ఆరోగ్యానికి " వాము " అన్నము
కావలిసిన పదార్థాలు
1. బియ్యం 1 గ్లాసు
2. పచ్చిమిర్చి 3.
3. ఉల్లిపాయ 1.
4. కరివేపాకు కొద్దిగా
5. ఉప్పు రుచికి సరిపడా
6. వాము 1 స్పూన్
7. ఎండుమిర్చి 1
8. జీడిపప్పు పలుకులు 6.
9. ఆయిల్ 2 స్పూన్స్
1. బియ్యం 1 గ్లాసు
2. పచ్చిమిర్చి 3.
3. ఉల్లిపాయ 1.
4. కరివేపాకు కొద్దిగా
5. ఉప్పు రుచికి సరిపడా
6. వాము 1 స్పూన్
7. ఎండుమిర్చి 1
8. జీడిపప్పు పలుకులు 6.
9. ఆయిల్ 2 స్పూన్స్
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ,
ఒక గ్లాసుకి రెండు గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకుని,
కుక్కరులో పెట్టి ఉడికించుకుని చల్లార్చికోవాలి.
పచ్చిమిర్చిని చీలికలుగాను ,ఉల్లిపాయలను సన్నగాను తరుగుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక, ఆయిల్ వేసి ,
ముందుగా జీడిపప్పు పలుకులను వేసి ,
దోరగా వేపుకుని ఒకప్లేటులోకి తీసుకోవాలి .
అదే బాణలిలో ఆయిల్ వేసి , వామును వేసి దోరగా వేగాక ,
ఎండుమిర్చి ,పచ్చిమిర్చి చీలికలు ,కరివేపాకు ,
వేసి దోరగా వేగాక , ఉల్లిపాయముక్కలు కూడా వేసి ,
దోరగా వేగాక, చల్లారబెట్టుకున్న అన్నమును ,
తగినంత ఉప్పును , జీడిపప్పు పలుకులను వేసి ,
బాగా కలిపి స్టవ్ మంట సిమ్ లో పెట్టి
కొద్దిసేపు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని
ఒక బౌల్లోకి తీసుకుని
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
వాము అన్నం రెడీ అవుతుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.