |
సర్వదర్సీ నివృతాత్మ సర్వజ్ఞో జ్ఞాన ముత్తమం ||

12. క్షేమాభివ్రుధ్ధికి:-
64వ శ్లోకం
అనివర్తీ నివృత్తాత్మ సంక్షేప్తా క్షేమక్రుచ్ఛివః |
శ్రీవత్సవక్షా శ్శ్రీవాస శ్శ్రీపతిః శ్శ్రీమతాం వరః ||

13. నిరంతర దైవ చింతనకు:-
65వ శ్లోకం.
శ్రీద శ్శ్రీశ శ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |
శ్రీధరః శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ||

14. దుఃఖ నివారణకు:-
67వ శ్లోకం.
ఉదీర్ణ స్సర్వత శ్చక్షు రనీశ శ్శాశ్వత స్థిరః |
భూశయో భూషణో భూతి ర్విశోక శ్శోక నాశనః ||

15. జన్మ రాహిత్యమునకు:-
75వ శ్లోకం.
సద్గతి స్సత్క్రుతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః |
శూరసేనో యదుశ్రేష్ఠ స్సన్నివాస స్సుయామునః ||

16. విద్యా ప్రాప్తి కి :-
80వ శ్లోకం.
అమానీ మానదో మాన్యో లోకఃస్వామీ త్రిలోకధృత్|
సుమేధా మేధజో ధన్యః సత్యమేథా ధరాధరః||

17. శత్రువుల జయించుటకు:-
88వ శ్లోకం.
సులభ స్సువ్రత సిద్ధ శ్శత్రుజి చ్ఛత్రు తాపనః !
న్యగ్రోధో దుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః ||

18. భయ నాశనమునకు:-
89వ శ్లోకం.
సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |
అమూర్తి రణఘో2చింత్యో భయక్రు ద్భయ నాశనః ||

19. సంతాన ప్రాప్తి కి :-
90వ శ్లోకం.
అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్|
అధృత స్స్వధృత స్య్సాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్థనః||

20. మంగళ ప్రాప్తికి:-
96వ శ్లోకం.
సనాత్సనాతన తమః కపిలః కపి రవ్యయః |
స్వస్తిద స్స్వస్తిక్రుత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ||

21. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు:-
97 & 98వ శ్లోకం.
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః |
శబ్దాదిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః ||
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః |
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ||

22. దుస్వప్న నాశనమునకు:-
99వ శ్లోకం.
ఉత్తారణో దుష్క్రుతిహా పుణ్యోదుస్వప్న నాశనః |
వీరహా రక్షణ స్సంతో జీవనం పర్యవస్తితః ||

23. పాపక్షయమునకు:-
106వ శ్లోకం.
ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః |
దేవకీ నందన స్స్రష్టా క్షితీశః పాపనాసనః ||

24.సర్వ రోగ నివారణకు:-
103వ శ్లోకం.
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః
తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః||

25. సుఖ ప్రసవమునకు:-
107వ శ్లోకం.
శంఖభృత్ నన్దకీ చక్రీ శారంగధన్వా గదాధరః|
రథాంగపాణి రక్ష్యోభ్యః సర్వ ప్రహరణాయుధః||
శ్రీ స్సర్వ ప్రహరణాయుధ ఓమ్ నమ ఇతి

విష్ణు సహస్ర నామము మొత్తం చదివిన తదుపరి మీకు ఇందులో కావలసిన శ్లోకం 108 సార్లు పఠించవలెను.

(సేకరణ)

సరస్వతీ దేవి చరిత్ర


సరస్వతీ దేవి చరిత్ర

హిందూ మతం లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది.
ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి.
వేదాలు, పురాణాలలో విపులంగాసరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది.
కొన్ని పురాణ గాధలు సరస్వతీ దేవి, సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి.
నవరాత్రి , వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది.

స్వరూపం.....
ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ,
బ్రహ్మ వైవర్త పురాణంలోనూ (2.6.13-95),
పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాధలున్నాయి.
సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని
వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు.
బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా
బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాధ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు
శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది.
సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాధ.

వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం – వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు.
ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది.
సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం.
“శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు”నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో
తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు.
సరస్వతి ధరించే వీణ పేరు”కచ్ఛపి”.

పరాశక్తి, జ్ఞాన ప్రదాతసరస్వతి –
రాజస్థాన్ లోని పాలరాతి విగ్రహం –
9వ శతాబ్దానికి చెందినది
పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు
సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని
దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది.
మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది.

జ్ఞాన ప్రదాతగా సరస్వతి – కొన్ని గాధలు...
పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు.
శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు.
ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు.

అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది.
అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు.
ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు.

పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాలను గురించి వాల్మీకిని అడిగాడు.
వాల్మీకి జగదాంబను స్మరించాడు.
అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని పొందాడు.
వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు.
ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని, పురాణ రచనను చేశాడు.

ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు.
శివుడు దివ్వవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు.
ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు.
అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి
వేయి దివ్య సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు.

పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు
యాజ్ఞవల్క్య మహర్షి.
అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు.
సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు.
అయితే యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేక పోవటాన్ని గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు.
యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు.
ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు, జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు.
తన మీద దయచూపి జ్ఞాన, జ్ఞాపక శక్తులను ప్రసాదించమని,
విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని,
గ్రంధ రచనా శక్తి, ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు.
సత్సభలలో మంచి విచారణ శక్తిని, సత్య స్వరూపిణి, వ్యాఖ్యాన రూపిణి, వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదేపదే స్తుతించటంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది.
ఈ సరస్వతి స్తుతి అంతా దేవీ భాగవతంలో ఉంది.

ఆలయాలు....
ఆంధ్రప్రదేశ్...బాసర.
ఆదిలాబాదు జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం
నిర్మల్ పట్టణానికి 35 కి.మీ దూరంలో
గోదావరి నది ఒడ్డున ఉంది.
హైదరాబాదు కు సుమారు 200 కి.మీ. దూరం.
బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రము.
బాసరలో జ్ఙాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు.
ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది.
ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది.

వరంగల్..
హైదరాబాదు కు సుమారు 48 కి.మీ. దూరం లోగల వరంగల్ లోని ఈఆలయం క్రమంగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది.

జమ్ము ‍‍& కాష్మీర్..
కాష్మీర్ లోని శారదా మందిరం అత్యంత పురాతనమైనదిగా చెప్పబడుతున్నది.
ఇప్పుడు పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాష్మీర్ భూభాగంలో ఉన్న ఈ మందిరం చారిత్రికంగా చాలా ముఖ్యమైనది. కాష్మీర్ చరిత్రకారుడైన కల్హణుడు తన రాజ తరంగిణిలో ఈ మందిరం గురించి విపులంగా వ్రాశాడు.
“నమస్తే శారదా దేవి కాష్మీర మండల వాసిని” అన్న ప్రార్ధన దేశమంతటా వాడబడేది.
శాండిల్య మునికి శారదా దేవి ఇక్కడ (ఎగువ కిషన్ గంజ్ లోయ ప్రాంతంలో) ప్రత్యక్షమైనదని కధనం. దేశమంతటినుండీ పండితులకు ఇది పరమ పవిత్ర క్షేత్రం. ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి గురువులు ఇక్కడికి వచ్చి దేవి దర్శనం చేసుకొన్నారని అంటారు.

ఈ మందిరం ఉన్న స్థలాన్ని కూడా కల్హణుడు
(8వ శతాబ్దం) తన కాష్మీర రాజ చరిత్రలో వర్ణించాడు (శిర్హసిల కోట ముట్టడి గురించి చెప్పిన సందర్భంలో Raj. viii- 2556-2706).
అంతకంటె ముందు కాలం గ్రంధం “శారదా మహాత్మ్యం” లో ఈ మందిరానికి వెళ్ళే యాత్రీకుల ప్రయాణ మార్గం వర్ణన ఉంది.
ఆ రెండు వర్ణనల ప్రకారం ఈ మందిరం ఎగువ కిషన్‌గంజ్ లోయ ప్రాంతంలో ఉండాలి.
శాండిల్య మునికి శారదా దేవి ప్రత్యక్షమైనదని చెప్పే స్థలం లోనే ఈ మందిరం నిర్మింపబడింది.
ప్రధానాలయం 22 అడుగుల చదరపు ఆకారంలో నిర్మింపబడింది.
10వ శతాబ్దంలో ‘అల్ బెరూని’ కూడా ఈ మందిరాన్ని వర్ణించాడు.

కర్ణాటక..శృంగేరి..
కర్ణాటక లోని శృంగేరిలో ఆదిశంకరాచార్యులచే ప్రతిష్టింపబడిన సరస్వతీ మూర్తిని అనేకులు దర్శిస్తారు.

తమిళనాడు..కూతనూర్..
తమిళనాడులో ‘కూతనూర్’ వద్ద మరొక సరస్వతీ మందిరం ఉంది. ఈ వూరు మైలాదుతురై – తిరువారూర్ రైలు మార్గంలో పూన్‌తోట్టమ్ గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది.
త్రివేణి సంగమానికి సంబంధించిన ఒక కధ ఇక్కడి స్థలపురాణంలో చెబుతారు.
కంబన్ కవి సమకాలీనుడైన ఊతకూత్తల్ కవి జీవితగాధతో ఈ క్షేత్రానికి సంబంధం ఉంది. హంసవాహనయైన ఈ దేవి దర్శనానికి అనేకులు వస్తూ ఉంటారు.
ఇంకా ఈ దేవాలయంలో వినాయకుడు, బ్రహ్మ, నాగరాజు, మురుగన్, హంస, నారద వినాయకుల విగ్రహాలున్నాయి. ఇక్కడ 1941, 1968, 1987 సంవత్సరాలలో కుంభాభిషేకం జరిగింది.

రాజస్థాన్...పిలానీ..
రాజస్థాన్ లోని పిలానిలో బిర్లా కుటుంబీకులు నిర్మించిన శారదా మందిరం ఉంది.
‘బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎండ్ సైన్సెస్’ ఆవరణ అయిన విద్యావిహార్‌లో ఈ మందిరం ఉంది.
ఖజురాహో ఖండరీయ మహాదేవ ఆలయం శైలిలో నిర్మింపబడిన ఆధునిక మందిరం ఇది.

ఇంకా..
హిందూమత ప్రభావం ఉన్న బౌద్ధమతంలో కొన్ని చోట్ల మంజుశ్రీ, మహా సరస్వతి, వజ్ర సరస్వతి, ఆర్య వజ్ర సరస్వతి, వజ్ర వీణా సరస్వతి, వజ్ర సారద వంటి పేర్లతో సరస్వతి ఆరాధన జరిగింది.
జైనులు శృతదేవతగా, షోడశ విద్యా దేవతలకు అధికారిణిగా సరస్వతిని ఆరాధించారు.
శ్వేతాంబరులు హంసవాహిని అని ఈ దేవిని స్తుతించారు. “శ్రీ మద్భోజ నరేంద్ర చంద్ర నగరీ విద్యాధరీ” అని భోజుడు వాగ్దేవిని ప్రతిష్టించాడని ప్రసిద్ధి ఉన్నది.

క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన సరస్వతీ విగ్రహము
ఉత్తర ప్రదేశ్‌లో మధుర సమీపంలోని ‘ఖజ్జాలీటీలా’లో లభించింది.
గుప్తరాజులలో ఒకడైన సముద్ర గుప్తుడు
తన సువర్ణ నాణెములపై ఒకవైపు సరస్వతీ దేవిని, మరొకవైపు వీణను ముద్రించాడు.
అలాగే క్రీ.పూ. 550-575 ప్రాంతంలో ఒక గౌడ వంశ రాజుల తన నాణెములపై సరస్వతీ దేవి రూపమును ముద్రించాడు.
క్రీ.శ. 10వ శతాబ్దంలో ఒరిస్సా (ఖచ్చింగ్)లో వీణాపాణియైన సరస్వతి విగ్రహం చెక్కబడింది.
పాల వంశపు రాజుల నాటివని చెప్పబడుచున్న
సరస్వతి విగ్రహాలు పాట్నాలోను, కలకత్తా (హాష్‌తోష్) మ్యూజియంలోను భద్రపరచబడ్డాయి.
ఇంకా వివిధ మ్యూజియంలలో సరస్వతి శిల్పాలున్నాయి. ఖజురాహోలోని పార్శ్వనాధాలయంలోను, ఖందరీయ మహాదేవాలయంలోను వాగ్దేవి విగ్రహాలున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్‌లోని ఘంటసాలలో క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన సరస్వతీ విగ్రహం లభించింది.
క్రీ.శ. 10వ శతాబ్దికి చెందిన చాళుక్యుల కాలం నాటి విగ్రహం సామర్లకోట భీమేశ్వరాలయంలో ఉంది. కారెంపూడి, తంజావూరు, హలెబీడు, శ్రీరంగంలలో సరస్వతీ దేవి విగ్రహాలున్నాయి.

పేర్లు..
అనేక హిందూ దేవతలకు వలెనే సరస్వతి అష్టోత్తర శత నామాలు, సహస్ర నామాలు ఉన్నాయి.
ఇంకా వివిధ స్తోత్రాలలో అనేక నామాలు వాడబడ్డాయి. అయితే శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రంలో చెప్పబడిన పేర్లు..
1. భారతి
2. సరస్వతి
3. శారద
4. హంస వాహిని
5. జగతీ ఖ్యాత
6. వాగీశ్వర
7. కౌమారి
8. బ్రహ్మ చారిణి
9. బుద్ధి ధాత్రి
10. వరదాయిని
11. క్షుద్ర ఘంట
12. భువనేశ్వరి

ఇదే స్తోత్రం ఆరంభంలో సరస్వతి, వీణాపుస్తక ధారిణి, హంస వాహన, విద్యా దానకరి అన్న సంబోధనలు, చివరిలో బ్రాహ్మీ, పరమేశ్వరి, బ్రహ్మ రూపి అన్న సంబోధనలు ఉన్నాయి.
ఇంకా వివిధ సందర్భాలలో చెప్పబడిన కొన్ని నామములు – అనుష్టుప్, ఆదిత్య, ఈ, ఉక్తి, ఐందవి, కభార్య కాదంబరి, కాషాయ మోహిని, కాషాయ వల్లభ, గీః, గీర్దేవి, గౌః, జూం, పుస్తకమ్, బ్రాహ్మీ, భగవతీ, భారతీ, భాషా, మహాలక్ష్మీః, వర్ణ రూపిణీ, వాక్, వాణీ, వారీ, శారదా, శ్రీః, సావిత్రీ – అన్న నామాలు వాడబడినాయి.
అచ్చ తెలుగులో వివిధ కవులు వాడిన సంబోధనలు –

అంచ తత్తడి చెలియ, తూటిగానపు తేజీగల బోటి (హంస వాహిని)
కలన తపసి తల్లి (నారదుని తల్లి)
చదువుల తల్లి, చదువుల వెలది
తల వాకిటను మెలగు చెలువ, పలుకు చెలి (వాగ్రూప)
నలువ రాణి, వెన్నుని కొడుకు రాణి (బ్రహ్మకు భార్య)
పొత్తము ముత్తో (పుస్తక రూపిణి)
మినుకు జేడియ (విద్యుద్రూపిణి)
లచ్చి కోడలు (లక్ష్మీ దేవికి కోడలు)
వెల్ల ముత్తైదువ (తెల్లని రూపము గలది)

ప్రార్ధనలు, స్తోత్రాలు..
తెలుగునాట ప్రాచుర్యంలో ఉన్న ఒక పద్యం.
ఇది పోతన రచించిన పద్యమని కొందరంటారు.

తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్
నీవునాయుల్లంబందున నిల్చి జృంభణముగా సుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా

పెక్కు సంస్కృత ప్రార్ధనా స్తుతులతో బాటు తెలుగులో కూడా అనేకానేక స్తోత్రాలున్నాయి. ఏదైనా రచన ఆరంభంలో గురువునూ, వినాయకునీ, తల్లిదండ్రులనూ, ఇష్ట దైవాన్నీ స్తుతించడం
తెలుగు సాంప్రదాయిక రచనలలో ఆనవాయితీ గనుక సరస్వతి స్తుతులు చాలా ఉండవచ్చును.
వాటిలో కొన్ని ఉదాహరణలు క్రింద ఇవ్వబడ్డాయి.

శ్రీ సరస్వతీ నిత్యపూజా విధానము
శ్రీ సరస్వతీ కవచం
శ్రీ మహాసరస్వతీ ధ్యానం
పుస్తక పూజ (అక్షరాభ్యాసం)
శ్రీ సరస్వతీ ప్రార్ధన
శ్రీ సరస్వతీ సహస్రనామ స్తోత్రం
శ్రీ సరస్వతీ సహస్ర నామావళి
శ్రీ సరస్వత్యష్టోత్తర శతనామ స్తోత్రం
శ్రీ సరస్వత్యష్టోత్తర శతనామావళి
శ్రీ సరస్వతీ ద్వాదశ నామస్తోత్రం
శ్రీ సరస్వతీ స్తోత్రము (అగస్త్య ప్రోక్తం)
శ్రీ సరస్వతీ సూక్తము
శ్రీ సరస్వతీ గాయత్రి.

( వివరాలు సేకరణ )