Friday, 2 December 2016

ముక్కల పులుసు


ముక్కల పులుసు

కావలిసిన  పదార్థాలు
1. ఆనపకాయ అర ముక్క
2. వంకాయలు  2.
3. బెండకాయలు  2.
4. టమాటో  1.
5. చిలకడ  దుంపలు  5.
6.   పచ్చిమిర్చి  2.
7. ములక్కాడ  1
8. కరివేపాకు  కొద్దిగా
9. కొత్తిమీర
10. పసుపు  కొద్దిగా
11. ఉప్పు  రుచికి  సరిపడా
12.  చింతపండు నిమ్మకాయ  అంత
13. బెల్లం  చిన్న ముక్క
14. వరిపిండి  2 స్పూన్స్

పోపు  దినుసులు
ఆవాలు  కొద్దిగా , జీలకర్ర  కొద్దిగా   , మెంతులు   కొద్దిగా  ,
ఇంగువ కొద్దిగా  , ఎండుమిరపకాయలు   2  , ఆయిల్   1 స్పూన్

తయారీ  విధానం
ముందుగా   కూరలు  అన్నిటిని   శుభ్రంగా  కడుగుకోవాలి  .
వంకాయ , టొమాటోలను  4 ముక్కలుగా ను  ,
చిలకడదుంపలను గుండ్రం గా ను  ,
ఆనపకాయను  పైన వున్న తొక్కను  తీసి  ,సమానమైన   ముక్కలుగాను   ,
ములక్కాడను 6 ముక్కలుగాను  ,
బెండకాయను  3 ముక్కలుగా ను  ,పచ్చిమిర్చిని   చీలికలుగా  తరుగుకోవాలి  .
చింతపండును ఒక  గిన్నెలో  నీళ్లు పోసి   నానబెట్టుకోవాలి.
 ఒక  గిన్నెలో  తరిగిన  ముక్కలన్నిటిని వేసి ,
 నాన  బెట్టుకున్న చింత పండు  నుండి తుక్కులను  తీసి,
 పలుచని రసములా తీసి  , దానిని తరిగిపెట్టుకున్న  ముక్కలపైన పోసి ,
పసుపు  ,సరిపడినంత ఉప్పు ,  బెల్లం  ,వేసి  స్టవ్  మీద పెట్టి ఉడకనివ్వాలి  .
ఒక  కప్పులో వరిపిండి ని  కొద్దిగా  నీళ్లు  పోసి  ఉండలు లేకుండా  కలుపుకోవాలి .
ఈ  పిండి  మిశ్రమాన్ని  ,
ముక్కలు ఉడికాక , పులుసులో వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి  .
మధ్య మధ్య లో కలుపుతూ  ఉండాలి లేకపోతే  అడుగంటుతుంది .
స్టవ్  వెలిగించి  బాణలి పెట్టి  వేడెక్కాక  ,ఆయిల్  వేసి  ,
పైన  చెప్పిన  పోపు దినుసులను  ,కరివేపాకును  వేసి ,దోరగా  వేగాక  ,
మరుగుతున్న  పులుసు  మీద  వేసుకుని ,
కొద్దిసేపు మరగనిచ్చి  స్టవ్  ఆఫ్  చేసుకుని
పైన  కొత్తిమీర  వేసి  మూత  పెట్టుకుంటే
ఘుమ ఘుమ  లాడే  ముక్కలపులుసు  రెడీ .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi