పచ్చి చలిమిడి
కావలిసిన పదార్థాలు
1. బియ్యం ఒక కప్పు
2. బెల్లం అర కప్పు
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని 2 గంటలసేపు
నీళ్లు పోసి నానబెట్టాలి.
ఇలా నానిన బియ్యాన్ని శుభ్రం గా కడిగి
తడి లేకుండా ఆర బెట్టుకోవాలి .
ఆరిన బియ్యాన్ని మెత్తగా పొడిలా గ్రైండ్ చేసుకుని,
దీంట్లో బెల్లం వేసి ముద్దలా అయ్యేలా గ్రైండ్ చేసుకుని ,
ఒక ప్లేటులోకి తీసుకుని
కలుపుకుంటే పచ్చి చలిమిడి రెడీ.
పచ్చి చలిమిడి నాగుల చవితి కి ప్రసాదము గా చేస్తారు.
పచ్చి చలిమిడి తీసుకుని , కడుపు చలవ ఇమ్మని నాగేంద్ర స్వామిని ప్రార్ధిస్తారు.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi