బర్బాటీ ఉల్లి కారం కూర
కావలిసిన పదార్థాలు
1. బర్బాటీలు పావుకేజీ
2. ఉల్లిపాయలు 2.
3. కరివేపాకు
4. పసుపు
5 .ఎండుమిరకాయలు 6
6. జీలకర్ర అర స్పూన్
7. ధనియాలు 1 స్పూన్
8. ఉప్పు రుచికి సరిపడా
9. నీళ్లు తగినన్ని
పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్ , ఆవాలు అర స్పూన్ , ఆయిల్ 5 స్పూన్స్
తయారీ విధానం
ముందుగా బర్బాటీలను శుభ్రంగా కడిగి ,
చిన్న ముక్కలుగా తరుగుకుని ,కుక్కరు లో పెట్టి ,
ఉడికించి చల్లార్చుకోవాలి .
ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా తరుగుకోవాలి .
తరిగిన ఉల్లిపాయలు ,ఎండుమిరపకాయలు ,జీలకర్ర, ధనియాలు ,
పసుపు , తగినంత ఉప్పు వేసి , మెత్తని ముద్దలాగ గ్రైండ్ చేసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపు దినుసులను వేసి , దోరగా వేగాక ,
ఉల్లిపాయ ముద్దను, కరివేపాకును వేసి ,
పచ్చివాసన పోయేంత వరకు వేపుకుని ,
ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న ,
బర్బాటీ ముక్కలను వేసి ,బాగా కలిపి, కొద్దిసేపు మగ్గనిచ్చి ,
స్టవ్ఆఫ్ చేసుకుంటే ,
బర్బాటీ ఉల్లికారంకూర రెడీ అవుతుంది
ఈకూర అన్నం లోను చపాతీ లోను దోశె లలోను బాగుంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi