Wednesday, 30 November 2016

నూని మాగాయ


నూని  మాగాయ
కావలిసిన  పదార్థాలు
1. మామిడికాయలు  10
2. ఉప్పు  తగినంత
3. కారము అర కేజీ
4. నువ్వుల నూనె పావులీటరు
5. మెంతులు అరకప్పు
6. ఆవాలు అర కప్పు
7. ఇంగువ  కొద్దిగా

తయారీ   విధానం
ముందుగా  మామిడికాయలు  శుభ్రం గా  కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి .
 తడి  ఆరిన మామిడికాయలు  పైన   వున్న తొక్కను  తీసి,
మాగాయ  ముక్కలు  తరిగినట్లే  చీలికలుగా  తరుగుకుని  ,
వెడల్పయిన  ప్లేట్  లో పోసి ,
ఉదయం  నుండి  సాయంత్రం  వరకు  ఎండబెట్టుకోవాలి.

స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి వేడెక్కాక
పైన  చెప్పిన  మెంతులు , ఆవాలను  ,
 దోరగా  కమ్మటి  వాసన వచ్చేంత  వరకు  వేపుకుని
చల్లార్చుకోవాలి .
చల్లారిన  వీటిని మెత్తని పొడి  లాగ  గ్రైండ్  చేసుకోవాలి .

ఎండ బెట్టుకున్న  మామిడికాయ  ముక్కలను ,
వెడల్పయిన  బేసిన్  లోకి తీసుకోవాలి .

స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ,
ఆయిల్  లో  ఇంగువ వేసి  కొద్దిసేపు   కాగనిచ్చి  , స్టవ్  ఆఫ్  చేసుకుని ,

ముందుగా తయారుచేసి  పెట్టుకున్న
మెంతి పొడి  ,ఆవపొడి  ,కారం  ,ఉప్పు  , వేసి  బాగా  కలిపి
మామిడికాయ  ముక్కలపైన  వేసి , ఆపైన  ఈ నూని వేసి
అంతా  కలిసేలా కలిపి  వూరనిస్తే  ,
నూని  మాగాయ  రెడీ  అవుతుంది
నూని  ఇంకా అవసరమైతే   కాచుకుని  పైన పోసుకోవచ్చు.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi


నిమ్మకాయ కారం


నిమ్మకాయ  కారం

కావలిసిన  పదార్థాలు
1. నిమ్మకాయలు  6.
2. పసుపు  కొద్దిగా
3. ఆయిల్ 4 స్పూన్స్

పోపు దినుసులు
సెనగపప్పు  2 స్పూన్స్  , మినపప్పు  2 స్పూన్స్ , ఆవాలు  1 స్పూన్ ,
 జీలకర్ర  1 స్పూన్  ,ఇంగువ  కొద్దిగా , ఎండుమిరపకాయలు   8  ,ఉప్పు  తగినంత

తయారీ  విధానం
ముందుగా నిమ్మకాయలు  శుభ్రం గా  కడిగి  ఆరబెట్టుకోవాలి .
ఆరిన  నిమ్మకాయల నుండి రసమును ఒక  కప్పులోకి   పిండుకోవాలి .
 రసము  పిండేసిన. నిమ్మ  చెక్కలను  ముక్కలుగా  తరుగుకోవాలి .
 స్టవ్  వెలిగించి   బాణలి  పెట్టి   వేడెక్కాక   1 స్పూన్ ఆయిల్  వేసి
పైన  చెప్పిన   పోపు దినుసులను  వేసి  దోరగా  వేగాక
స్టవ్  ఆఫ్   చేసుకుని  చల్లారనివ్వాలి  .
చల్లారిన  పోపును  తగినంత  ఉప్పు  వేసి   ,
మెత్తగా  పొడిలాగా  గ్రైండ్   చేసుకుని ,
 ఒక  బౌల్ లోకి  తీసుకుని
  దీనిలో  ముందుగా  మనం తీసి  ఉంచుకున్న
నిమ్మరసమును , నిమ్మకాయ   ముక్కలను  ,పసుపు ను ,3 స్పూన్స్  ఆయిల్   వేసి  ,
బాగా  కలిపి కొద్దిసేపు  ఊరనిస్తే
నిమ్మకాయ  కారం రెడీ
వేడి  అన్నం లో  నెయ్యి  వేసుకుని తింటే  బాగుంటుంది .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi

Tuesday, 29 November 2016

కంద ఊరగాయ


కంద ఊరగాయ
కావలిసిన  పదార్థాలు
1. కంద పావుకేజీ
2. నిమ్మకాయలు  2.
3. పసుపు
4. కారము  1 కప్పు
5. ఆవ పిండి  1 కప్పు
6. ఉప్పు  తగినంత
7. ఆయిల్  పావులీటరు

తయారీ విధానం
ముందుగా  కందను పైన  వున్న తొక్కనుతీసి శుభ్రం గా  కడిగి  ,
ముక్కలుగా తరుగుకోవాలి .
కారము ,ఆవ ,ఉప్పు  కలిపి న మిక్స్  బయట  షాప్ లలో  దొరుకుతుంది  .
అది  దొరకని పక్షం లో మన ఇంట్లోనే  ఈ మిక్స్  తయారుచేసుకోవచ్చు .
ఆవాలను బాగా ఎండబెట్టి ,  మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ,
ఆవపొడి  తయారవుతుంది .
ఈ ఆవపొడికి  కారం  ,ఉప్పు  కలిపితే  మిక్స్  తయారవుతుంది .
స్టవ్  వెలిగించి వెడల్పయిన  బాణలి  పెట్టి  వేడెక్కాక
ఆయిల్  వేసి అందులో తరిగిపెట్టుకున్న  కంద ముక్కలను   వేసి
దోరగా  వేపుకుని  ఒక బేసిన్  లోకి తీసుకోవాలి  .
ఈముక్కలపైన  పసుపు  ,కారం మిక్స్,   నిమ్మరసం  వేసి  ,
బాగా  కలుపు  కుంటే కంద  ఊరగాయ  రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi


గోమాతను "పూజించిన ఎంతో విశిష్ట ఫలితం


గోపూజ
"  గోమాతను "పూజించిన ఎంతో విశిష్ట ఫలితం
    లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి.

1. గోక్షీరం (ఆవుపాలు) లో చతుస్సముద్రాలుంటాయని పురాణాలు చెపుతున్నాయి.
2. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు.
3. గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన
    నీటిని సేవిస్తే... త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని
     పురాణాలు చెపుతున్నాయి.
4. శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ... బిళ్వ దళాలతో పూజిస్తే...
    సాక్ష్యాత్ కాశీ విశ్వేశ్వరుడిని    పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెపుతుంటారు.
5. గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే...
    సంతాన నష్టం ఉండదని,    చెపుతున్నారు.
6. ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెపుతారు. అందువల్ల చెవిని పూజిస్తే...
    సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట.
7. ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారనీ, వాటిని పూజించడం వల్ల
    అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయని చెపుతున్నారు.
8. ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే
    శీఘ్ర సంతతి కలుగుతుందని చెపుతున్నారు.
9. ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే... విద్యాప్రాప్తి.
10. ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని
      ప్రఘాడ విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే...
      యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెపుతారు.
11. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే...
      పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం.
12. ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే
       ఇంద్రియ పాఠవాలు, సంతానం కలుగుతుందట.
13. ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే...
      ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెపుతున్నారు.
14. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే...
      నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెపుతున్నారు. భూమిపై నాగుపాముల భయం ఉండదట.
15. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారు. కనుక గిట్టలను పూజిస్తే... గంధర్వలోక ప్రాప్తి.
16. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారు. ఆ భాగాన్ని పూజిస్తే... సఖ్యత, సౌందర్యం లభిస్తుందట.  

గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తే ఎంతో విశిష్ట ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే 
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/ 

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం// కమలాకుచ చూచుక కుంకుమతో


శ్రీ వేంకటేశ్వర స్తోత్రం

కమలాకుచ చూచుక కుంకుమతో
నియతారుణి తాతుల నీలతనో
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే||        1

శ చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ
ప్రముఖాఖిల దైవత మౌళిమణే
శరణాగతవత్సల సారనిధే
పరిపాలయ మం వృషశైలపతే||        2

అతివేలతయా తవదుర్విషహై
రనువేల కృతైరపరాధశతైః
భరితం త్వరితం వృషశైలపతే
పరయా కృపయా పరిపాహిహరే||        3

అధివేంకటశైల ముదారమతే
ర్జనతాభిమ తాధిక దానరతాత్
పరదేవతయా గదితా న్నిగమైః
కమలాదయితా న్న పరంకలయే||        4

కలవేణు రవా వశ గోపవధూ
శతకోటి వృతాత్స్మర కోటి సమాత్
ప్రతిపల్లవి కాభిమాతాత్సుఖదాత్
వసుదేవసుతా న్న పరం కలయే||        5

అభిరామ గుణాకర దాశరథే
జగదేక ధనుర్ధర ధీరమతే
రఘునాయక రామ రమేశవిభో
వరదోభవ దేవ దయాజలధే||        6

అవనీ తనయా కమనీయకరం
రజనీకర చారుముఖాంబురుహమ్
రజనీచర రాజ తమోమిహిరం
మహనీయ మహం రఘురామమయే||    7

సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుఖాయ మమోఘశరమ్
అసహాయ రఘూద్వాహ మన్య మహం
న కథం చ న కంచన జాతు భజే||        8

వీణా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశం ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ||    9

అహందూరతస్తే పదాంభోజయుగ్మ
ప్రణామేచ్చయాగత్య సేవాం కరోమి
సకృత్సేవయా నిత్యసేవా ఫలం త్వం
ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ||        10

అజ్ఞానినా మయాదోషా నశేషా న్విహితాన్ హరే
క్షమస్వతం క్షమస్వతం శేషశైల శిఖామణే||    11

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/




Monday, 28 November 2016

తోటకూర పులుసు


తోటకూర   పులుసు

కావలిసిన  పదార్థాలు
1.   తోటకూర  3. కట్టలు
2.  వంకాయలు  2
3. పచ్చిమిర్చి  3.
4. చింతపండు నిమ్మకాయ అంత
5.  పసుపు కొద్దిగా
6. ఉప్పు రుచికి సరిపడా
7. బెల్లం చిన్న ముక్క
8. వరిపిండి  2 స్పూన్స్
9.   కూర  కారం  1 స్పూన్
10.  నీళ్లు  పులుసుకి సరిపడా

పోపు దినుసులు
ఆవాలు అర స్పూన్ , జీలకర్ర   అర  స్పూన్ , మెంతులు అర  స్పూన్ ,
ఇంగువ  కొద్దిగా , ఎండుమిరపకాయలు  2   , ఆయిల్  1 స్పూన్
తయారీ  విధానం
ముందుగా  తోటకూరను ,పచ్చిమిర్చిని , వంకాయలను ,
శుభ్రం గా , కడుగుకోవాలి .
పచ్చిమిర్చిని  ,చీలికలుగాను ,  వంకాయలను  చిన్నముక్కలుగాను ,
తోటకూరను సన్నగా ను తరుగుకోవాలి .
ఒక  బౌల్లో 2. గ్లాసులు  నీళ్లు  పోసి ,చింతపండును నాన బెట్టుకోవాలి.
ఒక  గిన్నెలోకి  తరిగిన  తోటకూర , వంకాయ  ముక్కలు  ,పచ్చిమిర్చి  చీలికలు  వేసి
అందులో  నానబెట్టుకున్న  చింతపండు (బాగా పిసికి  తుక్కులు   లేకుండా తీసి )
 పలుచని  రసమును  పోసి  , పసుపు , తగినంత  ఉప్పు  ,బెల్లం   ,
వేసి  స్టవ్ మీదపెట్టి ఉడికించుకోవాలి .

వరిపిండి ని  కొద్దిగా  , కూరకారమును ఒక  బౌల్  లోకి   తీసుకుని  ,
కొద్దిగా  నీళ్లు పోసి  ఉంచుకోవాలి .

తోటకూర  వుడికినతరువాత  ముందుగా నీళ్లు కలిపి  ఉంచుకున్న  వరిపిండిని  వేసి
బాగా కలిపి  కొద్దిసేపు  ఉడకనివ్వాలి
మధ్య మధ్యలో  గరిట తో కలుపుతూ  ఉండాలి .
స్టవ్  వెలిగించి  బాణలి పెట్టి  వేడెక్కాక  ఆయిల్ వేసి పైన చెప్పిన
పోపు  దినుసులను  వేసి దోరగా  వేగాక
మరుగుతున్న పులుసు మీద  వేసి
 కొద్దిసేపు  మరగనిచ్చి  స్టవ్   ఆఫ్  చేసుకుంటే
 ఘుమ ఘుమ లాడే  తోటకూర  పులుసు రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi

శివస్తోత్రం (దేవకృతం)


శివస్తోత్రం (దేవకృతం)

నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే
రక్తపింగళనేత్రాయ జటామకుట ధారిణే||     1

భూత భేతాళ జుష్టాయ మహాభోగపవీతినే
భీమాట్టహాసవక్ర్తాయ కపర్దిస్థాణవే నమః||    2

పూషదంత వినాశాయ భాగానేత్రహనే నమః
భవిష్యద్వృష్ట చిహ్నాయ మహాభూతపతే నమః||    3

భవిష్యత్త్రి పురాంతాయ తథాంధక వినాశినే
కైలాస వరవాసాయ కరికృత్తినివాసినే||    4

వికరాళోర్ద్వ కేశాయ భైరవాయ నమోనమః
అగ్నిజ్వాలా కరాళాయ శశిమౌళి కృతేనమః||    5

భవిష్యత్ కృత కాపాలివ్రతాయ పరమేష్టినే
తథా దారువన ధ్వంసకారిణే తిగ్ముశూలినే||    6

కృతకంకణభోగీంద్ర నీలకంఠ త్రిశూలినే
ప్రచండ దండహస్తాయ బడబాగ్ని ముఖాయచ||    7

వేదాంత వేద్యాయ నమో యజ్ఞమూర్తే నమోనమః
దక్షయజ్ఞవినాశాయ జగద్భయకరాయ చ||    8

విశ్వేశ్వరాయ దేవాయ శివశ్శంభో భవాయ చ
కపర్దినే కరాళాయ మహాదేవాయ తే నమః||    9

ఏవం దేవైస్తృత శ్శంభు రుగ్రధన్వా సనాతనః
ఉవాచ దేవదేవోయం యత్కరోమి తదుచ్యతే||    10

(వరాహ పురాణే దైవకృత శివస్త్రోత్రం సంపూర్ణం)
ఫలం: శ్రీమంతం, సామంతం, శివసాక్షాత్కారాది

ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రము


ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రము

ఓం అస్యశ్రీ మథ్ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రస్య
విభీషణ రుశిహ్ హనుమాన్ దేవతా సర్వపదుద్దారక శ్రీ హనుమత్ ప్రసాదేనా సర్వ ఆపనివ్రుత్యర్దే –సర్వ కాల్యాను కూల్య సిద్ధర్ధ్యే జపే వినియోగః .
ధ్యానం
వామే కారే వైరిభిదాం వహంతం
 శైలం పరే శృంఖలహారిటంకమ్
దధానమచ్ఛవియుజ్ఞసూత్రం
భజే జ్వలత్కుండల మాంజనేయం

సంవీతకౌపీనముదంచితాంగుళీం
సముజ్వలన్మౌంజిమధోపవీతనం
సకుండలం లంబిశిఖాసమావృతం
తమాంజనేయం  శరణం ప్రపద్యే

అపన్నాఖిలలోకార్తిహారిణే శ్రీ హనూమతే
ఆకస్మాదాగతోత్పాతనాశనాయ నమోనమ:

సీతావియుక్త  శ్రీరామ శోక దు:ఖ భయాపహ
తాపత్రితయసంహారిన్! అంజనేయ! నమోస్తుతే

అధివ్యాధిమహామారి గ్రహపీడపహారిణే
ప్రాణాపహర్త్రే దైత్యానాం రామప్రాణాత్మనే నమ:

సంసారసాగారావర్త కర్తవ్యభ్రాంతచేతసాం
శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోస్తుతే

వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయామితతేజసే
బ్రహ్మాస్త్ర స్తంభానాయాస్మై  నమ: శ్రీ రుద్రమూర్తయే

రామేష్టం కరుణా పూర్ణ హనూమంతం భయాపహం
శత్రునాశకరం భీమం సర్వాభీష్ట  ప్రదాయకం

కారాగృహే ప్రయాణే వా సంగ్రామే శత్రుసంకటే
జలే స్థలే  తధాకాశే  వాహానేషు చతుష్పధే

గజసింహమహావ్యా ఘ్ర  చోరభీషణకాననే
యే స్మరంతి  హనూమంతం తేషాం నాస్తి విపత్ క్వచిత్

సర్వవానర ముఖ్యానాం ప్రాణభూతాత్మనే  నమ:
శరణ్యాయ వరేణ్యాయ వాయుపుత్రాయతే నమ:

ప్రదోషేవా ప్రభాతే వా యే స్మరంత్యంజనాసుతం
అర్దసిద్దిం జయం కీర్తిమ్ ప్రాప్నువంతి  న సంశయ:

జప్త్వా స్తొత్రమిదమ్ మంత్రం ప్రతివారం పఠేన్నర:
రాజస్థానే సభాస్థానే ప్రాప్తే వాదే  లభే జయం

విభీషణ కృతం స్తోత్రం  య:పఠేత్ ప్రయతో నర:
సర్వాపద్భ్య: విముచ్యతే నాత్ర కార్యా విచారణా

మంత్రం
మర్కటేశ మహోత్సాహ సర్వశోకనివారక
శత్రూన్ సంహార మాం రక్ష  శ్రియం దాపయభో హరే!!
ఇతి శ్రీ విభీషణకృతం సర్వాపదుద్ధారక హనుమత స్తోత్రం సంపూర్ణం

Sunday, 27 November 2016

మామిడి అల్లం తొక్కు పచ్చడి


మామిడి అల్లం తొక్కు  పచ్చడి

కావలిసిన  పదార్థాలు
1.  మామిడి  అల్లం  పావుకేజీ
2. నిమ్మకాయలు  2.
3. పసుపు
4. ఉప్పు రుచికి సరిపడా
5. ఎర్ర కారం  ఒక  కప్పు
6. ఆయిల్ కప్పు
7. ఇంగువ కొద్దిగా

మెంతి ఆవపొడికి
మెంతులు  2 స్పూన్స్  ,ఆవాలు  3 స్పూన్స్  ,ఇంగువ కొద్దిగా
పోపుకి
కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఆయిల్ ,

తయారీ  విధానం
ముందుగా  మామిడి  అల్లమును  శుభ్రం గా  కడిగి  ,
తడి  లేకుండా  ఆరబెట్టుకోవాలి.
ఆరిన  తరువాత పైన  వున్న తొక్కను  తీసి
ముక్కలుగా  తరిగి , పసుపును  వేసి కచ్చాపచ్చాగా  గ్రైండ్  చేసుకోవాలి.
లేదా తురుము కోవాలి.
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ,
పైన చెప్పిన  ఆవాలు  మెంతులను  కలిపి దోరగా వేపుకుని ,
చల్లారాక  మెత్తని పొడిలాగా  గ్రైండ్  చేసుకోవాలి.

 స్టవ్ వెలిగించి  బాణలి పెట్టి  వేడెక్కాక
 ఆయిల్  వేసి కొద్దిసేపు  కాగాక  ,
ముందుగా  తయారు  చేసి పెట్టుకున్న  మెంతి ఆవపొడి , కారము ,
తగినంత  ఉప్పును వేసి  బాగా  కలిపి ,
స్టవ్  ఆఫ్  చేసుకోవాలి .
ఈ  కారము  మిశ్రమంలో గ్రైండ్  చేసి  పెట్టుకున్న
మామిడి  అల్లం తొక్కును  వేసి  , కారము , ఉప్పు   కలిసేలా  బాగాకలిపి,
పోపు  కూడా వేసి ,
నిమ్మరసం  వేసి బాగా కలిపి  ఊరనిస్తే

మామిడి  అల్లం  తొక్కు పచ్చడి తయారవుతుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.


పనస ఆకు బుట్టలు


పనస ఆకు బుట్టలు

కావలిసిన  పదార్థాలు
1. పొట్టు మినపప్పు  1 గ్లాసు
2. వుప్పుడునూక  2  గ్లాసులు
3. ఉప్పు  రుచికి సరిపడా
4. పనస. ఆకులు

తయారీ  విధానం
 ముందుగా మినపప్పు  ను   , వుప్పుడునూకను ,
 వేటికవి  వేరు  వేరు. గిన్నెలలో  నీళ్లు  పోసి  ,
6. గంటల  సేపు  నానబెట్టుకోవాలి .
నానిన  మినపపప్పును పొట్టు   తీసి
శుభ్రంగా కడుగు కోవాలి.
తగినంత  ఉప్పును  వేసి మెత్తగా  గ్రైండ్  చేసుకోవాలి.
 అలాగే  వుప్పుడునూకను  కూడా  శుభ్రం  గా  కడిగి
గ్రైండ్  చేసుకున్న  మినపపిండిలో  వేసి
బాగా  కలిపి   2 గంటలసేపు   అలా  వదిలెయ్యాలి .
పనస  ఆకులు  తీసుకుని  శుభ్రంగా  కడుగుకోవాలి ,
చిన్న  గ్లాసు లు కానీ  , కప్పులుగాని , తీసుకుని
లోపల నెయ్యి  రాసి  ,
కడిగిన ఈ  ఆకులను వాటిలో  పెట్టి
రుబ్బుకున్న   పిండి ని  వేసి  ,
కుక్కరులో  పెట్టి
ఇడ్లీ  మాదిరిగా ఆవిరి  మీద  ఉడికించుకోవాలి .
చల్లారిన  తరువాత , ఇడ్లి  తీసుకున్నట్లే
స్పూన్ తో  తీస్తే  పనస  ఆకు  బుట్టలు  రెడీ.

వీటిని నెయ్యి వేసుకుని  కారప్పొడి,  కొబ్బరి  పచ్చడి , తో గాని  అల్లం పచ్చడి తో  ,
గాని తింటే  బాగుంటాయి .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. 

కృష్ణా ముకుందా మురారీ


హే కృష్ణా ముకుందా మురారీ
జయ కృష్ణా ముకుందా మురారి
జయ కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందా విహారీ
కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందా విహారీ
కృష్ణా ముకుందా మురారి
దేవకి పంట వసుదేవువెంట
దేవకి పంట వసుదేవువెంటా
యమునను నడిరేయి దాటితివంటా
వెలసితివంటా నందుని ఇంటా
వెలసితివంటా నందుని ఇంటా
రేపల్లె ఇల్లాయేనంటా
కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందా విహారీ
కృష్ణా ముకుందా మురారి
నీ పలుగాకి పనులకు గోపెమ్మ
నీ పలుగాకి పనులకు గోపెమ్మ
కోపించి నిను రోట బంధించెనంటా
ఊపునబోయీ మాకులకూలిచి
ఊపునబోయీ మాకులకూలిచి
శాపాలు బాపితి వంటా
కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందా విహారీ
కృష్ణా ముకుందా మురారి
అమ్మా తమ్ముడు మన్ను తినేనూ
చూడమ్మా అని రామన్న తెలుపగా
అన్నా అని చెవి నులిమి యశోద
ఏదన్నా నీ నోరు చూపుమనగా
చూపితివట నీ నోటను
బాపురే పదునాల్గు భువనభాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు
తాపము నశియించి జన్మ ధన్యత గాచెన్
జయ కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందా విహారీ
కృష్ణా ముకుందా మురారి
కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ
కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ
కేళీ ఘటించిన గోపకిశోరా
కంసాదిదానవ గర్వాపహారా
కంసాదిదానవ గర్వాపహారా
హింసా విదూరా పాపవిదారా
కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందా విహారీ
కృష్ణా ముకుందా మురారి
కస్తూరి తిలకం లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికమ్
కరతలే వేణుమ్ కరే కంకణమ్
సర్వాంగే హరిచందనంచ కలయమ్
కంఠేచ ముక్తావళీమ్ గోపస్త్రీ పరివేష్టితో
విజయతే గోపాల చూడామణీ
విజయతే గోపాల చూడామణీ
లలిత లలిత మురళీ స్వరాళీ
లలిత లలిత మురళీ స్వరాళీ
పులకిత వనపాళి గోపాళీ
పులకిత వనపాళి
విరళీకృత నవ రాసకేళి
విరళీకృత నవ రాసకేళి
వనమాలీ శిఖిపింఛమౌళీ
వనమాలీ శిఖిపింఛమౌళీ
కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందా విహారీ
కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందా విహారీ
కృష్ణా ముకుందా మురారి
జయ కృష్ణా ముకుందా మురారి

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/



శ్రీకృష్ణస్తుతి


శ్రీకృష్ణస్తుతి

కస్తూరీ తిలకం లలాట ఫలకే
వక్ష:స్థలే కౌస్తుభం నాసాగ్రే నవ
మౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరి చందనం చ కలయం
కంఠే చ ముక్తావళిం గోపస్ర్తీ పరివేష్టితో
విజయతే గోపాల  చూడామణీ

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/






Saturday, 26 November 2016

పొట్లకాయ పెరుగు పచ్చడి


పొట్లకాయ  పెరుగు  పచ్చడి
కావలిసిన  పదార్థాలు
1. పొట్లకాయ  ముక్కలు  3 కప్పులు
2. పెరుగు  పావులీటరు
3. పసుపు  కొద్దిగా
4.  ఉప్పు  రుచికి  సరిపడా
5. పచ్చిమిర్చి  3.
6. కరివేపాకు
7. కొత్తిమీర
8. నీళ్లు  1 కప్పు

పోపు దినుసులు
సెనగపప్పు  1 స్పూన్ ,  మినపప్పు  1 స్పూన్ ,  ఆవాలు  అర  స్పూన్ ,
 జీలకర్ర  అర  స్పూన్ , ఇంగువ  కొద్దిగా ,  ఎండుమిరపకాయలు   2 , ఆయిల్  2 స్పూన్స్

తయారీ  విధానం
ముందుగా  పొట్లకాయ  ముక్కలను  నీళ్లు పోసి  ఉడికించుకుని ,
చిల్లుల  పళ్లెం  లో పోసిచల్లార్చుకోవాలి  .
పచ్చిమిర్చి  ని  చీలికలుగా,   కొత్తిమీరను  సన్నగా  తరుగుకోవాలి.
ఒక  గిన్నెలో  పెరుగును   తీసుకుని , పసుపు  ,ఉప్పు ,
ముందుగా  ఉడికించి  చల్లారబెట్టుకున్న  పొట్లకాయ ముక్కలు వేసి  ,
బాగా  కలుపుకోవాలి . స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక   ఆయిల్  వేసి ,
పైన  చెప్పిన  పోపు  దినుసులను  వేసి ,
దోరగా   వేగాక   ,కరివేపాకు  ,పచ్చిమిర్చి  చీలికలు  ,వేసి  వేగనిచ్చి,
వీటిని  పొట్లకాయముక్కలు ,పెరుగు మిశ్రమంలో  వేసి బాగా కలిపి ,
పైన కొత్తిమీర తో  గార్నిష్  చేసుకుంటె
రుచికరమైన  పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ 
ఇది  అన్నం లోకి   చపాతీ లోకి  బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi


కార్తీక మాసము " శ్రీ సత్యనారాయణ స్వామి " వ్రతము


కార్తీక మాసము  " శ్రీ సత్యనారాయణ స్వామి "  వ్రతము

" సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం.
   లీలాయా వితతం విశ్వం యేన తస్మై నమోనమః.  "

" హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక పరమేశ్వరీ పరమేశ్వర స్వరూప
   ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామినే నమః."

పుణ్య ప్రదాయకమైన మాసం కార్తీకమాసం. ఈ మాసంలో ఎన్నో పర్వదినాలు వున్నాయి.
విశేషమైన ,విశిష్టమైన  ఈ వ్రతము ను గృహమునందు,  ఈ మాసంలోఆచరించిన
" సర్వత్రా విజయము లభించి కోరిన కోరికలు తీరును" .

దేవాలయే నదీతీరే గోశ్చే బృందావనే తధా
యత్పరిష్యతి తత్సర్వం అనంత ఫలదం భవేత్ "

" దేవాలయమున" , " నదీతీరమున " , " గోశాలలో" , " తులసీవనమున" ,
చేసిన వ్రతాలు అనంతఫలాన్నిస్తాయి అని చెప్పబడింది.

శ్రీసత్యనారాయణస్వామి పూజ
సత్యనారాయణ వ్రతము, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామికి చేసే పూజ విధానము. ఈ వ్రతమును వధూవరులు శ్రద్ధగా ఆచరించిన వారి కాపురం దివ్యముగా ఉండును, విద్యార్థులు, వ్యాపారులు ఇంకనూ ఎవరు ఆచరించిననూ విజయం లభించును.

వ్రత ప్రాశస్త్ర్యము
కలియుగమున లోక సంచారము చేసిన నారదుడు, లోకుల బాధలు చూడలేక మహావిష్ణువును ప్రార్థించగా స్వామి వారు ఇటుల తెలిపెను.

" కలియుగమున నేను సత్యనారాయణ రూపం ధరించితిని,

కావున  " శ్రీ సత్యనారాయణ వ్రతము చేసినవారికి శోకథుఃఖములు తొలగి ధనధాన్యాభివృద్ది చెంది , సంతానసౌభాగ్యాలు కలిగి ,
సర్వత్రా విజయము లభించి కోరిన కోరికలు తీరును" .

అంతట వ్రత విధానమును తెలుసుకొనిన నారదుడు సూతునికి చెప్పగా సూతుడు శౌనకాది మహామునులకు తెలిపెను.
శ్రీసత్యనారాయణస్వామి పూజ వ్రత కథ మొత్తము ఐదుభాగములుగా ఉండును.
ప్రతీ కథానంతమున నారికేళసమర్పణ ఆచారము.
శ్రీ సత్యనారయాణవ్రతమే సకల ధు:ఖ నివారిణి,

ఈ వ్రతమును ఏ రోజునైనను చేసి, వ్రతానంతరము తీర్ధప్రసాదాలు పుచ్చుకొనవలెను.
ఈ వ్రతము చేసిన వారు మోక్షమును పొందెదరని మహావిష్ణువు నారదునకు తెలిపెను.

సత్యనారాయణ వ్రతము చేసినచో మీ కోరికలు తీరునని సూత మహర్షి తెలిపెను.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/





Friday, 25 November 2016

మామిడిఅల్లం మెంతిముక్కలు


మామిడిఅల్లం  మెంతిముక్కలు

కావలిసిన  పదార్థాలు
1. మామిడిఅల్లం  పావుకేజీ  
2. నిమ్మకాయలు  2.
3. పసుపు  కొద్దిగా
4. ఉప్పు  రుచికి  సరిపడా

పోపు దినుసులు
మినపప్పు  1 స్పూన్   , ఆవాలు  1 స్పూన్ ,  మెంతులు  ఆర  స్పూన్  ,
జీలకర్ర  1 స్పూన్  , ఇంగువ  కొద్దిగా  ,ఎండుమిరపకాయలు  6  ,  ఆయిల్  8 స్పూన్స్ ,

తయారీ  విధానం
ముందుగా   స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక,
1 స్పూన్ ఆయిల్   వేసి  పైన  చెప్పిన  పోపు  దినుసులను  వేసి,
దోరగా  వేపుకుని  చల్లార్చుకోవాలి  .
పోపు చల్లారాక తగినంత  ఉప్పు  వేసి మెత్తని  పొడిలాగా  గ్రైండ్  చేసుకోవాలి .
మామిడిఅల్లమును  శుభ్రం గా  కడిగి ఆరనిచ్చి పైన ,
వున్న తొక్కను   తీసి చిన్న  ముక్కలుగా  తరుగుకోవాలి .
నిమ్మకాయలు నుండి రసమును  ఒక కప్పులోకి  పిండుకోవాలి.
ఒక బేసిన్  లోకి  మామిడి  అల్లం  ముక్కలు  , పసుపు,
ఉప్పువేసిన  కారం పొడిని ,  నిమ్మరసమును  వేసి
అంతా  కలిసేలా  బాగా కలుపుకోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి పెట్టి వేడెక్కాక ,
 కొద్దిగా ఇంగువ  , ఆయిల్  వేసి  ,
కొద్దిసేపు కాగనిచ్చి ఆ నూనె ను మామిడి అల్లం  ముక్కాలపైన వేసి,
బాగా కలిపితే ,

మామిడి అల్లం  మెంతి ముక్కలు  రెడీ  అవుతాయి 
ఇవి ఒక 15 రోజులపాటు నిలువ ఉంటాయి 
వీటిని  అన్నం లోకి  దోశె  చపాతీలలోకి  బాగుంటుంది

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. 


శ్రీరామ రక్షాస్తోత్రం


శ్రీరామ రక్షాస్తోత్రం

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్
ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్
ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్
జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్
సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్
స్వలీలయా జగత్రాతు మావిర్భూతమజం విభుమ్
రామరక్షాం పఠేత్ప్రాఙ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్
శిరో మే రాఘవః పాతుఫాలం దశరథాత్మజః
కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్ర ప్రియః శృతీ
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః
జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరత వందితః
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః
కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః
సుగ్రీవేశః కటీపాతు సక్థినీ హనుమత్-ప్రభుః
ఊరూ రఘూత్తమః పాతు రక్షకుల వినాశకృత్
జానునీ సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః
పాదౌవిభీషణ శ్రీదఃపాతు రామో‌உఖిలం వపుః
ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్
సచిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్
పాతాళ భూతల వ్యోమ చారిణశ్-చద్మ చారిణః
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః
రామేతి రామభద్రేతి రామచంద్రేతి వాస్మరన్
నరో నలిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి
జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వ సిద్ధయః
వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్
అవ్యాహతాఙ్ఞః సర్వత్ర లభతే జయ మంగళమ్
ఆదిష్టవాన్ యథాస్వప్నే రామ రక్షా మిమాం హరః
తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః
ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్
అభిరామ స్త్రిలోకానాం రామః శ్రీమాన్సనః ప్రభుః
తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణా జినాంబరౌ
ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ
శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్టా సర్వ ధనుష్మతాం
రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ
ఆత్త సజ్య ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ
రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పథిసదైవ గచ్ఛతాం
సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా
గచ్ఛన్ మనోరథాన్నశ్చ రామః పాతు స లక్ష్మణః
రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ
కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః
వేదాంత వేద్యో యఙ్ఞేశః పురాణ పురుషోత్తమః
జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః
ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశ్వమేథాధికం పుణ్యం సంప్రాప్నోతి నసంశయః
రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతావాససం
స్తువంతి నాభిర్-దివ్యైర్-నతే సంసారిణో నరాః
రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందేలోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ
శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి
శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే
మాతారామో మత్-పితా రామచంద్రః
స్వామీ రామో మత్-సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాన్యం జానే నైవ న జానే
దక్షిణేలక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా
పురతోమారుతిర్-యస్య తం వందే రఘువందనమ్
లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథం
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణ్యం ప్రపద్యే
మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే
కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం
భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదాం
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్
రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
ఇతి శ్రీబుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణం
శ్రీరామ జయరామ జయజయరామ

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/ 

భగవద్గీత


 " భగవద్గీత "

1. ధర్మాధర్మాల గురించి చెబుతుంది.
2. కర్తవ్యం గురించి చెబుతుంది.
3. నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు...
     అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
4. ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
5. సుఖం... శాంతి... త్యాగం... యోగం... అంటే ఏమిటో చెబుతుంది.
6. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.
7. పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.
8. ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది.
9. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
10. జ్ఞానం... మోక్షం... బ్రహ్మం... ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.
11. ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
12. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
13. మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
14. పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది.
15. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.
16. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
17. నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది.
18. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/ 

Thursday, 24 November 2016

దొండకాయ కాయల పడంగా కూర

దొండకాయ  కాయల పడంగా  కూర

కావలిసిన  పదార్థాలు
1. దొండకాయలు పావుకేజీ
2. పసుపు  కొద్దిగా  
3. ఆయిల్  4 స్పూన్స్
4. నీళ్లు తగినన్న
5. ఉప్పు  తగినంత

కారం  తయారీకి
సెనగపప్పు  1 స్పూన్  , మినపప్పు 1. స్పూన్   , ఆవాలు  అర స్పూన్  ,
జీలకర్ర  అర  స్పూన్  , ఎండుమిరపకాయలు  6  , ఆయిల్  1 స్పూన్   ,

తయారీ  విధానం
ముందుగా  స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక ,
 ఒక  స్పూన్ ఆయిల్  వేసి  పైన  చెప్పిన  పోపు  దినుసులను వేసి ,
దోరగా  వేపుకుని  చల్లారనివ్వాలి .
చల్లారాక  ఉప్పు వేసి మెత్తని  పొడిలాగా  గ్రైండ్  చేసుకోవాలి.
దొండకాయలను  శుభ్రంగా  కడిగి  తొడిమలు  కత్తిరించి  ,
గుత్తులమాదిరి  తరుగుకుని తగినన్ని నీళ్లు పోసి  ,
కుక్కరులో  పెట్టి  ఉడికించుకుని  చల్లార్చుకోవాలి .
స్టవ్ వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ఆయిల్  వేసి ,
ఉడికించుకున్న  దొండకాయలను  వేసి  దోరగా  వేగనివ్వాలి ,
మధ్య మధ్య లో అట్లకాడతో  కలుపుతూ  ఉండాలి ,
 దోరగా  వేగాక  ముందుగా తయారు చేసి  పెట్టుకున్న
కూరకారమును  వేసి , ఒక  స్పూన్ ఆయిల్  వేసి ,
బాగా  కలిపి  స్టవ్  ఆఫ్  చేసుకుంటే

దొండకాయ  కాయల పడంగా  కూర  రెడీ  అవుతుంది.

వేడి అన్నములో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi

దోసకాయ పప్పు


దోసకాయ   పప్పు
కావలిసిన  పదార్థాలు  
1.దోసకాయ  1.
2. కందిపప్పు  1 కప్పు  
3. పచ్చిమిర్చి  3.
4. పసుపు  కొద్దిగా
5.  ఉప్పు  రుచికి  సరిపడా
6.  చింతపండు  కొద్దిగా
7. కరివేపాకు  కొద్దిగా
8. నీళ్లు  తగినన్ని

పోపు  దినుసులు
మినపప్పు  1 స్పూన్,  ఆవాలు  అర  స్పూన్  ,జీలకర్ర  అర  స్పూన్  ,
ఇంగువ  కొద్దిగా , ఎండుమిరపకాయలు  2  ,ఆయిల్  2. స్పూన్స్

తయారీ  విధానం
ముందుగా  దోసకాయను  శుభ్రంగా  కడిగి  ,
పైన వున్నా తొక్కను  లోపల వున్న గింజలను  తీసి ,
చిన్న  ముక్కలుగా  తరుగుకోవాలి  .
 పచ్చిమిర్చిని  చీలికలుగా  చేసుకోవాలి ,

కందిపప్పును  శుభ్రంగా  కడిగి  తగినన్ని నీళ్లు   పోసి  ,
కుక్కరు లో  పెట్టి  మెత్తగా  ఉడికించుకోవాలి.
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ,
ఆయిల్  వేసి  పైన  చెప్పిన  పోపు  దినుసులను  వేసి  ,
దోరగా  వేగాక  , పచ్చిమిర్చి  చీలికలు,  కరివేపాకు  ,
పసుపు వేసి , వేగాక,
దోసకాయముక్కలు  , చింతపండు , తగినంత  ఉప్పు,
 వేసి  ఒక  గ్లాసు  నీళ్లు  పోసి  ఉడకనివ్వాలి.
 ఇవి  ఉడికాక ,
ముందుగాఉడికించి  పెట్టుకున్న  ,
కందిపప్పును  వేసి  అంతా  కలిసేలా  బాగాకలిపి
దగ్గర  పడేంత  వరకు  ఉంచి,
 స్టవ్  ఆఫ్  చేసుకుంటే
దోసకాయ  పప్పు  రెడీ  అవుతుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.



Wednesday, 23 November 2016

మామిడి అల్లం పచ్చడి


మామిడి  అల్లం  పచ్చడి

1. మామిడి అల్లం 100 గ్రాములు
2.  చింత పండు  కొద్దిగా
3. పచ్చిమిర్చి  2.
4.  పసుపు కొద్దిగా
5. ఉప్పు రుచికి  సరిపడా

పోపు  దినుసులు
మినపప్పు 1. స్పూన్,   ఆవాలు  1 స్పూన్ , మెంతులు  కొద్దిగా   ,
జీలకర్ర  అర  స్పూన్  , ఇంగువ   కొద్దిగా ,  ఎండుమిరపకాయలు  6  ,ఆయిల్  6 స్పూన్స్

తయారీ  విధానం
 ముందుగా మామిడి  అల్లమును  శుభ్రంగా  కడిగి
 పైన  వున్నా తొక్కను తీసి చిన్న ముక్కలుగా  తరుగుకోవాలి.
 పచ్చిమిర్చిని  కూడా  చిన్న  ముక్కలుగా  తరుగుకోవాలి
చింత  పండును  కొద్దిగానీళ్లు  పోసి  నానబెట్టుకోవాలి,

స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ఆయిల్  వేసి  ,
పైన  చెప్పిన  పోపు  దినుసులను  వేసి  దోరగా  వేపుకుని   ,
ఒక  ప్లేట్  లోకి   తీసుకుని చల్లార నివ్వాలి .

అదే  బాణలి  లో  ఒక  స్పూన్  ఆయిల్  వేసి
తరిగిపెట్టుకున్న  మామిడి  అల్లం  ముక్కలు, పచ్చిమిర్చి   ముక్కలు  వేసి  ,
దోరగా  వేగాక  స్టవ్  ఆఫ్  చేసుకుని చల్లారనివ్వాలి .

ముందుగా  పోపు మిశ్రమాన్ని  మెత్తగా  పొడిలాగా  గ్రైండ్  చేసుకుని ,

 దీనిలో  వేపుకున్న  మామిడి అల్లం , పచ్చిమిర్చి  ముక్కలు  ,పసుపు  ,ఉప్పు  ,చింతపండు ,
 కొద్దిగా  నీళ్లు  వేసి
 మెత్తగా  గ్రైండ్  చేసుకుని , ఒక  బౌల్  లోకి తీసుకోవాలి  .

స్టవ్  వెలిగించి  బాణలి పెట్టి  వేడెక్కాక  ఆయిల్  లో  ఇంగువ వేసి  ,
కొద్దిసేపు  మరగ  నిచ్చి పచ్చడి  మీద  వేసి
బాగా కలిసేలా  కలిపితే

మామిడి  అల్లం  పచ్చడి  రెడీ  అవుతుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.


ఏక శ్లోకి సుందరకాండ


ఏక శ్లోకి సుందరకాండ
(ప్రతి రోజు ఉదయం  చదవవలిసిన శ్లోకం )

తీర్త్వాక్షార పయోనిధిం; క్షణమథోగత్వా శ్రియః సన్నిధిమ్;

దత్త్వారాఘవ ముద్రికా మపశుచం; క్రుత్వాప్రవిశ్యాటవీం;

భఙ్త్వాఅనేకతరూం, నిహత్యబహుళాం రక్షోగణం స్తత్పురీమ్;

దగ్ధ్వాఅదాయమణి రఘాద్వహమగాద్వీరో హనూమాన్కపిః

                                          --0--  ---0--

ధృత్యా సాగర  లంఘనం హనుమతో, లంకామదోత్సారణం

తత్రా శోకవనే చ మార్గణ, మథ శ్రీ జానకీ దర్శనమ్,


రామక్షేమ నివేదనం, వనతరుం ప్రద్వంసనం, సంయుగే


రక్ష స్సంహననం, పురీ ప్రదహనం, రామాయణే సుందరమ్.


ఓం తత్సత్."


ఫలితం : ఎవరు భక్తితొ ప్రతి నిత్యం ఎవరు చదువుటారో  వారికి కష్టాలు దూరమౌతాయి
                సంతోషం ప్రాప్తిస్తుంది.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/

దీపరాధన


దీపరాధన

ఆవునెయ్యితో దీపాలువెలిగించడం ఉత్తమం.

కార్తీక మాసం పర్వదినాలలో దీపారాధన చేసే భక్తులు ,
శివాలయంలో గాని , వైష్ణవాలయంలోగాని దీపాలు వెలిగించాలి.
అలయ గోపురద్వారం వద్ద గాని, దేవుడి సన్నిదిలో గాని, ఆలయప్రాంగణంలో గాని
దీపాలను వెలిగించాలనీ,అలా వెలిగించిన వారి జన్మజన్మల పాపాలుహరింపబడి
ఇహంలో సౌఖ్యం , పరంలో మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రవచనం.

నదులలో  దీపాలను వదిలిపెట్టాలని , అలా చేయుటచే పుణ్య ప్రాప్తి అని పెద్దలు అంటారు.

అరటి దొప్పలోగానీ, అకుమీద గానీ దీపం వుంచి ,
నదులలో వదలడం కూడా పుణ్య ప్రదమే.
ఉసిరికాయ పైన ఆవు నెయ్యితో తడిపిన వత్తులను వుంచి
దీపమును వెలిగించడం అత్యంత శ్రేష్ఠం.

వెండి కుందులు, పంచ లోహ కుందులు,ఇత్తడి కుందులు మంచివి.
మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు.

కుందుని ఒక పళ్ళెం లో కాని తమలపాకు మీద కాని పెట్టాలి.
కింద ఆధారం లేకుండా పెట్టకూడదు.

దీపారాధన చేసేటప్పుడు ముందుగా నునె పొసి ,తర్వాత వత్తులు వేయాలి.

దీపారాధన చేయగానే దీపానికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి.
దీప పీఠభాగము బ్రహ్మాతో సమానం. స్ధంబము విష్ణురూపము, ప్రమిద పరమేశ్వరుడు,
 దీపతైలం నాదం, వత్తి అగ్ని, వెలుగుశక్తి స్వరూపం.

అమ్మవారిముందు బియ్యంపోసి దానిమాద వెండి కుందిలో దీపారాధన చేసి,
తెల్లకలువ పూలతో దీపాన్ని అలంకరించి, పూజ చేస్తే తెలివి తేటలు, మేధస్సుపెరిగి,
సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/






Tuesday, 22 November 2016

ఆనపకాయ ( పాలు పోసి ) కూర


ఆనపకాయ  ( పాలు పోసి  ) కూర
కావలిసిన పదార్థాలు
1. ఆనపకాయ  ముక్కలు  3 కప్పులు
2.  కరివేపాకు
3. పసుపు  కొద్దిగా
4. ఉప్పు రుచికి సరిపడా
5. వరిపిండి  1 స్పూన్
6.  పాలు పావు కప్పు
7. పచ్చి మిర్చి 2
8. పంచదార రెండు స్పూన్స్


పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్  , ఆవాలు అర  స్పూన్,    జీలకర్ర   అర  స్పూన్,
ఎండుమిరపకాయలు 2  , ఆయిల్ 2  స్పూన్స్.

తయారీ  విధానం
ముందుగా ఆనపకాయ  ముక్కలను  కొద్దిగా  నీళ్లు పోసి  ,
కుక్కరు  లో  పెట్టి  ఉడికించుకుని  ,
చిల్లుల  పళ్లెం లోపోసి  చల్లార్చుకోవాలి ..
 స్టవ్   వెలిగించి   బాణలి   పెట్టి  వేడెక్కాక  ఆయిల్  వేసి  ,
పైన   చెప్పిన   పోపు  దినుసులను  వేసి  దోరగా  వేగాక ,
పచ్చి మిర్చి చీలికలు ,కరివేపాకు ను  వేసి వేగాక  ,
ముందుగా  ఉడికించి  చల్లారబెట్టుకున్న ఆనపకాయ  ముక్కలు  ,
పాలు , పసుపు , పంచదార , తగినంత ఉప్పు  , వరిపిండి  వేసి  ,
బాగా  కలిపి  కొద్దీ సేపు మగ్గనిచ్చి ,
కూర అంతా  బాగా  దగ్గర  పడ్డాక  స్టవ్  ఆఫ్  చేసుకుంటే,
ఆనపకాయ ( పాలు పోసి ) కూర  రెడీ  అవుతుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer :
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.


ఏకశ్లోకి రామాయణము


ఏకశ్లోకి రామాయణము
( నిత్యం పటించవలిసిన శ్లోకం )


ఆదౌరామ తపోవనాది గమనం - హత్వామృగంకాంచనం

వైదేహీహరణం - జటాయుమరణం - సుగ్రీవసంభాషణం

వాలీనిగ్రహణం - సముద్రతరణం -లంకాపురీదాహనం

పశ్చాద్రావణ కుంభకర్ణహాననం యేతద్దిరమాయణమ్.


పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/

ఏకశ్లోకి భాగవతము


ఏకశ్లోకి భాగవతము
(ప్రతి రోజు ఉదయం  చదవవలిసిన శ్లోకం )

ఆదౌ దేవకి దేవీ గర్భజననం - గోపీగృహే వర్ధనం

మాయాపూతన జీవీతాపహరణం - గోవర్ధనోద్దారణం

కంసచ్చేదన కౌరవాదిహననం - కుంతీసుతాన్ పాలనం

యేతద్భాగవతం పురాణకధితం శ్రీకృష్టలీలమృతం .

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/

Monday, 21 November 2016

కంద అట్టు


కంద  అట్టు

కావలిసిన  పదార్థాలు
1. కంద  పావుకేజీ
2. వరిపిండి  2 కప్పులు
3.  ఉప్పు  తగినంత
4. ఎండుమిరప కాయలు  6.
5.  ఇంగువ  కొద్దిగా
6. జీలకర్ర  1 స్పూన్
7. పసుపు  కొద్దిగా
8. ఆయిల్  అర కప్పు
9. పెసర పప్పు అర కప్పు

తయారీ  విధానం
ముందుగా పెసర పప్పు ను నాన పెట్టుకోవాలి.
కందను  పైన  వున్న. తొక్కను తీసి శుభ్రం గా కడిగి
చిన్న  ముక్కలు గా  తరుగుకోవాలి . తరిగిన  కంద ముక్కలను
,నాన పెట్టిన పెసరపప్పును ,పసుపు  ,తగినంత  ఉప్పు
ఎండుమిరపకాయలు  ,జీలకర్ర  , ఇంగువ  వేసి  ,
మెత్తగా  గ్రైండ్ చేసుకుని ఒక  బౌల్  లోకి  తీసుకుని ,
తగినంత  వరిపిండి  వేసి  బాగా  కలుపుకోవాలి.
పైన  కొద్దిగా  జీలకర్రను  చల్లుకోవాలి .
స్టవ్  వెలిగించి  పెనం  పెట్టి  వేడెక్కాక
ఆయిల్ వేసి  పెనం అంతా  పామాలి .
ఇప్పుడు  ఒక  ప్లాస్టిక్  పేపర్  తీసుకుని ,  దానికి  ఆయిల్  రాసి
 కంద  పిండిని   దాని మీద  వేసి అట్టులా  తట్టుకుని  ,
వేడెక్కిన  పెనం  మీద  వేసుకుని   ,
ఆయిల్  వేసి  రెండు  పక్కలా  దోరగా  కాల్చు కుంటే ,

కంద  అట్టు  రెడీ  అవుతుంది
వేడి  అన్నం  లో  నెయ్యి  వేసుకుని  తింటే  రుచిగా  ఉంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.

గోగు ( గోంగూర ) పువ్వు పచ్చడి


గోగు   ( గోంగూర ) పువ్వు  పచ్చడి
కావలిసిన  పదార్థాలు
1.  గోగుపువ్వులు   2 కప్పులు
2.  ఉప్పు  రుచికి  సరిపడ
3. పసుపు  కొద్దిగా
పోపు  దినుసులు
మినపప్పు  1 స్పూన్ ,  ఆవాలు  1 స్పూన్   , మెంతులు  అర స్పూన్  ,
ఇంగువ  కొద్దిగా , జీలకర్ర  అర స్పూన్ , ఎండుమిరపకాయలు   8. ,ఆయిల్  8 స్పూన్స్

తయారీ  విధానం
ముందుగా  గోగుపువ్వులను  శుభ్రం గా  కడిగి ,
తొడిమలు  తీసి  ఆర బెట్టుకోవాలి.
స్టవ్  వెలిగించి   బాణలి  పెట్టి వేడెక్కాక   2 స్పూన్స్  ఆయిల్   వేసి
పైన  చెప్పిన  పోపు  దినుసులను  వేసిదోరగా  వేపుకుని
ఒక  ప్లేటులోకి   తీసుకోవాలి .
అదే  బాణలిలో   2 స్పూన్స్  ఆయిల్ వేసి  ఆర. బెట్టుకున్న
గోగుపువ్వులను  వేసి  దోరగా  వేపుకుని  చల్లార నివ్వాలి .
ముందుగా  వేపుకుని పెట్టుకున్న పోపు ను  మెత్తగా  పొడిలాగ  గ్రైండ్  చేసుకుని
ఒక  ప్లేటులోకి   తీసుకోవాలి .
తరువాత గోగుపువ్వులను  , పసుపు , తగినంత  ఉప్పును  వేసి   ,
మెత్తగా గ్రైండ్  చేసుకుని ,
తరువాత ముందుగా  గ్రైండ్  చేసి పెట్టుకున్న  కారం పొడిని  కూడా  వేసి ,
 ఒకేసారి   కలిసేలా  గ్రైండ్ చేసుకుని  ,
ఒక  బౌల్ లోకి తీసుకోవాలి .
 స్టవ్  వెలిగించి  బాణలి పెట్టి  వేడెక్కాక  4. స్పూన్స్  ఆయిల్  ,
కొద్దిగా ఇంగువ వేసి  మరగనిచ్చి  ,
దీంట్లో  ముందుగా తయారు  చేసిపెట్టుకున్న  పచ్చడిని వేసి ,
 ఆయిల్  అంతా  పచ్చడిలో ఇంకే  వరకు  ఉంచి
స్టవ్ ఆఫ్  చేసుకుంటే
ఘుమ ఘుమ  లాడే  గోగుపువ్వుల  పచ్చడి  రెడీ  అవుతుంది

ఈ  పచ్చడిలో  ఇష్టమైన  వారు బెల్లం  కూడా  వేసుకుని రుబ్బుకోవచ్చు
ఈ  పచ్చడి  ఒక 15. రోజులపాటు  నిలువ  ఉంటుంది .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు


కంద పచ్చడి


కంద పచ్చడి
కావలిసిన  పదార్థాలు
1.  కంద  ముక్కలు  3 కప్పులు
2. చింతపండు  కొద్దిగా
3. పసుపు
4.  ఉప్పు  రుచికి  సరిపడా
5. పచ్చి మిర్చి  4

పోపు  దినుసులు
సెనగపప్పు  1. స్పూన్ ,  మినపప్పు  1 స్పూన్  , ఆవాలు  అర స్పూన్  ,
జీలకర్ర  అర  స్పూన్ , ఇంగువ  కొద్దిగా  , ధనియాలు  1 స్పూన్ ,
 ఎండుమిరపకాయలు  5  , ఆయిల్  4. స్పూన్స్.

తయారీ  విధానం
 స్టవ్  వెలిగించి  బాణలి పెట్టి  వేడెక్కాక  2 స్పూన్స్  ఆయిల్  వేసి ,
పైన  చెప్పిన  పోపు దినుసులను  వేసి  దోరగా  వేపుకుని ,
ఒక  ప్లేటులోకి తీసుకుని చల్లారనివ్వాలి  .
అదే  బాణలిలో  2 స్పూన్స్  ఆయిల్  వేసి ,
కంద ముక్కలు ,  పచ్చిమిర్చి  చీలికలు ,
పసుపు ,  చింతపండు  వేసి,
 పచ్చివాసన  పోయేంత  వరకు  మగ్గనిచ్చి ,
చల్లారనివ్వాలి  . ముందుగా చల్లారిన  పోపును
మెత్తని పొడి లాగ  గ్రైండ్  చేసుకుని ,
 అందులో ముందుగా  మగ్గబెట్టి పెట్టుకున్న,
 కంద , పచ్చి మిర్చి , చింతపండు మిశ్రమం ,
 తగినంత  ఉప్పును  వేసి ,
 మెత్తగా  గ్రైండ్  చేసుకుని  , ఒకబౌల్  లోకి  తీసుకోవాలి  .

స్టవ్  వెలిగించి  బాణలి పెట్టి  వేడెక్కాక ,
ఆయిల్  వేసి  కొద్దిగా  మినపప్పు,   ఆవాలు  , జీలకర్ర ,  ఇంగువ ,
కరివేపాకు  , వేసి దోరగా  వేగాక  ,

ఈ పోపును పచ్చడి మీద వేసుకుంటే
కంద  పచ్చడి రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/



Sunday, 20 November 2016

బూందీ రైతా


బూందీ రైతా

కావలిసిన  పదార్థాలు 
1. కారపు బూందీ.  2  కప్పులు
2. పెరుగు   పావులీటరు
3. కొత్తిమీర
4. ఉప్పు  కొద్దిగా

బూందీ  తయారీ కి  కావలిసిన పదార్థాలు
1. సెనగపిండి  ఒక  గ్లాసు  
2. వరిపిండి  అర  గ్లాసు 
3.  బేకింగ్ పొడి  ( వంట సోడా ) కొద్దిగా  
4. నీళ్లు  తగినంత 
5.  ఆయిల్  అరలీటరు   
6. ఉప్పు  తగినంత  
7. కారము  తగినంత  
8. కరివేపాకు   కొద్దిగా  

తయారీ విధానం  
ముందుగా  ఒక  బేసిన్  లోకి  సెనగపిండి,   వరిపిండి , 
వంట సోడా ( బేకింగ్ పొడి ) , (చిటికెడు ) 
బాగా కలిపి, 
కొద్దీ కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గరిట జారుగా ఉండేలా  కలుపుకోవాలి . 
ఒక  ప్లేటులోకి   ఉప్పు ,కారము  ,బూందికి  సరిపడా  వేసి  కలుపుకునివుంచుకోవాలి . 
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  
ఆయిల్  పోసుకోవాలి . కాగాక 
బూందీ  చట్రం  తీసుకుని దాంట్లో  గుంట గరిటతో పిండిని  పోసి,
గరిటతో  పామితే బూందీ పలుకులు ఆయిల్ లో పడతాయి . 
వీటిని  దోరగా వేపుకుని  , వేరే ప్లేట్ లో వేసి ,
పైన తయారు చేసి పెట్టుకున్న ఉప్పుకారము ,
కొంచెం  చల్లుకోవాలి . 
ప్రతి  వాయి కి ఉప్పు  కారం కలుపుతువుండాలి . 
చివర్లో కరివేపాకును , ఆయిల్ లో 
వేసి దోరగా  వేపుకుని 
బూందీ పలుకుల మీద  వేసుకుని ,
ప్లేట్ లోకి తీసుకోవాలి.

బూందీ  రైతా
తయారీ  విధానం
ముందుగా  ఒక  బౌల్  లోకి  పెరుగును  తీసుకుని  ,
కొద్దిగా  ఉప్పు  వేసి బాగా కలిపి ,
తయారుచేసుకున్న  బూందీ  ని  వేసి , కలిపి
పైన  కొత్తిమీరతో  గార్నిష్  చేసుకుంటే

బూందీ  రైతా   రెడీ  అవుతుంది.

బూందీ  రైతా   చపాతీ లోకి బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/



















కంద వేపుడు


కంద  వేపుడు
కావలిసిన  పదార్థాలు
1. కంద  పావుకేజీ
2. పసుపు  కొద్దిగా
3. ఉప్పు  రుచికి సరిపడా
4. ఆయిల్ 6. స్పూన్స్
5.  కారం తగినంత
6.  జీలకర్ర  అర  స్పూన్  
7. కరివేపాకు కొద్దిగా

తయారీ  విధానం
ముందుగా  కంద ను  పైన  వున్న. తొక్కను  తీసి  ,
శుభ్రం గా  కడిగి , చిన్న   ముక్కలుగా తరిగి ,
తగినంత  నీళ్లు పోసి  కుక్కరులో పెట్టి  ఉడికించి  ,
చిల్లుపల్లెం లో పోసి  చల్లార్చికోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి పెట్టి  వేడెక్కాక   3 స్పూన్స్  ఆయిల్  వేసి  ,
జీలకర్ర  కరివేపాకులను  వేసి అవి  వేగాక  ,
ముందుగా  ఉడికించి  చల్లార బెట్టుకున్న  కంద  ముక్కలను  వేసి ,
చేమదుంపల మాదిరిగా  దోరగా  వేపుకోవాలి .
మధ్య  మధ్య లో అట్లకాడతో  కలుపుతూ  అవసరమైతే  ,
ఆయిల్ వేస్తూ ఉండాలి . దోరగా  వేగాక
కొద్దిగా సెనగపిండి  ,ఉప్పు ,  వేసి బాగాకలిపి కొద్దిసేపు వేగనిచ్చి ,
 కారం  వేసుకుని స్టవ్  ఆఫ్  చేసుకుంటే  ,

కరకర లాడే  కంద  వేపుడు రెడీ

వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే  బాగుంటుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/ 

సూర్యాష్టకం


సూర్యాష్టకం

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర |

దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోఽస్తుతే || ౧ ||

సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ |

శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౨ ||

లోహితం రథమారూఢం సర్వలోకపితామహమ్ |

మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౩ ||

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మావిష్ణుమహేశ్వరమ్ |

మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౪ ||

బృంహితం తేజఃపుంజం చ వాయురాకాశమేవ చ |

ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౫ ||

బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితమ్ |

ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౬ ||

తం సూర్యం జగత్కర్తారం మహాతేజఃప్రదీపనమ్ |

మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౭ ||

తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదమ్ |

మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౮ ||

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడాప్రణాశనమ్ |

అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్భవేత్ || ౯ ||

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |

సప్తజన్మ భవేద్రోగీ జన్మజన్మ దరిద్రతా || ౧౦ ||

స్త్రీతైలమధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |

న వ్యాధిః శోకదారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి || ౧౧ ||

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/

Saturday, 19 November 2016

కారపు బూందీ


కారపు బూందీ 
కావలిసిన  పదార్థాలు
1. సెనగపిండి  ఒక  గ్లాసు  
2. వరిపిండి  అర  గ్లాసు 
3.  బేకింగ్ పొడి  ( వంట సోడా ) కొద్దిగా  
4. నీళ్లు  తగినంత 
5.  ఆయిల్  అరలీటరు   
6. ఉప్పు  తగినంత  
7. కారము  తగినంత  
8. కరివేపాకు   కొద్దిగా  
9.  పల్లీలు  ఒక  కప్పు
 
తయారీ విధానం  
ముందుగా  ఒక  బేసిన్  లోకి  సెనగపిండి,   వరిపిండి , 
వంట సోడా ( బేకింగ్ పొడి ) , (చిటికెడు ) 
బాగా కలిపి, 
కొద్దీ కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గరిట జారుగా ఉండేలా  కలుపుకోవాలి . 
ఒక  ప్లేటులోకి   ఉప్పు ,కారము  ,బూందికి  సరిపడా  వేసి  కలుపుకునివుంచుకోవాలి . 
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  
ఆయిల్  పోసుకోవాలి . కాగాక 
బూందీ  చట్రం  తీసుకుని దాంట్లో  గుంట గరిటతో పిండిని  పోసి,
గరిటతో  పామితే బూందీ పలుకులు ఆయిల్ లో పడతాయి . 
వీటిని  దోరగా వేపుకుని  , వేరే ప్లేట్ లో వేసి ,
పైన తయారు చేసి పెట్టుకున్న ఉప్పుకారము ,
కొంచెం  చల్లుకోవాలి . 
ప్రతి  వాయి కి ఉప్పు  కారం కలుపుతువుండాలి . 
చివర్లో కరివేపాకును ,  పల్లీలను ఆయిల్ లో 
వేసి వాటిని కూడా  దోరగా  వేపుకుని 
బూందీ పలుకుల మీద  వేసుకుని ,  
ఉప్పు , కారం అంతా కలిసేలా కలుపుకుంటే  
కారపు బూందీ రెడీ  అవుతుంది.  

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే 
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/ 
Writers: 
Achanta Subba laxmi
Achanta Subhadevi

ఏకశ్లోకి భగవద్గీత


ఏకశ్లోకి భగవద్గీత



(ప్రతి రోజు ఉదయం  చదవవలిసిన శ్లోకం )

ఓం యత్రయోగీశ్వరః కృష్టోయత్రపార్థోధనుర్ధరః

తత్ర శ్రీర్విజయో భూతిర్ద్రువా నీతిర్మతిర్మమ

పార్ధాయ ప్రతిబోధితాం - భగవతే నారాయణేన స్వయమ్

వ్యాసేన గ్రథితాం - పురాణమునినా మద్యేమహాభారతమ్

అద్వైతామృత వర్షిణీం భగవతీమష్ఠాదశధ్యాయినీ

మంబత్వామను సందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/

Friday, 18 November 2016

ఆనపకాయ కూర


ఆనపకాయ  కూర

కావలిసిన పదార్థాలు
1. ఆనపకాయ  ముక్కలు  3 కప్పులు
2.  కరివేపాకు
3. పసుపు  కొద్దిగా
4. ఉప్పు రుచికి సరిపడా
5. వరిపిండి  1 స్పూన్
6.అల్లము చిన్న ముక్కలు
7. పచ్చి మిర్చి 2

పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్  , ఆవాలు అర  స్పూన్,    జీలకర్ర   అర  స్పూన్,
ఎండుమిరపకాయలు 2  , ఆయిల్ 2  స్పూన్స్.

తయారీ  విధానం
ముందుగా ఆనపకాయ  ముక్కలను  కొద్దిగా  నీళ్లు పోసి  ,
కుక్కరు  లో  పెట్టి  ఉడికించుకుని  ,
చిల్లుల  పళ్లెం లోపోసి  చల్లార్చుకోవాలి ..
 స్టవ్   వెలిగించి   బాణలి   పెట్టి  వేడెక్కాక  ఆయిల్  వేసి  ,
పైన   చెప్పిన   పోపు  దినుసులను  వేసి  దోరగా  వేగాక ,
పచ్చి మిర్చి చీలికలు ,అల్లము , కరివేపాకు ను  వేసి వేగాక  ,
ముందుగా  ఉడికించి  చల్లారబెట్టుకున్న ఆనపకాయ  ముక్కలు  ,
పసుపు , తగినంత ఉప్పు  , వరిపిండి  వేసి  ,
బాగా  కలిపి  కొద్దీ సేపు మగ్గనిచ్చి ,
కూర అంతా  బాగా  దగ్గర  పడ్డాక  స్టవ్  ఆఫ్  చేసుకుంటే,
ఆనపకాయ  కూర  రెడీ  అవుతుంది.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

కార్తవీర్యార్జున శ్లోకము


కార్తవీర్యార్జున శ్లోకము

 కార్త వీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ తస్య సంస్మరణాదేవ హృతం నష్టం చ లభ్యతే

ఇల్లు వదిలి వెళ్ళిన వ్యక్తులు,
పోయాయి అనుకున్న వస్తువులు,
 తిరిగిరాదు అనుకున్న సొమ్ము .....
వంటివి మరల మనం పొందటానికి
ఈ శ్లోకాన్ని భక్తితో కనీసం
రోజుకి 28 సార్లు జపిస్తే తిరిగి పొందుతామని వేదవాక్కు.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/

Thursday, 17 November 2016

గోంగూర ఆరోగ్యపరంగా ఎంతో శ్రేష్టమైనది.


గోంగూర ఆరోగ్యపరంగా ఎంతో శ్రేష్టమైనది.

1. గోంగూరలో ఉండే పీచు పదార్ధం మన గుండెకు ఎంతో మేలుచేస్తుంది.
     శరీరంలోని కొవ్వును కూడ నియంత్రిస్తుంది.

2. ఈ ఆకులో పొటాషియం ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండటం వలన రక్త ప్రసరణ
    సక్రమంగా ఉండటమే కాకుండా , మన శరీరంలోని రక్తపోటును కూడ అదుపులో ఉంచడానికి
     గోంగూర సహకరిస్తుంది.

3.  గోంగూరలో విటమిన్ ఎ అధికంగా ఉండటం వలన మన కంటికి సంబంధించిన అనారోగ్య
     సమస్యల నుండి కూడ  గోంగూర మనలను రక్షిస్తుంది .

 4.   గోంగూరలో విటమిన్ సి, ఎ, బి6 ఉన్నాయి
 
5.    మెగ్నీషియం, పొటాషియం, పుష్కలంగా ఉన్నాయి.

 6.   గోంగూరలో క్యాల్షియం,  ఇనుము సమృద్ధిగా ఉంటాయి
       కాబట్టి రోజు వారీ ఆహారంలో గోంగూర ఉండేలా జాగ్రత్త పడితే ఎముకల
        ఆరోగ్యం పటిష్టంగా ఉంటుంది.

7.  శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగడానికి గోంగూర సహకరిస్తుంది.

8. రక్తంలో ఇన్సులిన్ స్థాయిని.  పెంచి, షుగర్ లెవెల్స్ ని తగ్గించే శక్తి గోంగూరకు ఉంది.

9.  గోంగూరలో ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ అత్యధికంగా ఉంటాయి.

10. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.

11. గుండె, కిడ్నీ వ్యాధులు,  నివారించడానికి.  గోంగూర సహాయపడుతుంది.

12.  దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడేవాళ్లు
       గోంగూరనుఏదో ఒక రూపంలో తీసుకుంట ఉంటే సహజ ఔషధంలా పనిచేస్తుంది.

ఋణవిమోచన లక్ష్మి నృసింహ స్తోత్రం


ఋణవిమోచన లక్ష్మి నృసింహ స్తోత్రం

దేవతాకార్య సిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
ఆంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
స్మరణాత్సర్వపాపఘ్నం కద్రూజ విషనాశనం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
సింహనాదేన మహతా దిగ్దంతి భయనాశనం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
ప్రహ్లాదవరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
క్రూరగ్రహైః పీడితానాం భక్తానా మభయప్రదం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
వేదవేదాంత యజ్ఞేశం బ్రహ్మరుద్రాది వందితం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితం
అనృణీ జాయతే సద్యో ధనం శీఘ్రమవాప్నుయాత్
ఇతి ఋణవిమోచన నృసింహస్తోత్రం సమాప్తం.

(ఈ స్తోత్రాన్ని అన్ని అరిష్టాలు, దోషాలు, ఆర్ధిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు సాయం సమయంలో ఒకసారి స్మరిస్తే మంచి ఫలితం లభిస్తుంది.)  

చిలుకూరు బాలాజీ దేవాలయం


 " చిలుకూరు బాలాజీ దేవాలయం "

తెలంగాణ తిరుపతిగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.
ఇక్కడి స్వామివారిని  " వీసాల బాలాజీ " అని కూడా పిలుస్తుంటారు.

రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు నిత్యం పెద్దసంఖ్యలో బాలాజీని దర్శించుకుంటారు.

చిలుకూరు దేవాలయం హైదరాబాద్‌ నుంచి 25 కి.మీ.ల దూరంలో వికారాబాద్‌ వెళ్లే మార్గంలో ఉంది.
శుక్ర, శనివారాల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7.45 వరకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
వీఐపీ దర్శనాలు, ప్రత్యేకపూజ టికెట్‌ వంటివేవీ లేవు.
బాలాజీ దర్శనానికి ఎంతటి వారైనా సాధారణ భక్తుల మాదిరిగా క్యూలో వెళ్లాల్సిందే.
ఇక్కడ ఎలాంటి హుండీ ఉండదు.

ఇక్కడ నిత్య పూజలంటూ ఏమీ ఉండవు. అర్చకులు స్వామివారిని పూలతో అలంకరించి అర్చిస్తారు.
అనంతరం భక్తులకు అనుమతిస్తారు.
భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు.

స్థలపురాణం:

సుమారు 500 ఏళ్ల కిత్రం..
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి పరమభక్తుడైన గున్నాల మాధవరెడ్డి ఈ చిలుకూరులో ఉండేవాడు. అతను ఏటా ఎంత కష్టమైనా,కాలినడకన తిరుపతి వెళ్లి.. స్వామివారిని దర్శించుకుని వచ్చేవాడు. వృద్ధాప్యంలో సైతం ఆయన వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లి వస్తుండేవాడు.అలా ఒకసారి తిరుమలకు బయల్దేరిన మాధవరెడ్డి.. ప్రయాణ బడలిక కారణంగా మార్గమధ్యంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ మగత నిద్రలో వచ్చిన కలలో అతనికి స్వామివారు ప్రత్యక్షమయ్యారు. ‘మాధవా.. ఇకపై నువ్వు నా దర్శనం కోసం ఇంతదూరం ప్రయాసపడి రావాల్సిన అవసరం లేదులే. నేను చిలుకూరిలోని ఒక పుట్టలో కొలువై ఉన్నా..
వెలికి తీసి గుడి నిర్మించు’.. అని చెప్పి మాయమయ్యాడట.
నిద్ర నుంచి మేలుకున్న మాధవరెడ్డి ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు. అంతా కలిసివచ్చి.. అక్కడ ఉన్న పుట్టను గునపాలతో పెకిలిస్తుండగా.. గునపం బాలాజీ ఎదభాగంలో తగిలి రక్తం వచ్చింది. వెంటనే అపచారమైందంటూ అంతా ఆ దేవదేవుణ్ని క్షమాపణలు కోరి ఆపై విగ్రహాన్ని పాలతో కడిగి బయటకు తీశారు. అలా దొరికిన బాలాజీకి అక్కడే ఆలయాన్ని నిర్మించి.. పూజలు చేయడం ప్రారంభించారు. ఈ స్థలపురాణం నిజమేననడానికి ఇప్పటికీ ఆలయంలో కొలువైన బాలాజీ ఎదభాగంలో గునపం గుచ్చుకున్న ఆనవాళ్లు కనిపిస్తాయి.

ఈ దేవాలయంలో 1963లో ‘రాజ్యలక్ష్మి’ అమ్మవారిని ప్రతిష్ఠించారు.
ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలుగా సుందరేశ్వర, హనుమాన్‌
ఆలయాలు , గరుత్మంతులవారి గుడి ఉన్నాయి.
ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలనూ ఏటా చైత్రశుక్ల మాసంలో వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు.
పూలంగి, అన్నకోట, బ్రహ్మోత్సవాలను ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తారు.




 



Tuesday, 15 November 2016

ఆరోగ్యము నకు సొరకాయ ( ఆనపకాయ )


 ఆరోగ్యము నకు సొరకాయ ( ఆనపకాయ  )

1. సొరకాయలో అధిక శాతంలో ఫైబరు వుంటుంది.

2. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.

3. విటమిన్ B , C , కూడా వుంటాయి.

4. బరువు తగ్గాలి అనుకునేవారికి సొరకాయ రసం ఎంతో ఉపయోగపడుతుంది.

5. B P ని నియంత్రిస్తుంది.

6. కొలెస్టరాల్  ని నియంత్రిస్తుంది .

7. లివర్ యొక్క పనితనాన్ని మెరుగు పరుస్తుంది.

8. జుట్టు తెల్లబడటాన్ని కూడా తగ్గిస్తుంది.

9. సోడియం, పోటా షియుం కూడా వుంటాయి.

10. జింక్, ఐరన్ ,కూడా వుంటాయి.

11. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది.

పోషకవిలువలు ఉన్న సొరకాయను ఆహారములో భాగము చేసుకోవడము మంచిది.

 Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi

Monday, 14 November 2016

గోంగూర పులిహోర


గోంగూర  పులిహోర

కావలిసిన  పదార్థాలు
1. గోంగూర  2 కట్టలు
2. బియ్యం  3  గ్లాసులు
3. నీళ్లు  6 గ్లాసులు
4. పచ్చిమిర్చి  5.
5.  అల్లం  చిన్నముక్క
6. కరివేపాకు  కొద్దిగా
7. పసుపు  కొద్దిగా
8. ఉప్పు రుచికి సరిపడా

పోపు దినుసులు
పల్లీలు 2 స్పూన్స్  ,  సెనగపప్పు  1 స్పూన్,  మినపప్పు  1 స్పూన్,
ఆవాలు  అర  స్పూన్  ,జీలకర్ర  అర  స్పూన్ , ఇంగువ  కొద్దిగా  ,
ఎండుమిరపకాయలు 4 ,ఆయిల్  6 స్పూన్స్.

తయారీ  విధానం
ముందుగా బియ్యాన్ని శుభ్రం  గా  కడిగి  ,
ఒకగ్లాసు బియ్యాబికి  2 గ్లాసుల  చొప్పున , నీళ్లు  మొత్తం  6 గ్లాసులు పోసి ,
కుక్కరు లో పెట్టి ఉడికించుకోవాలి.
 ఉడికిన అన్నాన్ని  ఒక బేసిన్లో  చల్లార్చుకోవాలి .
పచ్చిమిర్చిని  చీలికలుగాను,  అల్లాన్ని చిన్న  ముక్కలుగాను  తరుగుకోవాలి.
 గోంగూరను కాడలు  లేకుండా ఆకులు తీసి  ,శుభ్రంగా కడిగి  ,
తడి లేకుండా  ఆర  బెట్టుకోవాలి  .
స్టవ్  వెలిగించి  బాణలి  పెట్టి  వేడెక్కాక  ఆయిల్  వేసి  ,
ముందుగా పల్లీలను  వేసి,   అవి కొంచెం  వేగాక,
 మిగిలిన  పోపు  దినుసులను  వేసి ,
 దోరగా వేగాక,  కరివేపాకు ,  పచ్చిమిర్చి  చీలికలు  , అల్లం  ముక్కలు  వేసి ,
దోరగా   వేగాక
 వీటిని చల్లారబెట్టుకున్న  అన్నం మీద  వేసుకోవాలి  .
బాణలి  లో  ఆయిల్  వేసి కడిగి  ఆరబెట్టుకున్న  గోంగూరను  వేసి
పచ్చి వాసన  పోయేంత  వరకు మగ్గనిచ్చి  స్టవ్  ఆఫ్  చేసుకోవాలి .
ఇది చల్లారిన తరువాత  గ్రైండ్   చేసుకుంటే  ముద్దలా  అవుతుంది.
   ఈ  ముద్దను  పోపు  మిశ్రమం  వేసుకున్న  అన్నం మీద  వేసి
పసుపు,  సరిపడినంత  ఉప్పును  వేసి  ,
బాగా  కలిపి  ఒక గంట  సేపు వూరనిస్తే
ఘుమ ఘుమ  లాడే  రుచికరమయిన
గోంగూర   పులిహోర  రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi