గోంగూర ఆరోగ్యపరంగా ఎంతో శ్రేష్టమైనది.
1. గోంగూరలో ఉండే పీచు పదార్ధం మన గుండెకు ఎంతో మేలుచేస్తుంది.
శరీరంలోని కొవ్వును కూడ నియంత్రిస్తుంది.
2. ఈ ఆకులో పొటాషియం ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండటం వలన రక్త ప్రసరణ
సక్రమంగా ఉండటమే కాకుండా , మన శరీరంలోని రక్తపోటును కూడ అదుపులో ఉంచడానికి
గోంగూర సహకరిస్తుంది.
3. గోంగూరలో విటమిన్ ఎ అధికంగా ఉండటం వలన మన కంటికి సంబంధించిన అనారోగ్య
సమస్యల నుండి కూడ గోంగూర మనలను రక్షిస్తుంది .
4. గోంగూరలో విటమిన్ సి, ఎ, బి6 ఉన్నాయి
5. మెగ్నీషియం, పొటాషియం, పుష్కలంగా ఉన్నాయి.
6. గోంగూరలో క్యాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉంటాయి
కాబట్టి రోజు వారీ ఆహారంలో గోంగూర ఉండేలా జాగ్రత్త పడితే ఎముకల
ఆరోగ్యం పటిష్టంగా ఉంటుంది.
7. శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగడానికి గోంగూర సహకరిస్తుంది.
8. రక్తంలో ఇన్సులిన్ స్థాయిని. పెంచి, షుగర్ లెవెల్స్ ని తగ్గించే శక్తి గోంగూరకు ఉంది.
9. గోంగూరలో ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ అత్యధికంగా ఉంటాయి.
10. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.
11. గుండె, కిడ్నీ వ్యాధులు, నివారించడానికి. గోంగూర సహాయపడుతుంది.
12. దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడేవాళ్లు
గోంగూరనుఏదో ఒక రూపంలో తీసుకుంట ఉంటే సహజ ఔషధంలా పనిచేస్తుంది.