తెల్ల వంకాయ సెనగలు అల్లం పెట్టిన కూర
కావలిసిన పదార్థాలు
1. తెల్లవంకాయలు పావుకేజీ
2. సెనగలు ఒక కప్పు
3. అల్లం చిన్న ముక్క
4. పచ్చిమిర్చి 3.
5. కొత్తిమీర కొద్దిగా
6. కరివేపాకు
7. పసుపు
8. ఉప్పు రుచికి సరిపడా
9. చింత పండుగుజ్జు కొద్దిగా
10. వరిపిండి కొద్దిగా
11. నీళ్లు తగినన్ని
1. తెల్లవంకాయలు పావుకేజీ
2. సెనగలు ఒక కప్పు
3. అల్లం చిన్న ముక్క
4. పచ్చిమిర్చి 3.
5. కొత్తిమీర కొద్దిగా
6. కరివేపాకు
7. పసుపు
8. ఉప్పు రుచికి సరిపడా
9. చింత పండుగుజ్జు కొద్దిగా
10. వరిపిండి కొద్దిగా
11. నీళ్లు తగినన్ని
పోపు దినుసులు
సెనగపప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్ ,ఆవాలు అర స్పూన్ ,
జీలకర్ర అర స్పూన్ , ఎండుమిరపకాయలు 2. ,ఆయిల్ 3 స్పూన్స్

తయారీ విధానం
ముందుగా సెనగలు ఒక గిన్నెలో నీళ్లు పోసి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి .
వంకాయలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు గా తరుగుకోవాలి.
పచ్చిమిర్చి , అల్లం ,కొత్తిమీర లను మెత్తటి ముద్దలా గ్రైండ్ చేసుకోవాలి .
చింత పండును కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి ,
నానిన తరువాత పిసికి గుజ్జులాగా తీసుకోవాలి .
నానిన సెనగలను శుభ్రం గా కడిగుకోవాలి .
ఒక గిన్నెలో వంకాయ ముక్కలు ,నానిన సెనగలు ,తగినన్ని నీళ్లు పోసి ,
కుక్కరు లో పెట్టి ఉడికించుకుని, చిల్లుపళ్లెంలోపోసి చల్లార్చుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,
ఆయిల్ వేసి పైన చెప్పిన పోపు దినుసులను వేసి ,
దోరగా వేగాక , అల్లం , పచ్చిమిర్చి ,కొత్తిమీర ముద్దను , కరివేపాకును వేసి
వేగాక ,
ఉడికించి చల్లార బెట్టుకున్న వంకాయ ,సెనగలు, పసుపు ,తగినంత ఉప్పు ,
చింతపండు గుజ్జు ,వరిపిండి వేసి ,
బాగా కలిపి కొద్దిసేపు మగ్గనిచ్చి,
కూర అంతా బాగా దగ్గర ,పడ్డాక స్టవ్ ఆప్ చేసుకుంటే
వంకాయ సెనగలు అల్లం పెట్టి కూర రెడీ అవుతుంది .
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi