Tuesday 8 November 2016

స్వామియే శరణం అయ్యప్ప //ఆంధ్రశబరిమలై


స్వామియే శరణం అయ్యప్ప

మాలధారణం నియమాల తోరణం
జన్మ తారణం దుష్కర్మ వారణం

శరణం శరణం శరణం
అయ్యప్ప స్వామి శరణం 

అయ్యప్ప స్వామి శరణం “

అంటూ అయ్యప్ప స్వామి శరణు ఘోషతో అలరారుతూ ఉంటుంది 
మన దక్షిణ భారత దేశం. 
కార్తీక మాసం మొదలైన కొద్దిరోజుల్లోనే, 
ఎటు చూసిన పవిత్రమైన నల్లని వస్త్రాలలో , 
మెడలో అయ్యప్ప స్వామి మాలతో 
భక్తులు మనకి దర్శనమిస్తారు. 
అత్యంత భక్తిశ్రద్ధలతో మండల దీక్ష చేపట్టి అనంతరము శబరిమలై వెళ్లి, 
ఇరుముడిని సమర్పంచి, 
స్వామిని దర్శించి, 
ఆధ్యాత్మిక పారవశ్యానికి లోనవుతారు. 
పునఃదర్శన యోగాన్ని ప్రసాదించమని  
స్వామిని కోరుకుంటారు.
అయ్యప్ప స్వామి దీక్ష కఠిన తరమైనది 
మరియు అత్యంత భక్తి శ్రద్ధలతో కూడినది . 
41  రోజుల పాటు చేసే 
ఈ దీక్షను మండల దీక్ష  అని అంటారు. తెల్లవారుఝామునె లేచి
 చల్లని నీటితో స్నానాన్ని ఆచరించి, 
స్వామిని  పూజిస్తారు.
 భజనలు చేస్తారు. 
బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. 
పాద రక్షలు ధరించరు. 
రోజు ఆలయానికి వెళతారు. 
ఆహారమును బిక్షగా స్వీకరిస్తారు. 
ప్రజలు వారిని అయ్యప్ప స్వరూపాలగా భావించి, వారిని బిక్షకు ఆహ్వానించి  
పవిత్రముగా,
 భక్తితో భోజనము పెట్టి 
సాక్షాత్తు అయ్యప్ప స్వామి తమ ఇంటికి వచ్చి  ఆహారము స్వీకరించారని విశ్వసిస్తూ ఉంటారు.
ఏ భక్తుడిని పలకరించినా 
ఎన్నవ సంవత్సరము స్వామి 
అని అడగడము, 
పది అని కొందరు, 
పన్నెండు అని కొందరు, 
పద్దెనిమిది అని మరికొందరు 
ఇలా అయ్యప్ప స్వామి దీక్ష  వహించి , 
స్వామి వారిని దర్శించి, 
కొలిచి తరించే భక్తులు ఎందరో …
భక్తి శ్రద్ధలతో దీక్ష ఆచరించడము ఒక ఎత్తు అయితే , పంబానది తీరానికి చేరుకున్నాక, 
కొండ దారిలో కాలినడకన ఆలయమునకు చేరుకోవడము ఇంకొక ఎత్తు. 
ఎంతో క్లిష్టతరమైన మార్గము అయినప్పటికీ, అయ్యప్ప నామ స్మరణతో  
ఏ బాధా తెలియదు అని  భక్తులు అంటారు.
కొంతమంది భక్తులు అతి పవిత్రమైనటువంటి
 జ్యోతి దర్శన సమయానికి చేరుకోనేలా
 దీక్షను చేపట్టి , ఆ సమయానికి చేరుకొని
జ్యోతి దర్శనము చేసుకొని భక్తి భావముతో పొంగిపోతారు. 
ఆ సమయములో అయ్యప్ప స్వరూపం 
దివ్య జ్యోతి తప్ప , 
ఇంక కన్నులకు ఏమి కనిపించవు, 
చెవులకు ఏమీ వినిపించవు.
అంతటా స్వామి శరణం, 
అయ్యప్ప శరణం 
అంటూ అంబరాన్ని తాకే శరణు ఘోషతో 
లక్షలాది మంది భక్తులు
పారవశ్యంలో మునిగిపోతారు.

“ఆంధ్రశబరిమలైగా” విరాజిల్లుతున్న రెండు ఆలయాలు —

1.ద్వారపూడిలో వున్న  శ్రీ అయ్యప్ప స్వామి  దేవాలయం —
ప్రకృతి రమణీయత, 
కోనసీమ అందాల మధ్య వెలసిన ప్రాంతం 
తూర్పు గోదావరి జిల్లాలోని ద్వారపూడి. 
ఇక్కడ శైవ వైష్ణవ సంగమ స్వరూపం అయిన, 
శ్రీ అయ్యప్ప స్వామి  దేవాలయం, 
శబరిమలలోని ఆలయానికి 
ఏమాత్రం తీసిపోకుండా నిర్మించడంతో 
అంతటి ప్రాచుర్యాన్ని పొందింది.
1983లో  కనక రాజు గురు స్వామి గారు,
వారి సువర్ణ హస్తాలతో శంకుస్థాపన చేసారు.
1989 లో ఈ ఆలయంలో  కంచి కామ కోటి 
పిఠాధి పతి శ్రీ.శ్రీ.శ్రీ.  జయేంద్ర సరస్వతి  
స్వామి వారు విగ్రహ ప్రతిష్ట చేసారు. 
పడి పూజకు సంభందించి ఏక శిల పై18  మెట్లు  చెక్కించి, బంగారంతో తాపడం చేయించారు. అయ్యప్ప దీక్ష ను చేపట్టిన వారిలో శబరిమలై వెళ్ళలేని  భక్తులు ఇక్కడి దేవాలయాన్ని  దర్శించుకుని ,
 ఇరుముడులు సమర్పించి  దీక్ష ను విరమింప చేయడం జరుగుతుంది.

2.శంఖవరం మండలము, సిద్ధివారిపాలెంలో వున్న అయ్యప్ప స్వామి దేవాలయం —
తూర్పు గోదావరి జిల్లా, శంఖవరం  మండలం, సిద్ధి వారి పాలెంలోని అయ్యప్ప  దేవాలయం
 “ఆంధ్రాశబరి మలై “గా విరాజిల్లుతోంది. జలపాతాలు, ఎత్తైన వృక్షాలు,
 కొండలు మధ్య  వుండే రహదారి గుండా 
ఈ కోవెలను చేరుకోవలసి వుంటుంది. 
ఈ దారిలో నడుస్తూ వుంటే శబరిమలలో నడుస్తున్న భావన కలుగుతుంది అని భక్తులు అంటారు. అయ్యప్ప దీక్షను చేపట్టిన వారిలో శబరిమలై వెళ్ళలేని భక్తులు ఇక్కడి దేవాలయాన్ని  
దర్శించుకుని ఇరుముడులు సమర్పించి 
దీక్షను విరమింప చేసుకుంటారు.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/