Friday 4 November 2016

అరటి దూట పెసరపప్పు పొడికూర

అరటి దూట పెసరపప్పు పొడికూర

కావలిసిన పదార్థాలు
1. అరటి దూట పావుకేజీ
2. పెసరపప్పు ఒక కప్పు
3.  పచ్చిమిర్చి 3
4. కరివేపాకు
5. కొత్తిమీర
6. పసుపు కొద్దిగా
7. మజ్జిగ ఒక కప్పు
8. ఉప్పు రుచికి సరిపడా

పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్ ,ఆవాలు అర స్పూన్ ,జీలకర్ర అరస్పూన్ ,ఇంగువ కొద్దిగా ,
ఎండుమిరప కాయలు 2 ,ఆయిల్ 3 స్పూన్స్

తయారీ విధానం
ముందుగా అరటిదూటనుశుభ్రం గా కడిగి తుడిచి , గుండ్రం గా తరుగుకుని ,
మధ్య లో వచ్చిన నారను తీసివేసి , సన్నగా చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.
 ఈ ముక్కలను మజ్జిగలో వేసి కొద్దిసేపు ఉంచాలి .
దీనివలన జిగురు వగరు తగ్గుతాయి .
పచ్చిమిర్చిని చీలికలుగా తరుగుకోవాలి ,
పెసరపప్పును శుభ్రం గా కడిగి ,
ఈ పప్పును మరియు అరటిదూట ముక్కలను
ఒక బాణలి వేసి సరి పడా నీళ్లు పోసిఉడికించుకుని ,
చిల్లుల పళ్లెం లో పోసి చల్లార బెట్టుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపు దినుసులను వేసి,  అవి దోరగా వేగిన తరువాత ,
కరివేపాకు , పచ్చిమిర్చి చీలికలు , వేసి ఇవి కూడా దోరగా వేగాక ,
ఉడికించి చల్లారబెట్టుకున్న పెసరపప్పు ,అరటిదూట ,మిశ్రమం
పసుపు , ఉప్పు వేసి బాగా కలిపి ,కొద్దిసేపు మగ్గనిచ్చి
తడి పోయేంత వరకు ఉంచి ఒక గిన్నెలోకి తీసుకుని ,
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
అరటిదూట పెసరపప్పు పొడికూర రెడీ.

ఈ కూర వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi