Wednesday 27 May 2020

శ్రీ మహాలక్ష్మీ


శ్రీ మహాలక్ష్మీ

హరికిం బట్టపుదేవి,
పున్నెముల ప్రోవు, అర్ధంపు బెన్నిక్క,
చందురు తోబుట్టువు,
భారతీ గిరిసుతల్‌తో నాడు పూబోడి,
తామరలందుండెడి ముద్దరాలు,
జగముల్ మన్నించు నిల్లాలు,
భాసురతన్ లేములు వాపు తల్లి,
సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్

లక్ష్మి లేదా మహాలక్ష్మి లేదా శ్రీ హిందూ సంప్రదాయంలో సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖసంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవత.
త్రిమూర్తిలలో ఒకరైన విష్ణువు నకు ఇల్లాలు. క్షీర సాగర మధనం సమయంలో అవతరించింది.

సంస్కృతంలో "లక్ష్మి" అన్న పదానికి మూల ధాతువులు - లక్ష్ - పరిశీలించుట, గురి చూచుట .
ఇదే ధాతువును "లక్ష్యం" అనే పదంలో కూడా చూస్తాము. వేదాలలో లక్ష్యాయిధి లక్ష్మిః - అనగా జనులను ఉద్ధరించే లక్ష్యం కలిగినది - అని అన్నారు.

మహాలక్ష్మిని శ్రీ అని కూడా అంటారు. తమిళంలో తిరుమగళ్ అంటారు. ఆమె ఆరుసుగుణములు పరిపూర్ణముగా కలిగినది. నారాయణుని శక్తికి ఆమెయే కారణము. ఆమె విష్ణువునకు ఇల్లాలు.
సీతగా రాముని పెండ్లాడినది. రాధ, రుక్మిణి మరియు శ్రీకృష్ణుని భార్యలందరును లక్ష్మీదేవి అంశలే.

భోజన నియమాలు

భోజన నియమాలు

1. భోజనానికి ముందు,తరువాత తప్పక
కాళ్ళు, చేతులు కడుక్కోవాలి.
తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.

2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.

3. ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.)
తినే పళ్ళానికి తాకించరాదు.
అలా చేస్తే అవి ఎంగిలి అవుతాయి.
ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు.
చాలా దోషం.

4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.

5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.

6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు. తాకరాదు.

7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు.
ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే ..వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.

8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.

9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు.

10. ఉపనయనం అయినవారు తప్పక ఆపోశనము పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసుకుని భోజనం చేయాలి. ఉపనయనం కాని వారు భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి.

11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.

12. ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే ఆ పదార్థాలు
ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.

13. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే మంచం మీద భోజనం చేయరాదు.
(ఇది వృద్ధులకు, అనారోగ్యం ఉన్నవారికి వర్తించదు.)

14. మాడిన అన్నాన్ని నివేదించరాదు.
అతిథులకు పెట్టరాదు.

15. భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు.
(వెంట్రుకలు కత్తిరించడం)

16. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే
మనం తినగా మిగిలినవి పెట్టరాదు.
మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి.

17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు.

18. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి.

19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది.

20. భగవన్నామము తలుచుకుంటూ లేదా
భగవత్ కథలు వింటూ వంట వండడం,
భోజనం చేయడం చాలా ఉత్తమం.

21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని
ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు. ( అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానికి ఇబ్బంది అవ్వచ్చు)

22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం మధ్యలో తింటూ) వేదం చదువరాదు.

23. గిన్నె మొత్తం ఊడ్చుకుని తినరాదు .
ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.

24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.

25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు.

26. అరటిఆకుల వంటి వాటిలో భోజనం చేసిన వ్యక్తి వాటిని మడవకూడదు
(తిన్న విస్తరిని మడవడం అనాచారం).
తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.

27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రం.
(జగద్గురువైన శ్రీ కృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగం లో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది.)

28. భోజనం అయ్యాక రెండుచేతులూ,కాళ్ళూ కడుక్కోవాలి.
అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి.
నోరు నీటితో పుక్కిలించుకోవాలి.

29. భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి(మెతుకులు తీసేసి,తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి.(ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు.)

30. స్నానం చేసి మాత్రమే వంట వండాలని
కఠోర నియమము.
పెద్దలు,సదాచారపరులు హోటళ్ళలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం చేయకపోవడానికి ఇదే ముఖ్యకారణం. అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు,
పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం.
అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.

31. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు.
ద్విపాక దోషం వస్తుంది.

32. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు. వడ్డించరాదు.

సేకరణ ...

Saturday 23 May 2020

శ్రీకృష్ణతాండవ స్తోత్రమ్ |

భజే వ్రజైకనందనం సమస్తపాపఖండనం
స్వభక్తచిత్తరంజనం సదైవ నందనందనమ్ |
సుపిచ్ఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం
అనంగరంగసారగం నమామి సాగరం భజే || ౧ || 
మనోజగర్వమోచనం విశాంఫాలలోచనం
విఘాతగోపశోభనం నమామి పద్మలోచనమ్ |
కరారవిందభూధరం స్మితావలోకసుందరం
మహేంద్రమానదారణం నమామి కృష్ణ వారణమ్ || ౨ || 
కదంబసూనకుండలం సుచారుమండగండలం
వ్రజాంగనైక వల్లభం నమామి కృష్ణ దుర్లభమ్ |
యశోదయా సమోదయా సకోపయా దయానిధిం
హ్యులూఖలే సుదుస్సహం నమామి నందనందనమ్ || ౩ || 
నవీనగోపసాగరం నవీనకేళిమందిరం
నవీన మేఘసుందరం భజే వ్రజైకమందిరమ్ |
సదైవ పాదపంకజం మదీయ మానసే నిజం
దరాతినందబాలక-స్సమస్తభక్తపాలక || ౪ || 
సమస్త గోపసాగరీహ్రదం వ్రజైకమోహనం
నమామి కుంజమధ్యగం ప్రసూనబాలశోభనమ్ |
దృగంతకాంతలింగణం సహాస బాలసంగినం
దినే దినే నవం నవం నమామి నందసంభవమ్ || ౫ || 
గుణాకరం సుఖాకరం కృపాకరం కృపానవం
సదా సుఖైకదాయకం నమామి గోపనాయకమ్ |
సమస్త దోషశోషణం సమస్త లోకతోషణం
సమస్త దాసమానసం నమామి కృష్ణబాలకమ్ || ౬ || 
సమస్త గోపనాగరీ నికామకామదాయకం
దృగంతచారుసాయకం నమామి వేణునాయకమ్ |
భవో భవావతారకం భవాబ్ధికర్ణధారకం
యశోమతే కిశోరకం నమామి దుగ్ధచోరకమ్ || ౭ || 
విముగ్ధముగ్ధగోపికా మనోజదాయకం హరిం
నమామి జంబుకాననే ప్రవృద్ధవహ్ని పాయనమ్ |
యథా తథా యథా తథా తథైవకృష్ణసర్వదా
మయా సదైవగీయతాం తథా కృపా విధీయతామ్ || ౮ || 
ఇతి శ్రీకృష్ణతాండవ స్తోత్రమ్ |

అచ్యుతాష్టకం 2

అచ్యుతాచ్యుత హరే పరమాత్మన్
రామ కృష్ణ పురుషోత్తమ విష్ణో |
వాసుదేవ భగవన్ననిరుద్ధ
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || ౧ || 
విశ్వమంగళ విభో జగదీశ
నందనందన నృసింహ నరేంద్ర |
ముక్తిదాయక ముకుంద మురారే
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || ౨ || 
రామచంద్ర రఘునాయక దేవ
దీననాథ దురితక్షయకారిన్ |
యాదవేంద్ర యదుభూషణ యజ్ఞ-
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || ౩ || 
దేవకీతనయ దుఃఖదవాగ్నే
రాధికారమణ రమ్యసుమూర్తే |
దుఃఖమోచన దయార్ణవ నాథ
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || ౪ || 
గోపికావదనచంద్రచకోర
నిత్య నిర్గుణ నిరంజన జిష్ణో |
పూర్ణరూప జయ శంకర శర్వ
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || ౫ || 
గోకులేశ గిరిధారణ ధీర
యామునాచ్ఛతటఖేలనవీర |
నారదాదిమునివందితపాద
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || ౬ || 
ద్వారకాధిప దురంతగుణాబ్ధే
ప్రాణనాథ పరిపూర్ణ భవారే |
జ్ఞానగమ్య గుణసాగర బ్రహ్మన్
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || ౭ || 
దుష్టనిర్దళన దేవ దయాళో
పద్మనాభ ధరణీధర ధన్విన్ |
రావణాంతక రమేశ మురారే
శ్రీపతే శమయ దుఃఖమశేషమ్ || ౮ || 
అచ్యుతాష్టకమిదం రమణీయం
నిర్మితం భవభయం వినిహంతుమ్ |
యః పఠేద్విషయవృత్తినివృత్తిం
జన్మదుఃఖమఖిలం స జహాతి || ౯ || 
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం అచ్యుతాష్టకం |

అచ్యుతాష్టకం 1

అచ్యుతం కేశవం రామ నారాయణం
కృష్ణ దామోదరం వాసుదేవం హరిమ్ |
శ్రీధరం మాధవం గోపికావల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే || ౧ ||
అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికాఽరాధితమ్ |
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే || ౨ ||
విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే
రుక్మిణీరాగిణే జానకీజానయే |
వల్లవీవల్లభాయాఽర్చితాయాత్మనే
కంసవిధ్వంసినే వంశినే తే నమః || ౩ ||
కృష్ణ గోవింద హే రామ నారాయణ
శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే |
అచ్యుతానంత హే మాధవాధోక్షజ
ద్వారకానాయక ద్రౌపదీరక్షక || ౪ ||
రాక్షసక్షోభితః సీతయా శోభితో
దండకారణ్యభూపుణ్యతాకారణమ్ |
లక్ష్మణేనాన్వితో వానరైస్సేవితో-
ఽగస్త్యసంపూజితో రాఘవః పాతు మామ్ || ౫ ||
ధేనుకారిష్టహానిష్టకృద్ద్వేషిణాం
కేశిహా కంసహృద్వంశికావాదకః |
పూతనాకోపకః సూరజాఖేలనో
బాలగోపాలకః పాతు మామ్ సర్వదా || ౬ ||
విద్యుదుద్యోతవత్ప్రస్ఫురద్వాససం
ప్రావృడంభోదవత్ప్రోల్లసద్విగ్రహమ్ |
వన్యయా మాలయా శోభితోరఃస్థలం
లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే || ౭ ||
కుంచితైః కుంతలైర్భ్రాజమానాననం
రత్నమౌళిం లసత్కుండలం గండయోః |
హారకేయూరకం కంకణప్రోజ్జ్వలం
కింకిణీమంజులం శ్యామలం తం భజే || ౮ ||
అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం
ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ |
వృత్తతస్సుందరం వేద్య విశ్వంభరం
తస్య వశ్యో హరిర్జాయతే సత్వరమ్ || ౯ ||

Wednesday 20 May 2020

భస్మం/విభూది

భస్మం/విభూది

కైలాసం నుండి శంకరుడు బ్రాహ్మణుని వేషములో ఒకనాడు రాముడి వద్దకు వెళ్లేను రాముడు మీ యొక్క నామమును నివాసమును తెలుపుమని అడుగగా
" నా పేరు శంభుడు నేను కైలాసం నా యొక్క నివాసము అని రాముడికి చెప్పగా గ్రహించి అతనిని శంకరునిగా గ్రహించి రాముడు వీభూతి యొక్క మహిమ ను తెలుపవలసినిదని అని అడుగగా శివుడు చెప్పసాగెను .
" రామ భస్మమహత్యమును చెప్పుటకు బ్రహాదులకు కూడా శక్యము కాదు బట్టమీది చారలను అగ్ని కాల్చినట్లు మన నుదుట బ్రహ్మ వ్రాసిన వ్రాతలను కూడా తుడిచివేయగలిగే శక్తి భస్మంనకు ఉన్నది విభూతిని మూడు రేఖలుగా పెట్టుకున్నచో త్రిమూర్తులను మన దేహముమీద ధరించినట్లగును ,
ముఖమున భస్మమును ధరించిన నోటి పాపములను (తిట్టుట చెడు మాటలు పలుకుట ,
అభక్ష్యములను తినకూడని పధార్థములను తినడం అనుపాపములు)
చేతులపై ధరించిన
చేతిపాపములను ( కొట్టటం మొ") హ్రదయముపై ధరించిన మనఃపాతకములను (దురాలోచనాలు మొదలైనవి)
పాపములను భర్త్సనము చేసి (బెదిరించి) పోగొట్టునది కావున భస్మము అని పేరు దీనికి కలిగెను భస్మము మీద పడుకొన్నను తిన్నను
ఒంటికి పూసుకున్నను పాపములన్ని భస్మీభూతములు అగును
ఆయువు పెరుగును గర్భిణి స్త్రీలకు
సుఖ ప్రసవం కలిగించును
సర్ప వృశ్చికాదీ దోషములను హరించును భూత పిశాదులను పారద్రోలును
ఆవుపేడ పిడుకలను శతారుద్రీయ(నమకము)మంత్రముచేప్పుచు కాల్చి భస్మము చేయవలెను మంత్రములు రాకున్నచో ప్రణవము ఉచ్చరించుచు ధరింపవలెను.
ఓం మంత్రము రానీ వారు
ఓం నమశ్శివాయ మంత్రముచే భస్మమును ధరించుట శ్రేష్టం అని ''పద్మ పురాణము లో చెప్పబడినది.

Sunday 17 May 2020

దేవతల ప్రీత్యర్ధం సమర్పించవలసిన నైవేద్యాలు


దేవతల ప్రీత్యర్ధం సమర్పించవలసిన నైవేద్యాలు

శ్రీ వేంకటేశ్వరస్వామి:

శ్రీ వేంకటేశ్వరస్వామికి వడపప్పు, పానకము, నైవేద్యం పెట్టవలెను. తులసిమాల మెడలో ధరింపవలెను.

వినాయకుడు:

వినాయకునకు బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజింపవలెను.

ఆంజనేయస్వామి:

ఆంజనేయస్వామికి అప్పములు నైవేద్యం, తమలపాకులతోనూ గంగసింధూరంతోనూ పూజింపవలెను.

సూర్యుడు:

సూర్యుడుకు మొక్కపెసలు, క్షీరాన్నము నైవేద్యం.

లక్ష్మీదేవి:

లక్ష్మీదేవికి క్షీరాన్నము, తీపిపండ్లు, నైవేద్యం, తామరపూవులతో పూజింపవలెను.

లలితాదేవి:

లలితాదేవికి క్షీరాన్నము, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన పానకము, వడపప్పు, చలిమిడి, పానకము.

సత్యన్నారాయణస్వామి:

సత్యన్నారాయణస్వామికి ఎర్ర గోధుమనూకతో, జీడిపప్పు, కిస్ మిస్, నెయ్యి కలిపి ప్రసాదము నైవేద్యం.

దుర్గాదేవి:

దుర్గాదేవికి మినపగారెలు, అల్లం ముక్కలు, నైవేద్యం.

సంతోషీమాత:

సంతోషీమాతకు పులుపులేని పిండివంటలు, తీపిపదార్ధాలు.

శ్రీ షిర్డీ సాయిబాబా:

శ్రీ షిర్డీ సాయిబాబాకు పాలు, గోధుమరొట్టెలు నైవేద్యం

శ్రీకృష్ణుడు:

శ్రీకృష్ణునకు అటుకులతోకూడిన తీపిపదార్ధాలు, వెన్న నైవేద్యం. తులసి దళములతో పూజించవలెను.

శివుడు:

శివునకు కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా, మారేడు దళములు, నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి.

కొత్తిమీర పచ్చడి


కొత్తిమీర పచ్చడి

కావలిసిన పదార్ధాలు
1. ఆవాలు 2 స్పూన్స్
2.మెంతులు 2 స్పూన్స్
3.ఎండు మిరపకాయలు 10
4. ఇంగువ కొంచెం
5. చింత పండు నిమ్మ కాయ అంత
6. బెల్లం చిన్న ముక్క
7.ఉప్పు తగినంత

తయారీ విధానం
ముందుగా మూకుడు తీసుకుని అందులో
2 స్పూన్స్ నూని వేసి దానిలో
2 చెంచాలు ఆవాలు
2 చెంచా మెంతులు
10 ఎండు మిరపకాయలు
కొంచం ఇంగువ వేసి వెయించాలి.
తరువాత
నిమ్మకాయ అంత చింతపండు వేరే గిన్నె లో నీళ్లు పోసి నానపెట్టి మెత్తని గుజ్జుగా చేసుకొవాలి .
దానిలో కొంచెం బెల్లం ,
తగినంత ఉప్పు పసుపు వేసి
చివర గా కొత్తిమీర పచ్చిది వేసి
గ్రైండర్ లో మెత్తగా చెయ్యాలి .
కొంచము నీళ్ళు మరగిన్చి ఉంచుకొని మెత్తగా రావాలంటే ఈ నీళ్లు కాసిని పొయాలి.
అంతే కొత్తిమీర పచ్చడి రెడీ...

కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు

కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు

హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.

1. విద్యా ప్రాప్తికి:-
పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!

2. ఉద్యోగ ప్రాప్తికి :-
హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!

3. కార్య సాధనకు :-
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!

4. గ్రహదోష నివారణకు :-
మర్కటేశ మహోత్సాహా సర్వ గ్రహదోష నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!

5. ఆరోగ్యమునకు :-
ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!

6. సంతాన ప్రాప్తికి :-
పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!

7. వ్యాపారాభివృద్ధికి :-
సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!

8. వివాహ ప్రాప్తికి :-
యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!

Saturday 16 May 2020

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం

నవగ్రహాల అనుగ్రహాన్ని కలిగించే
శ్రీ ఆంజనేయస్వామి వారిని పూజిస్తే
సకల దేవతలని పూజించిన ఫలితం వస్తుందని పరాశర సంహిత'లో ఉంది.

నవగ్రహాల అనుగ్రహం త్వరగా పొందాలంటే వాల్మీకి రామాయణం లోని ఈ 9 శ్లోకాలు నిత్యం పారాయణ చేయడం మంచిది.

నవగ్రహాలు అత్యంత కరుణా స్వరూపులు. మనం పూర్వజన్మలలో చేసిన పుణ్యపాపాల బట్టి ఫలితాలని ఇస్తారు.

కానీ భక్తితో వారిని ఇటువంటి స్తోత్రాలతో స్తుతిస్తే శుభఫలితాల్ని అనుగ్రహిస్తారు.

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా శ్లోకాల పారాయణం వల్ల విద్యార్థులకు మేధస్సు, ఉద్యోగస్తులు, వ్యాపారులకు అభివృద్ధి, స్త్రీలకు వివాహం, సత్సంతానము మరియు వృద్దులకు ఆరోగ్యం కలుగుతుంది.

నిత్యం లేదా శనివారం అయినా వీటిని పారాయణ చేయడం వలన శుభఫలితాలని పొందవచ్చు.

వాల్మీకి రామాయణమునకు సుందరకాండ తలమానికము.సుందరకాండ సారమైన 9 శ్లోకములతో ఏర్పడినదే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం.

రత్నములవంటి తొమ్మిది శ్లోకములను ఒక మాలగా కూర్చి శ్రీ ఆంజనేయస్వామి వారికి సమర్పించబడినది. ఈ తొమ్మిది శ్లోకములు తొమ్మిది గ్రహములకు చెందునని చెప్పబడినది.

ఇవి శ్రీ ఆంజనేయస్వామి వారి వైభవము, స్వామి వారికి నవ గ్రహములతో గల సంబంధము తెలియబర్చును. ఈ స్తోత్రం పారాయణ చేసినవారికి శ్రీ ఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో బాటు నవగ్రహముల అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పబడినది.

శ్లోకము తత్సంబంధిత గ్రహము, రత్నముల వివరములు స్తోత్రంలో తెలుపబడినవి. నవగ్రహములకు ఆయా శ్లోకములతో జపముచేసి ఫలితం పొందవచ్చునని చెప్పబడినది.

మాణిక్యం (సూర్యుడు)..
తతో రావణనీతాయా: సీతాయాశ్శత్రుకర్శన: |
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ||

అర్థము : అనంతరము అరివవీర భయంకరుడైన ఆంజనేయుడు రావణాపహృతయైన సీతజాడను అన్వేషించుటకై చారణాది దివ్యజాతులవారు సంచరించు ఆకాశమార్గమున వెళ్ళుటకు నిశ్చయించుకొనెను.

ముత్యం (చంద్రుడు).
యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ |
స్మృతిర్మతిర్ధృ తిర్ధాక్ష్యం స కర్మసు న సీదతి ||

అర్థము : నీవలె గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వముగలవాడు తన కార్యసిద్ధి యందు ఎన్నడును వైఫల్యమును పొందడు.

పగడం (కుజుడు).
అనిర్వేద: శ్రియో మూలం అనిర్వేద: పరం సుఖం |
అనిర్వేదో హి సతతం సర్వార్ధేషు ప్రవర్తక: ||

అర్థము : దిగులుపడకుండా ఉత్సాహముతో నుండుటవలన కార్యసిద్ధియు, పరమ సుఖము కలుగును. ఎల్లవేళలను అన్ని సందర్భములలో ఉత్సాహము కలిగి యుండటయే శ్రేయస్కరము.

మరకతం (బుధుడు).
నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చతస్యై జనకాత్మజాయై |
నమోస్తు రుద్రేంద్రయమనిలేభ్య:
నమోస్తు చంద్రార్కమరుద్గణభ్య: ||

అర్థము : శ్రీరామునకు నమస్కారము. జనకసుతయైన సీతామాతకు ప్రణతి, లక్ష్మణునకు నమస్కారము, వాయుదేవునకు నమస్కారములు. సూర్యచంద్రులకును మరుద్దేవతలకును నమస్కారములు.

హీరకం (శుక్రుడు)
రామ: కమలపత్రాక్ష: సర్వసత్త్వమనోహర: |
రూపదాక్షిణ్యసంపన్న: ప్రసూతో జనకాత్మజే ||

అర్థము : ఓ జానకీ! శ్రీరాముడు కమలపత్రముల వంటి కన్నులుగలవాడు. తన నిరుపమానకాంతిచే సమస్త ప్రాణులకును ఆనందమును గూర్చువాడు. పుట్టుకతోనే అతడు చక్కని దేహసౌందర్యము, గుణసంపదయు గలవాడు.

ఇంద్రనీలం (శని)..
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల: |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణ: ||

అర్థము : మహాబలసంపన్నుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. అసహాయ శూరుడు, కోసలదేశప్రభువు ఐన శ్రీరామునకు నేను దాసుడను.

గోమేదికం (రాహువు)..
యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తప: |
యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమత: ||

అర్థము : నేను పతిసేవాపరాయణనే ఐనచో, తపమాచిరించియున్నచో, నేను నిష్కలంక పతివ్రతనైనచో ఓ అగ్నిదేవా! హనుమంతుని చల్లగా చూడుము.

వైడూర్యం (కేతువు)..
నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమం |
అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం ||

అర్థము : శత్రుమర్ధనుడైన శ్రీరాముడు వనవాసము ముగిసిన పిమ్మట నీతోగూడి అయోధ్య యందు పట్టాభిషిక్తుడగుటను నీవు త్వరలో చూడగలవు.

ఇతి శ్రీ ఆంజనేయ నవరత్న మాలా స్తోత్రం సంపూర్ణం.

Thursday 14 May 2020

శ్రీలక్ష్మీ_గణపతి_స్త్రోత్రం


శ్రీలక్ష్మీ_గణపతి_స్త్రోత్రం

(సర్వ_ఆరోగ్య_సిద్ధి)

ఓం నమో విఘ్న రాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే!
దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే!
లంబోదరం మహావీరం నాగ యజ్ఞోప శోభితం!
అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం!
ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః హేరంబాయ
నమో నమః!!

స్వసిద్ధి ప్రదోహాసి త్వం సిద్ధి బుద్ధి ప్రదో భవ!
చిన్తితార్ధ ప్రదస్త్వం హి సతతం మోదక ప్రియ!
సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక!
ఇదం గణపతి స్త్రోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః!!
తస్యదేహం చ గేహం చ స్వయం లక్ష్మీర్నముంచతి!!

ఇతి శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం సంపూర్ణం.

Tuesday 12 May 2020

శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్రం

శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్రం

అస్య శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్రమహామంత్రస్య అగస్త్యోభగవానృషిః | అనుష్టుప్ఛందః | సుబ్రహ్మణ్యో దేవతా | మమేష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః |

ధ్యానం |
షడ్వక్త్రం శిఖివాహనం త్రిణయనం చిత్రాంబరాలంకృతాం |
శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకమ్ ||
పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దధానం సదా |
ధ్యాయేదీప్సితసిద్ధిదం శివసుతం స్కందం సురారాధితం ||

ప్రథమోజ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవ చ |
అగ్నిగర్భస్తృతీయస్తు బాహులేయశ్చతుర్థకః ||

గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః |
సప్తమః కర్తికేయశ్చ కుమరశ్చాష్టమస్తథా ||

నవమః షణ్ముఖః ప్రోక్తః తారకారిః స్మృతో దశ |
ఏకాదశశ్చ సేనానీః గుహో ద్వాదశ ఏవ చ ||

త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః |
క్రౌంచదారీ పంచదశః షోడశః శిఖివాహనః ||

షోడశైతాని నామాని యో జపేద్భక్తిసంయుతః |
బృహస్పతిసమో బుద్ధ్యా తేజసా బ్రహ్మణస్సమః ||

కవిత్వేచ మహాశస్త్రే జయార్థీ లభతే జయం |
కన్యార్థీ లభతే కన్యాం జ్ఞానార్థీ జ్ఞానమాప్నుయాత్ ||

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ ధనమశ్నుతే |
యద్యత్ప్రార్థయతే మర్త్యః తత్సర్వం లభతే ధృవం ||

ప్రేమంటే ఇదే...కధ

ప్రేమంటే ఇదే
మేఘాలు కమ్ముకుంటున్నాయి... 
వర్షం మొదలయ్యింది..
గాలి బాగా వీస్తోంది.
చెట్లు ఊగి పోతున్నాయి.. కరెంట్ లేదు
అంతా చీకటి..
పడవ ని ఒడ్డున తాడుతో కట్టేసాడు వీరయ్య...ఈ వర్షం ఒకటి తెగ కురిసేత్తోంది... ఎక్కడా తెరిపి ఇచ్చే టట్లు గా లేదు... ఇవాళ్టి కి ఓ చుక్క ఏసుకుని పడుకోవడమే... అనుకుంటూ కల్లు పాక చేరాడు.. అక్కడ లాంతరు వెలుగు చిన్నగా వస్తోంది...పాక చూరు లోంచి వర్షం చుక్కలు ధారగా పడుతూ ఉన్నాయి...
సూరి గాడు అక్కడే ఉన్నాడు... రారా వీరయ్య.. ఈయ్యేల దాకా ఏంచేస్తున్నావు...
ఇంత వాన లో కూడా పడవ ఏసేద్దామనే...
అన్నాడు..
అదేం లేదు...నది చాలా వేగం గా ఉంది.. పడవని ...ఒడ్డున కట్టేసి వచ్చా... అయిన ఇంత చీకట్లో, ఈ వర్షం లో రేవు దాటే వాళ్ళు ఎవరుంటారు... అన్నాడు...
ఓ చుక్క ఎత్తవా... అని అడిగాడు... సూరి
ఇయ్యాల బేరం లేదు... డబ్బులు నువ్వే ఇయ్యాల మరి... అన్నాడు వీరయ్య...
అలాగే ఇత్తా గాని కానియ్...
ఒరేయ్ ఆడికి ఇయ్యాల మన ఖాతాలో ఏసేయ్... అన్నాడు.
ఫుల్ గా.. తాగేసి అక్కడే పడిపోయాడు...
ఒరేయ్ వీరిగా అంటూ పిలిచాడు...
లేవట్లేదు.. ఇంత వర్షం లో ఈడిని తీసుకు వెళ్ళేది లేదు కానీ... ఇక్కడే పడి ఉండని... రేపు లేచి ఆడే పోతాడు... అంటూ షాప్ వాడికి చెప్పి..
బయలు దేరాడు సూరి..
వాన పెద్దది గానే ఉంది ..గొడుగు వేసుకుని సైకిల్ నడిపించుకుంటు బయలుదేరాడు.. సూరి..
***
ఇంతలో గోడ మీద నుండి ఒక బాగ్ బయట పడింది.
అక్కడే గొడుగు తో ఉన్న రాజేష్ ఆ బాగ్ తీసుకున్నాడు.
కళ్ళు కనిపించట్లేదు..
గోడ మీద నుండి కిందకి దూకింది మాధవి.
రా రా తొందరగా...
మళ్ళీ ఎవరైనా చూస్తే సమస్య...అన్నాడు చెయ్యి పట్టుకుని లేపుతూ...
పద పద అంటూ గొడుగు వేసుకుని ..వీధుల్లో జాగ్రత్తగా ఎవరూ లేకుండా చూసు కుంటూ బయలుదేరారు.
ఈ వీధి దాటితే మనం తొందరగా నది ఒడ్డు కి చేరుకుంటాం... అంటూ వడి వడి గా నడవ సాగారు...
వీళ్ళిద్దరూ వెళ్లడం అజయ్  పాలేరు  సూరి...చూసాడు...
ఎవరూ అమ్మాయి గారి లా ఉందే .
ఇంత వర్షం లో ఎక్కడికి వెడుతున్నారు..
అమ్మాయి గారూ అంటూ పిలిచాడు..
అమ్మో వీడు చూసేసాడు...
తొందరగా పద అంటూ పరిగెత్తింది రాజేష్ చెయ్యి పట్టుకుని...
వాడు రాజేష్ లాగా ఉన్నాడు...
ఈ విషయం వెంటనే అయ్యగారి కి చెప్పాలి అంటూ,
గొడుగు ముడిచి ,సైకిల్ తొక్కుకుంటు... బయలు దేరాడు.
అయ్యా అయ్యా...అంటూ గట్టిగా అరిచాడు గేటు బైట నుంచుని.
కాపలా కాస్తున్న వాళ్ళు ....
ఏరా ఇంత వర్షం లో వచ్చావు...
రేపు రా , అయ్యగారు బిజీ గా ఉన్నారు అన్నాడు.
లేదు ...నేను ఒక ముఖ్య మైన విషయం మాట్లాడాలి..
కొంచెం చెప్పు... తొందరగా అన్నాడు...
ఏమిటి నాతో చెప్పు అన్నాడు..
అది అయ్యగారి విషయం ఆయనకి చెప్పకుండా నీకు చెప్పలేను...
తొందరగా నన్ను అయ్యగారి దగ్గరకి తీసుకు వెళ్లు. అన్నాడు..
సరే రా అంటూ గేట్ తీసి , లోపలికి తీసుకుని వెళ్ళాడు.
లోపల
అజయ్ కూర్చుని మందు తాగుతున్నాడు.
ఏరా ఇలా వచ్చావు.. అన్నాడు .
అయ్యా తమతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి...అని పక్కన ఉన్న అతని వైపు చూసాడు...
నువ్వు బయట ఉండు... అన్నాడు.
సరే అండీ అంటూ బైటకి వెళ్ళాడు...
ఇప్పుడు చెప్పు ఏమి జరిగింది.అని అడిగాడు... ఇందాక అమ్మాయిగారూ..
ఆ రాజేష్ గాడు నది వైపు వెళుతుండగా చూసాను.. చేతిలో బాగ్ ఉంది... నేను పిలిస్తే పలకలేదు..
పైగా వినబనట్టు వెళ్లిపోయారు. నాకేదో అనుమానం గా ఉంది...అందుకే మీ దగ్గరకి పరిగెత్తుకుని వచ్చాను... అన్నాడు...
ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు... అజయ్
.. ఎంత సేపు  అయ్యింది అన్నాడు...కోపం గా..
ఇప్పుడే అండీ...
రచ్చ బండ దగ్గర చూసాను...
నది బాగా పోటు మీద ఉంది...
వీరి గాడు వర్షం కదా అని తాగేసి పడుకున్నాడు...
పడవ లేదుకదా అని మీతో చెపుదామని వచ్చాను. అన్నాడు.
ఎవర్రా అక్కడ అని అరిచాడు..
వెంటనే నలుగురు పరిగెత్తుకుని వచ్చారు.. అమ్మాయి గారిని ఆ రాజేష్ గాడు తీసుకు పోతున్నాడు..
నది వైపు కి వేడుతున్నారు ట...
వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఊరు దాట కూడదు... తొందరగా వెళ్ళండి....అంటూ ఆజ్ఞా పించాడు...
ఆ రాజేష్ గాడి కాళ్ళు చేతులు విరిచయిన సరే...తీసుకు రండి..
అమ్మాయి గారు జాగ్రత్త...అంటూ పురమాయించాడు...
అందరూ బయలుదేరి వెళ్లారు.
కొంత దూరం వెళ్ళాక జీపు లు బురదలో ఆగిపోయాయి.. కిందకి దిగి కత్తులు కర్రలు పుచ్చుకుని  టార్చ్ లైట్ లు వేసుకుంటూ...పరిగెత్తారు ...
మాధవి రాజేష్ లు నది ఒడ్డుకి చేరుకున్నారు... నది చాలా స్పీడ్ గా ఉంది..
వీరి గాడు లేడు.. ఇప్పుడు ఎలా...
నే వెళ్లి వాడిని తీసుకుని వస్తా అన్నాడు..
వద్దు వాళ్ళు మనల్ని చుసేసారు.ఇంకాసేపట్లో వచేస్తారు... ఎలాగై నా నది దాటేయాలి అంది మాధవి..
ఇంతలో దూరం గా టార్చ్ వెలుగు లు కనిపించాయి.అదిగో వాళ్ళు వచేస్తున్నారు... మనం పడవ తీసేద్దాం అంది మాధవి.
సరే అంటూ పడవ తాడు విప్పాడు...
ఇద్దరూ అందులో కూర్చుని... ఒక్క నిమిషం అంటు మళ్ళీ దిగాడు... ఏంటి మళ్ళీ అంది ...వాళ్ళు ఇంకో పడవలో వచ్చేస్తే... దాన్ని నదిలో వదిలేస్తే వాళ్ళు మన వెనుక రాలేరు అంటూ రెండో పడవ తాళ్ళు విప్పేసాడు.. ముందుకి తోసేశాడు... అది నెమ్మది గా నదిలోకి వెళ్ళిపోయింది.. అప్పుడు రాజేష్ కూడా పడవ ఎక్కి తెడ్డు వేయసాగాడు.. గట్టిగా పట్టుకో చాలా వేగంగా ఉంది నది..అన్నాడు.
ఇంతలో పరిగెత్తు కుని వచ్చి నవాళ్ళకి అక్కడ ఏమి కనబడలేదు..
టార్చ్ వేస్తే దూరంగా పడవ కనబడింది..ఐరెయ్ తొందరగా రెండో ది తీయాండ్రా అన్నారు...
అన్నా అది కూడా నదిలో కి వెళ్ళిపోయింది...
ఇంత స్పీడ్ గా ఉన్న నదిని ఈదడం కష్టం...వెళ్లి ఆయ్యగారికి చెపుదాం.. ఆయనే చూసుకుంటాడు..అంటూ వెనక్కి వెళ్లారు..
ఏమయ్యింది రా అంటూ అడిగాడు... అయ్యా పడవలో వెళ్లిపోయారు...రెండవ పడవ కూడా నది లోకి వదిలేసి పోయారు.. నది చాలా వేగం గా ఉంది ...ఈదడం కష్టమని వచ్చేసాం...అన్నాడు...
ఎడవలేక పోయారు... సరే రేపట్నుంచి అన్ని చోట్లా వెదకండి...అన్నాడు...
మరునాడు దిగాలు గా ఉన్న అక్క బావ ని పలక రించడానికి..వెళ్ళాడు అజయ్.
బాధ పడకు అక్కా అన్ని చోట్లా వెదికిస్తున్నా..
త్వరలోనే నీదగ్గరికి తీసుకుని వచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పి... వెళ్లి పోయాడు...
భగవంతుడా అమ్మాయి ఈ దుర్మారుడికి దొరక్కుండా చూడు స్వామి... ఆస్తి కోసం చేసుకుంటున్నాడు... ఆమె ఎక్కడ ఉన్నా సుఖం గా ఉండేటట్లు చూడు స్వామి అంటూ మనసులో నే ప్రార్ధించింది... శ్యామలమ్మ...
చూడు శ్యామలా రమేష్ మంచివాడు... బాగా చూసుకుంటాడు.. లేచిపోయింది అని బాధ తప్ప మిగతా ఏ అభ్యంతరం లేదు.. అలాగని ఊరిలో ఉంటే ఈ దుర్మార్గుడికి ఇచ్చి చేయాల్సి ఉంటుంది... బాధ పడకు...జరగాల్సింది ఏదో జరుగుతుంది... ఆ భగవంతుడు ని నమ్ముకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమి లేదు అన్నాడు...జగపతి...
*******
యువర్ అటెన్షన్ ప్లీస్ ఎక్స్ప్రెస్ ఒకటవ నంబరు ప్లాట్ ఫారం మీదకి మరికొద్ది సేపట్లో వచ్చుచున్నది అని అనౌన్స్ మెంట్ వినిపించింది...
ట్రైన్ వచ్చి ఆగింది అందులోనించి దిగాడు మహేష్... బాగ్ తీసుకుని స్టేషన్ బైటకి వచ్చాడు.. అక్కడి నుంచి నది ఒడ్డుకి వచ్చి అవతలి ఒడ్డుకి వెళ్ళడానికి ఎదురు చూస్తున్నాడు.ఇంతలో పడవ వచ్చింది... అందరూ ఎక్కాక బయకుదేరింది..
ఎమ్ వీరయ్య బాగున్నావా అంటూ పలక రించాడు మహేష్... ఎవరు మహేష్ బాబా....గుర్తు పట్టలేక పోయాను బాబు...చాలాకాలం అయిపోయింది కదా..అయిన మీరు చాలా మారిపోయారు...ఇంగ్లీష్ దొర లాగా ఉన్నారు... ఊరిలో పని ఉందా సారు అని ప్రశ్నించాడు... అవును ...ఇంకా ఏమిటి విశేషాలు.. ఊరిలో అందరూ ఎలా ఉన్నారు.. అని అడిగాడు... ఏముంది బాబు మా బతుకు లు చెప్పడానికి.. ఆ అజాయ్ లాంటి వాళ్ళు ఉన్నంత వరకు మా బతుకులు బాగుపడవు.. అన్నాడు...అదేమిటి జగపతిబాబు గారు ఉన్నారుగా అన్నాడు..పాపం ఆయన సంగతి ఏమి చెబుతాము అండీ... ఆయన కధ వింటే జాలి వేస్తుంది... అదేమిటి ఏమయింది ఆయనకి అన్నాడు కంగారుగా.. ఏమి చెపుతాం అండి ఆ అజయ్ ఆస్థి కోసం మాధవి అమ్మగార్ని చేసుకునేందుకు ప్రయత్నింనించాడు...అది ఆయనికి వాళ్ళ అమ్మాయికి ఇష్టం లేదు...చాలా పెద్ద గొడవ చేసాడు... ఆయన ఆస్తి పాస్తులు అన్ని అతని కంట్రోల్ లో నే ఉన్నాయి... ఈ లోగా ఆమె మధు అని మీ స్నేహితుడితో..ఊరు వదిలి వెళ్లి పోయింది... కొంతమంది అజయ్ కి భయపడి పారిపోయింది అంటున్నారు... కొంతమంది అతనిని ప్రేమించి అతనితో లేచి పోయింది అనుకుంటున్నారు...నిజం ఎవరికి తెలియదు... ఈ దుర్మార్గుడు ఆమె కోసం ఇంకా వెతికిస్తూనే ఉన్నాడు... అది అండి... జరిగింది... అన్నాడు ....
అయ్యో ఎంత పని జరిగింది... నేను ఒకసారి ఆయనని కలిసి వస్తాను.. పాపం నేను చదువు కునే అప్పుడు చాలా సహాయం చేసారు... అన్నాడు.. మహేష్
ఆపని చేయండి బాబు...కొంత అయినా బాధ తగ్గుతుంది... ఎవరిని రానివ్వట్లేదు... ఎవరితో మాట్లాడట్లేదు ఆయన ...
అన్నాడు వీరయ్య.. పడవ ఒడ్డుకి చేరింది... డబ్బులు ఇచ్చి జగపతి గారింటికి బయలు దేరాడు మహేష్...
గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు... పడక కుర్చీ లో పడుకుని ఉన్నారు జగపతి గారు..గెడ్డం పెరిగి పోయింది... చిక్కి పోయి ఉన్నారు... నమాస్తే అండి... అన్నాడు మహేష్... ఎవరూ అంటూ కళ్ళు తెరిచారు.. నేనండి మహేష్ ని...అంటూ ముందుకి వచ్చాడు... రా బాబు లోపలికి వెళ్లి మాట్లాడుకుందాము..అంటూ లోపలికి వెళ్లారు... శ్యామల మహేష్ వచ్చాడు... దూరం నించి వచ్చాడు భోజన ఏర్పాట్లు చూడు... అన్నాడు...నువ్వు ముందు కాళ్ళు కడుక్కుని రా భోజనాలు అయ్యాక మాట్లాడు కుందాము అన్నారు...పని వాడికి ఇతని బాగ్ లోపల పెట్టించు... స్నానానికి ఏర్పాట్లు చెయ్ అంటూ పురమాయించారు.. సరే సర్ ...అంటూ లోపలికి వెళ్ళాడు... భోజనాలు అయ్యాక... ఆయన గదికి వెళ్ళాడు మహేష్... సర్ ఏమిటి జరిగింది... మీరు ఇలా ఎందుకు అయిపోయారు... మాధవి ఎక్కడ...అంటూ ప్రశ్నించాడు.. చెపుతా అన్నీ వివరం గా ఆ తలుపు వేసి రా అంటూ చెప్పారు..మహేష్ తలువు వేసి వచ్చాడు.. ఇప్పుడు చెప్పండి అంకల్.. నేను మీ దగ్గరకి వచ్చి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని అడిగితే మీరు కాదు అన్నారు.. నా దగ్గర డబ్బు లేదు అన్నారు..నా దగ్గర డబ్బు లేక పోవచ్చు కానీ చదువు ఉంది కదా...మంచి ఉద్యోగం సంపాదించి బాగా చూసుకుంటాను అని అంటే మీరు ముందు సంపాదించు అన్నారు..నాకు కొంచెం గడువు కావాలి అంటే 5 ఇయర్స్ టైం ఇస్తా.. కానీ తరువాత నికోసం ఎదురు చూడకుండా పెళ్లి చేసేస్తా అని చెప్పారు.. నేను కష్ట పడి మాధవిని ఒప్పించా... ఇంతలో మీకు ఏమైనది... ఇలా జరిగింది... అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు....
ఎమ్ చేయమంటావ్ అజయ్ దాన్ని పెళ్లి చేసుకోవడానికి కుట్ర పన్నాడు... నేను ఏమి చేయలేని పరిస్థితి... ఇంతలో నీ ఫ్రెండ్ రాజేష్ ని పిలిచి నీ గురించి వివరాలు అడిగా..తన దగ్గర కూడా లేదు అని చెప్పాడు.. చివరికి అతను మంచి వాడే...ముందు ఇతని నుంచి రక్షించడానికి.. నేనె డబ్బు ఇచ్చి పంపేసా...ఈ విషయ ము ఊరిలో ఎవరికి తెలియదు... అందరూ అది లేచి పోయింది అని అనుకుంటున్నారు..నేను మాట్లాడలేదు... ఈ విషయం శ్యామల కి కూడా తెలియదు... తెలిస్తే పోరపాటున ఆచూకీ తెలిసి పోతుంది అని...భయ పడ్డాను.. అన్నారు... కనీసం వాళ్లిద్దరూ సుఖం గా ఉంటారని ఈ పని చేసాను...క్షమించు బాబు ...నీకు మాటిచ్చి తప్పాను... అన్నారు జగపతి...
అయ్యో అంత మాట అనకండి... మీరు పెట్టిన భిక్ష వలన నేను చదువుకుని ఇంత వాడిని అయ్యాను... దేనికైనా యోగం ఉండాలి కదా...నా ప్రేమ అక్కడి తో ఆగి పోయింది... ఎమ్ చేస్తాం... కానీ ఆమె మీద నా ప్రేమ గుండెలలో పెట్టుకుని దాచు కుంటాను ..జీవితమంతా ప్రేమిస్తు ఇలాగే ఉండిపోతాను... అన్నాడు మహేష్..ఇంతకీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏమైనా తెలుసా అండి అని అడిగాడు.. లేదు బాబు మాకు ఏమాత్రం కాంట్రాక్టు చేసిన అజయ్ కి తెలుసిపోతుందని నేనె వద్దు అన్నా..అన్నారు సరే అండి మీరేమి బాధ పడకండి అన్ని సద్దుకుంటాయి... నేను వచేసా గా నేను చూసుకుంటా ను..మీరు విశ్రాంతి తీసుకోండి... నేను బయలు దేరతాను అన్నాడు మహేష్... సరే బాబు అన్నారు జగపతి...
మహేష్ బయలుదేరి నది ఒడ్డుకి వచ్చాడు... పడవ అవతలి ఒడ్డు నుండి వస్తోంది... అంతవరకు అక్కడే తాను ఎంతో ఇష్టం గా కూర్చునే రావి చెట్టు గట్టు మీద కూర్చున్నాడు... ఎంత ప్రశాంతంగా ఉంటుంది.. చల్లని గోదావరి.. చుట్టూ పచ్చని చెట్లు... నదిని చూస్తూ ,ఈ రావి చెట్టు కింద కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటుంది...
ఇంతలో అతనికి బాగా సహాయం గా ఉండే రామయ్య పరిగెత్తుకుని వచ్చాడు... మహేష్ బాబు మిగురించి తెలిసి వచ్చాను... వెళ్లి పోయారు ఏమో అనుకుని పరిగెత్తు కుని వచ్చా... బాగున్నారా బాబు అంటూ అడిగాడు... ఆ రామయ్య .
ఎలా ఉన్నావు..రామయ్యా అంటూ ఆప్యాయంగా పలకరించాడు మహేష్... బాగానే ఉన్నాను ...మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అమ్మాయి గారి గురించి అన్నాడు..అవును జగపతి గారు అంతా చెప్పారు ...అన్నాడు...అది కాదు బాబు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు ...అన్నాడు ..అవునా .
నేను వాళ్లకోసమే వెతుకు తానని ఆయనకి చెప్పాను...బాగానే ఉన్నారా అని అడిగాడు... బాగానే ఉన్నారు.. ఇదిగో ఈ ఆజయ్ అన్ని చోట్లా వెదికి స్తున్నాడు... వాళ్ళకి దొరక్కుండా...తప్పించుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు... ఒక ఉరి వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు... ఎవరికి కనబడ కుండా అక్కడే క్షేమం గా ఉన్నారు...రమేష్ ఫోన్ చేస్తూ అందరూ ఎలా ఉన్నారో అని వాకబు చేస్తూ ఉంటాడు రహస్యం గా...అన్నాడు రామయ్య... సరే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు మహేష్...రామయ్య ఏ ఊరిలో ఉన్నారో చెప్పాడు.కనబడితే.. మీకు మాత్రమె చెప్పమన్నాడు..అన్నాడు...
సరే అయితే నేను వెడతా లే ..అక్కడకి.. వాళ్ళని తీసుకుని వచ్చి ఈ అజయ్ పని పడతా...అన్నాడు మహేష్... జాగ్రత్త బాబు వీడు చాలా దుర్మార్గుడు.. అన్నాడు..
పడవ వచ్చేసింది ఇంక నేను బయలుదేరి వెడతా... బాబుగారి ని జాగ్రత్తగా చూసుకోవాలి మరి అన్నాడు మహేష్.. తప్పకుండా బాబు మీరు వెళ్లి రండి అన్నాడు...రామయ్య...
పడవ లో బయలుదేరి వెళ్ళాడు మహేష్...
ఈ విషయం చెట్టు చాటు నుండి విన్న భ
అజయ్ అనుచరుడు పరిగెత్తు కు వెళ్లి అజయ్  చెవిలో వేసాడు...ఒరేయ్ అందరూ రండి ఎక్కడ ఉన్నారో తెలిసి పోయింది ..పదండి ఈ సారినేను వస్తా ...లాక్కుని వద్దాం అంటూ బయలుదేరారు...
******
మాధవి రమేష్ బజార్లో సరుకులు కొనుక్కుని వస్తున్నారు... ఇంకా ఎంత కాలం ఇలా దాక్కుని బ్రతకాలి... అమ్మ నాన్న గుర్తుకు వస్తున్నారు... అంది బాధ గా...ఏం చేస్తాం ఇంకొంత కాలం ఎదురు చూద్దాం... ఫోన్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ వివరాలు తెలుసుకుంటున్నా....అంతా బాగానే ఉన్నారు... ట... అన్నాడు రమేష్...
సరే ఇప్పటికే ఆలస్యం అయింది పద అంటూ నడవ సాగాడు...ఇంతలో వేగం గా జీపులు రావడం చూసాడు... అంతే. ..మాధవి వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చేసారు.. పద అంటూ పక్కకి తీసుకుని వెళ్ళాడు.. కొంత మంది దిగారు.. ఒరేయ్ ఊరంతా గాలించండి... ఈ సారి వాళ్ళు తప్పించు కో కూడదు... అంటూ అరిచాడు భ
అజయ్ ... అందరూ తలో దిక్కుకు పరిగెత్తారు... ఈ సారి మనం దొరికి పోయినట్లే ఎమ్ చేద్దాం... సరే నేను ఇటునుంచి పరిపోతాను... వాళ్ళు నన్ను చూసి నా వెంట పడతారు... నువ్వు ఈ సందులోనించి ఇలా వెడితే రైల్వే స్టేషన్ వస్తుంది... ఏదో ఒక ట్రైన్ ఎక్కేయ్... నేను ఎలాగో అలా వచ్చి చేరుకుంటాను.. ఫోన్ చేసి ఏ ట్రైన్ నాకు చెప్పు... జాగ్రత్త అంటూ... వాళ్ళకి కనబడే లా పరిగెత్తాడు రమేష్... అదిగో రమేష్ పట్టుకోండి రా అంటూ వాడి వెనుక పడ్డారు ..ఒరే మీరు కూడా వెళ్ళండి... వాడిని పట్టుకోండి అని ..అటు పంపాడు... రమేష్ అటువైపు పరిగెత్తు కుంటూ వెళ్ళాడు... ఈ లోగా మాధవి స్టేషన్ వైపుకి పరిగెత్తింది... పట్టాల వెంబడి పరుగెత్తి ప్లాట్ ఫారం ఎక్కింది... ఇంతలో అనౌన్స్ మెంట్ వచ్చింది... ట్రైన్ నంబరు... ఒకటవ ప్లాట్ ఫారం మీదకి వచ్చు చున్నది... అని...ట్రైన్ ఫ్లటుఫారం మీదకి వచ్చేసింది... మాధవి ట్రైన్ తో పాటు పరిగెడుతోంది... ఈ లోగా కొంతమంది, అజయ్ ఆమె  వెనుకే వచ్చేసారు... ఎక్కడికి పోతావు వాడు అటు వెడితే నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు అందుకే నేను ఇటువైపు కి వచ్చా... అన్నాడు..ఒరేయ్ పట్టుకోండి రా అని అరిచాడు... ఆమె పరిగెడుతోంది... ట్రై ను కొంత ముందుకి వెళ్లి స్లో గా ఆగింది... అజయ్  కర్ర విసిరాడు... ఆమె కాళ్ళకి తగిలి కింద పడిపోయింది.. దొర్లు కుంటూ వెళ్లి ఒక కంపార్ట్మెంట్ గుమ్మం దగ్గర ఆగుంది..లెవలేక పోతోంది... పాపం ..బాధగా అజయ్ వైపుకి చూసింది... అందరూ అక్కడికి వచ్చి ఆగారు...ఒరే లాక్కుని రా రా...అంటూ పురమాయించాడు... వాడు దగ్గరకి వచ్చి రెక్క పట్టుకో బోయాడు... అప్పుడే ట్రైన్ లోనించి దిగాడు మహేష్...ఒక్క తన్ను తన్నాడు వాడిని...వాడు ఎగురుకుంటూ వెళ్లి మిగతా వాళ్ళ మీద పడిపోయాడు... వాళ్ళు పడిపోయారు..భయం తో కళ్ళు ముసుకున్న మాధవికి ఏం జరిగిందో అర్ధం కాలేదు... నెమ్మది గా కళ్ళు తెరిచి చూసింది... ఎదురుగా మహేష్....ఒక్కసారిగా దుఃఖం పొంగుకుని వచ్చేసింది... మహేష్ అంటూ పిలిచింది. అతను నెమ్మదిగా భుజం పట్టుకుని లెవదిసాడు...రా భయపడకు నేను వచ్చేసా గా...ఇలా కూర్చో అంటూ కూర్చోపెట్టాడు... అక్కడే తోపుడు బండి లో ఉన్న వాటర్ బాటిల్ ని ఓపెన్ చేసి...తాగు....అంటూ పట్టించాడు...పరుగెత్తి పరుగెత్తి అలసిపోయింది... గబ గబ తాగేసింది... నువ్వు ఇక్కడే కూర్చో...నేను వాళ్ళ సంగతి తేల్చుకుని వస్తా...అంటూ ధైర్యం చెప్పి...వాళ్ళ వైపుకి నడిచాడు..మహేష్...
ఎవడ్రా వీడు... మధ్యలో వాడిని వేసేసి దాన్ని తీసుకుని రండి అని అరిచాడు...వాళ్ళు ముందుకి కదిలారు... అందరిని చితక కొట్టేసాడు మహేష్... భూ
అజయ్ ని కూడా..
కింద పడి ఉన్న అజయ్ ని చూడగానే కోపం పెరిగి పోయింది మహేష్ కి ,
ఇంకా ఎంత దూరం పరిపోతారు రా వీళ్ళు... ఆస్థి కోసం అయిన వాళ్ళని కూడా చూడవా ...నువ్వు అసలు మనిషివి కాదు... నిన్ను చంపేస్తా అంటూ అక్కడ కొబ్బరిబోండం బండి లోనించి కత్తి తీసాడు.. చెయ్యి పైకి ఎత్తగానే ...ఆగు మహేష్... అతనిని ఏమి చేయవద్దు.. ఎంతైనా మా మావయ్య కదా...వదిలేయ్... చూడు మామయ్య నాకు ఆస్తి అక్కరలేదు... నీకు ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతాను...నమానాన నన్ను వదిలేయ్ అంది...సిగ్గు తో తల వంచు కున్నాడు భ
అజయ్...ఇంతలో రమేష్ వచ్చాడు.. ఒరేయ్ మహేష్.. సమయానికి వచ్చావు రా అంటూ కౌగలించుకొని... మాధవి వైపు చూసాడు... నన్ను క్షమించండి... నా తప్పు తెలుసుకున్నా...నువు మాధవి సుఖం గా ఉండండి... అంటూ అజయ్ చేతులు కలప బోయాడు... ఆగండి ఆగండి... చేతులు కలపాల్సింది నాతో కాదు...మహేష్ తో... అన్నాడు...ఆశ్చర్య పోయారు మహేష్ కూడా... అదేమిటి మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని విన్నాను..ఎంతైనా నేను ప్రేమించిన అమ్మాయి కదా ఒకసారి సుఖం గా ఉందొ లేదో అని చూద్దామని వచ్చాను అన్నాడు మహేష్... అలా ఎలా మిత్రమా... నీకు కాబోయే భార్య నాకు చెల్లెలు లాంటిది... నీ ఆచూకీ తెలియదు...
ఈ అజయ్ నుంచి కాపాడడానికి..నాకు వేరే మార్గం తెలియలేదు...అందుకే లేపుకుని వచ్చేసా... అన్ని ఉరులు తిరిగి ఇదిగో ఈ ఊరిలో కాస్త సహాయం దొరికింది.. ఇక్కడి వాళ్ళ సహాయం తో ఈమెని కాపాడుకుంటూ వస్తున్నా...ఇన్నాళ్లకు ఈమె నిరీక్షణ ఫలించింది... నువ్వు వచ్చావు...
అమ్మా మాధవి నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా...ప్రేమించిన వాడి కోసం ఎన్ని కష్టాలు పడ్డావో...అన్ని సమస్యలు తీరి పోయాయి... అంటూ ఆమె చెయ్యి మహేష్ చేతిలో పెట్టాడు...నన్ను క్షమించు మాధవి రావడం కొంచెం ఆలస్యమైంది..నా మూలంగా ఇన్ని కష్టాలు.. పడ్డావు... నీ ప్రేమని దక్కించుకివడానికి కష్టపడి సంపాదించు కుని వచ్చాను...అన్నాడు.. ఆనందం తో కౌగలించుకొని .మురిసి పోయింది...వాళ్లిద్దరూ అలా తన్మయత్వం లో ఉంటే ...మహేష్ వీపు మీద కొట్టాడు రమేష్... బాబు ఇది రైల్వే స్టేషన్...అందరూ మనల్నే చూస్తున్నారు... అన్నాడు...ఓహ్ ...అవును సరే పద అందరం మన ఊరు వెడదాం అన్నాడు..మహేష్... వద్దురా ..ఈ ఊరి వాళ్ళతో అనుబంధం పెరిగింది ...నాకోసం.చాలా చేశారు...నేను ఇక్కడే ఉండిపోతా...అయిన నాకు ఒక అమ్మాయి దొరికింది లే ...మా పెళ్లికి తప్పక రావాలి.. అన్నాడు... తప్పకుండా..ఇది గో ఈ చెక్ తీసుకో....ఇందులో 10 కోట్లు రాసాను...అన్నాడు.. ఏరా స్నేహాన్ని కొనే కరెన్సీ ఇంకా రాలేదు రా అన్నాడు..నవ్వుతూ...అధికాదు రా ఈ ఊరు ఇంత చేసింది ఉరికి ఉపయోగడే ఏదైనా మంచి చేయరా...అన్నాడు.మహేష్.. అలా అన్నావు బాగుంది.. పెళ్లికి రావాలి రోయ్ ...ఫోన్ చేస్తా..బాబాయ్ గారిని ఆడిగానని చెప్పు..ఇక్కడి పనులు పూర్తి చేసుకుని శుభలేఖ లతో వస్తా...అన్నాడు రమేష్...మరోసారి స్నేహితుడి ని కౌగలించుకొని.. ట్రైన్ ఎక్కారు...గుమ్మం లోనించి అతనికీ ఇద్దరూ టాటా చెప్పారు..
లోపలికి వచ్చి అరే హడావిడి లో టికెట్ తీయడం మర్చి పోయాను...అన్నాడు మహేష్... నేను తీశాలే బాబు అన్న మాట వినిపించింది వెనుక నుండి..ఎవరా అని చూస్తే అజయ్ టికెట్ లతో ఉన్నాడు.. నేను వచ్చి బావగారికి క్షమాపణ చెప్పి నిన్ను అప్పచెప్పుతా...మీ ఇద్దరి పెళ్లికి నేనె అన్ని చూసుకుంటా...అన్నాడు...అందరూ నవ్వుకున్నారు....
శుభం...


Monday 11 May 2020

ఏ రాశి వారు ఏ దేవునికి తాంబూలం స‌మ‌ర్పించాలి

ఏ రాశి వారు ఏ దేవునికి తాంబూలం స‌మ‌ర్పించాలి

ఈతిబాధలతో స‌త‌మ‌త‌మ‌య్యేవారు ఏం చేయాలి? ఏ దేవున్ని ప్రార్థించాలి? ఈతిబాధలు తొలిగిపోవాలంటే ఎలాంటి ప‌రిహారం చేసుకోవాల‌ని అడుగుతుంటారు చాలా మంది.
అయితే 12 రాశుల్లో జన్మించిన జాతకులు
ఏ దేవుళ్లకు తాంబూలం సమర్పించి ప్రార్థించాలో తెలుసుకోవాలి.
12 రాశుల్లో పుట్టిన జాతకులు రాశి ప్రకారం ఏ దేవునికి తాంబూలం సమర్పించి వేడుకుంటే.. ఈతిబాధలు తొలగిపోతాయనేది తెలుసుకుందాం..

మేష రాశి వారు..

తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలు తొల‌గిపోతాయి.

వృషభ రాశి వారు

తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును స్తుతిస్తే.. కష్టాలుండవు. సుఖసంతోషాలు చేకూరుతాయి.

మిథున రాశి వారు

తమలపాకులో అరటిపండును ఉంచి బుధవారం ఇష్టదేవతా పూజ చేస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.

కర్కాటక రాశి వారు..

తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం పూట కాళిమాతను ప్రార్థిస్తే కష్టాలు తీరిపోతాయి.

సింహ రాశి వారు..

తమలపాకులో అరటిపండును ఉంచి గురువారం ఇష్టదేవతా పూజను చేయాలి.

కన్యారాశి రాశి వారు..

తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవతా పూజ చేస్తే.. దుఃఖం దూరమవుతుంది.

తులా రాశి రాశి వారు..

తమలపాకులో లవంగంను ఉంచి శుక్రవారం పూట ఇష్టదేవతను స్తుతిస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.

వృశ్చిక రాశి వారు..

తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి.

ధనుస్సు రాశి వారు..

తమలపాకులో కలకండను ఉంచి గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.

మకర రాశి వారు..

తమలపాకులో బెల్లంను ఉంచి శనివారాల్లో కాళిమాతను పూజిస్తే.. కష్టాలు తీరిపోతాయి.

కుంభ రాశి వారు..

తమలపాకులో నెయ్యిని ఉంచి శనివారం పూట కాళిమాతను పూజించినట్లైతే.. దుఃఖాలు తొలగిపోతాయి.

మీన రాశి వారు..

తమలపాకులో పంచదారను ఉంచి ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతారు.

సేకరణ 

శ్రీ శివ ద్వాదశ పంజర స్తోత్రం

శ్రీ శివ ద్వాదశ పంజర స్తోత్రం

1) శివాయ నిర్వికల్పాయ భవతిమిరాపహారిణే
భస్మత్రిపుండ్రభాసాయ పార్వతీపతయే నమః ||

2) శర్వాయ గిరీశాయ సత్సంతానకారిణే
వ్యోమకేశవిరూపాయ గిరిజాపతయే నమః ||

3) భవాయ మహేశాయ మహావ్యామోహహారిణే
జటాజూటధరాయ భవానీపతయే నమః ||

4) సోమాయ నిర్మలాయ విషజ్వరరోగహారిణే
త్రిపురాసురసంహరాయ శర్వాణీపతయే నమః ||

5) శంకరాయ రుద్రాయ అక్షమాలాధారిణే
వ్యాఘ్రచర్మాంబరాయ శివానీపతయే నమః ||

6) కాలాయ నీలకంఠాయ సమాధిస్థితికారణే
నాగాభరణధరాయ రుద్రాణీపతయే నమః ||

7) ఘోరాయ అఘోరాయ పాపకర్మనివారిణే
నాగయజ్ఞోపవీతాయ కాత్యాయినీపతయే నమః

8) ఈశానాయ మృడాయ వేదవేదాంతరూపిణే
కైలాసపురవాసాయ శాంకరీపతయే నమః ||

9) నిఠలాక్షాయ దేవాయ దక్షిణామూర్తిరూపిణే
సృష్టిస్థిత్యంతరూపాయ భైరవీపతయే నమః ||

10) అమృతేశ్వరాయ సాంబాయ వ్యక్తావ్యక్తస్వరూపిణే
భాషాసూత్రప్రదానాయ గౌరీపతయే నమః ||

11) పంచాననాయ భర్గాయ ఢమరుపరశుధారిణే
మార్కండేయరక్షకాయ మృడానీపతయే నమః ||

12) అభిషేకప్రియాయ యోగ్యాయ యోగానందరూపిణే
భక్తహృత్కమలవాసాయ చండికాపతయే నమః ||

సర్వం శ్రీ సదాశివదివ్యచరణారవిందార్పణమస్తు.....

ఓం నమః శివాయ

Sunday 10 May 2020

శ్రీమహాగణపతి సహస్రనామస్తోత్రమ్

శ్రీమహాగణపతి సహస్రనామస్తోత్రమ్

అస్య శ్రీమహాగణపతి సహస్రనామస్తోత్రమహామంత్రస్య, మహాగణపతి ఋషి, అనుష్టుప్ ఛందః, శ్రీమహాగణపతిర్దేవతా, శ్రీమహాగణపతి ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః

ధ్యానమ్

శ్లో!! శ్రీవల్లభాసమాశ్లిష్టం దశహస్తం గజాననమ్!
గణనాథమహం వందే సర్వసిద్ధి ప్రదాయకమ్!!

ఓం గణేశ్వరో గణక్రీడో గణనాథో గణాధిపః ।
ఏకదంష్ట్రో వక్రతుండో గజవక్త్రో మహోదరః ॥ ౧॥

లంబోదరో ధూమ్రవర్ణో వికటో విఘ్ననాయకః ।
సుముఖో దుర్ముఖో బుద్ధో విఘ్నరాజో గజాననః ॥ ౨॥

భీమః ప్రమోద ఆమోదః సురానందో మదోత్కటః ।
హేరంబశ్శంబరశ్శంభుః లంబకర్ణో మహాబలః ॥ ౩॥

నన్దనోఽ (అ)లంపటోఽ (అ)భీరుర్మేఘనాదో గణంజయః ।
వినాయకో విరూపాక్షో ధీరశూరో వరప్రదః ॥ ౪॥

మహాగణపతిర్బుద్ధిప్రియః క్షిప్రప్రసాదనః ।
రుద్రప్రియో గణాధ్యక్షః ఉమాపుత్రోఽ(అ)ఘనాశనః ॥ ౫॥

కుమారగురురీశానపుత్రో మూషకవాహనః ।
సిద్ధిప్రియః సిద్ధిపతిః సిద్ధః సిద్ధివినాయకః ॥ ౬॥

అవిఘ్నస్తుంబురుః సింహవాహనో మోహినీప్రియః ।
కటంకటో రాజపుత్రః శాలక స్సమ్మితోఽ(అ)మితః ॥ ౭॥

కూష్మాణ్డసామసంభూతిః దుర్జయో జయః ।
భూపతిర్భువనపతిర్భూతానాంపతిరవ్యయః ॥ ౮॥

విశ్వకర్తా విశ్వముఖో విశ్వరూపో నిధిర్ఘృణిః !
కవిః కవీనాం ఋషభో బ్రహ్మణ్యో బ్రహ్మణస్పతిః॥ ౯॥

జ్యేష్ఠరాజో నిధిపతిః నిధిప్రియపతిప్రియః ।
హిరణ్మయపురాన్తస్థః సూర్యమణ్డలమధ్యగః ॥ ౧౦॥

కరాహతిధ్వస్తసిన్ధుసలిలః పూషదన్తభిత్ ।
ఉమాఙ్కకేలికుతుకీ ముక్తిదః కులపాలనః ॥ ౧౧॥

కిరీటీ కుణ్డలీ హారీ వనమాలీ మనోమయః ।
వైముఖ్యహతదైత్యశ్రీః పాదాహతిజితక్షితిః ॥ ౧౨॥

సద్యోజాతః స్వర్ణముంజమేఖలీ దుర్నిమిత్తహృత్ ।
దుఃస్వప్నహృత్ప్రసహనో గుణీ నాదప్రతిష్ఠితః ॥ ౧౩॥

సురూపః సర్వనేత్రాధివాసో వీరాసనాశ్రయః ।
పీతామ్బరః ఖణ్డరదః ఖండేందుకృతశేఖరః ॥ ౧౪॥

చిత్రాంక శ్యామదశనో ఫాలచంద్రశ్చతుర్భుజః!
యోగాధిపస్తారకస్థః పూరుషో గజకర్ణకః ॥ ౧౫॥

గణాధిరాజో విజయః స్థిరో గజపతిధ్వజీ ।
దేవదేవః స్మర ప్రాణదీపకో వాయుకీలకః ॥ ౧౬॥

విపశ్చిద్వరదో నాదోన్నాదభిన్నవలాహకః ।
వరాహరదనో మృత్యుఞ్జయో వ్యాఘ్రాజినామ్బరః ॥ ౧౭॥

ఇచ్ఛాశక్తిభవో దేవత్రాతా దైత్యవిమర్దనః ।
శమ్భువక్త్రోద్భవః శమ్భుకోపహా శమ్భుహాస్యభూః ॥ ౧౮॥

శమ్భుతేజాః శివాశోకహారీ గౌరీసుఖావహః ।
ఉమాఙ్గమలజో గౌరీతేజోభూః స్వర్ధునీభవః ॥ ౧౯॥

యజ్ఞకాయో మహానాదో గిరివర్ష్మా శుభాననః ।
సర్వాత్మా సర్వదేవాత్మా బ్రహ్మమూర్ధా కకుప్ శ్రుతిః ॥ ౨౦॥

బ్రహ్మాణ్డకుంభః చిద్వ్యోమఫాలః సత్యశిరోరుహః ।
జగజ్జన్మలయోన్మేషనిమేషోఽ(అ)గ్న్యర్కసోమదృక్ ॥ ౨౧॥

గిరీన్ద్రైకరదో ధర్మాధర్మోష్ఠః సామబృంహితః ।
గ్రహర్క్షదశనో వాణీజిహ్వా వాసవనాసికః ॥ ౨౨॥

కులాచలాంసః సోమార్కఘణ్టో రుద్రశిరోధరః
నదీనదభుజః సర్పాంగుళీకస్తారకానఖః ।! ౨౩ !!

భ్రూమధ్యసంస్థితకరో బ్రహ్మవిద్యామదోత్కటః ।
వ్యోమనాభిః శ్రీహృదయో మేరుపృష్ఠోఽ(అ)ర్ణవోదరః ॥ ౨౪॥

కుక్షిస్థయక్షగన్ధర్వరక్షఃకిన్నరమానుషః ।
పృథ్వీకటిః సృష్టిలిఙ్గః శైలోరుః దస్రజానుకః ॥ ౨౫॥

పాతాళజంఘో మునిపాత్ కాలాంగుష్ఠస్త్రయీతనుః ।
జ్యోతిర్మణ్డలలాంగూలో హృదయాలాననిశ్చలః ॥ ౨౬॥

హృత్పద్మకర్ణికాశాలి వియత్కేలిసరోవరః ।
సద్భక్తధ్యాననిగడః పూజావారీనివారితః ॥ ౨౭॥

ప్రతాపీ కశ్యపసుతో గణపో విష్టపీ బలీ ।
యశస్వీ ధార్మికః స్వోజాః ప్రథమః ప్రథమేశ్వరః ॥ ౨౮॥

చిన్తామణిర్ద్వీపపతిః కల్పద్రుమవనాలయః ।
రత్నమణ్డపమధ్యస్థో రత్నసింహాసనాశ్రయః ॥ ౨౯॥

తీవ్రాశిరోద్ధృతపదో జ్వాలినీమౌలిలాలితః ।
నన్దానన్దితపీఠశ్రీః భోగదా భూషితాసనః ॥ ౩౦॥

సకామదాయినీపీఠః స్ఫురదుగ్రాసనాశ్రయః ।
తేజోవతీశిరోరత్నం సత్యానిత్యావతంసితః ॥ ౩౧॥

సవిఘ్ననాశినీపీఠః సర్వశక్త్యంబుజాశ్రయః ।
లిపిపద్మాసనాధారో వహ్నిధామత్రయాశ్రయః ॥ ౩౨॥

ఉన్నతప్రపదో గూఢగుల్ఫః సంపృతపార్ష్ణికః ।
పీనజంఘ శ్శ్లిష్టజానుః స్థూలోరుః ప్రోన్నమత్కటిః ॥ ౩౩॥

నిమ్ననాభిః స్థూలకుక్షిః పీనవక్షా బృహద్భుజః ।
పీనస్కన్ధః కమ్బుకణ్ఠో లంబోష్ఠో లంబనాసికః ॥ ౩౪॥

భగ్నవామరదస్తుఙ్గసవ్యదన్తో మహాహనుః ।
హ్రస్వనేత్రత్రయః శూర్పకర్ణో నిబిడమస్తకః ॥ ౩౫॥

స్తబకాకారకుంభాగ్రో రత్నమౌలిర్నిరంకుశః ।
సర్పహారకటీసూత్రః సర్పయజ్ఞోపవీతవాన్ ॥ ౩౬॥

సర్పకోటీరకటకః సర్పగ్రైవేయకాఙ్గదః ।
సర్పకక్ష్యోదరాబన్ధః సర్పరాజోత్తరీయకః ॥ ౩౭॥

రక్తో రక్తాంబరధరో రక్తమాల్యవిభూషణః ।
రక్తేక్షణో రక్తకరో రక్తతాల్వోష్ఠపల్లవః ॥ ౩౮॥

శ్వేతః శ్వేతామ్బరధరః శ్వేతమాల్యవిభూషణః ।
శ్వేతాతపత్రరుచిరః శ్వేతచామరవీజితః ॥ ౩౯॥

సర్వావయవసంపూర్ణః సర్వలక్షణలక్షితః ।
సర్వాభరణశోభాఢ్యః సర్వశోభాసమన్వితః ॥ ౪౦॥

సర్వమఙ్గలమాఙ్గల్యః సర్వకారణకారణమ్ ।
సర్వదైవకరశ్శార్ఙ్గీ బీజపూరీ గదాధరః ॥ ౪౧॥

ఇక్షుచాపధరః శూలీ చక్రపాణిః సరోజభృత్ ।
పాశీ ధృతోత్పలః శాలీమఞ్జరీభృత్స్వదన్తభృత్ ॥ ౪౨॥

కల్పవల్లీధరో విశ్వాభయదైకకరో వశీ ।
అక్షమాలాధరో జ్ఞానముద్రావాన్ ముద్గరాయుధః ॥ ౪౩॥

పూర్ణపాత్రీ కమ్బుధరో విధృతాలిసముద్గకః ।
మాతులింగధర శ్చూతకలికాభృత్ కుఠారవాన్ !!౪౪!!

పుష్కరస్థస్వర్ణఘటీపూర్ణరత్నాభివర్షకః ।
భారతీసున్దరీనాథో వినాయకరతిప్రియః ॥౪౫॥

మహాలక్ష్మీప్రియతమః సిద్ధలక్ష్మీమనోరమః ।
రమారమేశపూర్వాంగో దక్షిణోమామహేశ్వరః ॥ ౪౬॥

మహీవరాహవామాంగో రతికన్దర్పపశ్చిమః ।
ఆమోదమోదజననః సప్రమోదప్రమోదనః ॥ ౪౭॥

సమేధిత సమృద్ధశ్రీః బుద్ధిసిద్ధిప్రవర్తకః!
దత్తసౌముఖ్యసుముఖః కాన్తికన్దలితాశ్రయః ॥ ౪౮॥

మదనావత్యాశ్రితాంఘ్రిః కృతదౌర్ముఖ్యదుర్ముఖః ।
విఘ్నసమ్పల్లవోపఘ్నః సేవోన్నిద్రమదద్రవః ॥ ౪౯॥

విఘ్నకృన్నిఘ్నచరణో ద్రావిణీశక్తిసత్కృతః ।
తీవ్రాప్రసన్ననయనో జ్వాలినీపాలనైకదృక్ ॥ ౫౦॥

మోహినీమోహనో భోగదాయినీకాన్తిమండితః ।
కామినీకాన్తవక్త్రశ్రీరధిష్ఠితవసున్ధరః ॥ ౫౧॥

వసుంధరామదోన్నద్ధ మహాశఙ్ఖనిధిప్రభుః ।
నమద్వసుమతీమౌళీ మహాపద్మనిధిః ప్రభుః ॥ ౫౨॥

సర్వసద్గురుసంసేవ్యః శోచిష్కేశహృదాశ్రయః ।
ఈశానమూర్ధా దేవేన్ద్రశిఖా పవననన్దనః ॥ ౫౩॥

అగ్రప్రత్యగ్రనయనో దివ్యాస్త్రాణాంప్రయోగవిత్ ।
ఐరావతాదిసర్వాశావారణావరణప్రియః ॥ ౫౪॥

వజ్రాద్యస్త్రపరీవారో గణచణ్డసమాశ్రయః ।
జయాజయాపరీవారో విజయావిజయావహః ॥ ౫౫॥

అజితార్చితపాదాబ్జో నిత్యానిత్యావతంసితః ।
విలాసినీకృతోల్లాసః శౌణ్డీ సౌన్దర్యమణ్డితః ॥ ౫౬॥

అనన్తానన్తసుఖదః సుమఙ్గలసుమఙ్గలః ।
ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తి క్రియాశక్తినిషేవితః ॥ ౫౭॥

సుభగాసంశ్రితపదో లలితాలలితాశ్రయః ।
కామినీకామనః కామమాలినీకేలిలాలితః ॥ ౫౮॥

సరస్వత్యాశ్రయో గౌరీనన్దనః శ్రీనికేతనః ।
గురుగుప్తపదో వాచాసిద్ధో వాగీశ్వరీపతిః ॥ ౫౯॥

నలినీకాముకో వామారామో జ్యేష్ఠామనోరమః ।
రౌద్రీముద్రితపాదాబ్జో హుంబీజస్తుంగశక్తికః ॥ ౬౦॥

విశ్వాదిజననత్రాణః స్వాహాశక్తిః సకీలకః ।
అమృతాబ్ధికృతావాసో మదఘూర్ణితలోచనః ॥ ౬౧॥

ఉచ్ఛిష్టగణ ఉచ్ఛిష్టగణేశో గణనాయకః ।
సార్వకాలికసంసిద్ధిః నిత్యశైవో దిగంబరః ॥ ౬౨॥

అనపాయోఽ(అ)నన్తదృష్టిః అప్రమేయోఽ(అ)జరామరః ।
అనావిలోఽ(అ)ప్రతిరథో హ్యచ్యుతోఽ(అ)మృతమక్షరమ్ ॥ ౬౩॥

అప్రతర్క్యోఽ(అ)క్షయోఽ(అ)జయ్యోఽ(అ)నాధారోఽ(అ)నామయోఽ(అ)మలః ।
అమోఘసిద్ధిరద్వైతమఘోరోఽ(అ)ప్రమితాసనః ॥ ౬౪॥

అనాకారోఽ(అ)బ్ధిభూమ్యగ్నిబలఘ్నోఽ(అ)వ్యక్తలక్షణః ।
ఆధారపీఠమాధార ఆధారాధేయవర్జితః ॥ ౬౫॥

ఆఖుకేతన ఆశాపూరక ఆఖుమహారథః ।
ఇక్షుసాగరమధ్యస్థః ఇక్షుభక్షణలాలసః ॥ ౬౬॥

ఇక్షుచాపాతిరేకశ్రీః ఇక్షుచాపనిషేవితః ।
ఇన్ద్రగోపసమానశ్రీః ఇన్ద్రనీలసమద్యుతిః ॥ ౬౭॥

ఇన్దీవరదలశ్యామ ఇన్దుమణ్డలనిర్మలః ।
ఇధ్మప్రియ ఇడాభాగ రాధామా ఇందిరాప్రియః ॥ ౬౮॥

ఇక్ష్వాకువిఘ్నవిధ్వంసీ ఇతికర్తవ్యతేప్సితః ।
ఈశానమౌలిరీశాన ఈశానసుత ఈతిహా ॥ ౬౯॥

ఈషణాత్రయకల్పాన్త ఈహామాత్రవివర్జితః ।
ఉపేన్ద్ర ఉడుభృన్మౌళిః ఉండేరకబలిప్రియః ॥ ౭౦॥

ఉన్నతానన ఉత్తుఙ్గ ఉదారస్త్రిదశాగ్రణీః ।
ఊర్జస్వానూష్మలమద ఊహాపోహదురాసదః ॥ ౭౧॥

ఋగ్యజుఃస్సామసంభూతిః ఋద్ధిసిద్ధిప్రవర్తకః ।
ఋజుచిత్తైకసులభః ఋణత్రయవిమోచకః ॥ ౭౨॥

లుప్తవిఘ్నః స్వభక్తానాం లుప్తశక్తిః సురద్విషామ్ ।
లుప్తశ్రీర్విముఖార్చానాం లూతావిస్ఫోటనాశనః ॥ ౭౩॥

ఏకారపీఠమధ్యస్థః ఏకపాదకృతాసనః ।
ఏజితాఖిలదైత్యశ్రీః ఏధితాఖిలసంశ్రయః ॥ ౭౪॥

ఐశ్వర్యనిధిరైశ్వర్యమైహికాముష్మికప్రదః ।
ఐరమ్మదసమోన్మేషః ఐరావతనిభాననః ॥ ౭౫॥

ఓంకారవాచ్య ఓంకార ఓజస్వానోషధీపతిః ।
ఔదార్యనిధిరౌద్ధత్యధుర్య ఔన్నత్యనిస్వనః ॥ ౭౬॥

అంకుశః సురనాగానామంకుశస్సురవిద్విషాం ।
అస్సమస్తవిసర్గాన్తపదేషు పరికీర్తితః ॥ ౭౭॥

కమణ్డలుధరః కల్పః కపర్దీ కలభాననః ।
కర్మసాక్షీ కర్మకర్తా కర్మాకర్మఫలప్రదః ॥ ౭౮॥

కదమ్బగోలకాకారః కూష్మాణ్డగణనాయకః ।
కారుణ్యదేహః కపిలః కథకః కటిసూత్రభృత్ ॥ ౭౯॥

ఖర్వః ఖడ్గప్రియః ఖడ్గః ఖాంతాంతస్థః ఖనిర్మలః ।
ఖల్వాటశృంగనిలయః ఖట్వాంగీ ఖదురాసదః ॥ ౮౦॥

గుణాఢ్యో గహనో గద్యో/గస్థో గద్యపద్యసుధార్ణవః ।
గద్యగానప్రియో గర్జో గీతగీర్వాణపూర్వజః ॥ ౮౧॥

గుహ్యాచారరతో గుహ్యో గుహ్యాగమనిరూపితః ।
గుహాశయో గుడాబ్ధిస్థో గురుగమ్యో గురుర్గురుః ॥ ౮౨॥

ఘణ్టాఘర్ఘరికామాలీ ఘటకుమ్భో ఘటోదరః ।
చండశ్చండేశ్వరసుహృత్ చండీశ శ్చండవిక్రమః॥ ౮౩॥

చరాచరపతీ చిన్తామణిశ్చర్వణలాలసః !
ఛన్దశ్ఛన్దోద్భవపుశ్ఛన్దో దుర్లక్ష్యశ్ఛన్దవిగ్రహః !!౮౪!!

జగద్యోనిర్జగత్సాక్షీ జగదీశో జగన్మయః !
జపో జపపరో జప్యో జిహ్వాసింహాసనప్రభుః !!౮౫!!

ఝలఝ్ఝలోల్లసద్దానఝంకారి భ్రమరాకులః !
టంకారస్ఫారసంరావః టంకారమణినూపురః !!౮౬!!

ఠద్వయీపల్లవాన్తస్థసర్వమంత్రైక సిద్ధిదః !
డిణ్డిముణ్డో డాకినీశో డామరో డిణ్డిమప్రియః !!౮౭!!

ఢక్కానినాదముదితో ఢౌకో ఢుణ్ఢివినాయకః !
తత్త్వానాం పరమంతత్త్వం తత్త్వం పదనిరూపితః !!౮౮!!

తారకాన్తరసంస్థానస్తారకస్తారకాన్తకః !
స్థాణుః స్థాణుప్రియః స్థాతా స్థావరం జంగమం జగత్ !!౮౯!!

దక్షయజ్ఞ ప్రమథనో దాతా దానవమోహనః !
దయావాన్ దివ్యవిభవో దణ్డభృద్దణ్డనాయకః !!౯౦!!

దన్తప్రభిన్నాభ్రమాలో దైత్యవారణదారణః !
దంష్ట్రాలగ్నద్విపఘటో దేవార్థనృగజాకృతిః !!౯౧!!

ధనధాన్యపతిర్ధన్యో ధనదో ధరణీధరః!
ధ్యానైకప్రకటో ధ్యేయో ధ్యానం ధ్యానపరాయణః !!౯౨!!

నన్ద్యో నన్దిప్రియో నాదో నాదమధ్యప్రతిష్ఠితః ।
నిష్కలో నిర్మలో నిత్యో నిత్యానిత్యో నిరామయః ॥ ౯౩॥

పరం వ్యోమ పరం ధామ పరమాత్మా పరం పదమ్ !
పరాత్పరః పశుపతిః పశుపాశవిమోచనః !!౯౪!!

పూర్ణానన్దః పరానన్దః పురాణపురుషోత్తమః !
పద్మప్రసన్ననయనః ప్రణతాజ్ఞానమోచనః !!౯౫!!

ప్రమాణప్రత్యయాతీతః ప్రణతార్తినివారణః !
ఫలహస్తః ఫణిపతిః ఫేత్కారః ఫాణితప్రియః !!౯౬!!

బాణార్చితాఙ్ఘ్రియుగళో బాలకేళికుతూహలీ ।
బ్రహ్మ బ్రహ్మార్చితపదో బ్రహ్మచారీ బృహస్పతిః ॥ ౯౭॥

బృహత్తమో బ్రహ్మపరో బ్రహ్మణ్యో బ్రహ్మవిత్ప్రియః ।
బృహన్నాదాగ్ర్యచీత్కారో బ్రహ్మాణ్డావలిమేఖలః ॥ ౯౮॥

భ్రూక్షేపదత్తలక్ష్మీకో భర్గో భద్రో భయాపహః ।
భగవాన్ భక్తిసులభో భూతిదో భూతిభూషణః ॥ ౯౯॥

భవ్యో భూతాలయో భోగదాతా భ్రూమధ్యగోచరః ।
మన్త్రో మన్త్రపతిర్మన్త్రీ మదమత్తో మనోరమః ॥ ౧౦౦॥

మేఖలావాన్ మన్దగతిః మతిమత్కమలేక్షణః।
మహాబలో మహావీర్యో మహాప్రాణో మహామనాః ॥ ౧౦౧॥

యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞగోప్తా యజ్ఞఫలప్రదః ।
యశస్కరో యోగగమ్యో యాజ్ఞికో యాజకప్రియః ॥ ౧౦౨॥

రసో రసప్రియో రస్యో రఞ్జకో రావణార్చితః ।
రక్షోరక్షాకరో రత్నగర్భో రాజ్యసుఖప్రదః ॥ ౧౦౩॥

లక్ష్యం లక్ష్యప్రదో లక్ష్యో లయస్థో లడ్డుప్రియః!
లాసప్రియో లాస్యపరో లాభకృల్లోకవిశ్రుతః ॥ ౧౦౪॥

వరేణ్యో వహ్నివదనో వన్ద్యో వేదాన్తగోచరః ।
వికర్తా విశ్వతశ్చక్షుః విధాతా విశ్వతోముఖః ॥ ౧౦౫॥

వామదేవో విశ్వనేతా వజ్రివజ్రనివారణః ।
విశ్వబంధనవిష్కంభాధారో విశ్వేశ్వర ప్రభుః ॥ ౧౦౬॥

శబ్దబ్రహ్మ శమప్రాప్యః శమ్భుశక్తిగణేశ్వరః ।
శాస్తా శిఖాగ్రనిలయః శరణ్యః శిఖరీశ్వరః ॥ ౧౦౭॥

షడృతుకుసుమస్రగ్వీ షడాధారః షడక్షరః ।
సంసారవైద్యః సర్వజ్ఞః సర్వభేషజభేషజమ్ ॥ ౧౦౮॥

సృష్టిస్థితిలయక్రీడః సురకుఞ్జరభేదనః ।
సిన్దూరితమహాకుమ్భః సదసద్ వ్యక్తిదాయకః ॥ ౧౦౯॥

సాక్షీ సముద్రమథనః స్వసంవేద్యః స్వదక్షిణః ।
స్వతన్త్రః సత్యసంకల్పః సామగానరతః సుఖీ ॥ ౧౧౦॥

హంసో హస్తిపిశాచీశో హవనం హవ్యకవ్యభుక్ ।
హవ్యో హుతప్రియో హృష్టో/హర్షో హృల్లేఖామన్త్రమధ్యగః ॥ ౧౧౧॥

క్షేత్రాధిపః క్షమాభర్తా క్షమాపరపరాయణః ।
క్షిప్రక్షేమకరః క్షేమానన్దః క్షోణీసురద్రుమః ॥ ౧౧౨॥

ధర్మప్రదోఽ(అ)ర్థదః కామదాతా సౌభాగ్యవర్ధనః ।
విద్యాప్రదో విభవదో భుక్తిముక్తిఫలప్రదః ॥ ౧౧౩॥

ఆభిరూప్యకరో వీరశ్రీప్రదో విజయప్రదః ।
సర్వవశ్యకరో గర్భదోషహా పుత్రపౌత్రదః ॥ ౧౧౪॥

మేధాదః కీర్తిదః శోకహారీ దౌర్భాగ్యనాశనః ।
ప్రతివాదిముఖస్తమ్భో రుష్టచిత్తప్రసాదనః ॥ ౧౧౫॥

పరాభిచారశమనో దుఃఖభంజనకారకః ।
లవస్త్రుటిః కలా కాష్ఠా నిమేషస్తత్పరః క్షణః ॥ ౧౧౬॥

ఘటీ ముహూర్తం ప్రహరో దివా నక్తమహర్నిశమ్ ।
పక్షో మాసో అయనం వర్షం యుగం కల్పో మహాలయః ॥ ౧౧౭॥

రాశిస్తారా తిథిర్యోగో వారః కరణమంశకమ్ ।
లగ్నం హోరా కాలచక్రం మేరుః సప్తర్షయో ధ్రువః ॥ ౧౧౮॥

రాహుర్మన్దః కవిర్జీవో బుధో భౌమః శశీ రవిః ।
కాలః సృష్టిః స్థితిర్విశ్వం స్థావరం జంగమం చ యత్ ॥ ౧౧౯॥

భూరాపోఽ(అ)గ్నిర్మరుద్వ్యోమ అహంకృతిః ప్రకృతిః పుమాన్ ।
బ్రహ్మా విష్ణుశ్శివో రుద్ర ఈశః శక్తిః సదాశివః ॥ ౧౨౦॥

త్రిదశాః పితరస్సిద్ధాః యక్షా రక్షాంసి కిన్నరాః ।
సాధ్యా విద్యాధరా భూతాః మనుష్యాః పశవః ఖగాః ॥ ౧౨౧॥

సముద్రాః సరితః శైలాః భూతం భవ్యం భవోద్భవః ।
సాంఖ్యం పాతంజలం యోగః పురాణాని శ్రుతిః స్మృతిః ॥ ౧౨౨॥

వేదాంగాని సదాచారో మీమాంసా న్యాయవిస్తరః ।
ఆయుర్వేదో ధనుర్వేదో గాన్ధర్వం కావ్యనాటకమ్ ॥ ౧౨౩॥

వైఖానసం భాగవతం సాత్వతం పాంచరాత్రకమ్ ।
శైవం పాశుపతం కాలాముఖమ్భైరవశాసనమ్ ॥ ౧౨౪॥

శాక్తం వైనాయకం సౌరం జైనమార్హతసంహితా ।
సదసద్ వ్యక్తమవ్యక్తం సచేతనమచేతనమ్ ॥ ౧౨౫॥

బన్ధో మోక్షః సుఖం భోగో యోగః సత్యమణుర్మహాన్ ।
స్వస్తి హుం ఫట్ స్వధా స్వాహా శ్రౌషట్ వౌషట్ వషట్ నమః ॥ ౧౨౬॥

జ్ఞానం విజ్ఞానమానన్దో బోధః సంవిత్శమోయమః ।
ఏక ఏకాక్షరాధారః ఏకాక్షరపరాయణః ॥ ౧౨౭॥

ఏకాగ్రధీ రేకవీర ఏకాఽనేకస్వరూపధృక్ ।
ద్విరూపో ద్విభుజో ద్వ్యక్షో ద్విరదో ద్వీపరక్షకః ॥ ౧౨౮॥

ద్వైమాతురో ద్వివదనో ద్వంద్వాతీతో ద్వయాతిగః ।
త్రిధామా త్రికరస్త్రేతా త్రివర్గఫలదాయకః ॥ ౧౨౯॥

త్రిగుణాత్మా త్రిలోకాదిస్త్రిశక్తీశస్త్రిలోచనః ।
చతుర్బాహు శ్చతుర్దంతః చతురాత్మా చతుర్ముఖః !!౧౩౦!!

చతుర్విధోపాయమయశ్చతుర్వర్ణాశ్రయః ।
చతుర్విధవచోవృత్తిపరివృత్తిప్రవర్తకః ॥ ౧౩౧॥

చతుర్థీపూజనప్రీతశ్చతుర్థీతిథిసమ్భవః
పఞ్చాక్షరాత్మా పఞ్చాత్మా పఞ్చాస్యః పఞ్చకృత్యకృత్ ॥ ౧౩౨॥

పఞ్చాధారః పఞ్చవర్ణః పఞ్చాక్షరపరాయణః ।
పఞ్చతాలః పఞ్చకరః పఞ్చప్రణవభావితః ॥ ౧౩౩॥

పఞ్చబ్రహ్మమయస్ఫూర్తిః పఞ్చావరణవారితః ।
పఞ్చభక్ష్యప్రియః పఞ్చబాణః పఞ్చశివాత్మకః ॥ ౧౩౪॥

షట్కోణపీఠః షట్చక్రధామా షడ్గ్రన్థిభేదకః ।
షడధ్వధ్వాన్తవిధ్వంసీ షడంగులమహాహ్రదః ॥ ౧౩౫॥

షణ్ముఖః షణ్ముఖభ్రాతా షట్ఛక్తిపరివారితః ।
షడ్వైరివర్గవిధ్వంసీ షడూర్మిభయభఞ్జనః ॥ ౧౩౬॥

షట్తర్కదూరః షట్కర్మనిరత షడ్రసాశ్రయః ।
సప్తపాతాలచరణః సప్తద్వీపోరుమణ్డలః ॥ ౧౩౭॥

సప్తస్వర్లోకముకుటః సప్తసప్తివరప్రదః ।
సప్తాఙ్గరాజ్యసుఖదః సప్తర్షిగణమండితః ॥ ౧౩౮॥

సప్తచ్ఛన్దోనిధిః సప్తహోతా సప్తస్వరాశ్రయః ।
సప్తాబ్ధికేలికాసారః సప్తమాతృనిషేవితః ॥ ౧౩౯॥

సప్తచ్ఛన్దో మోదమదః సప్తచ్ఛన్దో మఖప్రభుః ।
అష్టమూర్తిర్ధ్యేయమూర్తిరష్టప్రకృతికారణమ్ ॥ ౧౪౦॥

అష్టాఙ్గయోగఫలభూరష్టపత్రామ్బుజాసనః ।
అష్టశక్తిసమృద్ధశ్రీరష్టైశ్వర్యప్రదాయకః ॥ ౧౪౧॥

అష్టపీఠోపపీఠశ్రీరష్టమాతృసమావృతః ।
అష్టభైరవసేవ్యోఽ(అ)ష్టవసువన్ద్యోఽ(అ)ష్టమూర్తిభృత్ ॥ ౧౪౨॥

అష్టచక్రస్ఫురన్మూర్తిరష్టద్రవ్యహవిఃప్రియః ।
నవనాగాసనాధ్యాసీ నవనిధ్యనుశాసితా ॥ ౧౪౩॥

నవద్వారపురాధారో నవధారనికేతనః ।
నవనారాయణస్తుత్యో నవదుర్గానిషేవితః !!౧౪౪!!

నవనాథమహానాథో నవనాగవిభూషణః !
నవరత్నవిచిత్రాఙ్గో నవశక్తిశిరోద్ధృతః ॥ ౧౪౫॥

దశాత్మకో దశభుజో దశదిక్పతివన్దితః ।
దశాధ్యాయో దశప్రాణో దశేన్ద్రియనియామకః ॥ ౧౪౬॥

దశాక్షరమహామన్త్రో దశాశావ్యాపివిగ్రహః ।
ఏకాదశాదిభీరుద్రైఃస్తుత ఏకాదశాక్షరః ॥ ౧౪౭॥

ద్వాదశోద్దండదోర్దండో ద్వాదశాంతనికేతనః ।
త్రయోదశాభిదాభిన్నో విశ్వేదేవాధిదైవతమ్ ॥ ౧౪౮॥

చతుర్దశేన్ద్రవరదశ్చతుర్దశమనుప్రభుః ।
చతుర్దశాదివిద్యాఢ్యశ్చతుర్దశజగత్ప్రభుః ॥ ౧౪౯॥

సామపఞ్చదశః పఞ్చదశీశీతాంశునిర్మలః ।
షోడశాధారనిలయః షోడశస్వరమాతృకః !!౧౫౦!!

షోడశాన్తపదావాసః షోడశేన్దుకలాత్మకః !
కలాసప్తదశీ సప్తదశస్సప్తదశాక్షరః !!౧౫౧!!

అష్టాదశద్వీపపతిరష్టాదశపురాణకృత్ !
అష్టాదశౌషధీసృష్టిరష్టాదశవిధిః స్మృతః !!౧౫౨!!

అష్టాదశలిపివ్యష్టిసమష్టిజ్ఞానకోవిదః !
ఏకవింశః పుమానేకవింశత్యంగుళిపల్లవః ॥ ౧౫౩॥

చతుర్వింశతితత్త్వాత్మా పఞ్చవింశాఖ్యపూరుషః ।
సప్తవింశతితారేశః సప్తవింశతియోగకృత్ ॥ ౧౫౪॥

ద్వాత్రింశద్భైరవాధీశశ్చతుస్త్రింశన్మహాహ్రదః ।
షట్త్రింశత్తత్త్వసంభూతిరష్టాత్రింశత్కలాతనుః ॥ ౧౫౫॥

నమదేకోనపఞ్చాశన్మరుద్వర్గనిరర్గలః
పఞ్చాశదక్షరశ్రేణీ పఞ్చాశద్రుద్రవిగ్రహః ॥ ౧౫౬॥

పఞ్చాశద్విష్ణుశక్తీశః పఞ్చాశన్మాతృకాలయః ।
ద్విపఞ్చాశద్వపుఃశ్రేణీ త్రిషష్ట్యక్షరసంశ్రయః !!౧౫౭!!

చతుఃషష్ట్యర్థనిర్ణేతా చతుఃషష్టికలానిధిః ।
చతుష్షష్టిమహాసిద్ధయోగినీబృన్దవన్దితః !!౧౫౮!!

అష్టషష్టిమహాతీర్థక్షేత్రభైరవభావనః!
చతుర్నవతిమన్త్రాత్మా షణ్ణవత్యధికప్రభుః !!౧౫౯!!

శతానన్దః శతధృతిః శతపత్రాయతేక్షణః!
శతానీకః శతమఖః శతధారావరాయుధః !!౧౬౦!!

సహస్రపత్రనిలయః సహస్రఫణభూషణః!
సహస్రశీర్షాపురుషః సహస్రాక్షః సహస్రపాత్ !!౧౬౧!!

సహస్రనామసంస్తుత్యః సహస్రాక్షబలాపహః!
దశసాహస్రఫణభృత్ఫణిరాజకృతాసనః !!౧౬౨!!

అష్టాశీతిసహస్రాద్యమహర్షిస్తోత్రయంత్రితః!
లక్షాధీశ ప్రియాధారో లక్షాధారమనోమయః !!౧౬౩!!

చతుర్లక్షజపప్రీతశ్చతుర్లక్షప్రకాశితః!
చతురశీతిలక్షాణాం జీవానాం దేహసంస్థితః !!౧౬౪!!

కోటిసూర్యప్రతీకాశః కోటిచన్ద్రాంశునిర్మలః !
శివాభవాధ్యుష్టకోటివినాయకధురన్ధరః !!౧౬౫!!

సప్తకోటిమహామన్త్రమన్త్రితావయవద్యుతిః!
త్రయస్త్రింశత్కోటిసురశ్రేణీప్రణతపాదుకః !!౧౬౬!!

అనన్తనామానన్తశ్రీరనన్తాఽనన్తసౌఖ్యదః ।
ఇతి వైనాయకం నామ్నాం సహస్రమిదమీరితమ్ ॥ ౧౬౭॥

ఇతి శ్రీగణేశపురాణే ఉపాసనాఖండే శ్రీమహాగణపతిప్రోక్తమ్ శ్రీగణేశ సహస్రనామ స్తోత్రమ్ సంపూర్ణమ్!!

శ్రీ సూర్య స్తోత్రము

శ్రీ సూర్య స్తోత్రము

ఈ స్తోత్రమును ప్రతినిత్యము ప్రాతఃకాలమున పఠించినవారికి సమస్త వ్యాధులునుతొలగి పోయి ఆయుఃరారోగ్యములు త్వరలో చేకూరును

స్తోత్రమ్—-
1. బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదా శివః |
పంచ బ్రహ్మ మయాకారాయేన జాతాస్త మీశ్వరమ్ ||

2. కాలాత్మ సర్వ భూతాత్మా వేదాత్మా విశ్వతో ముఖః |
జన్మమృత్యు జరావ్యాధ సంసార భయనాశనః ||

3. బ్రహ్మ స్వరూప ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వరః |
అస్తమానే స్వయం విష్ణు స్త్రయీమూర్తిర్ద వాకరః ||

4. ఏక చక్ర రధో యస్య దివ్యః కనక భూషితః |
సోయంభవతునః ప్రీతః పద్మమస్తో దివాకరః ||

5. పద్మ హస్తః పరంజ్యోతిః పరేశాయ నమోనమః |
అండ యోనిర్మహాసాక్షి ఆదిత్యాయ నమో నమః ||

6. కమలాసన దేవేశ ఆదిత్యాయ నమోనమః |
ధర్మమూర్తిర్ద యామూర్తి స్సత్త్వ మూర్తి ర్నమోనమః ||

7. సకలే వాయ సూర్యాయ క్షాంతీ శాయ నమోనమః |
క్షయాపస్మార గుల్మాది దుర్దోషవ్యాధ నాశన ||

8. సర్వ జ్వర హర శ్చైవ కుక్షి రోగ నివారణ |
ఏత తోత్త్సత్రం శివ ప్రోక్తం సర్వసిద్ద కరం పరమ్ ||

నరసింహపురాణే సూర్యాష్టోత్తరశతనామావలిః విశ్వకర్మకృతా
ఓం ఆదిత్యాయ నమః । సవిత్రే । సూర్యాయ । ఖగాయ । పూష్ణే । గభస్తిమతే ।
తిమిరోన్మథనాయ । శమ్భవే । త్వష్ట్రే । మార్తణ్డాయ । ఆశుగాయ ।
హిరణ్యగర్భాయ । కపిలాయ । తపనాయ । భాస్కరాయ । రవయే । అగ్నిగర్భాయ ।
అదితేః పుత్రాయ । శమ్భవే । తిమిరనాశనాయ నమః । ౨౦

ఓం అంశుమతే నమః । అంశుమాలినే । తమోఘ్నాయ । తేజసాం నిధయే ।
ఆతపినే । మణ్డలినే । మృత్యవే । కపిలాయ । సర్వతాపనాయ । హరయే ।
విశ్వాయ । మహాతేజసే । సర్వరత్నప్రభాకరాయ । అంశుమాలినే । తిమిరఘ్నే ।
ఋగ్యజుస్సామభావితాయ । ప్రాణావిష్కరణాయ । మిత్రాయ । సుప్రదీపాయ ।
మనోజవాయ నమః । ౪౦

ఓం యజ్ఞేశాయ నమః । గోపతయే । శ్రీమతే । భూతజ్ఞాయ । క్లేశనాశనాయ ।
అమిత్రఘ్నే । శివాయ । హంసాయ । నాయకాయ । ప్రియదర్శనాయ । శుద్ధాయ ।
విరోచనాయ । కేశినే । సహస్రాంశవే । ప్రతర్దనాయ । ధర్మరశ్మయే ।
పతఙ్గాయ । విశాలాయ । విశ్వసంస్తుతాయ । దుర్విజ్ఞేయగతయే నమః । ౬౦

ఓం శూరాయ నమః । తేజోరాశయే । మహాయశసే । భ్రాజిష్ణవే ।
జ్యోతిషామీశాయ । విష్ణవే । జిష్ణవే । విశ్వభావనాయ । ప్రభవిష్ణవే ।
ప్రకాశాత్మనే । జ్ఞానరాశయే । ప్రభాకరాయ । ఆదిత్యాయ । విశ్వదృశే ।
యజ్ఞకర్త్రే । నేత్రే । యశస్కరాయ । విమలాయ । వీర్యవతే । ఈశాయ నమః । ౮౦

ఓం యోగజ్ఞాయ నమః । యోగభావనాయ । అమృతాత్మనే । శివాయ । నిత్యాయ ।
వరేణ్యాయ । వరదాయ । ప్రభవే । ధనదాయ । ప్రాణదాయ । శ్రేష్ఠాయ ।
కామదాయ । కామరూపధృకే । తరణయే । శాశ్వతాయ । శాస్త్రే ।
శాస్త్రజ్ఞాయ । తపనాయ । శయాయ । వేదగర్భాయ నమః । ౧౦౦

ఓం విభవే నమః । వీరాయ । శాన్తాయ । సావిత్రీవల్లభాయ । ధ్యేయాయ ।
విశ్వేశ్వరాయ । భర్త్రే । లోకనాథాయ । మహేశ్వరాయ । మహేన్ద్రాయ ।
వరుణాయ । ధాత్రే । విష్ణవే । అగ్నయే । దివాకరాయ నమః । ౧౧౫

ఇతి నరసింహపురాణే సూర్యాష్టోత్తరశతనామావలిః విశ్వకర్మకృతా సమాప్తా ।

శ్రీ దక్షిణామూర్తి అష్టకం- తాత్పర్యము

శ్రీ దక్షిణామూర్తి అష్టకం- తాత్పర్యము

శ్రీ ఆది శంకరుల విరచితం


1. విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం
నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం
యధానిద్రయా
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే
వాద్వయం
తస్మై శ్రీగురు మూర్తయే
నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

ఈ విశ్వము అద్దములో కనిపించే ప్రతిబింబము వంటిది.
నిజమే బ్రహ్మము.
బ్రహ్మమునకు రెండవది లేదు.
మనస్సు, ఇంద్రియములు, బుద్ధి కేవలం
ఆత్మ యొక్క ప్రతిబింబమును మాత్రమే
గ్రహించ గలుగుతున్నవి.
స్వయం ప్రకాశము (సాక్షాత్కారము) పొందిన పిమ్మటే ఆత్మ, బ్రహ్మ యొక్క గోచరమగును.
ఈ సాక్షాత్కారమునకై శ్రీ గురు స్వరూపుడైన దక్షిణామూర్తికి నా నమస్కారములు.

2. బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం
పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం
మాయావీవ విజృంభ త్యపి మయా యోగేవయః
స్వేచ్ఛయా
తస్మై శ్రీగురు మూర్తయే
నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

వృక్షము మొలచుటకు ముందు బీజరూపమున నిక్షిప్తమై ఉన్నట్టు,
ఈ విశ్వము కూడా తనయందు అటులనే
కలిగిన ఆయనకు, తన మాయచే,
యోగుల వంటి సంకల్పముచే విశ్వమును
అనేక రూపములలో సృష్టించిన,
శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి
నా నమస్కారములు.

3. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం
భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో
బోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధ
తస్మై శ్రీగురు మూర్తయే
నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

ఎవరి ప్రకాశముచే ఈ మాయా ప్రపంచము నిజముగా కనిపిస్తున్నదో,
ఆయన, ఆత్మ జ్ఞానము పొందగోరువారికి వేదముల సారము (తత్త్వమసి) ద్వారా పరబ్రహ్మ తత్త్వమును బోధిస్తున్నాడు.
ఈ సంసార సాగరాన్ని అంతము చేసే,
శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి
నా నమస్కారములు.

4. నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప
ప్రభాభాస్వరం
జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా
బహిస్పందతే
జానామీతి తమేవ
భాంతమనుభాత్యేతత్సమస్తంజగత్
తస్మై శ్రీ గురు మూర్తయే
నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

ఎవరి ప్రకాశము ఇంద్రియముల ద్వారా
కుండలో ఉన్న వెలుగు దాని రంధ్రముల ద్వారా వెలువడినట్లు వెలువడునో,
ఎవరి జ్ఞానము వల్లనే నేనే బ్రహ్మ అను
జ్ఞానము కలుగునో,
ఎవరి ప్రకాశము వలన విశ్వమంతా ప్రకాశించునో,
శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి
నా నమస్కారములు.

5. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం
బుద్ధించశూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహ మితి భ్రాంతాభృశం
వాదినః
మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ
సంహారిణే
తస్మైశ్రీ గురుమూర్తయే
నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

కొంత మంది తత్త్వవేత్తలు శరీరము, ఇంద్రియములు, ప్రాణము, శ్వాస మరియు శూన్యమును
ఆత్మగా వాదిస్తున్నారు.
అది జ్ఞానము లేని స్త్రీలు, పిల్లలు, గుడ్డివారు, బలహీనుల వాదన కన్నా లోకువైనది.
మాయ వలన కలిగే భ్రాంతిని తొలగించి సత్యమును తెలియచేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.

6. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా
సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః
పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః
ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే
నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా,
సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా యుండును.
అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా,
కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును. ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును.
ఎలాగైతే నిద్రనుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకుముందు నిద్రలోయున్నాను,
మరియు ఆ నిద్రలోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో, అలాగే,
ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు. ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.

7. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వా
స్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమి
త్యంతస్స్ఫురంతం సదా స్వాత్మానం
ప్రకటికరోతిభజతాం యోముద్రయా భద్రయా
తస్మైశ్రీగురుమూర్తయే
నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

ఎవరి ఉనికి అయితే దేహము, బుద్ధి యొక్క
వివిధ అవస్థల (దేహమునకు బాల్యం, యౌవనం, వృద్ధాప్యం; బుద్ధికి జాగ్రత్, చేతన, సుషుప్తా మొదలగునవి) వచ్చే మార్పులకు అతీతంగా ఉండునో,
జ్ఞాన ముద్ర (అభయ హస్తమున బొటన వేలు, చూపుడు వేలు కలిపిన ముద్రను జ్ఞాన ముద్ర అంటారు) ద్వారా ఆత్మ జ్ఞానమును కలుగ జేసే,
శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి
నా నమస్కారములు.

8. విశ్వం పశ్యతి కార్యకారణతయా
స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పిత్ర పుత్రాద్యాత్మనా
భేదతాః
స్వస్నే జాగ్రతి వాయు ఏష పురుషో మయా
పరిభ్రామితః
తస్మైశ్రీ గురుమూర్తయే
నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

ఎవరి మాయ వలన ఈ ప్రపంచమున చేతన, స్వప్నావస్థల యందు అనేక రూపముల
అనుభూతి కలుగుతున్నదో (గురువు, శిష్యుడు, తండ్రి కొడుకు మొదలగునవి),
శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి
నా నమస్కారములు.

9. భూరంభాం స్యనలోనిలోబర
మహర్నాధోపిమాంశుః పుమాన్
నిత్యభాతి చరాచరాత్మక మిదం యస్మైచ
మూర్త్యష్టకం
.నాన్యత్కించ నవిద్యతే విమృశతాంయస్మాతత్పర
స్వాదిభో
తస్మై గిరి మూర్తయే
నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

ఎవరి సూక్ష్మ, అష్ట పరిణామములు (రూపాంతరములు) ఈ చరాచారమును సృష్టించుచున్నవో,
ఎవరి అనుగ్రహము వలన ఈ సృష్టులు అన్ని అంతర్ధానమై ఆత్మయే బ్రహ్మము అను సత్యమును తెలుపబడుతున్నదో,
శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి
నా నమస్కారములు.

10. సర్వాత్వమితి స్ఫుటీకృత మిదం
యస్మాదముష్మిన్ స్తవే తేనాస్వ శ్రవణాత్త దర్థ
మననా ద్ధ్యానా చ్ఛ సంకీర్తనాత్
సర్వాత్మత్వ మహావిభూతి సహితం
స్వాదీశ్వత్వం స్వతః
సిద్ధేత్తత్పురష్టధా పరిణతం చైశ్వర్య
మవ్యాహతమ్!!

ఈ స్తోత్రము ఆత్మ యొక్క
సర్వ వ్యాపకా తత్త్వమును తెలుపుచున్నది.
దీని మననము, పఠనం, ధ్యానము వలన
శిష్యుడు ఆత్మ సంయోగం చెంది,
ఈ విశ్వము, ఆత్మ యొక్క ఏకత్వమును తెలుసుకొని ఎనిమిది పరిణామముల సారమగును.
సంసార బంధములు, జనన మరణ ఋణములు తొలగించే, వట వృక్షము కింద ఆసీనుడై యోగులకు, మునులకు జ్ఞానోపదేశము చేసే వానిగా
ధ్యానించ బడే, త్రిలోక వంద్యుడైన
శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
స్వస్తి

ఓం నమః శివాయ 

Saturday 9 May 2020

శివ_ప్రదోష_స్తోత్రమ్

శివ_ప్రదోష_స్తోత్రమ్

జయ దేవ జగన్నాథ జయ శఙ్కర శాశ్వత |
జయ సర్వసురాధ్యక్ష జయ సర్వసురార్చిత ||1||

జయ సర్వగుణాతీత జయ సర్వవరప్రద ||
జయ నిత్య నిరాధార జయ విశ్వమ్భరావ్యయ ||2||

జయ విశ్వైకవన్ద్యేశ జయ నాగేన్ద్రభూషణ |
జయ గౌరీపతే శమ్భో జయ చన్ద్రార్ధశేఖర ||౩||

జయ కోఠ్యర్కసఙ్కాశ జయానన్తగుణాశ్రయ |
జయ భద్ర విరూపాక్ష జయాచిన్త్య నిరఞ్జన ||4||

జయ నాథ కృపాసిన్ధో జయ భక్తార్తిభఞ్జన |
జయ దుస్తరసంసారసాగరోత్తారణ ప్రభో ||5||

ప్రసీద మే మహాదేవ సంసారార్తస్య ఖిద్యతః |
సర్వపాపక్షయం కృత్వా రక్ష మాం పరమేశ్వర ||6||

మహాదారిద్ర్యమగ్నస్య మహాపాపహతస్య చ ||
మహాశోకనివిష్టస్య మహారోగాతురస్య చ ||7||

ఋణభారపరీతస్య దహ్యమానస్య కర్మభిః ||
గ్రహైఃప్రపీడ్యమానస్య ప్రసీద మమ శఙ్కర ||8||

దరిద్రః ప్రార్థయేద్దేవం ప్రదోషే గిరిజాపతిమ్ ||
అర్థాఢ్యో వాఽథ రాజా వా ప్రార్థయేద్దేవమీశ్వరమ్ ||9||

దీర్ఘమాయుః సదారోగ్యం కోశవృద్ధిర్బలోన్నతిః ||
మమాస్తు నిత్యమానన్దః ప్రసాదాత్తవ శఙ్కర ||10||

శత్రవః సంక్షయం యాన్తు ప్రసీదన్తు మమ ప్రజాః ||
నశ్యన్తు దస్యవో రాష్ట్రే జనాః సన్తు నిరాపదః ||11||

దుర్భిక్షమారిసన్తాపాః శమం యాన్తు మహీతలే ||
సర్వసస్యసమృద్ధిశ్చ భూయాత్సుఖమయా దిశః ||12||

ఏవమారాధయేద్దేవం పూజాన్తే గిరిజాపతిమ్ ||
బ్రాహ్మణాన్భోజయేత్ పశ్చాద్దక్షిణాభిశ్చ పూజయేత్ ||1౩||

సర్వపాపక్షయకరీ సర్వరోగనివారణీ |
శివపూజా మయాఽఽఖ్యాతా సర్వాభీష్టఫలప్రదా ||14||

ఇతి ప్రదోషస్తోత్రం సమ్పూర్ణమ్ ||

శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం

శ్రీ నృసింహ స్వామి వారి ద్వాదశ నామ స్తోత్రం

 మహా మహిమాన్వితం శక్తివంతం,
ఈస్తోత్రాన్ని భక్తిగా పఠిస్తే
స్వామివారు మనకు రక్షా కవచంలా ఉండి కాపాడతారు.
అతి భయంకర వ్యాధులు రుగ్మతులు నశిస్తాయి,భయంతొలగుతుంది.

 శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం

ప్రథమంతు మహాజ్వాలో ద్వితీయం తు ఉగ్రకేసరీ ।

తృతీయం తు వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః ॥

పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః ।

సప్తమో యాతుహంతా చ అష్టమో దేవవల్లభః ॥

నవమం ప్రహ్లాద వరదో దశమోऽనంత హస్తకః ।

ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తదా ॥

ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః ।

మంత్రరాజ ఇతి జ్ఞాతం సర్వపాప వినాశనమ్ ॥

క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం ।

రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే ॥

గిరిగహ్వర అరణ్యే వ్యాఘ్ర చోరామయాదిషు ।

రణేచ మరణేచైవ శమదం పరమం శుభమ్ ॥

శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధి బంధనాత్ ।

ఆవర్తయత్ సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్ ॥

 
ఓం శ్రీ లక్ష్మి నృసింహాయ నమః.

సేకరణ...

Thursday 7 May 2020

దేవుని ప్రసాదములు రకాలు

దేవుని ప్రసాదములు రకాలు

మనం చేసే పూజలు రెండు రకాలుగా చేసుకుంటాం.
ఇంట్లో దేవునికి పూజ దేవాలయాల్లోనూ పూజలు చేస్తూ ఉంటాం.
ఇంట్లో చేసే పూజలు దేవతా కార్యాలు కిందకు వస్తాయి.
ఇంటి యజమాని పెద్దల సహకారంతో ఇక్కడ పూజలు చేస్తాం.
దేవాలయాలలో పూజల విషయానికి వస్తే కుటుంబ సభ్యులు మిత్రులు బంధువులతో వెళ్లి దేవుని పూజ చేస్తాము.
పూజలు చేసిన తర్వాత దేవాలయ అర్చకులు భక్తులకు ప్రసాదాలు అందజేస్తారు.
దైవ ప్రసాదం పేరుతో తీర్థాలు, భక్ష్య ప్రసాదాలు , పుష్ప ప్రసాదాలు, ఫల, అన్న, రక్ష ,లేపన, మృత్తిక ,ఇన్ని రకాల రూపాలలో ప్రసాదాలు ఇస్తారు..
ఫల ,అన్న, భక్ష ప్రసాదాలను వెంటనే అక్కడి తినొచ్చు..
కుంకుమ అయితే ప్రతిరోజు నుదుటిన ధరించవచ్చు అయితే శివుని గుడి లో ఇచ్చే బిల్వ పత్ర ప్రసాదాన్ని ప్రతిరోజూ ఉపయోగించలేము.
ధరించడం పై నిషేధం ఉంది..

ఇటువంటి సందర్భాల్లో ఏం చేయాలి? ప్రసాదాలు లో ఎన్ని రకాలు ఉంటాయి? ఈ ప్రసాదాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలి ?ఈ ప్రసాదాలతో ఎటువంటి ఫలితం లభిస్తుంది? ప్రసాదాలు స్వీకరించే విషయంలో చేయవలసిన అంశాలు కొన్ని

ప్రసాదాలలో రెండు రకాల ప్రసాదాలు

1. భక్ష్య ప్రసాదం
2. తీర్థ ప్రసాదం

తీర్థప్రసాదాలలో నాలుగు రకాలు ఉంటాయి..

1. జల తీర్ధం.
2. కాషాయ తీర్థం.
3. పంచామృత అభిషేక తీర్థం.
4. పానక తీర్థం.

జల తీర్ధం

ఈ తీర్థం సేవించడం ద్వారా అకాల మృత్యువు సర్వరోగాలు నివారించబడతాయి అన్ని కష్టాలు దుఖాలు తొలగిపోతాయి.. బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డు పడుతుంది..

కషాయ తీర్థం

ఈ తీర్థాన్ని కొల్హాపురం లోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం, కొల్లూరు మూకాంబిక దేవాలయం, హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాల మాలిని దేవాలయం, అస్సాంలోని కామాఖ్య దేవాలయములో ఇస్తారు రాత్రి పూజ తర్వాత తీర్థాన్ని కషాయం రూపంలో పంచుతారు ..
వీటిని సేవించడం ద్వారా కనిపించే కనిపించని రోగాలు త్వరగా నయం అవుతాయి

పంచామృత అభిషేక తీర్థం

పంచామృత అభిషేకం ని స్వీకరించడం ద్వారా చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావడం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది..

పానక తీర్థం

శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి అహోబిలం నరసింహస్వామి దేవునికి పానకం నైవేద్యంగా పెట్టడం తో పానకాల స్వామి పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినార్జించారు..కారణం స్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్థంగా పంచుతారు..
పానక తీర్థాన్ని సేవిస్తే
దేహంలో ఉత్సాహం ఎక్కువవుతుంది కొత్త చైతన్యం వస్తుంది..
దేహంలో ఉండే ఉష్ణం సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది.
రక్తపోటు ఉన్న వారికి తల తిరగడం నోరు ఎండిపోయినట్లు ఉండటం జరగదు
ఎముకలకు సంబంధించిన వ్యాధులు నయం అవుతాయి..
నీరసం దరిచేరదు ఆకలి బాగా వేస్తుంది ..
హార్మోన్లు వృద్ధి చెందుతాయి..
జీవితంలో శత్రువుల బాధ కలుగదు..
బుద్ధి చురుకుగా పనిచేస్తుంది ..
జ్ఞాపక శక్తి పెరుగుతుంది..

భక్ష్య ప్రసాదం

దేవునికి భక్తులు ప్రసాదం రూపంలో భక్ష్యాలను అందిస్తారు .
వీటిలో లడ్డు , వడల హారం, దోసెల నైవేద్యం ,బెల్లం దోస నైవేద్యం ,చేగోడీ ల నైవేద్యం, జంతికల నైవేద్యం ,బొబ్బట్లు నైవేద్యం ,అరిసెల నైవేద్యం, రవ్వ లడ్డు నైవేద్యం మొదలైన నైవేద్యాలు ఉన్నాయి.‌

వీటిని నైవేద్యంగా దేవుడికి ఇవ్వడం ద్వారా ఎటువంటి శుభాలు కలుగుతాయి అంటే

దేవునికి
1. లడ్డులను నైవేద్యంగా ఉంచితే ఇంట్లో శుభకార్యాలు జరిగి అంతా శుభమే జరుగుతుంది..
2. వడల హారాన్ని లేదా గారెలను నైవేద్యంగా పెడితే ఇంట్లో అన్ని రకాల కలహాలు నివారణ అవుతాయి. మనసు కూడా స్థిరంగా ఉంటుంది..
3. దోసెను నైవేద్యంగా పెడితే ఇంట్లో
శాంతి ఉంటుంది.
శాంతియుత వాతావరణం నెలకొంటుంది .
ఇంట్లో ఎవరికైనా నిద్ర రాకుంటే చక్కగా నిద్రపడుతుంది..
4. బెల్లం దోసెను నైవేద్యంగా ఉంచడం
ద్వారా చక్కెర వ్యాధి ఉన్నవారు త్వరగా కోలుకుంటారు. చదువుకునే వారికి విద్య చక్కగా అబ్బుతుంది. మంచి జ్ఞాపకశక్తి వస్తుంది..
5. శనగపిండి లడ్డు నైవేద్యంగా ఉంచితే మరుపు దరిచేరదు..
6. జంతికలను నైవేద్యంగా పెట్టడం ద్వారా బరువైన లోహాలు ఇనుప వ్యాపారం చేసేవారికి వ్యాపారం వృద్ధి చెందుతుంది..
7. చేగోడీలు నైవేద్యంగా ఉంచితే ఇంట్లో చాలా రోజులుగా నిలిచి ఉన్న పనులు వేగంగా జరుగుతాయి..
8. దేవునికి బొబ్బట్లు నైవేద్యంగా ఉంచితే ఇంట్లో కుజ దోషాలు నివారణ కలిగి త్వరగా వివాహాలు జరుగుతాయి..
9. అప్పాలు లేదా అరిసెలను నైవేద్యంగా ఉంచితే పెద్దలు పాపాలు తొలగిపోతాయి..
10. రవ్వలడ్డు నైవేద్యంగా ఉంచితే ఆలోచనల వల్ల కలిగే తలనొప్పి,కంటికి సంబంధించిన నొప్పి, అధిక రక్తపోటు సాధారణ స్థితికి వస్తాయి..

సేకరణ....

దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి

దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి

దత్తపరమైన జ్ఞానం చెప్పుకోవడం,
వినడం అనే క్రియవల్ల అన్ని అమంగళములు నశించి పోతాయి అంటూ దత్తుడి మహిమ చెప్పుకోవడం వల్ల వచ్చే ఫలితం చెప్తూ వేదధర్ముడు దీపకునికి ఒక 108 అద్భుత దత్తనామములు చెప్తాడు. ఆ దత్తనామాలు నిత్యానుష్టానం చేసేవాడిని కవచంలా స్వామి కాపాడతాడు.

దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి

ఓం శ్రీ దత్తాయ నమః
ఓం దేవదత్తాయ నమః
ఓం బ్రహ్మదత్తాయ నమః
ఓం శివదత్తాయ నమః
ఓం విష్ణుదత్తాయ నమః
ఓం అత్రిదత్తాయ నమః
ఓం ఆత్రేయాయ నమః
ఓం అత్రివరదాయ నమః
ఓం అనసూయాయ నమః
ఓం అనసూయాసూనవే నమః 10
ఓం అవధూతాయ నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధర్మపరాయణాయ నమః
ఓం ధర్మపతయే నమః
ఓం సిద్ధాయ నమః
ఓం సిద్ధిదాయ నమః
ఓం సిద్ధిపతయే నమః
ఓం సిధ్ధసేవితాయ నమః
ఓం గురవే నమః
ఓం గురుగమ్యాయ నమః 20
ఓం గురోర్గురుతరాయ నమః
ఓం గరిష్ఠాయ నమః
ఓం వరిష్ఠాయ నమః
ఓం మహిష్ఠాయ నమః
ఓం మహాత్మనే నమః
ఓం యోగాయ నమః
ఓం యోగగమ్యాయ నమః
ఓం యోగాదేశకరాయ నమః
ఓం యోగపతయే నమః
ఓం యోగీశాయ నమః 30
ఓం యోగాధీశాయ నమః
ఓం యోగపరాయణాయ నమః
ఓం యోగిధ్యేయాంఘ్రి పంకజాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం దివ్యాంబరాయ నమః
ఓం పీతాంబరాయ నమః
ఓం శ్వేతాంబరాయ నమః
ఓం చిత్రాంబరాయ నమః
ఓం బాలాయ నమః
ఓం బాలవీర్యాయ నమః 40
ఓం కుమారాయ నమః
ఓం కిశోరాయ నమః
ఓం కందర్ప మోహనాయ నమః
ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః
ఓం సురాగాయ నమః
ఓం వీరాగాయ నమః
ఓం వీతరాగాయ నమః
ఓం అమృతవర్షిణే నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం అనుగ్రహరూపాయ నమః 50
ఓం స్ధవిరాయ నమః
ఓం స్ధవీయసే నమః
ఓం శాంతాయ నమః
ఓం అఘోరాయ నమః
ఓం మూఢాయ నమః
ఓం ఊర్ధ్వరేతసే నమః
ఓం ఏకవక్త్రాయ నమః
ఓం అనేకవక్త్రాయ నమః
ఓం ద్వినేత్రాయ నమః
ఓం త్రినేత్రాయ నమః 60
ఓం ద్విభుజాయ నమః
ఓం షడ్భుజాయ నమః
ఓం అక్షమాలినే నమః
ఓం కమండలధారిణే నమః
ఓం శూలినే నమః
ఓం శంఖినే నమః
ఓం గదినే నమః
ఓం ఢమరుధారిణే నమః
ఓం మునయే నమః
ఓం మౌనినే నమః 70
ఓం శ్రీ విరూపాయ నమః
ఓం సర్వరూపాయ నమః
ఓం సహస్రశిరసే నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రబాహవే నమః
ఓం సహస్రాయుధాయ నమః
ఓం సహస్రపాదాయ నమః
ఓం సహస్రపద్మార్చితాయ నమః
ఓం పద్మహస్తాయ నమః
ఓం పద్మపాదాయ నమః 80
ఓం పద్మనాభాయ నమః
ఓం పద్మమాలినే నమః
ఓం పద్మగర్భారుణాక్షాయ నమః
ఓం పద్మకింజల్కవర్చసే నమః
ఓం జ్ఞానినే నమః
ఓం జ్ఞానగమ్యాయ నమః
ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః
ఓం ధ్యానినే నమః
ఓం ధ్యాననిష్ఠాయ నమః
ఓం ధ్యానస్ధిమితమూర్తయే నమః 90
ఓం ధూళిదూసరితాంగాయ నమః
ఓం చందనలిప్తమూర్తయే నమః
ఓం భస్మోద్ధూళితదేహాయ నమః
ఓం దివ్యగంధానులేపినే నమః
ఓం ప్రసన్నాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ప్రకృష్టార్ధ ప్రదాయ నమః
ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వరీయసే నమః 100
ఓం బ్రహ్మణే నమః
ఓం బ్రహ్మరూపాయ నమః
ఓం విశ్వరూపిణే నమః
ఓం శంకరాయ నమః
ఓం ఆత్మనే నమః
ఓం అంతరాత్మనే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం శ్రీ దత్తాత్రేయాయ పరబ్రహ్మణే
నమో నమః 108

ఓం శ్రీ దత్తాయనమః ఓం దేవదత్తాయనమః తో ప్రారంభమయ్యే ఈ దివ్య నామములు దివ్యదృష్టితో దత్తాత్రేయ స్వామి ని దర్శించి వేద ధర్ముడు దీపాకునికి చెప్పాడు.

శ్రీ దత్త నామ కవచం


ఓం శ్రీ దత్తాయనమః ఓం దేవదత్తాయనమః తో ప్రారంభమయ్యే ఈ దివ్య నామములు దివ్యదృష్టితో దత్తాత్రేయ స్వామి ని దర్శించి వేద ధర్ముడు దీపాకునికి చెప్పాడు.
తరువాత ఈ నామములను కవచముగా ఎలా చేసుకొనవలెనో వివరించాడు. ఈ కవచమును ఉదయము, సాయంత్రం శ్రద్ధగా చదివిన పాపములనుంచి విముక్తి కలుగును అని శిష్యునకు కూడా చెప్పెను. ఈ నామములు ఆచార్య భరద్వాజ మాష్టరు గారు వ్రాసిన దత్తమహత్యం లో చివరలో కలవు.

శ్రీ దత్త నామ కవచం

1. ఓం కారాది నమోంతానం! నామ్నామష్టోత్తరం శతమ్!
శ్రద్ధయా యః పఠేన్నిత్యం! త్రిసంధ్యం నియతః సుధీః॥

భావము:: వేదధర్ముడు ఇలా చెప్పారు - ఓం కారంతో మొదలు పెట్టి నమః శబ్దమును చివర చేర్చి నూట ఎనిమిది నామములను విద్వాంసుడు ఏకాగ్రతతో మూడు సంధ్యా కాలములలో శ్రద్ధగా చదవాలి.

2. సర్వపాప విముక్తాత్మా! జాయతే విమలాంతరః !
భుక్త్యా యథేప్సితాన్భోగాన్! ప్రేత్య బ్రహ్మణి లీయతే ॥

భావము:: ఈ నామములు పఠించిన చో పాపచింతనలనుండి విడివడి స్వచ్ఛమైన మనస్సు కలవాడై. కోరిన కోర్కెలు తీరి సమస్త సుఖములను అనుభవించును . పరలోకమున శ్రీ దత్తునియందు ఐక్యము చెందును.

3. భక్తరక్షాక్షణో దేవః!స్మృతః సేవా స్వవేశ్మని!
స్వభోజ్యస్యార్పణం దానం! ఫలమింద్రాది దుర్లభమ్ ॥

భావము:: భక్తరక్షణ కొరకు ఎల్లప్పుడూ దత్తుడు సిద్ధంగా వుండును. భక్తులను రక్షించుటయే ఆయనకు ఆనందం. మన ఇంట్లోనే వుండి ఆయనను తలచినా, భోజనమునకు ముందు ఆ స్వామికి భోజనం అర్పించి తినినా, మనకు దానఫలము లభింస్తుంది. ఇంద్రాది దేవతలకు కూడా దుర్లభమైన ఐశ్వర్యమును ఇచ్చును.

4. య ఏతైర్నామభిర్దివ్యైః! కవచం ధారయేత్కృతీ!
రాజవేశ్మని కాంతారే! దుర్గాదిషు మహాభయే ॥

భావము:: ఈ అష్టోత్తర శతనామములు ఎవరు కవచముగా ధరించెదరో వారు కృతార్థులు అగుదురు. రాజభవనమునందు,అరణ్య ములందు,మహాభయములందు ఈ నామములతో కవచముగా ధరించిన విజయము పొందుతారు.

5. శత్రుచోరభయాకీర్ణే! శ్మశానే ప్రేతదూషితే!
న భయం విద్యతే తస్య! దృష్ట్వా తం విద్రువేద్భయమ్॥

భావము:: శత్రువులు, దొంగలు, శ్మశానములయందు,భయములువుండు చోట ఈ నామములు కవచముగా కలిగిన వానిని చూసి భయపడి అన్ని పారిపోవును.

6. శిరో లలాటం నేత్రేచ! భ్రూమధ్యం చ భ్రువౌ తథా!
నాసే కర్ణౌ తథోష్ఠౌ చ! హనుః కంఠం కకుత్తథా ॥

భావము:: శిరస్సు, నుదురు, నేత్రములు, కనుబొమల మధ్యభాగం,కనుబొమలు, ముక్కు, చెవులు, పెదవులు, దవడలు, కంఠము, ఈ నామములు చెప్పుచూ తాకవలెను. అక్కడ వున్న రోగములు పోతాయి.

7 . దౌతాంఘ్రిహస్త ఆచమ్య! స్మృత్యా దత్తం న్యసేత్సుధీః!
కరాంగన్యాసౌ విన్యస్య!షడ్భిః ష్షడ్భిః తతః క్రమాత్ ॥

భావము:: చేతులు, కాళ్ళు కడుగుకొని కేశవాది నామాలతో ఆచమనం చేసి దత్తాత్రేయుని స్మరించి ఈ అష్టోత్తర శతనామ కవచమును చదువుకొనవలెను. అంగన్యాస, కరన్యాసములు ఆరేసి నామములతో చేయవలెను.

8. జత్రుస్తనౌ చ చక్షుశ్చ! హృదయం నాభిరేవచ!
మూలాధార స్ఫిచావూరూ! జానుజంగాశ్చ గుల్ఫయౌః ॥

భావము:: మూపు సంధులు, వక్షస్థలము, నేత్రములు, నాభి, మూలాధార ము, పిరుదులు, కటిప్రదేశము,తొడలు, మోకాళ్ళు, పిక్కలు, గిలకలు.

9. ప్రపదౌ పాదమూలాభ్యం ! తథా పాదతలే ఉభే!
పాదాగ్రాంగుష్ఠయో శ్చైవ ! హస్తాగ్రాభ్యాం తథైవ చ ॥

భావము: మోకాళ్ళు, పాదమూలములు , పాదప్రదేశములు,బొటనవేళ్ళు,చేతుల యొక్క అగ్రభాగములకు,నామములతో కవచము చేసుకొనవలెను.నామ ప్రభావముతో ఆయా అవయము ల రోగములు పోవును మరియు కవచము వలె రక్షణ ఇచ్చును.

10. స్కంధయోర్బుజమూలాభ్యాం ! సంధిభ్యాం కరయోః పృథక్!
అంగుల్యం గుష్ఠయోశ్చైవ! హస్తాగ్రాభ్యాం తథైవ చ ॥

భావము: భుజస్కంధముల యందు,భుజముల మూలలయందు,హస్తముల సందులయందు,వ్రేళ్ళయందు, హస్తాగ్రములయందు .

11.హృదయాద్దస్త పాదాగ్ర! పర్యంతవ్యాపకం న్యసేత్!
దశేంద్రియాంతః కరణ! చతుష్టయధృతంన్యసేత్ ॥

భావము:: హృదయము నుంచి హస్తాది పాదాగ్రముల వరకు ఈ నామకవచమును కప్పవలెను. పది ఇంద్రియాలందు, మనో,బుద్ధి, చిత్త, అహంకారముల యందు ఈ కవచమును ఉంచవలెను.

12. రోమస్వేకం చ హృదయం! స్పృష్ట్వా నామాని పంచ చ !
జేద్భక్త్యా స్మరన్దేవం! కృతకృత్యో భవేన్నరః ॥

భావము: రోమమలయందు,హృదయము నందు స్పృశించి అయిదు నామములను చెప్పవలెను. ఇట్లు భక్తి తో తన అవయముల అన్నిటి అందును ఆ దేవదేవుని స్మరించుచూ ఆ స్వామి నామములను జపించవలెను.

జపమునకు ముందు చేయవలసిన ధ్యాన శ్లోకం:::
పీతాంబరాలంకృత పృష్టభాగం! భస్మావగుంఠామలరుక్మ దేహమ్!
విద్యుత్సదాపింగ జటాభిరామం! శ్రీ దత్తయోగీశమహంనతోస్మి ॥

భావము:: పట్టు వస్త్రాలు కట్టుకొన్న, విభుతితో పూయబడిన బంగారపు శరీరము కలవాడు, మెరుపు తీగ వలె పచ్చనైన జడలతో మనోహరమైన శ్రీ దత్తయోగీశ్వరునికి అన్నివేళలా వంగి వంగి నమస్కరిస్తాను.

పితృ దేవతల ఆశీర్వచనం కోసం

పితృ దేవతల ఆశీర్వచనం కోసం

ఏ నక్షత్రం నాడు
అమ్మానాన్నలను/కాలం చేసిన పెద్దలను పూజిస్తే ఏ ఫలం దక్కుతుందో కూడా ఈ విధంగా మహాభారతం, కూర్మపురాణం చెబుతున్నాయి.

1)అశ్విని: వాహనాలు కావాలనుకున్న వారు అశ్వినీ నక్షత్రం ఉన్నప్పుడు తల్లి తండ్రుల సేవ చేయాలి.

2)భరణి: ఆయువు కావలసిన వారు భరణిలో అమ్మానాన్నలను అర్చించాలి.

3)కృత్తిక: అగ్నిసహితంగా కుమారునితో కలసి పితరులను కృత్తిక ఉన్నప్పుడు అర్చిస్తే రోగశోకాలు లేనివాడవుతాడు.

4)రోహిణి: సంతానం కావాలనుకున్నవారు తమ పితరులను రోహిణీ నక్షత్రం ఉన్నప్పుడు ప్రార్థించాలి.

5)మృగశిర: బ్రహ్మతేజస్సు కలుగుతుంది.

6)ఆర్ద్ర: శౌర్యం కావాలనుకున్నవారు ఆరుద్రా నక్షత్రం ఉన్నప్పుడు అమ్మానాన్నలను పార్వతీపరమేశ్వరులుగా అర్చించాలి. అంటే పోలీసులు, సైన్యం, అగ్నిమాపకదళం, భద్రతాదళాలు, అంగరక్షకులు వంటి వృత్తులలోని వారు ఈ రోజు తమ తల్లితండ్రులను పూజించాలి. దీని వల్ల శూరత్వం కలిగి తమ శౌర్యవృత్తుల్లో రాణిస్తారు.

7)పునర్వసు: ధనం, భూమి కావాలనుకున్న వారు పునర్వసులో పెద్దలను సేవించాలి.

8)పుష్యమి: తాతముత్తాలను పుష్యమి నాడు సేవిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, పుష్టికలుగుతుంది.

9)ఆశ్రేష: ఈ నక్షత్రం ఉన్నప్పుడు అమ్మానాన్నలను ప్రసన్నం చేసుకుంటే ధీరులైన పుత్రసంతానం, సర్వ కోరికలూ తీర్చే కుమారులు కలుగుతారు.

10)మఖ: తన దాయాదులలో మేటి కావాలను

కున్న వారు మఖనాడు పితరుల అర్చన చేయాలి.

11)పుబ్బ: పాపనాశనం, సౌభాగ్యం పుబ్బ వల్ల కలుగుతాయి.

12)ఉత్తర: సంతానధనాలు ఉత్తరానక్షత్రం వల్ల కలుగుతాయి.

13)హస్త:తన కులంలో శ్రేష్ఠత్వం హస్తా నక్షత్రం ద్వారా పొందుతారు.

14)చిత్త: అందమైన కొడుకులు కావాలనుకున్న వారు చిత్తా నక్షత్రంలో పెద్దలను సేవిస్తే సౌందర్యంకల పుత్రులు అనేకం కలుగుతారు.

15)స్వాతి: వ్యాపారాల వృద్ధిని స్వాతి కలిగిస్తుంది. (ఉద్యోగాలలో వృద్ధి కూడా కలుగుతుంది.)

16)విశాఖ: స్వర్ణరజతాలు పొందవచ్చు. అలాగే అనేక మంది పుత్రులు విశాఖ నక్షత్రం నాడు అమ్మానాన్నలను సేవిస్తే కలుగుతాయి.

17)అనూరాధ: రాజ్యాధికారం, మంచి మిత్రులను అనూరాధ ద్వారా పొందవచ్చు.

18)జ్యేష్ఠ: సర్వసమృద్ధి, కోరుకున్న రంగంలో అధిపతి కావాలంటే జ్యేష్ఠా నక్షత్రంలో పితరుల అర్చన చేయాలి.

19)మూల: ఆరోగ్యం, చేసే కృషి ఫలించాలంటే మూలా నక్షత్రంలో అమ్మానాన్నలకు మ్రొక్కాలి.

20)పూర్వాషాఢ: సమృద్దీ కీర్తిప్రతిష్ఠలు కలుగడానికి పూర్వాషాఢలోని పితృదేవతార్చన తోడుపడుతుంది.

21)ఉత్తరాషాఢ: నిశ్శోకవంతుడు, శుభగృహం (మంచి ఇల్లు) పొందాలి అంటే ఉత్తరాషాఢలో తాతముత్తాల ఆశీర్వచనాలు పొందాలి.

22)శ్రవణం: బ్రతికినన్నాళ్ళూ శ్రేష్ఠత్వం అనంతరం స్వర్గప్రాప్తి శ్రవణం నాటి మాతాపితరుల సేవ కలిగిస్తుంది.

23)ధనిష్ఠ: రాజ్యప్రాప్తి. నేడు రాజకీయాల్లో రాణించాలనుకున్న వారు ధనిష్ఠ నక్షత్రం ఉన్నప్పుడు అమ్మానాన్నలను సేవించాలి. వారికి పదవీయోగం కలుగుతుంది.

24)శతభిషం:వైద్యులు హస్తవాసి కోసం అమ్మానాన్నలను శతభిష నక్షత్రం ఉన్న సమయంలో అర్చించాలి. మహాబలవంతులు అవుతారు.

25)పూర్వాభాద్ర: మేకలు గొర్రెలు వంటివి పొందవచ్చు. అంటే యానిమల్ హజ్బెండరీస్ కు చెందిన వారు పూర్వాభాద్రలో పితరులను అర్చించాలి. అలా అర్చిస్తే వారి అనుగ్రహంతో పశువుల మందలు వృద్ధిపొందుతాయి. అంటే ఇవి వ్యవసాయప్రధానులైన శూద్రవైశ్యులకు కూడా ఇవి చెప్పారని తెలుసుకోవాలి.

26)ఉత్తరాభాద్ర: గోసంపద వృద్ధి అవుతుంది.

27)రేవతి: వెండి బంగారం తప్ప ఇతర వజ్రవైఢూర్యాదులు పొందాలంటే రేవతిలో అమ్మానాన్నల ఆశీర్వాదాలు పొందాలి.

సేకరణ

దత్తాత్రేయ స్తోత్రము

దత్తాత్రేయ స్తోత్రము

జటాధరం పాండురంగం, శూలహస్తం కృపానిధిమ్‌
సర్వరోగహరం దేవం, దత్తాత్రేయ మహం భజే
జగదుత్పత్తికర్త్రే చ, స్థితి సంహారహేతవే
భవనాశ విముక్తాయ దత్తాత్రేయ! నమోస్తుతే
జరాజన్మవినాశాయ, దేహశుద్ధికరాయ చ
దిగంబర! దయామూర్తే ! దత్తాత్రేయ! నమోస్తుతే
కర్పూరకాంతిదేహాయ, బ్రహ్మమూర్తిధరాయ చ
వేదశాస్త్ర పరిజ్ఞాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
హ్రస్వదీర్ఘకృత స్థూల నామగోత్రవివర్జిత !
పంచభూతైకదీప్తాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
యజ్ఞభోక్త్రే చ యజ్ఞాయ, యజ్ఞరూపధరాయ చ
యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ ! నమోస్తుతే
ఆదౌ బ్రహ్మా హరిర్మధ్యే హ్యంతే దేవ స్సదాశివ:
మూర్తిత్రయస్వరూపాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
భోగాలయాయ భోగాయ, యోగయోగ్యాయ ధారిణి
జితేంద్రియ జితజ్ఞాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
దిగంబరాయ దివ్యాయ, దివ్యరూప ధరాయ చ
సదోదిత పరంబ్రహ్మ దత్తాత్రేయ ! నమోస్తుతే
జంబూద్వీపే మహాక్షేత్రే, మాతా పురనివాసినే
జయమానసతాం దేవ ! దత్తాత్రేయ ! నమోస్తుతే
భిక్షాటనం గృహే గ్రామే, పాత్రం హేమమయం కరే
నానా స్వాద్యమయీ భిక్షా, దత్తాత్రేయ ! నమోస్తుతే
బ్రహ్మజ్ఞానమయీముద్రా, వస్త్రేచమాకాశభూతలే
ప్రజ్ఞానఘనబోధాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
అవథూత సదానంద, పరబ్రహ్మ స్వరూపిణి
విదేహదేహరూపాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
సత్యరూప! సదాచార! సత్యధర్మపరాయణ !
సత్యాశ్రయ ! పరోక్షాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
శూలహస్త ! గదాపాణ ! వనమాలాసుకంధర !
యజ్ఞసూత్రధర ! బ్రహ్మన్‌ ! దత్తాత్రేయ ! నమోస్తుతే
క్షరక్షరస్వరూపాయ, పరాత్పరతరాయ చ
దత్తముక్తి పరస్తోత్ర, దత్తాత్రేయ ! నమోస్తుతే
దత్తవిద్యా(ఢ్య)య లక్ష్మీశ ! దత్తస్యాత్మస్వరూపిణి
గుణనిర్గుణరూపాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
శత్రునాశకరం స్తోత్రం, జ్ఞానవిజ్ఞానదాయకమ్‌
సర్వపా పప్రశమం, దత్తాత్రేయ ! నమోస్తుతే
ఇదం స్తోత్రం మహద్దివ్యం, దత్త ప్రత్యక్షకారకమ్‌
దత్తాత్రేయ ప్రసాదాచ్ఛ, నారదేన ప్రకీర్తితమ్‌

ఇతి నారదపురాణే నారద విరచితం దత్తాత్రేయ స్తోత్రమ్

గణేశ ఋణ విమోచక స్తోత్రం

గణేశ ఋణ విమోచక స్తోత్రం

ఎవరికీ అయితే ఋణ ( అప్పులు ) భాధలు వుంటాయో వారు .. ఈ గణేశ ఋణ విమోచక స్తోత్రముని ప్రతి రోజు ఉదయము 6 గంటల లోపు వినాయక పటము ముందుకొబ్బరి నూనె తో దీపము పెట్టి చదివాలి .... లేకపోతే వినాయక దేవాలయము లో అయిన కొబ్బరి నూనె తో దీపము పెట్టి , ఋణ విమోచక స్తోత్రం చదవాలి

ధ్యానం
సిందూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం
బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం ||

స్తోత్రం

సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౧ ||

త్రిపురస్యవధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౨ ||

హిరణ్యకశ్యపాదీనాం వదార్థే విష్ణునార్చితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౩ ||

మహిషస్యవధే దేవ్యా గణనాథః ప్రపూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౪ ||

తారకస్య వధాత్పూర్వం కుమారేణ ప్రపూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౫ ||

భాస్కరేణ గణేశోహి పూజితశ్చ సుశిద్ధయే
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౬ ||

శశినా కాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయకః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౭ ||

పాలనయ చ తపసాం విశ్వామిత్రేణ పూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౮ ||

ఇదం ఋణహరం స్తోత్రం తీవ్ర దారిద్ర్య నాశనం
ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః || ౯ ||

దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్
పఠంతోఽయం మహామంత్రః సార్థ పంచదశాక్షరః || ౧౦ ||

శ్రీ గణేశం ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్
ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావనః || ౧౧ ||

ఏకవింశతి సంఖ్యాభిః పురశ్చరణ మీరితం
సహస్రవర్తన సమ్యక్ షణ్మాసం ప్రియతాం వ్రజేత్ || ౧౨ ||

బృహస్పతి సమో జ్ఞానే ధనే ధనపతిర్భవేత్
అస్యైవాయుత సంఖ్యాభిః పురశ్చరణ మీరితః || ౧౩ ||

లక్షమావర్తనాత్ సమ్యగ్వాంఛితం ఫలమాప్నుయాత్
భూత ప్రేత పిశాచానాం నాశనం స్మృతిమాత్రతః || ౧౪ ||

ఇతి శ్రీకృష్ణయామల తంత్రే ఉమా మహేశ్వర సంవాదే ఋణహర్తృ గణేశ స్తోత్రం సమాప్తం.

సేకరణ

ఋణ విమోచన నృసింహ స్తోత్రం

ఋణ విమోచన నృసింహ స్తోత్రం

దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౧ ||

లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౨ ||

ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౩ ||

స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౪ ||

సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౫ ||

ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౬ ||

క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౭ ||

వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౮ ||

య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితమ్ |
అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్