బేబీ పొటాటోస్ ఉల్లికారం కూర
కావలిసిన పదార్థాలు
1. బేబీ పొటాటోస్. పావుకేజీ
2. పసుపు
3. ఆయిల్ 5 స్పూన్స్
ఉల్లికారమునకు
ఉల్లిపాయలు 2, ఎండుమిరపకాయలు 6, సెనగపప్పు 1 స్పూన్ ,
మినపప్పు 1 స్పూన్ ,ధనియాలు 1 స్పూన్ ,ఆవాలు అర స్పూన్ ,జీలకర్ర అరస్పూన్ ,
ఉప్పు రుచికి సరిపడా
తయారీ విధానం
ముందుగా బేబీ పొటాటాస్ ను శుభ్రం గా కడిగి ,
పైన వున్న తొక్కను తీసి కుక్కరులో పెట్టి ఉడికించుకుని చల్లారబెట్టుకోవాలి .
ఉల్లిపాయలను సన్నగా చిన్న ముక్కలుగా తరువుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపు దినుసులను వేసి దోరగా వేపుకుని ,
ఒక ప్లెట్ లోకి తీసుకుని చల్లార్చికోవాలి.
అదే బాణలిలో కొద్దిగా ఆయిల్ వేసి ,తరిగిపెట్టుకున్నఉల్లిపాయ ముక్కలను వేసి ,
దోరగా వేపుకుని, చల్లార్చుకోవాలి .
చల్లారిన పోపును తగినంత ఉప్పు వేసి ,మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకుని ,
తరువాత వేపుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ,
మెత్తని ముద్దలాగా గ్రైండ్ చేసుకోవాలి .
స్టవ్ వెలిగించి వెడల్పయిన బానలిపెట్టి ,వేడెక్కాక ఆయిల్ వేసి ,
ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న బేబీ పొటాటోస్ ను వేసి ,
దోరగా వేపువేపుకొవాలి .
ముందుగా మనం తయారుచేసి పెట్టుకున్న ఉల్లికారమును కూడా బాగా కలిపి ,
ఒక స్పూన్ ఆయిల్ వేసి , కొద్దిసేపు మగ్గనిచ్చి ,
స్టవ్ ఆఫ్ చేసుకుంటే
బేబీ పొటాటోస్ ఉల్లికారం కూర రెడీ అవుతుంది
ఈ కూర అన్నము లోకి చపాతీలలోకి బాగుంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi