Thursday, 10 November 2016

అరటిదూట పెరుగు పచ్చడి


అరటిదూట  పెరుగు  పచ్చడి

కావలిసిన  పదార్థాలు
1.  అరటి  దూట పావుకేజీ
2.   పెరుగు పావులీటరు
3. పచ్చిమిర్చి  4.
4. కరివేపాకు  కొద్దిగా
5. పసుపు  కొద్దిగా
6. ఉప్పు  రుచికి  సరిపడా
7. మజ్జిగ రెండు కప్పులు

పోపు దినుసులు
సెనగపప్పు అర స్పూన్ , మినపప్పు అర  స్పూన్ , ఆవాలు  కొద్దిగా,
 జీలకర్ర కొద్దిగా , ఇంగువ  కొద్దిగా , ఎండుమిరపకాయలు  2.
ఆయిల్   3. స్పూన్స్

తయారీ విధానం
ముందుగా   అరటిదూటను శుభ్రంగా కడిగి  గుండ్రం గా తరిగి ,
 మధ్యలోవున్న  నారను  తీసి  సన్నగా  చిన్న ముక్కలుగా తరుగుకుని ,
 మజ్జిగలో  వేసి  ఒక  పావుగంట  సేపు ఉంచాలి .
 దీని వలన  జిగురు వగరు పోతాయి.i
మజ్జిగలో ఉంచిన దూట ముక్కలను
శుభ్రంగా  కడిగి  నీళ్లు పోసుకుని ఉడికించి
చల్లార్చుకోవాలి .
పచ్చిమిర్చిని  చీలికలుగా  తరుగుకోవాలి.
ఒక  బౌల్ లో  పెరుగును వేసుకుని  ,
పసుపు  తగినంత ఉప్పు  వేసి
బాగా  కలుపుకోవాలి.
స్టవ్  వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్  వేసి  పైన  చెప్పిన పోపు  దినుసులను   వేసి
అవి  దోరగా  వేగాక  ,
పచ్చిమిర్చి చీలికలు , కరివేపాకు లను వేసి ,
ఇవి కూడా  దోరగా వేపుకోవాలి .
 పెరుగులో
ముందుగా  ఉడికించి  పెట్టుకున్న  దూట ముక్కలను  ,
పోపు  మిశ్రమాన్ని  వేసి
బాగా కలిపి
పైన కొత్తిమీరతో  గార్నిష్  చేసుకుంటే

అరటిదూట   పెరుగు పచ్చడి రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi