Sunday, 4 September 2016

జిల్లేడు కాయలు( కజ్జికాయలు) /// వినాయక చవితి special


                                                                      జిల్లేడు కాయలు (కజ్జికాయలు)

కావలిసిన పదార్థాలు

1. వరి పిండి ఒక గ్లాసు
2. ఉప్పు కొద్దిగా
3. నీళ్లు ఒక గ్లాసు
4. ఆయిల్ కొద్దిగా
5. కొబ్బరికాయ 1
6. బెల్లం పావుకేజీ
7. నెయ్యి కొద్దిగా

తయారీ విధానం

స్టవ్ వెలిగించి బాణలి పెట్టి అందులో
నీళ్లు  ఆయిల్ ఉప్పు వేసి బాగా మరగనిచ్చి
అందులో వరిపిండిని వేసి బాగా కలిపి
కొద్దిసేపు మగ్గనిచ్చి స్టవ్ నుండి దింపి చల్లారనివ్వాలి  
కొబ్బరికాయను కోరుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నెయ్యి వేసుకుని
కొబ్బరికోరును వేసి దోరగా వేపుకుని
వేరే ప్లేటులోకి తీసుకోవాలి
అదే బాణలిలో వేపుకున్న కొబ్బరి తురుమును బెల్లమును వేసి
బాగా కలిపి స్టవ్ మీద పెట్టుకుని ఉడకనివ్వాలి
మధ్యమధ్య లో కలుపుతూ ఉండాలి
బాగా దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిచ్చి
చిన్న ఉండలు గా చేసుకోవాలి
ముందుగా ఉడికించి పెట్టుకున్న వరిపిండిని
చిన్న ఉండలుగా చేసుకుని
 అర చేతికి ఆయిల్ రాసుకుని చిన్న సైజు పూరీ మాదిరిగా వత్తుకుని
తయారు చేసి పెట్టుకున్న కొబ్బరిబెల్లం ఉండను
దీని పైన పెట్టి నిలువుగా పొడవు గా వచ్చేలా చేతితో నొక్కుకోవాలి
అన్నీ ఇలా తయారు చేసుకున్న తరువాత
ఒక గిన్నె లో పెట్టి మూత పెట్టి
కుక్కరులో పెట్టి ఆవీరి మీద మగ్గ నిస్తే
జిల్లేడు కాయలు రెడీ .

వినాయక చవితి ప్రసాదానికి  కజ్జి కాయలు ప్రసిద్ధి .

వినాయక చవితి శుభాకాంక్షలు

Subha's Kitchen